14 వరకు అసెంబ్లీ | assembly until june 14th | Sakshi
Sakshi News home page

14 వరకు అసెంబ్లీ

Published Thu, Jun 12 2014 6:04 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

14 వరకు అసెంబ్లీ - Sakshi

14 వరకు అసెంబ్లీ

బీఏసీలో నిర్ణయం
- నేడు, రేపు గవర్నర్ ప్రసంగంపై చర్చ
- 14న పోలవరంపై తీర్మానం, హిమాచల్ దుర్ఘటనపై చర్చ
- ఏడాదికి 65-70 రోజుల పాటు సమావేశాలు: సీఎం
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 14 వరకు నిర్వహించాలని తెలంగాణ శాసనసభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) నిర్ణయించింది. స్పీకర్ మధుసూదనాచారి అధ్యక్షతన ఆయన చాంబర్‌లో బుధవారం ఈ కమిటీ సమావేశమైంది. అధికారపక్షం తరఫున సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు టి.హరీశ్‌రావు, ఈటెల రాజేందర్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రతిపక్ష సభ్యులు జి. చిన్నారెడ్డి(కాంగ్రెస్), ఎర్రబెల్లి దయాకర్‌రావు, రేవంత్ రెడ్డి(టీడీపీ), డాక్టర్ కె.లక్ష్మణ్ (బీజేపీ), పాషా అహ్మద్ ఖాద్రీ(మజ్లిస్), టి.వెంకటేశ్వర్లు(వైఎస్సార్ కాంగ్రెస్), సున్నం రాజయ్య(సీపీఎం), రవీంద్రకుమార్(సీపీఐ) ఈ భేటీలో పాల్గొన్నారు.

గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రెండు రోజుల పాటు చర్చించాలని ఈ సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. నూతనంగా ప్రభుత్వం ఏర్పాటైన తరుణంలో గవర్నర్ తొలి ప్రసంగంపై రెండు రోజులపాటు చర్చించాలని బీఏసీ నిర్ణయించింది. గవర్నర్ ప్రసంగంపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించడానికి గురువారం ఉదయం 10 గంటలకు శాసనసభ ప్రారంభం కానుంది. దీన్ని సాయంత్రం దాకా కొనసాగించాలని, ఇందుకోసం వర్కింగ్ లంచ్ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు.

 

13న కూడా సాయంత్రం దాకా గవర్నర్‌కు ధన్యవాద తీర్మానంపై మాట్లాడతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత సీఎం కేసీఆర్ మాట్లాడనున్నారు. కనీసం రెండు గంటల పాటు ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశముంది. ఇక 14న అమరవీరులకు నివాళులు, పోలవరం ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా తీర్మానం, హిమాచల్‌ప్రదేశ్‌లో విద్యార్థులు గల్లంతైన దుర్ఘటనపై చర్చ జరగనుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర తొలిశాసనసభా సమావేశాలు ముగియనున్నాయి.
 
ఎక్కువ రోజులు సవూవేశమవుదాం: సీఎం
ఏడాదికి 70 రోజులపాటు శాసనసభా సవూవేశాలను నిర్వహించుకుందావుని వుుఖ్యవుంత్రి కేసీఆర్ బీఏసీ భేటీలో ప్రతిపాదించారు. గతంలో 30-40 రోజులు కూడా సమావేశాలు జరగలేదని టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు బీఏసీ సవూవేశంలో ప్రస్తావించారు. కొత్త రాష్ట్రంలో తలెత్తే సవుస్యల ప్రస్తావన, వాటిపై చర్చ, పరిష్కారం కోసం కనీసం 60 రోజులైనా సవూవేశాలు నిర్వహించాలని వారు కోరారు. దీనిపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ అవసరమైతే 65-70 రోజుల దాకా సవూవేశాలను నిర్వహించుకుందావున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement