టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి | Kiran Kumar Reddy Co-operates to TRS : Sobhanagireddy | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి

Published Tue, Dec 17 2013 7:31 PM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి - Sakshi

టీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్నసీఎం : శోభానాగిరెడ్డి

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు (తెలంగాణ బిల్లు) విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి టిఆర్ఎస్కు సహకరిస్తున్నారని వైఎస్‌ఆర్‌సీపీ శాసనసభాపక్ష ఉపనేత శోభానాగిరెడ్డి ఆరోపించారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లును ఓడిద్దామని గతంలో చెప్పిన సీఎం  శాసనసభా వ్యవహారాల కమిటీ(బిఏసి) సమావేశంలో  ఎందుకు మౌనంగా ఉన్నారు? అని ఆమె ప్రశ్నించారు. సీఎం కిరణ్‌ కుమార్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బీఏసీ సమావేశానికి  వస్తే ఫలితముండేదన్నారు. బీఏసీలో టీడీపీ సభ్యులు ద్వంద్వవైఖరి అవలంబించారని విమర్శించారు. బీఏసీలో తాము సమైక్య వాణి వినిపించినట్లు  తెలిపారు.  అసెంబ్లీలో తెలంగాణ బిల్లుపై రేపటి చర్చను అడ్డుకుంటామని  శోభానాగిరెడ్డి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement