హైదరాబాద్ : బీఏసీ సమావేశం కొనసాగుతోంది. అయితే ఈ సమావేశానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కీలక భేటీకి డుమ్మా కొట్టారు. బీఏసీకి అన్ని పార్టీల శాసనసభా పక్షనేతలు హాజరు అయ్యారు. వైఎస్‌ఆర్‌సీపీ నుంచి నలుగురు సభ్యులు హాజరయ్యారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఫ్లోర్ లీడర్ వైఎస్ విజయమ్మతోపాటు.. డిప్యుటీ ఫ్లోర్ లీడర్లు..శోభా నాగిరెడ్డి, ధర్మాన కృష్ణదాస్.. పార్టీ విప్.. బాలినేని శ్రీనివాసరెడ్డి హాజరుకాగా.. టీడీపీనుంచి ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. డిప్యుటీ సీఎంతోపాటు..అసెంబ్లీ వ్యవ హారాలశాఖా మంత్రి శైలజానాథ్, రఘువీరారెడ్డి, ఆనం.. కాంగ్రెస్ పార్టీ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి, ఆరేపల్లి మోహన్, అనిల్ బీఏసీకి హాజరయ్యారు.