సాక్షి, అమరావతి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఎవరి ఆప్షన్ వారు చూసుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించిన కిరణ్‌కుమార్ రెడ్డి సొంతంగా పార్టీ పెట్టుకున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆయన పార్టీ ప్రజాభిమానం పొందలేకపోయిందని అన్నారు.
గత నాలుగేళ్లుగా ఏ పార్టీలో చేరని కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారని చెప్పుకొచ్చారు. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా కొనసాగారని, ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment