-
బీఏసీకి మళ్లీ ముఖం చాటేసిన బాబు, కిరణ్
-
తానిచ్చిన నోటీసే ఎజెండా అయినా సీఎం డుమ్మా
-
ఇరు ప్రాంత ‘తమ్ముళ్లనూ’ ఎగదోసి తప్పుకున్న బాబు
-
మినీ అసెంబ్లీలా గందరగోళంగా ముగిసిన బీఏసీ
-
బిల్లుపై ఓటింగ్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టు
-
ఎవరి తీర్మానాన్ని అనుమతించినా మద్దతు: విజయమ్మ
-
30 లోపు చర్చ ముగించి బిల్లును పంపాల్సిందేనన్న
-
టీ కాంగ్రెస్, టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం
-
కిరణ్ నోటీసు మేరకు తీర్మానం చేపట్టాలి: ఆనం
-
రాష్ట్రపతిని మరింత గడువు కోరాలని సూచన
-
తీవ్రంగా ఆక్షేపించిన డిప్యూటీ సీఎం దామోదర
-
ఆనం వాదన ప్రభుత్వ వాదన కాదని స్పష్టీకరణ
-
హరీశ్ సమర్థన.. డిప్యూటీదే ప్రభుత్వ వైఖరని వ్యాఖ్య
-
కిరణ్ నోటీసు ప్రభుత్వానిదా, ప్రైవేటుదా: ఎంఐఎం
-
వివాదాలకు తావులేకుండా నిర్ణయాలు: నాదెండ్ల
సాక్షి, హైదరాబాద్: మళ్లీ అవే డ్రామాలు. ముఖ్యమంత్రి కిరణ్‌దీ, విపక్ష నేత చంద్రబాబుదీ మరోసారి అదే లెక్కలేని ధోరణి. అత్యంత కీలకమైన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు విషయమై మంగళవారం స్పీకర్ నాదెండ్ల మనోహర్ నిర్వహించిన కీలకమైన సభా వ్యవహారాల సలహా మండలి (బీఏసీ) సమావేశానికి మరోసారి వారిద్దరూ ముఖం చాటేశారు. పైగా బిల్లుపై సభలోనూ, బయటా తాము ఇంకాలమూ ఆడుతూ వస్తున్న నాటకాలనే బీఏసీ విషయంలోనూ కిరణ్, బాబు పునరావృతం చేశారు. ‘బిల్లా, ముసాయిదానా?’ అంటూ సాంకేతికాంశాలను లేవనెత్తడమే గాక బిల్లును తిరస్కరిస్తూ సభలో తీర్మానం చేయాలంటూ స్వయంగా స్పీకర్‌కు నోటీసిచ్చిన కిరణ్... అదే అంశంపై స్పీకర్ నిర్వహించిన బీఏసీకి మాత్రం డుమ్మా కొట్టారు. ‘లోపాలుంటే బిల్లును తిప్పిపంపాలి’ అంటూ సభలో కిరణ్‌కు వత్తాసు పలికిన బాబు కూడా బీఏసీకి ఎగనామం పెట్టారు. తాను వెళ్లకపోగా, ‘బీఏసీకి వెళ్లి ఎవరి వాదన వారు గట్టిగా వినిపించండి’ అంటూ తెలంగాణ, సీమాంధ్ర టీడీపీ నేతలను ఎగదోసి తాపీగా ఇంటిముఖం పట్టారు. పైగా, ‘వీలైనంత ఎక్కువ సంఖ్యలో’ బీఏసీకి వెళ్లాల్సిందిగా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలకు కిరణ్, బాబులిద్దరూ ‘సూచించారు’! దాంతో చివరికి బీఏసీ సభ్యులు కాని వారు సైతం భేటీలో పాల్గొని, భిన్న వాదనలతో హోరెత్తించారు. ఫలితంగా బీఏసీ కాస్తా మినీ అసెంబ్లీగా మారి షరామామూలుగా గందరగోళానికి దారితీసింది. అజెండాలోని అంశాలపై ఏ నిర్ణయమూ తీసుకోకుండానే ముగిసింది. శాసనసభలో కీలక పాత్ర పోషించాల్సిన సభా నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేతే ఇలా సమస్యపై పీటముడి మరింత బిగుసుకునేలా, ప్రతిష్టంభన కొనసాగేలా ఉద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్న తీరు రాజకీయ పక్షాలన్నింటినీ విస్మయానికి గురిచేసింది. రాష్ట్ర విభజన బిల్లుపై రాష్ట్రపతి పొడిగించిన గడువు కూడా మరో రెండు రోజులతో ముగుస్తున్న ఈ తరుణంలో కూడా ఇటు బాబు, అటు కిరణ్ తమ నాటకాలను మానడం లేదంటూ వారి వారి పార్టీల నేతలే మండిపడుతున్నారు. సీఎం ‘సమైక్యవాదం’ కేవలం ప్రచార పటాటోపమే తప్ప మరోటి కాదని మంగళవారం ఆయన వ్యవహరించిన తీరుతో మరోసారి తేలిపోయిందని కాంగ్రెస్ నేతలంటున్నారు. అసెంబ్లీ శీతాకాల సవూవేశాల్లో ఇప్పటిదాకా జరిగిన బీఏసీ సవూవేశాల్లో కిరణ్ ఒక్కసారే పాల్గొనగా, బాబు అసలుకే ముఖం చాటేయడం తెలిసిందే. మరోవైపు బీఏసీలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలంతా ఎవరికి అనుకూల వాదన వారు చేసి, ‘మీరే నిర్ణయం తీసుకోండ’ని స్పీకర్‌కు చెప్పేసి వెళ్లిపోవడంతో బంతి చివరికి స్పీకర్ కోర్టులోకే చేరింది. సీఎం తదితరుల నోటీసులు, సవరణలపై చర్చ, ఓటింగ్ తదితరాలపై నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తానని సభ్యులకు స్పీకర్ స్పష్టం చేశారు. బిల్లుపై చర్చ, అభిప్రాయూల సేకరణకు నిర్దిష్ట విధానమేమీ లేనందున వివాదాలకు తావు లేని పద్ధతిని అనుసరిస్తానని వివరించారు.
పాల్గొన్నది వీరే...
కిరణ్, బాబు డుమ్మా నేపథ్యంలో సభా నాయకుడు, ప్రధాన ప్రతిపక్ష నేత లేకుండానే స్పీకర్ నాదెండ్ల మనోహర్ మంగళవారం బీఏసీ నిర్వహించారు. భేటీలో ఆద్యంతం పరస్పర భిన్న వాదనలు, వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. డిప్యూటీ స్పీకర్ వుల్లుభట్టి విక్రవూర్క, ఉప వుుఖ్యవుంత్రి దామోదర రాజనర్సింహ, వుంత్రులు ఆనం రావునారాయుణరెడ్డి, ఎన్.రఘువీరారెడ్డి, సాకే శైలజానాథ్, పొన్నాల లక్ష్మయ్యు, ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరవుణారెడ్డి, విప్‌లు ద్రోణంరాజు శ్రీనివాస్, ఆరేపల్లి మోహన్, టీడీపీ నుంచి అశోక్‌గజపతి రాజు, ఎర్రబెల్లి దయూకర్‌రావు, రావుల చంద్రశేఖరరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర, గాలి వుుద్దుకృష్ణవునాయుుడు, కొత్తకోట దయూకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ నుంచి ఈటెల రాజేందర్, హరీశ్‌రావు, కె.తారకరావూరావు, వైఎస్సార్‌సీపీ నుంచి వైఎస్ విజయువ్ము, శోభానాగిరెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డిలతో పాటు అక్బరుద్దీన్ (ఎంఐఎం), గుండా వుల్లేశ్, సాంబశివరావు (సీపీఐ), జూలకంటి రంగారెడ్డి (సీపీఎం), యెండల లక్ష్మీనారాయుణ, యెన్నం శ్రీనివాసరెడ్డి (బీజేపీ) పాల్గొన్నారు. వీరేగాక నాగం జనార్దనరెడ్డి, వూజీ వుంత్రి కోవుటిరెడ్డి వెంకటరెడ్డి వంటి బీఏసీతో సంబంధం లేని ఎమ్మెల్యేలు కూడా పాల్గొన్నారు. దాంతో అధికారిక సభ్యులు వూత్రమే అభిప్రాయూలు చెప్పాలని భేటీ మొదట్లోనే స్పీకర్ స్పష్టం చేశారు.
ఇదీ అజెండా...
సభ్యులకు నాలుగు పేజీల నోట్
సభ్యులకు నాలుగు పేజీలతో కూడిన ప్రత్యేక అజెండా నోట్‌ను స్పీకర్ అందించారు. 77, 81 నిబంధనల కింద అందిన 12 నోటీసులను బీఏసీ వుుందుంచారు. బిల్లుపై చర్చలో ఇప్పటిదాకా పాల్గొన్న, లిఖితపూర్వకంగా అభిప్రాయూలిచ్చిన వారి వివరాలు తెలిపారు. రాష్ట్రపతి ఇచ్చిన గడువు ఈ నెల 30 వరకే ఉన్నందున ఆలోగా బిల్లుపై చర్చను వుుగించేందుకు సవరణలతో పాటు అభిప్రాయూలపై ఓటింగ్‌కు అనుసరించాల్సిన విధానం, సీఎం తదితరుల నోటీసులపై తీసుకోవలసిన చర్యలు తదితరాలపై సూచనలు కోరారు. మొత్తంగా సభ సజావుగా సాగాలంటే ఏం చేయాలో సలహాలు కోరారు.
ఎవరి వాదన వారిదే
జరిగిందిదీ...
ఎవరి వాదన వారిదే
షరావూవుూలుగా ఈ బీఏసీలో కూడా అధికార, ప్రధాన ప్రతిపక్ష సభ్యులు సీవూంధ్ర, తెలంగాణ ప్రాంతాలవారీగా విడిపోయి ఎవరి వాదన వారు వినిపించారు. వైఎస్సార్‌సీపీ సమైక్యతీర్మానం కోసం పట్టుబట్టింది. చర్చను వుుగించి రాష్ట్రపతికి బిల్లును తిరిగి పంపాలని టీఆర్‌ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం కోరాయి. సభా నాయుకుడిగా సీఎం ఇచ్చిన నోటీసు ప్రకారం సభలో తీర్మానాన్ని చేపట్టాలని ఆనం వివరించారు. ఇంకా చర్చలో పాల్గొనాల్సిన సభ్యులున్నందున గడువు పొడిగించాల్సిన అవసరవుుందన్నారు. ఈ మేరకు రాష్ట్రపతికి సభ ద్వారా తీర్మానాన్ని పంపించాలన్నారు. పక్కనే ఉన్న దామోదర దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆనం చెప్పేది ప్రభుత్వ వాదన కాబోదన్నారు. గడువు వురో వుూడు రోజులున్నందున చర్చను కొనసాగించి 30న బిల్లును రాష్ట్రపతికి తిరిగి పంపాల్సిందేనన్నారు. గడువు పొడిగింపుకు గానీ, తీర్మానానికి గానీ అంగీకరించబోవుని స్పీకర్‌కు స్పష్టం చేశారు. ఆనం చెప్పేది అధికారికం కాబోదన్నారు. దామోదర వాదనను హరీశ్ సమర్థించారు. సీఎం సవూవేశంలో పాల్గొనని సవుయుంలో డిప్యుటీ సీఎం చెప్పేదే ప్రభుత్వ వాదన అవుతుందన్నారు. ఆనం వూటలు అధికారికం కాబోవన్నారు. కిరణ్ నోటీసును తిరస్కరించాలని టీఆర్‌ఎస్ సహ తెలంగాణ వుంత్రులు, టీడీపీతో సహా ఆ ప్రాంత నేతలంతా డివూండ్ చేశారు.
కేబినెట్ ఆమోదం లేకుంటే నోటీసును తిరస్కరించాలి: అక్బర్
అసలు సీఎం ఇచ్చింది ప్రైవేటు నోటీసా, ప్రభుత్వ నోటీసా స్పష్టం చేయూలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అడిగారు. ‘ప్రైవే టు సభ్యుడిగా ఇచ్చిన నోటీసే అరుుతే ఏడు రోజుల వుుందు ఇవ్వాలి. అలా ఇవ్వలేదు గనుక కిరణ్ నోటీసును అనువుతించరాదు. ఒకవేళ సభా నాయుకుడిగా ప్రభుత్వ తరఫున నోటీసిచ్చినా అందుకు కేబినెట్ ఆమోదముందో లేదో కూడా చూడాలి’ అన్నారు. కేబినెట్ ఆమోదం లేకపోతే కిరణ్ నోటీసును తిరస్కరించాలని సూచించారు. అరుుతే సీఎంగా నోటీసిచ్చాక దాన్ని ప్రభుత్వమిచ్చిన అధికారిక నోటీసుగానే పరిగణించాల్సి ఉంటుందని కొందరు సభ్యులన్నారు. సభలో సీఎం ఏ అంశం లేవనెత్తినా దాన్ని సభా నాయుకుడి అభిప్రాయుంగానే పరిగణించాలి తప్ప కేబినెట్ ఆమోదముదా, లేదా అన్నదానితో సంబంధం లేదన్నారు.
తుది నిర్ణయం స్పీకర్‌దేన్న నేతలు
తుది నిర్ణయుం తీసుకోవలసింది స్పీకరేనని తెలంగాణ నేతలంతా అన్నారు. ‘‘బిల్లుపై చర్చ ప్రారంభమై చాలా రోజులైంది. చర్చలో వుూడుసార్లు పాల్గొన్న సీఎం, అది బిల్లు చర్చకు అనర్హమైందని ఎలా చెబుతారు? 81వ నిబంధన కింద స్పీకర్‌కు అన్ని అధికారాలూ ఉన్నాయి. నోటీసును తిరస్కరించాలి’’ అన్నారు. స్పీకర్‌కే అన్ని అధికారాలున్నాయుని తాము కూడా చెబుతున్నామని ఆనం, రఘువీరారెడ్డి సహా సీమాంధ్ర సభ్యులన్నారు. 81వ నిబంధన కిందే నిర్ణయుం ప్రకటించాలని కోరారు. సభానాయుకుడి నోటీసుపై ఏ నిర్ణయుం తీసుకున్నా అంతివుంగా రాష్ట్రపతిని, రాజ్యాంగాన్ని గౌరవించే విధంగానే ఉండాలన్నారు. సభా నాయుకుడిగా ఎప్పుడు ఏ అంశంపైనైనా నోటీసులిచ్చే అధికారం సీఎంకు ఉందని సీవూంధ్ర మంత్రులు, సభ్యులు అన్నారు.
సమైక్యం కోసం ఎవరైనా సరే: వైఎస్సార్‌సీపీ
సభలో సమైక్య తీర్మానం చేయాలని తామిప్పటికే పలువూర్లు విన్నవించావుని వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు, పార్టీ శాసనసభాపక్ష నేత వైఎస్ విజయువ్ము గుర్తు చేశారు. తామిచ్చిన నోటీసులపై కాకున్నా వేరెవరి నోటీసులను ఆధారంచేసుకొని సమైక్య తీర్మానం ప్రవేశపెట్టినా వుద్దతిచ్చేందుకు తావుు సిద్దంగా ఉన్నావుని స్పష్టం చేశారు. బిల్లుపై ఓటింగ్‌కు డివూండ్ చేశారు.
చర్చ ముగిద్దామన్న స్పీకర్: గండ్ర
రాష్ట్రపతిని గౌరవించాలని బీఏసీలో సీవూంధ్ర వుంత్రులే చెప్పినందున వుుందుగా బిల్లుపై చర్చ వుుగించి, ఆ తర్వాతే నోటీసులపై నిర్ణయుం తీసుకుంటాననే రీతిలో స్పీకర్ మాట్లాడారని బీఏసీ అనంతరం గండ్ర తెలిపారు. ‘ఖేల్ ఖతమ్’ అని కూడా వ్యాఖ్యానించారు. అయితే, ఎవరి ఖేల్ ఖతమ్ అరుుందో రేపు తేలుతుందని ఆనం అన్నారు. సీఎం నోటీసులను అనువుతిస్తానని గానీ, తిరస్కరిస్తానని గానీ, ఓటింగ్‌పై నిర్ణయుం గురించి గానీ స్పీకర్ స్పష్టత ఇవ్వలేదని సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి తెలిపారు. సభలో సమైక్య తీర్మానం చేయాలనే డిమాండ్‌తో, విభజన బిల్లును రాష్ట్రపతికి వెనక్కి పంపాలని డిసెంబర్ 12, 16 తేదీల్లో తామిచ్చిన నోటీసులపై నిర్ణయం తీసుకోనందుకు నిరసనగా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు అంతకుముందు స్పీకర్ చాంబర్ వద్ద అరగంట పాటు ధర్నా చేశారు. దానిపై బీఏసీ ఏర్పాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చాక విరమించారు.