
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి నియమితులయ్యారు. రాజ్యసభ సభ్యులు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, మల్లికార్జున్ ఖర్గే, శివ్ ప్రతాప్ శుక్లాలను బీసీఏ సభ్యులుగా రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు నామినేట్ చేశారు. సబార్డినేట్ లెజిస్లేచర్ కమిటీ సభ్యులుగా జీవీఎల్ నరసింహారావు, కె.ఆర్.సురేష్‌రెడ్డి నియమితులయ్యారు.