27వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు | Telangana Assembly Session End On This Month 27 | Sakshi
Sakshi News home page

27వరకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

Published Mon, Mar 12 2018 3:47 PM | Last Updated on Tue, Aug 21 2018 11:44 AM

Telangana Assembly Session End On This Month 27 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను ఈ నెల 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. 13,14 తేదీల్లో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరపనున్నారు. 15న ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 25 వ తేదీ( ఆదివారం) కూడా సభను నడపాలని బీఏసీలో నిర్ణయించారు. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది.

కాగా, గవర్నర్‌ ప్రసంగానికి కాంగ్రెస్‌ అడ్డుతగలడంతో తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనపై బీఏసీ సమావేశంలో చర్చ జరిగింది. కాంగ్రెస్‌ సభ్యులు ప్రవర్తించిన తీరుపై సభ్యులు బీఏసీ సమాచవేశంలో విచారం వ్యక్తం చేశారు. అయితే మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌కు గాయాలు అవడంపై చింతిస్తున్నామని కాంగ్రెస్‌ నేత జానారెడ్డి తెలిపారు. మరో వైపు ఈ ఘటనపై పోలీసులకు పిర్యాదు చేయాలని మజ్లిస్‌ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్‌ ఒవైసీ సూచించారు. వీటిపై స్పందించిన సభాపతి మధుసూదనచారి అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement