స్వామిగౌడ్‌ అంటే నాకు అభిమానం: కోమటిరెడ్డి | Komatireddy venkat reddy  Headphone Attack in Telangana Assembly | Sakshi
Sakshi News home page

స్వామిగౌడ్‌ అంటే నాకు అభిమానం: కోమటిరెడ్డి

Published Mon, Mar 12 2018 4:40 PM | Last Updated on Sat, Aug 11 2018 6:44 PM

Komatireddy venkat reddy  Headphone Attack in Telangana Assembly - Sakshi

సాక్షి, యాదాద్రి: తెలంగాణ అసెంబ్లీలో తాను ఉద్దేశపూర్వకంగా తప్పు చేయలేదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వెల్లడించారు. బడ్జెట్‌ సమావేశాల తొలిరోజు తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర ఘటనలు చోటుచేసుకున్నవిషయం తెలిసిందే. ఈ అంశంపై కోమటిరెడ్డి స్పందించారు. స్వామి గౌడ్‌పై దాడి ఉద్దేశపూర్వకంగా జరగలేదని, ఆయనంటే తనకు అభిమానమని కోమటిరెడ్డి స్పష్టం చేశారు. అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం అర్ధరహితంగా ముగించడంతో కోపోద్రిక్తతకు గురైనట్టు ఆయన తెలిపారు.

అసెంబ్లీ చివరి సెషన్‌లో ప్రభుత్వ వ్యవహరించిన తీరు దారుణమని ఆయన విమర్శించారు. ప్రతిపక్షాలను కనీసం మాట్లాడనీయకుండా పోలీసులతో అడ్డుకున్నారని తెలిపారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి చెత్త సమావేశాలను తానెప్పుడూ చూడలేదని ఆరోపించారు. సంక్షేమ పథకాల పేరుతో కోట్ల రూపాయలు దోపిడీ చేశారని, ప్రాజెక్టుల రీ డిజైన్‌ల పేరుతో కోట్ల రూపాయాలు దండుకున్నారన్నారు. ఒక్క కాళేశ్వరంలోనే రూ. 40 వేల కోట్లు కొట్టేశారని విమర్శించారు. ధనిక రాష్ట్రం అని చెబుతూ ప్రజలను సీఎం కేసీఆర్‌ మభ్యపెడుతూ తెలంగాణను అప్పుల పాలు చేస్తున్నారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement