కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కోమటిరెడ్డి కౌంటర్‌ | Komatireddy Venkat Reddy Counter To KTR | Sakshi
Sakshi News home page

నీ చిట్టా మొత్తం తెలుసు.. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి: కోమటిరెడ్డి కౌంటర్‌

Published Tue, Oct 11 2022 4:28 PM | Last Updated on Wed, Oct 12 2022 12:39 PM

Komatireddy Venkat Reddy Counter To KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ఉద్యమంలో రబ్బరు బుల్లెట్లు తిన్న తాము కోవార్టులమా అని ప్రశ్నించారు. కేటీఆర్‌ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. తెలంగాణ కోసం మంత్రి పదవి వదులుకున్న తనను కోవర్ట్‌ అనే అర్హత కేటీఆర్‌కు ఉందా అని నిలదీశారు. తనపై కేటీఆర్‌ చేసిన కోవర్ట్‌ కామెంట్స్‌ విత్‌డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు. కేటీఆర్‌ క్షమాపణ చెప్పాలన్నారు.

కేటీఆర్‌ బాగోతం మొత్తం తెలుసు..
విదేశీ పర్యటన తన వ్యక్తిగతమని కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. సొంత పార్టీ నేతలు తిట్టిన బాధలోనే తాను ప్రచారానికి వెళ్లడం లేదని పేర్కొన్నారు. తను ప్రచారానికి వెళ్లినా, వెళ్లకపోయినా వాళ్లకు ఎందుకని ప్రశ్నించారు. కేటీఆర్‌ బాగోతం మొత్తం తనకు తెలుసని, ఆయన వంద దేశాలు తిరిగి ఏం చేశారో కూడా తెలుసని తెలిపారు. కాంగ్రెస్‌ నుంచి ఏ ఒక్క ఎంపీ కూడా పార్టీ మారరని స్పష్టం చేశారు. 
చదవండి: మునుగోడుకు రూ. 22 వేల కోట్లు ఇస్తే పోటీ నుంచి తప్పుకుంటాం: కేటీఆర్

నీ అవినీతి చిట్టా విప్పుతా..
కేసీఆర్‌ కుంటుంబంపై కోమటిరెడ్డి మండిపడ్డారు. ‘కల్వకుంట్ల కుటుంబం అంటే కమీషన్ల కుటుంబం. కేటీఆర్‌ అవినీతి చిట్టా మొత్తం నాకు తెలుసు. నా జోలికి వస్తే నీ చిట్టా విప్పుతా. ముందు నీ చెల్లి కవితను కాపాడుకో. సంతోష్ రావుకు మునుగోడు భాధ్యతలు ఎందుకు ఇవ్వలేదు. తెలంగాణ ఉద్యమంలో నేను మంత్రి పదవిని వదిలిన వాడిని. అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్‌.’ అని  ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ధ్వజమెత్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement