హైదరాబాద్ : విపక్ష సభ్యుల నిరసనలతో మంగళవారం మధ్యాహ్నం ఆరంభమైన శాసనసభ రేపటికి వాయిదా పడింది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. ఇదే సమయంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి ఆందోళనకు దిగారు. తొలుత ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ కొద్ది నిముషాల్లోనే అరగంటపాటు వాయిదా పడింది.
ఇరు ప్రాంత నేతలు జై సమైక్యాంధ్ర, జై తెలంగాణ అంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. శాసనమండలి బీఏసీ అనంతరం అసెంబ్లీ బీఏసీ సమావేశం జరగనుంది. తెలంగాణ బిల్లుపై రేపటి నుంచి చర్చిస్తారు. తెలంగాణ బిల్లు అంశాన్ని మూడు రోజులపాటు అసెంబ్లీ చర్చించే అవకాశం ఉంది.