'అసెంబ్లీని సమావేశపర్చండి'
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం శాసనసభ సభాపతి నాదెండ్ల మనోహర్ను కలిశారు. తక్షణమే అసెంబ్లీని సమాపర్చాలని ఈ సందర్భంగా వారు స్పీకర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం పెట్టాలని ఎమ్మెల్యేలు సభాపతిను కోరారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ కోసం ఏవిధంగా అయితే ప్రత్యక సమావేశం ఏర్పాటు చేశారో అదే పద్థతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా తీర్మానం కోసం అసెంబ్లీ సమావేశపరచాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిందని ఇంకా కాలయాపన చేయవద్దని కోరారు. స్పీకర్ ను కలిసిన అనంతరం ఎమ్మెల్యేలు మీడియాతో మాట్లాడుతూ తమది... పార్టీ అధ్యక్షుడిదీ ఒకే మాట అన్నారు.