'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’ | Day 2 of AP Assembly sessions | Sakshi
Sakshi News home page

'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’

Published Tue, Mar 7 2017 11:17 AM | Last Updated on Wed, Jul 25 2018 4:42 PM

'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’ - Sakshi

'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వైఎస్‌ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కమార్‌ యాదవ్‌ ఆరోపించారు. రెండో రోజు మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మీడియా పాయింట్‌ అనిల్‌ కుమార్‌ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏటా రూ. 10 వేల కోట్లు ఇస్తామని చెప్పి.. గత మూడేళ్లలో రూ. 8 వేల కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు.
 
ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బీసీ సంక్షేమంపై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామన్నా సమయం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని తెలిపారు. 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement