opposition protest
-
రాజ్యసభలో విపక్షాల ఆందోళన
న్యూఢిల్లీ: విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ వరుసగా మూడో రోజు కూడా వాయిదా పడింది. బుధవారం ఉదయం సభ ప్రారంభం కాగానే తమ సమస్యల గురించి తక్షణమే చర్చించాలని నోటీసులు ఇచ్చిన ఎంపీల పేర్లను చైర్మన్ వెంకయ్యనాయుడు చదువుతుండగానే అస్సాంకు చెందిన ఎంపీలంతా ఆందోళన మొదలుపెట్టారు. వీరికి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలు జతకలిశారు. దీంతో సభను మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమయ్యాక కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజూజు రాజ్యాంగ (125వ సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. అనంతరం విపక్ష సభ్యులు తమ ఆందోళన కొనసాగించారు. ఆర్జేడీ, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ సభ్యులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వీరికి కాంగ్రెస్ సభ్యులు కూడా జతకలిశారు. పౌరసత్వ సవరణ బిల్లు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్ల కోసం ప్రవేశపెట్టిన రోస్టర్ విధానానికి వ్యతిరేకంగా విపక్ష నేతలు ఆందోళన నిర్వహించారు. జీరో అవర్‌లో మాట్లాడే అవకాశం ఇస్తామని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ హామీ ఇవ్వడంతో ఎస్పీ నేతలు ఆందోళన విరమించారు. మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ మాట్లాడుతూ.. రోస్టర్ విధానానికి సంబంధించి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్, రివ్యూ పిటిషన్లను దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. విపక్ష సభ్యులు వెనక్కుతగ్గకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హరివంశ్ ప్రకటించారు. ఎంపీ మృతితో లోక్‌సభ వాయిదా.. బిజు జనతా దళ్ (బీజేడీ) ఎంపీ కిషోర్ స్వాయిన్ (71) మృతితో లోక్‌సభ వాయిదా పడింది. ఒడిశాకు చెందిన కిషోర్ బుధవారం ఉదయం భువనేశ్వర్‌లో మృతిచెందారు. లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ కిషోర్ మృతి విషయాన్ని సభ్యులకు తెలిపారు. అనంతరం సభ్యులు ఆయన మృతికి సంతాపంగా మౌనం పాటించారు. ఆ తర్వాత సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. -
‘నాలుకలు చీరేస్తారు.. జాగ్రత్త’
హైదరాబాద్: ధర్నా చౌక్ వద్దని స్థానికులు పదేళ్లుగా కోరుతున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. శాంతియుతంగా ఆందోళనలు చేస్తామంటేనే ఈ రోజు కార్యక్రమానికి పోలీస్‌లు అనుమతి ఇచ్చారని చెప్పారు. ఆందోళనకారులు ఐరన్ పైపులతో వచ్చారని ఆరోపించారు. తాము ఎవరినీ సమీకరించలేదని.. తలుచుకుంటే పది లక్షల మందిని అక్కడకు రప్పించ గలిగేవాళ్లమని చెప్పారు. విపక్షాల దౌర్జాన్యాన్ని ఖండిస్తున్నామన్నారు. స్థానిక ఎమ్మెల్యే కాలనీ వాసులను ధర్నా చౌక్‌కు రావద్దని ఒత్తిడి తెచ్చినా వారు ఆవేదన చెప్పుకోవడానికి వచ్చారని తెలిపారు. విపక్షాలను ప్రజలు చీదరించుకుంటున్నాయని అన్నారు. ముఖ్యమంత్రిని ఏకవచనంతో సంబోధించడం దుర్మార్గం అన్నారు. సీఎం కుటుంబ సభ్యులను ఇలాగే ఏకవచనంతో సంభోదిస్తే ప్రజలు నాలుకలు చీరేస్తారని తీవ్రంగా హెచ్చరించారు. ఇప్పటికైనా విపక్షాలు పద్దతి మార్చుకోవాలని సూచించారు. ప్రజల కోసం పని చేసే ప్రభుత్వం మీద ప్రతిపక్షాలకు అక్కసు ఎందుకు అని ప్రశ్నించారు. -
'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’
అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అనిల్ కమార్ యాదవ్ ఆరోపించారు. రెండో రోజు మంగళవారం శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అసెంబ్లీ మీడియా పాయింట్ అనిల్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఏటా రూ. 10 వేల కోట్లు ఇస్తామని చెప్పి.. గత మూడేళ్లలో రూ. 8 వేల కోట్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వ తీరుతో లక్షలాది మంది విద్యార్థులు నష్టపోతున్నారన్నారు. సభలో తమకు మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడంలేదని మండిపడ్డారు. బీసీ సంక్షేమంపై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామన్నా సమయం ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన నడుస్తోందని తెలిపారు. -
ప్రతిపక్షాల నిరసన.. సభ వాయిదా
-
'బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు’
-
ప్రతిపక్షాల నిరసన.. సభ వాయిదా
బీసీ సంక్షేమం మీద చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టుబట్టింది. ఈ అంశంపై ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్క మాట మాట్లాడగానే.. స్పీకర్ మైక్ కట్ చేశారు. ఇప్పటికే ఆ ప్రశ్న ముగిసిపోయి మరో ప్రశ్నలోకి వెళ్లిపోయామని, అందువల్ల దానిపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేమని అన్నారు. అయితే.. బీసీ సంక్షేమం మీద తాము వాకౌట్ చేయాలనుకుంటున్నామని, అందువల్ల ఆ విషయమై తాము చెప్పదలచుకున్న వివరణ చెప్పి వాకౌట్ చేస్తామని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత అడిగినా పట్టించుకోలేదు. దాంతో వైఎస్ఆర్సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. జగన్‌కు మాట్లాడే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష సభ్యులు తీవ్రంగా నినాదాలు చేస్తుండగానే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఏదో మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే గందరగోళం నడుమ ఎవరికీ ఏమీ వినిపించలేదు. దాంతో స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను పది నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
-
తెలంగాణ అసెంబ్లీలో ఉద్రిక్తత
హైదరాబాద్: విపక్షాల ఆందోళనతో తెలంగాణ శాసనసభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ రేపటికి వాయిదా పడిన తర్వాత ప్రతిపక్ష కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలు సభ లోపల బైఠాయించారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పై అసెంబ్లీలో మాట్లాడేందుకు ప్రభుత్వం తగిన సమయం ఇవ్వలేదని ఆరోపిస్తూ విపక్ష సభ్యులు నిరసన కొనసాగిస్తున్నారు. ఫీజులపై తమ ప్రశ్నలకు కేసీఆర్ సర్కారు సమాధానం చెప్పడం లేదని విమర్శించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆందోళన విరమింపజేసేందుకు అసెంబ్లీ కార్యదర్శి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రంగంలోకి దిగిన పోలీసులు... ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బలవంతంగా బయటకు తీసుకొచ్చారు. ఎమ్మెల్యేలు ప్రతిఘటించడంతో తోపులాటలు జరిగాయి. ఎమ్మెల్యేలను ఆయా పార్టీల కార్యాలయాల వద్ద పోలీసులు వదిలిపెట్టారు. -
విపక్షాలను పార్టీ ఆఫీసులకు తరలిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : రైతుల రుణాల మాఫీ ఒకే దఫాలో చేయాలని డిమాండ్ చేస్తూ సభలోనే బైఠాయించిన ప్రతిపక్షాల నేతలను పోలీసులు బలవంతంగా ఆయా పార్టీల నేతలను వారి పార్టీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా వేసిన అనంతరం స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లేది లేదంటూ వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు అసెంబ్లీలోనే బైఠాయించారు. సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. హామీ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ సభలోనే కూర్చోవడంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. విపక్ష సభ్యలను వారి పార్టీ కార్యాలయాలకు బలవంతంగా తరలిస్తున్నారు. -
సభ వాయిదా వేసినా అసెంబ్లీలోనే విపక్షాలు
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా వేశారు. అయితే, శాసనసభను రేపటికి వాయిదా వేసినప్పటికీ.. విపక్షాల నేతలు సభలోనే బైఠాయించారు. స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లేది లేదంటూ వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు అసెంబ్లీలోనే బైఠాయించారు. బుధవారం రోజు కూడా సమావేశాలు కొద్ది వాడివేడిగా జరిగాయి. రైతుల రుణమాఫీ అంశంపై ప్రతిపక్షాలు అధికార పక్షంపై పదేపదే ప్రశ్నలు కురిపిస్తూ ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచేశాయి. ఒకే దఫాలో రైతుల రుణమాఫీ చేస్తామని స్పష్టమైన హామీ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వైఎస్ఆర్ సీపీ, లెఫ్ట్ పార్టీల నేతలు సభలోనే బైఠాయించి తమ నిరసన తెలిపారు. -
ఐదు నిమిషాల్లో ముగిసిన సర్వసభ్య సమావేశం
ఆదిలాబాద్ మున్సిపాలిటీ సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లో ముగిసింది. గురువారం నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఐదు నిమిషాల్లోనే ముగియడంతో ఆగ్రహించిన ప్రతిపక్షాలు కమిషనర్ నాగమల్లేశ్వరరావు చాంబర్‌కు వెళ్లి ఎజెండా పత్రాలు చింపేసి నిరసన తెలిపారు. అధికార టీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఉండటంతో ప్రజా సమస్యలు చర్చించకుండానే వాయిదా వేశారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన సభ్యులు నిరసన తెలిపారు.