విపక్షాలను పార్టీ ఆఫీసులకు తరలిస్తున్న పోలీసులు | police entering in sabha and removing oppositions from assembly | Sakshi
Sakshi News home page

విపక్షాలను పార్టీ ఆఫీసులకు తరలిస్తున్న పోలీసులు

Published Wed, Sep 30 2015 9:46 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

police entering in sabha and removing oppositions from assembly

హైదరాబాద్ : రైతుల రుణాల మాఫీ ఒకే దఫాలో చేయాలని డిమాండ్ చేస్తూ సభలోనే బైఠాయించిన ప్రతిపక్షాల నేతలను పోలీసులు బలవంతంగా ఆయా పార్టీల నేతలను వారి పార్టీ కార్యాలయాలకు తరలిస్తున్నారు. బుధవారం అసెంబ్లీ వాయిదా వేసిన అనంతరం స్పష్టమైన హామీ ఇచ్చేవరకూ సభనుంచి వెళ్లేది లేదంటూ వైఎస్ఆర్ సీపీ, కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, లెఫ్ట్ పార్టీల నేతలు అసెంబ్లీలోనే బైఠాయించారు.

సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల సభ్యులు నినాదాలు చేశారు. హామీ ఇవ్వాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ సభలోనే కూర్చోవడంతో ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దించింది. విపక్ష సభ్యలను వారి పార్టీ కార్యాలయాలకు బలవంతంగా తరలిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement