
1:12PM
అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణపై మంత్రి దామోదర ప్రసంగం
• సామాజిక న్యాయ సాధికారతకు బాటలు వేస్తున్న నిబద్దత గల నాయకుడు, దార్శనికుడు మా ముఖ్యమంత్రి.
• బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలే ఆయన దార్శనికతకు తార్కాణం.
• ఎస్సీ వర్గీకరణ డిమాండ్ ఈనాటి కాదు, స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే ఈ డిమాండ్ మొదలైంది.
• వర్గీకరణ కోసం ఉమ్మడి రాష్ట్రంలో అనేక ఉద్యమాలు జరిగాయి. ఎంతో మంది త్యాగాలు చేశారు.
• వారందరికీ ఈ సందర్భంగా మాదిగ సమాజం తరపున నా కృతజ్ఞతలు, అమరవీరులకు జోహార్లు
• అమరుల ఆశయాలను, దశాబ్దాల మాదిగల ఆకాంక్షను ఈరోజు సీఎం రేవంత్‌రెడ్డి నెరవేరుస్తున్నారు.
• వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన 6 నెలల్లోనే వర్గీకరణ చట్టం చేసుకుంటున్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ కమిట్‌మెంట్, రేవంత్‌రెడ్డి గారి కమిట్‌మెంట్.
• 2025 ఫిబ్రవరి 4వ తేదీ(సోషల్ జస్టీస్ డే), మార్చి 18వ తేదీలు చరిత్రలో నిలిచిపోతాయి.
• గతంలో ఓసారి వర్గీకరణ చేసినా, కోర్టు తీర్పులతో అది నిలిచిపోయింది.
• నాటి వర్గీకరణకు, నేటి వర్గీకరణకు పెద్దగా తేడా లేదు.
• కేవలం 1.78 లక్షల జనాభా ఉన్న 26 కులాలు మాత్రమే ఇతర గ్రూపుల్లో చేర్చబడ్డాయి.
- మొత్తం మాదిగల్లో ఈ 26 కులాల జనాభా 3.43 శాతమే కావడం గమనార్హం.
• మిగిలిన 33 కులాలూ, పాత గ్రూపుల ప్రకారమే కొనసాగుతున్నాయి.
• ప్రపంచంలో అనేక దేశాల్లో వర్ణ వివక్ష, బానిసత్వం ఉంటే, మన దేశంలో అత్యంత నీచమైన అంటరానితనం ప్రజలను పీడించింది.
• 19వ శతాబ్దం వరకూ అంటరానితనం బహిరంగంగానే కొనసాగింది.
• ఈ అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ, ఆత్మగౌరవం కోసం మహాత్మ జ్యోతిరావు ఫూలె, మహాత్మ గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ వంటి మహనీయులు ఎందరో పోరాటాలు చేశారు.
• తత్ఫలితంగా ఉపశమన చర్యలు, సంఘ సంస్కరణలు ప్రారంభమయ్యాయి.
• 1931లోనే తొలిసారి కుల గణన చేశారు. 1936లో షెడ్యూల్డ్ కులాల జాబితాను ప్రకటించారు.
• మహనీయుడు అంబేద్కర్ పోరాట ఫలితంగా దళితులకు విద్య, ఉద్యోగాలు, చట్టసభల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
• విద్యతోనే సమాజ పురోగతి, అభివృద్ధి అని నమ్మిన వ్యక్తి అంబేద్కర్, అందుకే విద్యావకాశాల్లో రిజర్వేషన్లు కల్పించారు.
- ఆర్థిక స్వావలంభన కోసం ఉద్యోగాలు, పాలనలో భాగస్వామ్యం కోసం చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించారు.
• కానీ, ఆ రిజర్వేషన్ల ఫలాలు షెడ్యూల్డ్ కులాల ప్రజలందరికీ వారి వారి జనాభా ప్రాతిపదికన పంపిణీ కాలేదు.
• ఇదే దళిత సమాజంలో ఆందోళనకు, అసంతృప్తికి కారణమైంది.
• స్వాతంత్ర్యం వచ్చిన 15 ఏండ్లకే, 1965లోనే ఈ అంశంపై అధ్యయనం చేసేందుకు బీఎన్ లోకూర్ కమిటీని అప్పటి ప్రభుత్వం నియమించింది.
• ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అవసరాన్ని నాడే ఆ కమిటీ గుర్తించింది.
• మా వాటా మాకు, మా హక్కులు మాకు కావాలని ప్రజలు ఆందోళన చేయడంతో 1975లోనే పంజాబ్ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేసింది.
• 1990వ దశకం నాటికి ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమం ఉదృతమైంది.
• ఫలితంగా నాటి ప్రభుత్వం జస్టీస్ రామచంద్రరాజు నేతృత్వంలో 1996లో కమిషన్‌ను ఏర్పాటు చేసింది.
• వెనుకబాటుతనం, జనాభా, చారిత్రక నేపథ్యం ఆధారంగా షెడ్యూల్డ్ కులాలను 4 గ్రూపులుగా వర్గీకరించి, రిజర్వేషన్లు అమలు చేయాలని కమిషన్ సూచించింది.
• కమిషన్ సూచనల మేరకు 2000వ సంవత్సరంలో షెడ్యూల్డ్ కులాలను A, B, C, D గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు అమలు చేశారు.
• అత్యంత వెనుకబడిన రెల్లి, దాని ఉపకులాలను గ్రూప్ Aలో చేర్చి, వారికి కమిషన్ సూచనల ప్రకారం అదనపు ప్రయోజనం కల్పించారు.
వారి జనాభా ప్రకారం 0.25 శాతం రిజర్వేషన్ రావాల్సి ఉండగా, 1 శాతం రిజర్వేషన్ కల్పించారు.
• కోర్టు కేసులు, సుప్రీంకోర్టు తీర్పుతో 2004 నుంచి వర్గీకరణ ఆగిపోయింది.
• 2006లో దవిందర్ సింగ్ వర్సెస్ పంజాబ్, కేసుతో పంజాబ్‌లోనూ వర్గీకరణ ఆగిపోయింది.
• నాటి నుంచి గతేడాది వరకూ వర్గీకరణ కేసులో సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది.
• 2023 డిసెంబర్‌లో ప్రజలందరి దీవెనతో రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది.
• ఆ వెంటనే సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న వర్గీకరణ కేసులో, వర్గీకరణకు అనుకూలంగా వాదించేందుకు ప్రభుత్వం తరపున సీనియర్ అడ్వకేట్‌ను నియమించాం.
• సుదీర్ఘ విచారణ, వాదోపవాదనల అనంతరం గతేడాది ఆగస్ట్ ఒకటో తేదీన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చరిత్రాత్మక తుది తీర్పును ప్రకటించింది.
• రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చునని పేర్కొంది.
• వర్గీకరణకు ఎంపిరికల్ డేటాను ప్రమాణికంగా తీసుకోవాలని చెప్పింది.
• “వర్గీకరణ లేకుండా, షెడ్యూల్డ్ కులాలలోని అత్యంత అణగారిన వర్గాలు రిజర్వేషన్లలో వారి చట్టబద్ధమైన వాటాను పొందలేరు’’ అని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
• ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలను ప్రోత్సహించే చర్యలు తీసుకోవడానికి, చట్టాలను రూపొందించడానికి ఆర్టికల్ 341 అడ్డురాదు.”అని స్పష్టం చేసింది.
• రాజకీయ కారణాలతో కాకుండా, అందరికీ న్యాయం జరిగేలా వర్గీకరణ చేయాలని సూచించింది.
• ఇందుకోసం అక్షరాస్యత, వృత్తి, జనాభా, ఉద్యోగవకాశాలు, ఆర్థిక, సామాజిక పరిస్థితులను ప్రమాణికంగా తీసుకోవాలని ఆదేశించింది.
• ఎంపిరికల్ డేటా పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా వర్గీకరణ చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
• సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన గంటలోపే, వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని అసెంబ్లీలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేశారు.
• దేశంలో వర్గీకరణ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా నిలుస్తామని ప్రకటన చేశారు.
• ఇచ్చిన మాటను నిలుపుకునే లక్షణం మా నాయకుడిది.
• సుప్రీం కోర్టు తీర్పును పరిశీలించి, వర్గీకరణను అమలు చేయడానికి కేబినెట్ సబ్ కమిటీని నియమించారు.
• సుప్రీంకోర్టు తీర్పును పరిశీలించిన సబ్ కమిటీ, దీనిపై మరింత అధ్యయనం అవసరం అని భావించింది.
• హైకోర్టు రిటైర్డ్ జడ్జితో వన్ మ్యాన్ కమిషన్ ఏర్పాటు చేసి, అధ్యయనం చేయించాలని సూచించింది.
• రిటైర్డ్ జడ్జి, జస్టీస్ షమీమ్ అక్తర్ చైర్మన్‌గా వన్ మ్యాన్ జ్యుడీషియల్ కమిషన్‌ను ప్రభుత్వం నియమించింది.
• రాష్ట్రంలోని పాత పది ఉమ్మడి జిల్లాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను కమిషన్ తెలుసుకున్నది.
• ప్రజల నుండి మొత్తం 8 వేలకుపైగా విజ్ఞాపనలను కమిషన్ స్వీకరించింది.
• ఎస్సీల జనాభా, అక్షరాస్యత, ఉపాధి,విద్యా సంస్థలలో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు, ఆర్థిక స్థితిగతులు మరియు రాజకీయ ప్రాతినిధ్యాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించింది.
• 82 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి, 199 పేజీల నివేదికను ఫిబ్రవరి 3, 2025 న ప్రభుత్వానికి సమర్పించింది.
1:07PM
- అసెంబ్లీ ఎంట్రెన్స్ మెట్ల దగ్గర కూర్చున్న బీజేపీ ఎమ్మెల్యేలు
- స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాను... మీతో మాట్లాడతా అన్నారు.. అరెస్ట్ చేసిన వారిపైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారని చెప్పిన చీఫ్ మార్షల్
- అసెంబ్లీ లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు
- స్పీకర్ ను కలవనున్న బీజేపీ ఎమ్మెల్యేలు
12: 20PM
హైదరాబాద్:
- అసెంబ్లీ లో సీఏం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య..
- వారం రోజుల క్రితం రేవంత్ ఇంటి ముందు వెయిట్ చేసిన గుమ్మడి నర్సయ్య
- మొన్న అసెంబ్లీలో సైతం ఈ అంశాన్ని ప్రస్తావించిన సీఎం రేవంత్ రెడ్డి.
12: 02PM
స్పీకర్ ను కలిసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- ప్రశ్నోత్తరాలను రద్దు చేయడంపై స్పీకర్ ను కలిసిన కేటిఆర్ హరీష్ తో పాటు BRS MLA లు
- నిన్న కూడా బిఆర్ఎస్ కు సంబంధించిన మూడు ప్రశ్నలను రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తున్న BRS
- ఈ అన్ని అంశాల పై స్పీకర్ తో డిస్కషన్ చేస్తున్న BRS MLA లు
11:59AM
- కాసేపట్లో అసెంబ్లీ కి రానున్న బీసీ సంఘాల నేతలు..
- సీఎం రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలపనున్న బీసీ నేతలు
- అసెంబ్లీ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్ కోసం చేసిన బిల్లు ఆమోదం నేపథ్యంలో.. ప్రభుత్వం కు కృతజ్ఞతలు
- అసెంబ్లీ కమిటీ హాల్ లో మధ్యాహ్నం 2 గంటలకు సీఎం, మంత్రులు, విప్ ల తో భేటీ కానున్న బీసీ నేతలు
11:55AM
ముగిసిన జీరో అవర్.... తెలంగాణ శాసనసభకు టీ బ్రేక్
10:46AM
మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్
- భూములు తాకట్టు పెట్టి 20 వేల కోట్ల అప్పులు తెస్తుంది
- భూముల ప్రశ్న సభలో ఉండే..చర్చ కి రాకుండా చేశారు..
- మా ప్రశ్నలు రాకుండా గొంతు నొక్కుతున్నారు
- Go లు ఆన్లైన్ లో పెట్టడం లేదు..mim అడుగుదాం అంటే..
- స్పీకర్ సభ హక్కుల ను కాపాడాలి
- ప్రశ్నోత్తరాలు క్యానిల్ చేసి జీరో హావర్ పెట్టారు
- యాసంగి పంటలు ఎండి పోవడం పై ప్రశ్న లు ఉండే...
- ప్రాజెక్టు ల క్రింద పంటలు ఎండిపోవడం ప్రభుత్వ బాధ్యత.
- ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు వాళ్ళను ఆదుకోవాలి.
- రైతు భరోసా వానాకాలం వేశారా లేదా అనే ప్రశ్న ఉండే.
- 15 వేలు ఎప్పటి నుంచి అనే ప్రశ్న ఉండే..
- పంటలు ఎండి పోవడం పై ప్రశ్న.
- వడ్ల కొనుగోలు కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది అని ప్రభుత్వం చెప్పింది.
- 52 లక్షల మేట్రిక్ టన్నుల ధాన్యం కొన్నారు..
- బిఅరెస్ హాయం లో వానాకాలం లో 70 లక్షల మెట్రిక్ టన్నుల కొన్నాం.
- ప్రభుత్వం పూర్త్జి గా ఫెయిల్ అయ్యింది.
- 54 లక్షల మెట్రిక్ సన్నాలు కొంటాం అన్నారు..కొన్నది 24 లక్షల మెట్రిక్ టన్నులే.
10:10AM
తెలంగాణ మండలి ఆవరణలో బీఆర్‌ఎస్ సభ్యుల ినిరసన
- ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు
- ఇప్పుడు స్కూటీ లేదు.. లూటీ ఉందంటూ నినాదాలు
9:30 AM
కాసేపట్లో ప్రారంభం కానున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్ బిల్లుపై సభలో చర్చ...ఆమోదం తెలుపుననున్న సభ
- బిల్లుపై మంత్రి దామోదర రాజనర్సింహ ప్రజెంటేషన్
- ఎస్సీ వర్గీకరణ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.
- ఎస్సీ వర్గీకరణతో పాటు మరో ఐదు బిల్లులు.
- ఇవ్వాళ సభలో ప్రశ్నోత్తరాలు రద్దు.
రెండు కీలక బిల్లులకు నిన్న అసెంబ్లీ ఆమోదం
- విద్య, ఉద్యోగాల్లో..స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ కల్పించే రెండు ‘బీసీ’ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం
- తెలుగు వర్సిటీకి సురవరం ప్రతాప్‌రెడ్డి పేరు
- ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు శాసనసభ ఆమోదం
- చర్లపల్లి రైల్వే టెర్మినల్‌కు పొట్టి శ్రీరాములు పేరు ప్రతిపాదన
- సురవరం పేరు ఉస్మానియా యూనివర్సిటీకి పెట్టాలని సూచించిన భారతీయ జనతా పార్టీ
Comments
Please login to add a commentAdd a comment