తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు.. | telangana assembly budget session 25 july 2024 | Sakshi
Sakshi News home page

తెలంగాణ బడ్జెట్‌ ముఖ్యాంశాలు..

Published Thu, Jul 25 2024 12:12 PM | Last Updated on Thu, Jul 25 2024 2:03 PM

telangana assembly budget session 25 july 2024

తెలంగాణ బడ్జెట్‌: రెండు లక్షల 91వేల 191 కోట్లు

రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. 

మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. 

అసెంబ్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మం‍త్రులు భట్టి, శ్రీధర్‌ బాబు

సంక్షేమం, సాగునీరు, పంచాయతీరాజ్‌, విద్యకు భారీగా కేటాయింపులు

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం సరికొత్త ప్లాన్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. శాసన సభలో బడ్జెట్‌పై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, మండలిలో మంత్రి శ్రీధర్‌ బాబు ప్రసంగించారు. 

ఇక, 2024-25 గాను తెలంగాణ బడ్జెట్‌: రెండు లక్షల 91వేల 191 కోట్లు కాగా,  రెవెన్యూ వ్యయం రూ.2.20,945 కోట్లు. మూలధన వ్యయం రూ.33,487 కోట్లుగా ఉంది. 

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా..

  • సాగునీటి పారుదల శాఖకు రూ.26వేల కోట్లు.

  • విద్యాశాఖకు రూ.21,292 ​కోట్లు.

  • ప్రజాపంపిణీకి రూ.3836 కోట్లు

  • ఆరోగ్యశ్రీని రూ.10లక్షలకు పెంచాం.

  • సంక్షేమానికి రూ.40వేల కోట్లు.

  • రోడ్లు, భవనాలకు రూ.5790 కోట్లు.

  • ఐటీ శాఖకు రూ.774 కోట్లు.

  • హార్టీకల్చర్‌కు రూ.737 కోట్లు.

  • పరిశ్రమల శాఖకు రూ.2762 కోట్లు.

  • ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 ​కోట్లు.

  • గృహజ్యోతికి రూ.2418 కోట్లు.

  • 500 రూపాయల ‍గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.

  • అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.

  • ఎస్టీ సంక్షేమానికి రూ.17056 కోట్లు.

  • ట్రిపుల్‌ ఆర్‌ఆర్‌ఆర్‌కు రూ.1525 కోట్లు.

  • ఎస్సీ సంక్షేమానికి రూ.33.124 కోట్లు

  • ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.

  • వైదారోగ్య శాఖకు రూ.11468 కోట్లు.

  • ఓఆర్‌ఆర్‌కు రూ.200 కోట్లు.

  • ఎయిర్‌పోర్టు వరకు మెట్రో విస్తరణకు రూ.100 కోట్లు.

  • హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌కు రూ.500 కోట్లు.

  • హెచ్‌ఎండీఏ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.500 కోట్లు.

  • హోంశాఖకు రూ.9564 కోట్లు.

  • పంచాయతీరాజ్‌ శాఖకు రూ.29,816 కోట్లు.

  • బీసీ సంక్షేమానికి రూ.9200 కోట్లు.

  • మైనార్టీ శాఖకు రూ.3003 కోట్లు.

  • మెట్రోవాటర్‌ వర్క్స్‌ కోసం రూ.3385 కోట్లు.

  • కొత్త ఏర్పాటు చేసిన హైడ్రాకు రూ.200 కోట్లు.

  • మొత్తం హైదరాబాద్‌ అభివృద్ధికి రూ.10వేల కోట్లు. 

  • పశుసంవర్థక శాఖకు రూ.1980 కోట్లు.

  • విద్యాశాఖకు రూ.21,292 కోట్లు.

  • స్త్రీ శిశు సంక్షేమశాఖకు రూ.2736 కోట్లు.

  • ఓల్డ్‌ సిటీ మెట్రో విస్తరణకు రూ.500 కోట్లు.

  • అడవులు, పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.

  • విద్యుత్‌ శాఖకు రూ.16,410 కోట్లు.

  • రూ.2లక్షల రుణమాఫీ కోసం రూ.31వేల కోట్లు.

  • ఇందిరా మహిళా శక్తి పథకానికి రూ.50.41 కోట్లు. 

  • మహాలక్ష్మి ఉచిత రవాణాకు రూ.723కోట్లు.

  • మూసీ రివర్‌ ఫ్రంట్‌ ప్రాజెక్ట్‌కు రూ.1500 కోట్లు.

  • ఎస్సీ, ఎస్టీ గృహ లబ్ధిదారులకు రూ.6 లక్షల సాయం.  

  • మల్టీ మోడల్‌ సబర్బన్‌ రైలు ట్రాన్స్‌పోర్టు సిస్టంకు రూ.50 కోట్లు. 
     
     

మంత్రి భట్టి విక్రమార్క ప్రసంగిస్తూ.. పదేళ్ల అస్తవ్యస్త పాలనకు తెలంగాణ ప్రజలు చరమగీతం పాడారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అప్పుడు పది రేట్లు పెరిగాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఉద్యోగాలు, నీళ్లు దక్కలేదు.  బంగారు తెలంగాణ చేస్తామని ఉత్తరకుమార ప్రగల్బాలు పలికారు.  బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం అప్పులపాలైంది.  వామనావతారం లెక్క అప్పలు పెరిగాయి.  గత ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 

కొత్త ఉద్యోగాలు..
గత ప్రభుత్వం మాదిరిగా దుబారా ఖర్చు ఆపేసి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాం. ఒంటెద్దు పోకడలతో ఆర్ధిక వ్యవస్థను నిర్వీర్యం చేశారు. 
అప్పులు పెరగడంతో పాటుగా బిల్లులు బకాయిలు భారీగా పెరిగిపోయాయి. కొత్త ఉద్యోగాలు సృష్టించడం కాదు.. ఉన్న ఉద్యోగాలే ఇవ్వలేదు.  దశాబ్ద కాలంలో తెలంగాణ పురోగమించలేదు.  జీతాలు, పెన్షన్లు చెల్లింపులు కూడా చేయలేని పరిస్థితి.  రాష్ట్రంలో ఏర్పడిన పదేళ్ల తర్వాత వాస్తవిక బడ్జెట్‌ ప్రవేశపెట్టాం. నా తెలంగాణ కోటి రతనాల వీణ. ఎన్నో ఏళ్లు ప్రజలు ఉద్యమం చేశారు.

రైతులకు మేలు..
ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులకు అవసరమైన సాయం అందిస్తాం. రాష్ట్రంలో లక్ష ఎకరాల ఆయిల్‌ పామ్‌ సాగును లక్ష్యంగా పెట్టుకున్నాం. ఎల్బీనగర్‌ నుంచి హయత్‌ నగర్‌ వరకు, పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు వరకు మెట్రోను విస్తరిస్తాం.  మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు మెట్రోను విస్తరిస్తాం.  ఉచిత బస్సులు పథకం రాష్ట్ర అభివృద్ధి సాయపడుతోంది.  అప్పులకు వడ్డీల కోసం రూ.17,729 కోట్లు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్నా అభివృద్ధిని ఆపలేదు. ప్రధాన మంత్రి ఫసల్ భీమా యోజన పథకంలో చేరాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ ఏడాది నుంచి కేంద్ర ప్రభుత్వంతో కలిసి ప్రీమియం అంతా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు ఇది ఎంతోగానో ఉపయోగపడుతుంది. రైతులు చెల్లించాల్సిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తుంది.

ఇందిరమ్మ ఇళ్లు..
త్వరలో భూమిలేని రైతు కూలీలకు ఏటా రూ.12వేలు అందిస్తాం. ఏదో గెలవాలని మేం ఎన్నికల హామీలు ఇవ్వలేదు. ఈ ఏడాది మార్చి వరకు 2,26,740 ధరణి అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా మరో 1,22,774 ధరణి దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 1,79,143 దరఖాస్తులను పరిష్కరించాం. రూ.2లక్షల వరకు రుణం ఉన్న రైతులకు త్వరలో రుణమాఫీ. రైతు భరోసా పథకం కింద ఎకరాకి రూ.15వేలు ఇవ్వాలన్నది మా సంకల్పం. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా పేదలకు రూ.5లక్షల సాయం. ఎస్సీ, ఎస్టీ గృహ లబ్దిదారులకు రూ.6 లక్షల సాయం.  ప్రతీ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు. రాష్ట్రంలో మొత్తం నాలుగు లక్షల 50వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు.

డ్వాక్రా మహిళలకు జీవిత బీమా
స్వయం సహాయక సంఘాల్లోని 63.86 కోట్ల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా. వీరికి రూ.10 లక్షల జీవిత బీమా. రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు. గత ఆరు నెల్లలో బకాయిపడిన కస్టమ్‌ మిల్లర్స్‌ నుంచి రూ.450 కోట్లు వసూలు చేశాం.గత ప్రభుత్వం రైతుబంధుకు రూ.80వేల కోట్లు ఖర్చు చేసింది. రైతుబంధు ద్వారా అనర్హులకే అధికారంగా లబ్ధి చేకూరింది.

తలసరి ఆదాయం ఇలా..
తెలంగాణ తలసరి ఆదాయం రూ.3,47,299. జాతీయ తలసరి ఆదాయంలో పోల్చితే లక్షా 64వేలు అధికం. అత్యధికంగా రంగారెడ్డి తలసరి ఆదాయం రూ.9,46,862. అత్యల్పంగా వికారాబాద్‌ తలసరి ఆదాయం రూ.1,80,241. తెలంగాణ జీఎస్‌డీపీ రూ.14,63,963 కోట్లు. గతేదాడితో పోల్చితే 11.9 శాతం జీఎస్‌డీపీ వృద్ధిరేటు. 2023-24 తెలంగాణ వృద్ధిరేటు 7.4 శాతం. ఇదే సమయంలో జాతీయ వృద్ధి రేటు 7.6 శాతం. 

హైదరాబాద్‌పై స్పెషల్‌ ఫోకస్‌..

ఓఆర్‌ఆర్‌ పరిధిలో కొత్త వ్యవస్థ ఏర్పాటు. తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌(TCUR) ఏర్పాటు. టీసీయూఆర్‌ పరిధిలో జీహెచ్‌ఎంసీతో పాటు హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాలు ఉంటాయి. హైదరాబాద్‌లో విపత్తుల నివారణ, ఆస్తుల పరిరక్షణకు హైడ్రా. మూసీ రివర్‌ ‍ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యత. మూసీ చుట్టూ రిక్రియేషన్‌ జోన్లు, పీపుల్స్‌ ప్లాజాలు, చిల్డ్రన్‌ పార్కులు, ఎంటర్‌టైన్‌మెంట్‌ జోన్లు. మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతాం. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను మారుస్తాం. డ్రగ్స్‌ నిర్మూలనకు అవగాహన సదస్సులు. హైదరాబాద్‌ చుట్టూ శాటిలైట్‌ టౌన్‌షిప్‌లు. టౌన్‌షిప్‌లు అన్ని సౌకర్యాలు ఉండేలా ప్రణాళికలు. 

వారికి వేల్ఫేర్‌ బోర్డులు..
ఈ సంవత్సరం రంజాన్‌ పండుగ కోసం రూ.33కోట్లు కేటాయింపు. కల్లు గీత కార్మికులు ప్రమాదాలకు గురికాకుండా కొత్త పరికరాల పంపిణీ. కొత్తగా ముదిరాజ్‌, యాదవ్‌, కురుమ, మున్నూరు కాపు, పద్మశాలి, లింగాయత్‌, గంగపుత్రుల కార్పొరేషన్లు ఏర్పాటు. ఆర్థికంగా వెనుకబడిన కులాల సంక్షేమం కోసం వేల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు. ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా 163 రకాల వ్యాధులను చేర్చాం. నాణ్యమైన విద్యుత్‌ను నిరంతరాయంగా అందించాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం. తీవ్ర వేసవిలో కూడా నిరంతరాయంగా విద్యుత్‌ను అందించాం. అడవులు, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. అర్హులైన వారికి రైతుభరోసా ఇస్తాం. అసెంబ్లీలో రైతుభరోసా విధి విధానాలపై చర్చిస్తాం అని అన్నారు. 

మరోవైపు.. అసెంబ్లీలో భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. భట్టి ప్రసంగానికి సభలో నిరసన నినాదాలు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని పార్టీ నేతలు భట్టి వ్యాఖ్యలను ఖండించారు.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement