సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదు. అన్ని తండాలకు మండల కేంద్రం నుంచి బీటీ రోడ్లు వేస్తాం. విద్యుత్ సౌకర్యం కల్పిస్తాం.
.. ఏడు లక్షల ఇళ్లకు గత ప్రభుత్వం తాగునీరు ఇవ్వలేదు. ప్రజలు ఆగ్రహించినా బీఆర్‌ఎస్ మాత్రం మారలేదు. తప్పులు చేశారు. ప్రజలు శిక్షించారు. అయినా మారలేదు. బీఆర్‌ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నాం’’ అని రేవంత్ తెలిపారు.
కార్మికులు పక్షాన కొట్లాడే కమ్యూనిస్టులకు మైక్ ఇస్తే తప్పేంటి?. ఎమ్మెల్యే సాంబశివరావుకు మైక్ ఇవ్వటం తప్పా?. స్పీకర్‌పై ఆరోపణలు చేయటం తగదని సీఎం రేవంత్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment