
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలోనూ అమలు చేయడం లేదని, చివరి ఆరు నెలల్లోనే వీటిపై కచ్చితంగా చర్చ జరుగుతుందని అన్నారాయన. సోమవారం మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన ఆయన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సహా పలు అంశాలపై స్పందించారు.
ఎల్కతుర్తి సభలో కేసీఆర్(KCR) తన అక్కసు మొత్తం గక్కారు. కేసీఆర్ స్పీచ్‌లో పస లేదు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పిల్లగాళ్లు అని ఆయన అన్నారు. మరి వాళ్లనెందుకు అసెంబ్లీకి పంపిస్తున్నారు?. గతంలో రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వని చరిత్ర వాళ్లది. కానీ, బీఆర్ఎస్ సభకు ఆర్టీసీ బస్సులు కావాలని మమ్మల్ని అడిగారు. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వమని చెప్పా. ఆర్టీసీకి ఆదాయం వస్తుంటే.. వద్దంటామా?.
.. అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి అనేక పథకాలు తీసుకొచ్చాం. ఇప్పుడు వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం. నేను కమిట్మెంట్‌తో పనిచేస్తున్నా. అద్దంకి దయాకర్‌కు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పా. ఇప్పించా. చేసిన పనులు చెప్పుకోవడంలో కొంత వెనకపడ్డాం. వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రేవంత్ చెప్పింది చేస్తాడు అని ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తాం. అంతేగానీ.. కేసీఆర్ మాదిరి లాంచింగ్ క్లోజింగ్ పనులు చేయను.
చిట్‌ఛాట్‌లో ఇంకా..
ఆపరేషన్ కగార్(Operation Kagar) అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలి. కగార్‌పై మా పార్టీ నిర్ణయం తీసుకున్న తర్వాతే. ప్రభుత్వ విధానాన్ని ప్రకటిస్తాం.
ప్రపంచంలో ఇందిరా గాంధీకి మించిన యోధురాలు లేరు. ఓ దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరా గాంధీదే. ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ వాళ్ల అవసరాలకు అనుగుణంగా మాట్లాడుతారు. నాకు, రాహుల్ గాంధీకి మధ్య మంచి రిలేషన్ ఉంది. ఈ విషయంలో ఎవర్ని నమ్మించాల్సిన అవసరం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన పథకాలు ఏ రాష్ట్రంలో అమలు చేయలేదు. చివరి ఆరు నెలలు వీటిపై చర్చ జరుగుతోంది.
అధికార యంత్రాంగాన్ని స్ట్రీమ్ లైన్ చేశాం. ఆప్షన్ లేకనే కొంతమంది అధికారులను కొనసాగిస్తున్నాం. ఉన్నపళంగా తీసేస్తే పాత విషయాలన్నీ తెలిసేదెలా?.
ఎమ్మెల్యే అయ్యాక మనోడు.. మందోడు అని ఉండదు. కానీ, ఎమ్మెల్యేలు హైదరాబాద్‌లో టైం పాస్ చేస్తున్నారు. ఎమ్మెల్యే లు నియోజకవర్గాల్లో ఉండాలి.. అవసరం అయితేనే హైదరాబాద్ రావాలి