
ప్రకటించిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు
అభినందించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
అఫ్జల్‌గంజ్ (హైదరాబాద్): దేశంలోనే తొలిసారిగా ఉస్మానియా ఆసుపత్రిలో పేగు మార్పిడి (కాలేయానికి ఆనుకుని ఉండే పేగు) శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తిచేశామని వైద్యు లు ప్రకటించారు. 40 ఏళ్ల వయసున్న వ్యక్తి కాలేయ తదితర సమ స్యలతో బాధపడుతూ చికిత్స నిమిత్తం ఉస్మానియాలో చేరాడు. అతడు కాలేయ జబ్బులతో పాటు కుడివైపు కడుపులో గాంగ్రీన్ సెంట్రల్ లైన్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.
దీంతో పేగు మార్పిడి చేయాలని సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నిర్ధారించారు. ఈనెల 19న పేగు మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం 7వ రోజు ప్రొ టోకాల్ ఎండోస్కోపి నిర్వహించి రోగి సాధారణ స్థితికి చేరుకున్న ట్లు నిర్ధారించారు. దేశంలోనే తొలిసారిగా పేగుమార్పిడి శస్త్రచికిత్స చేయడంపై ముఖ్యమంత్రి వైద్యులను అభినందించారు.