Updates
తెలంగాణ శాసనసభ సోమవారం ఉదయం 10 గంటలకు వాయిదా
- వ్యవసాయ మోటార్ల దగ్గర మీటర్ల అంశంపై సీఎం చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన
- స్పీకర్ పోడియం వద్ద నిరసన చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- వ్యవసాయ మీటర్ల అంశంపై మాట్లాడే అవకాశం ఇవ్వాలని కోరిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
- ఎమ్మెల్యేలు నిరసన చేస్తుండగాని సభను వాయిదా వేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్
తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌పై కొనసాగుతున్న చర్చ..
- మైనార్టీలకు మంత్రి వర్గంలో చోటులేదు: హరీశ్ రావు
- ఉద్యోగులకు కొత్త పీఆర్సీలకు అనుగుణంగా కేటాయింపులు లేవు
- ఈ ప్రభుత్వంలో మైనార్టీలకు న్యాయం జరగలేదు
- బీసీలు 9 వేల కోట్ల బడ్జెట్ మాత్రమే పెట్టారు
- అభయ హస్తం శున్య హస్తంలా మారింది.
- సభను తప్పుదోవ పట్టించిప్పుడు సరిదిద్దాల్సిన బాధ్యత నాపై ఉంది: సీఎం రేవంత్
- ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేందుకు అవకాశం ఇస్తున్నాం.
- పూర్తి సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు.
- విపక్షాలు సలహాలు, సూచనలు ఇస్తే స్వీకరిస్తాం.
- బడ్జెట్ పై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులకు ఎక్కువ సమయం ఇచ్చాం.
- అసత్యాలను రికార్డుల నుంచి తొలగించాల్సిన బాధ్యత నాపై ఉంది..
- కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, విద్యుత్ సంస్థలు మూడు పార్టీలు కలపి 2017లో ఒప్పందం చేసుకున్నారు.
- మీటర్లు పెడతాం అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది
- గృహాలకు, వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతామని ఓప్పందంలో బీఆర్ఎస్ స్పష్టంగా పేర్కొంది
- విద్యుత్ ఒప్పందాలపై హరీష్ రావు వాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి
- హరీష్ రావుకు ఆఫ్ నాలెడ్జ్.. పెద్దాయనకు ఫుల్లు నాలెడ్జ్.. ఇలాంటి వారికి మేం ఏం చెప్తాం
హైదరాబాద్ సిటీలో ఆటో ఎక్కిన అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు: హరీశ్‌రావు
శాంతిభద్రతలు రాష్ట్రంలో లోపించాయి
అర్దరాత్రి ఐస్ క్రీం తినాలనుకున్న మంత్రికి.. ఐస్ క్రీం దొరకలేదట
10 గంటలకే హైదరాబాద్‌లో షాపులు మూసేస్తున్నారని.. రివ్యూలో సదరు మంత్రి సీఎంకు చెప్పారట
- ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న బీఆర్ఎస్ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరిన మంత్రి శ్రీధర్ బాబు
- నడి రోడ్డుపై మిట్టమధ్యాహ్నం ఇద్దరు అడ్వకేట్లను చంపేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు..
- హరీష్ రావు మాట్లాడుతుంటె దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉంది
- చేత గానమ్మకు మాటలు ఎక్కువ అన్న భట్టి వాఖ్యలు కాంగ్రెస్‌కు వర్తిస్తాయి: హరీశ్ రావు
- కాంగ్రెస్ ఇస్తా అన్న రెండు లక్షల ఉధ్యోగాలు ఏమయ్యాయి
- సభలో బీఆర్ఎస్ సభ్యులు ఫ్లకార్డులు ప్రదర్శించడంపై స్పీకర్ అభ్యంతరం.
- 2020 జులై నెలలో పెన్షన్ ఇవ్వకుండా నెల ఆలస్యం చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది.
- అప్పటి నుంచి నెల ఆలస్యం అవుతూ ఉంది..
- 57 ఏళ్ళకే బీఆర్ఎస్ ప్రభుత్వం పెన్షన్ అన్నారు.. ఎందుకు ఇవ్వలేదు.
- బీఆర్ఎస్ ప్రభుత్వం లో ఏ రోజు నెల మొదటి వారం లో పెన్షన్ ఇవ్వలేదు.
- వాళ్లు చేసింది మాత్రమే రైట్ అన్నట్లు హరీష్ రావు మాట్లాడుతున్నారు.
- మే , జూన్ నెల పెన్షన్ ఇంకా ఇవ్వలేదు: హరీష్ రావు
- నాలుగు వేల పెన్షన్ సరికదా.. రెండు వేల పెన్షన్ టైం కు ఇవ్వడం లేదు
- మంత్రులపై హరీష్ రావు వాఖ్యలు సరికాదన్న విప్ ఐలయ్య
- తెలంగాణ మొదటి సీఎం దలితుడే అని పదేళ్లలో ఎందుకు చేయలేదు
- రెవెన్యూ వ్యవస్థ ను బిఆర్ఎస్ నాశనం చేసింది
- విఆర్ఎ, వీఆర్వో వ్యవస్థను తొలగించి.. రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించారు
కోమటిరెడ్డికి హరీశ్ రావు కౌంటర్
- కోమటిరెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్న హరీశ్ రావు.
- గతంలో డబ్బులిచ్చి టీపీసీసీ తెచ్చుకున్నారని అనేదా?
- బస్సులు సరిపోక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
- బస్సులు లేని 15 వందల గ్రామాలు బస్సులు నడపాలి
- ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది.
- మహాలక్ష్మీ పథకాన్ని వెంటనే అమలు చేయాలి
- మద్దతు ధర సన్నాలకు మాత్రమేనని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు.
- రైలు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలి
- తెలంగాణ లో 90 శాతం దొడ్డు వడ్లు పండిస్తారు
- దొడ్డు రకానికి బోనస్ ఇవ్వాలి
- గృహజ్యోతి పథకం లో పాక్షికంగా ఇబ్బందులు ఉన్నాయి
- యువ వికాసం పథకంపై బడ్జెట్ లో చర్చే లేదు
- చేయూత గురించి ప్రభుత్వం మాటైనా మాట్లాడడం లేదు
- హరీశ్ రావు వద్ద సబ్జెక్ట్ లేదు: మంత్రి కోమటిరెడ్డి
- అబద్దాలు, గారడీలు అంటే బీఆర్‌ఎస్సే
- హరీష్ రావు వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయి.
- హరీష్ రావు బడ్జెట్ పై కాకుండా రాజకీయాలు సభలో మాట్లాడుతున్నారు.
- ఉద్యమంలో కేసీఆర్ దళితున్ని సీఎం చేస్తా అన్నారు.
- దళితున్ని సీఎం చేయకపోతే తలనరుక్కుంటా అన్నారు.
- బీఆర్ఎస్ పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు.
- బడ్జెట్‌పై చీల్చి చెండాడుతా అన్నారు కేసీఆర్.
- ఈరోజు ఏం చీల్చుతారో అని నేను అసెంబ్లీకి వచ్చాను కానీ కేసీఆర్ రాలేదు.
- కేసీఆర్‌కు సభకు రావాలంటే భయం.. అందుకే వీళ్లను పంపాడు.
- గతంలో హరీశ్ రావు ఒక డమ్మీ మంత్రి
- కేసీఆర్ సభుకు రాలేక హరీశ్‌రావును పంపారు.
- బీఆర్‌ఎస్ నేతలు వచ్చి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు.
- 24 గంటల కరెంట్ ఎక్కడిచ్చారో చెప్పాలి
- మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీ అమలు చేస్తాం: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
- బీఆర్‌ఎస్ నాశనం చేసిన ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం
- గత ప్రభుత్వం భూములు అమ్మింది అన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సమాధానం ఇచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు
- సీఎం గత ప్రభుత్వం భూముల అమ్మింది అంటున్నారు.. మరి ఈ బడ్జెట్లో 24 వేల కోట్ల రూపాయలు భూముల అమ్మో తెస్తాం అనడం ఏంటి?
- మహబూబ్‌నగర్ జిల్లాకు నీళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది.
- కాలేశ్వరం ప్రాజెక్టుపై నేను ఒకే మాటపై ఉన్నాను. అప్పుడైనా ఇప్పుడైనా రూ. 94 వేల కోట్లు ఖర్చు చేశాం అని చెప్పాను.
- బతుకమ్మ చీరలపై సీఎం వ్యాఖ్యలు సరికాదు వెంటనే మహిళలకు క్షమాపణ చెప్పాలి.
- ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, కాలేశ్వరం ప్రాజెక్టుపై ప్రత్యేకంగా చర్చ పెడితే అన్నిటికీ సమాధానాలు చెప్తాను.
- పాలమూరు వెనబాటుకు కాంగ్రెస్సే కారణం
- మహబూబ్‌నగర్‌కు ఐదు మెడికల్ కాలేజీలు ఇచ్చాం.
- 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.
హారీశ్‌రావు వ్యాఖ్యలకు సీఎం రేవత్‌రెడ్డి కౌంటర్
- గతంలో బతుకున్న చీరలు ఇస్తే.. మహిళలు తగలబెట్టిన పరిస్థితి ఉంది: సీఎం రేవంత్‌రెడ్డి
- తెలంగాణ ఆడబిడ్డలు ఆత్మ గౌరవంతో బతుకుతారు.
- బతుకమ్మ చీరల విషయంలో అవినీతి జరిగింది.
- బీఆర్‌ఎస్ ఆలోచన మారలేదు.. విధానం మారలేదు.
- బీఆర్‌ఎస్ తీరు వల్ల కేంద్ర బడ్జెట్‌లో నిధులు రాలేదు.
- గొర్రెల పథకంలో 700 కోట్ల స్వాహా చేశారు.
- వేల కోట్ల విలువైన భూములు అమ్మేశారు.
- పాలమూరు జిల్లా కేసీఆర్‌కు ఏం అన్యాయం చేసింది?
- పాలమూరు ప్రాజెక్టు పూర్తి కాకపోవడానికి బీఆర్‌ఎస్ దుర్మార్గ కారణం కాదా?
- బీఆర్‌ఎస్ నేతలు ప్రజలను సభ్యపెట్టాలని చూస్తున్నారు.
- రంగారెడ్డి జిల్లా, కొడంగల్‌కు గోదావరి నీరు ఇవ్వొద్దని కుట్ర చేశారు.
- కాళేశ్వరం ప్రాజెక్టు భారీ అవినీతి జరిగింది
- పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్‌ఎస్‌కు గుండు సున్నా ఇచ్చినా వారి బుద్ధి మారలేదు
- చేవెళ్ల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది.
- రంగారెడ్డి జిల్లా ఆస్తులను భూములను అమ్ముకున్నది గత ప్రభుత్వం.
- మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌లో ప్రజలు బొంద పెట్టారు.
- బతుకమ్మ చీరలు, కెసిఆర్ కిట్లు, గొర్రెల పంపిణీ పై విచారణకు సిద్ధమా?
- విచారణకు సిద్ధమైతే సవాళ్లు బీఆర్ఎస్ స్వీకరించాలి?
ఆరోగ్య శ్రీ పథకం వైఎస్ఆర్ ప్రవేశపెట్టారు - హరీష్ రావు
ఫీజు రీయింబర్స్ మెంట్, 108 పథకాలను వైఎస్సార్ ప్రారంభించారు
వైఎస్ఆర్ పెట్టిన పథకాలను కేసీఆర్ సభలో పొగిడారు
మంచి పథకాలు అయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్, 108 ను పేర్లు మార్చకుండా కేసీఆర్ కొనసాగించారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తెచ్చిన న్యూట్రిషన్ కిట్‌ను పక్కకు పెట్టింది.
ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు పెంచటం సంతోషమే
కానీ, వైద్య శాఖ బడ్జెట్ కేటాయింపులు తగ్గిస్తే.. ఇది ఎలా సాధ్యం అవుతుంది?
రుణమాఫీ కోసం 31వేల కోట్లు ఖర్చు అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు: హరీష్ రావు
బడ్జెట్ లో 26వేల కోట్లు మాత్రమే నిధులు కేటాయింపు జరిగింది.
5వేల కోట్ల రూపాయలను కోత విధించారు ఎలా బడ్జెట్ తగ్గింది?
రుణమాఫీ కోత విధించారు.. రుణమాఫీ అర్హులు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రుణమాఫి విషయంలో చాలా కోతలు పెట్టారు.
31వేల కోట్ల రుణమాఫి ఒకేసారి చేస్తామన్నారు.
31 వేల కోట్ల నుంచి 25 వేల కోట్లకు తగ్గించారు.
రాజకీయాలు కోసం పేదల కడుపుకొట్టకండి
ఎక్సైజ్ ఆదాయం 7వేల కోట్లు ఎలా పెరుగుతుంది?: హరీష్ రావు
తెలంగాణ ప్రజలను మద్యం బానిసలు చేస్తున్నారు అని కాంగ్రెస్ ఆరోపణలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మద్యం పై ఆదాయం పెరుగుతుంది అంటే బిర్ల ధరలు పెంచుతారా?
బెల్ట్ షాపులను రాష్ట్ర వ్యాప్తంగా పెంచుతారా?
భూములు అమ్మి 10వేల కోట్లు, మరో 14వేల అడిషనల్ రెవెన్యూ మొబలైజేషన్ ద్వారా ఆదాయం అని బడ్జెట్ పెట్టారు
ఆదాయ మార్గాలను చెప్పకుండా 24వేల కోట్ల రూపాయలను ఆదాయం అని బడ్జెట్‌లో చూపించారు.
వారసత్వ భూములు ఎలా అమ్ముతారు? అని ఆనాడు నేటి సీఎం రేవంత్ అన్నారు.
- పదేళ్లు బీఆర్‌ఎస్ పాలన ప్రజలను మభ్య పెట్టారు -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- ప్రతిపక్షంలో కూడా అలానే భ్రమలు కల్పిస్తున్నారు
- ప్రతిపక్ష నేత ఇవ్వాళ సభకు వస్తారు అనుకున్నాం.
- బడ్జెట్‌పై ఎల్‌ఓపీ మాట్లాడుతారు అనుకున్నాం.
- ఎక్సైజ్ టెండర్లు ముందే ఎందుకు పిలిచారు?
- టానిక్ లాంటి వారితో కొద్దిమంది చేతుల్లోకి వెళ్ళనివ్వం.
- ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి తీసుకువచ్చారు.
- మేం అధికారంలోకి వచ్చాకు నెలనెలా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పని మొదలు పెట్టాం
- సర్కార్ సొమ్ము ప్రజలకు చేరేలా చేశాం
- మా బడ్జెట్ చూసి హరీశ్ రావుకు కంటగింపుగా ఉంది: మంత్రి భట్టి విక్రమార్క
- హరీశ్ రావు ఎందుకు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు.
- హరీశ్‌రావు లేనిది ఉన్నట్లు మాట్లాడుతున్నారు.
- పూర్తి సత్యదూరమైన ఆరోపణలు చేస్తున్నారు.
- పత్రిపక్ష నేత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు మాత్రమే వచ్చారు.
- ఇవాళ ప్రతిపక్ష నేత సభకు ఎందుకు రాలేదు.
- పదేళ్లు తెలంగాణను ఆర్థికంగా నాశనం చేశారు.
- మంత్రి జూపల్లి గల్లీకో బెల్ట్ షాప్ పెడతామని అన్నారా?
- ఎక్సైజ్ శాఖ పై హరీష్ రావు వ్యాఖ్యలను తప్పుబట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావు
- 2014లో పదివేల కోట్ల ఆదాయం ఉండే బీఆర్‌ఎస్ రాగానే అది 19వేలకు పెరిగింది.
- అదే విధంగా 2019 నాటికి 19వేల కోట్లు.. గత ఏడాదికి రూ. 35వేల కోట్లు ఎక్సైజ్ నుంచి ఆదాయం వచ్చినట్లు లెక్కలు చెప్తున్నాయి
- తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల రియలేస్టేట్ కుదేలైంది: హరీశ్ రావు
- రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల తగ్గుతున్నాయి... రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతుంది.
- రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గుతున్నా .. 4 వేల కోట్లు అదనపు ఆదాయం ఎలా తెస్తారు?
- రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ వ్యాల్యూ పెంచుతారా? రెట్లు పెంచుతారా?
- 7700 కోట్ల రూపాయలు గత ఏడాది కంటే ఎక్కువ ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో పెంచారు
- మొత్తం ఎక్సైజ్ శాఖ నుంచి గత ఏడాది 25వేల కోట్లు ఆదాయం వస్తె ఇప్పుడు 42వేల కోట్లకు పెంచారు.
- 42వేల కోట్ల ఆదాయం రావాలంటే గల్లీలో బెల్ట్ షాప్ పెట్టాల్సి వస్తది.
- సభలో హరీష్ రావు స్పీచ్‌కు అడ్డుపడ్డ మంత్రి జూపల్లి కృష్ణారావు
- జూపల్లి కృష్ణారావు మంత్రిపై మాజీ మంత్రి హరీష్ చురకలు
- ఎవరూ ఆవేశపడకండి.. అన్ని లెక్కలు చెప్తాను, లిక్కర్ లెక్కలు చెప్తా అన్న హరీష్ రావు
- కాంగ్రెస్ పార్టీకి మమ్మల్ని తిట్టడమే సరిపోతుంది
- 8 నెలల పాలన కాంగ్రెస్ ఏం సాధించింది: హరీశ్ రావు
- బీఆర్‌ఎస్ టార్గెట్‌గానే బడ్జెట్ ప్రసంగం ఉంది.
- ప్రభుత్వం పచ్చి అబద్దాలు చెబుతోంంది.
- బడ్జెట్‌లో వాస్తవాలు విస్మరించారు.
- గల్లీకో బెల్ట్ షాప్ ఓపెన్ చేశారు
- మేం అధికారంలోకి వచ్చాక పెన్షన్ రూ. 2 వేలు చేశాం
- రాష్ట్రంలో దశ, దిశలేని పాలన నడుస్తోంది
- కరెంట్ అంశంపై కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసిరిన హరీష్ రావు
- భట్టి విక్రమార్క, నేను అసెంబ్లీ బయట రోడ్డుపై పదినిమిషాలు ప్రజలను అడుగుదాం- హరీష్ రావు
- కరెంట్ బీఆర్‌ఎస్ పాలనలో భగుండేనా?, కాంగ్రెస్ పాలనలో బాగుండేనా? ప్రజలే చెప్తారు
- రాష్ట్రంలో విద్యుత్ సరఫరా సరిగా లేదు
- గ్రామాల్లో విద్యుత్‌పై చర్చకు సిద్దమా? : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు
ప్రతిపక్ష నేతలు మాట్లాడేటప్పుడు మమ్మల్ని టీవీలో చూపించాలి : హరీష్ రావు.
పార్లమెంట్ లో రాహుల్ గాంధీని చూపించడం లేదు అని కోడ్ చేసిన హరీష్ రావు.
మమ్ములను సైతం అలా వివక్ష చూపిస్తున్నారు.. మమ్ములను మాట్లాడేటప్పుడు చూపించాలి: హరీష్ రావు
- హరీష్ రావు పై స్పందించిన స్పీకర్, మంత్రి శ్రీధర్ బాబు.
- రాహుల్ గాంధీ కంటే పదిరెట్లు ఇక్కడ చూపిస్తాం : శ్రీధర్‌బాబు
- రాహుల్ గాంధీ బాటలో మేము నడుస్తం - శ్రీధర్‌బాబు
- ప్రతిపక్ష నాయకులను టీవీలో చూపిస్తున్నారు కదా - స్పీకర్
శ్రీధర్ బాబు వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్
రాహుల్ గాంధీ బాటలో నడవటం కాదు - ఆయన చెప్పినట్లు ఎమ్మెల్యేలను డిస్క్వాలిపై చేయాలి అని కోరుతున్నాం: హరీష్ రావు
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
- బీజేపీ వాయిదా తీర్మానం
- రాష్ట్రంలో బాలికల మీద పెరుగుతున్న అత్యాచారాలపై వాయిదా తీర్మానం పెట్టిన బీజేపీ
- బీజేపీ తరపున అసెంబ్లీలో మట్లాడనున్న ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, రామారావు పటేల్
- నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కాసేపట్లో ప్రారంభం కానున్నాయి.
- శాసన సభలో నేడు క్వశ్చన్ అవర్ రద్దు
- బడ్జెట్‌పై సభలో సాధారణ చర్చ జరగనుంది.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం ప్రభాకర్ కామెంట్లు
- బడ్జెట్ లో హైదరాబాద్ అభివృద్ధి కి 10 వేల కోట్లు కేటాయించిన సీఎంకు , డిప్యూటీ సిఎంకు కృతజ్ఞతలు
- జీహెఎంసీ, వాటర్ బోర్డు, మెట్రో లకు ప్రభుత్వం ఆర్థిక ఊతం ఇచ్చింది
- సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ కు ఏం తెచ్చారు
- టూరిజం మంత్రి గా ఉన్నా కిషన్ రెడ్డి చేసిందేమి లేదు.
- హైదరాబాద్ అభివృద్ధికి కేంద్రం నిధులు తెచ్చి కిషన్ రెడ్డి తన చిత్తశుద్ధి ని నిరూపించుకోవాలి
- కిషన్ రెడ్డి, బండి సంజయ్ కేంద్ర మంత్రులు అయినా రాష్ట్రానికి ఉపయోగం లేదు
- హైదరాబాద్ అభివృద్ధి కి నిధులు ఇచ్చినందుకా రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్దం చేస్తున్నారా
- కేంద్ర బడ్జెట్ ప్రిపరేషన్‌కు ముందే రాష్ట్ర అవసరాలను కేంద్ర ప్రభుత్వం కు తెలియజేసాం. అయినా సహకారం లేదు.
- గంగా ప్రక్షాళనకు బడ్జెట్ కేటాయింపులు చేసిన కేంద్రం, మూసీ అభివృద్ధికి ఎందుకు ఇవ్వరు
- కారణం లేకుండా కేసీఆర్ నీతి అయోగ్ సమావేశానికి వెల్లలేదు
- కేంద్ర బడ్జెట్ లో మాకు అన్యాయం జరిగింది.. అందుకే నిరసన తెలియజేయడం కోసమే నీతిఅయోగ్ సమావేశాన్ని బైకాట్ చేస్తున్నాం
- తమ్మిడిహెట్టి దగ్గర బ్యారేజ్ కట్టకపోవడం వల్ల భారీ నష్టం జరిగింది
- గేట్లు తెరవడానికి మీరు పోటుగాళ్ళా?
- మెడిగడ్డ దగ్గర నీరు పంప్ చేసే అవకాశం లేదని ఎన్డిఎస్ఎ చెప్పింది
- కేటీఆర్ యువరాజు కాదు, హుకుంలకు.. అల్టిమేటంకు బయపడేది లేదు
Comments
Please login to add a commentAdd a comment