ఈనెల 19న బడ్జెట్‌.. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ | Telangana Assembly Budget Sessions March 12th Live Updates | Sakshi
Sakshi News home page

ఈనెల 19న బడ్జెట్‌.. 27 వరకు తెలంగాణ అసెంబ్లీ

Published Wed, Mar 12 2025 10:43 AM | Last Updated on Wed, Mar 12 2025 1:52 PM

Telangana Assembly Budget Sessions March 12th Live Updates

Assembly Session Updates..

👉బీఏసీ సమావేశం ముగిసింది.. 

👉ఈనెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగించాలని నిర్ణయం. 

👉19న బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న భట్టి విక్రమార్క

👉హోలీ రోజున, ఆదివారం అసెంబ్లీకి సెలవు. 

గవర్నర్‌ను అబద్దాల ప్రచారానికి వాడుకున్నారు: హరీష్‌

  • గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ప్రకటన
  • గవర్నర్ ప్రసంగంలో దశ లేదు, దిశ లేదు
  • గవర్నర్లు మారారు తప్ప ప్రసంగం మారలేదు
  • సీఎం స్తుతి, అసత్యాలు తప్ప కొత్తగా ఏం లేదు
  • ప్రసంగం మొత్తం అర్థ సత్యాలు, అబద్దాలు, అవాస్తవాలు
  • ఏడాదిన్నర పాలన వైఫల్యానికి నిదర్శనం గవర్నర్ ప్రసంగం
  • అబద్దాల ప్రచారానికి గవర్నర్‌ను సైతం వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
  • గతేడాది గవర్నర్ ప్రసంగానికి, ఈసారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదు.

👉 స్పీకర్ ఛాంబర్‌లో ప్రారంభమైన BAC సమావేశం. బీఆర్‌ఎస్‌ నుంచి సమావేశానికి హాజరైన హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి

ముగిసిన ప్రసంగం.. 

👉తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగం ముగిసింది. 

👉36 నిమిషాలకు పాటు సాగిన గవర్నర్ ప్రసంగం

👉జై తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ముగించిన గవర్నర్

 

👉తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం.

👉ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ప్రసంగిస్తున్నారు. 

బీఆర్‌ఎస్‌ సభ్యుల నినాదాలు..

  • తెలంగాణలో రుణమాఫీ, ఆరు గ్యారంటీలపై గవర్నర్‌ ప్రసంగం..
  • రుణమాఫీ జరిగింది, రైతులకు బోనస్ లభించింది అంటూ గవర్నర్ ప్రసంగం
  • ఆరు గ్యారెంటీల అమలు జరిగింది, గృహలక్ష్మి, మహాలక్ష్మి పథకాలు అమలు అంటూ గవర్నర్ ప్రసంగం.
  • కాంగ్రెస్‌ ‍ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ సభ్యులు.
  • గవర్నర్ తో అబద్ధాలు చెప్పిస్తున్నారు అంటూ నిరసన
     

👉అసెంబ్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌ సహా, మంత్రులు, ఎమ్మెల్యేలు చేరుకున్నారు. 

అసెంబ్లీకి చేరుకున్న కేసీఆర్‌..

👉బీఆర్‌ఎస్‌ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్నారు. బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో సభకు హాజరయ్యేందుకు ఆయన అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీ వద్ద కేసీఆర్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్వాగతం పలికారు. అనంతరం వారితో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

👉అసెంబ్లీ లాబీలో కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన పఠాన్‌చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. తన తమ్ముడి కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చిన మహిపాల్ రెడ్డి. పెళ్లికి రావాలనిక కేసీఆర్‌ను కోరిన ఎమ్మెల్యే, 


 

👉మొదటి రోజున గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ శాసనసభ, మండలి సంయుక్త సమావేశాలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సభ వాయిదా పడనుంది. తర్వాత శాసనసభ వ్యవహారాల కమిటీ(బీఏసీ) సమావేశం సభాపతి గడ్డం ప్రసాద్‌ కుమార్‌ అధ్యక్షతన జరగనుంది. సభను ఎన్నిరోజులు నిర్వహించాలనేది ఈ భేటీలో నిర్ణయించనున్నారు.

👉రెండో రోజు(13న) గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. ఈ తీర్మానం ఆమోదం తర్వాత మూడు బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.

👉మూడో రోజు(14న) హోలీ నేపథ్యంలో సభకు సెలవు ఉంటుందని తెలుస్తోంది. తిరిగి ఈ నెల 15 నుంచి 18 వరకూ సభలో కులగణన సర్వేపై చర్చ, బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎస్సీ వర్గీకరణ బిల్లుపై చర్చలు తీర్మానాలు ఉంటాయని సమాచారం. స్థానిక సంస్థల్లో, విద్య-ఉద్యోగావకాశాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి వేర్వేరు బిల్లులకు ఆమోదం తెలపనుంది.

👉అనంతరం, ఈ నెల 18 లేదా 19న 2025-26 రాష్ట్ర బడ్జెట్‌ను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. బడ్జెట్‌ ప్రవేశపెట్టిన మరుసటి రోజు సెలవు ఉంటుంది. అనధికార సమాచారం మేరకు ఈ నెల 27 లేదా 28 వరకు సభ జరగవచ్చని తెలుస్తోంది. బీఏసీలో నిర్ణయం తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement