మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ: సీఎం రేవంత్‌ | Telangana Assembly Live Updates | Sakshi
Sakshi News home page

Telangana Assembly Session 2023: తెలంగాణ అసెంబ్లీ అప్‌డేట్స్‌

Published Sat, Dec 16 2023 9:40 AM | Last Updated on Sat, Dec 16 2023 8:50 PM

Telangana Assembly Live Updates - Sakshi

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ప్రజలు చాలా బాధపడ్డారు: ఎమ్మెల్సీ కవిత

  • ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రెస్‌ మీట్‌
  • ఉభయ సభల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ జరిగింది
  • గవర్నర్ ప్రసంగంపై ప్రజలు చాలా బాధపడ్డారు
  • రెండు సార్లు ఓట్లేస్తే గెలిచి ఏర్పాటు చేసిన ప్రభుత్వంపై గవర్నర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు
  • నిరంకుశ, నిర్బంధ ప్రభుత్వంగా దూషించారు
  • ఆ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం
  • ఆ పదాలు రికార్డుల్లో నుంచి తొలగించాలని కోరాం
  • ప్రజల తీర్పు గౌరవిస్తున్నాం
  • తొలి శాసనమండలి సమావేశాలు ఇవి
  • మండలిలో భారాసకు మెజారిటీ ఉంది
  • ప్రభుత్వానికి సహరించాలన్న ఉద్దేశంతో ప్రజలకు ఓ సందేశం ఇవ్వాలనుకున్నాం
  • ఆ స్ఫూర్తిని ప్రభుత్వం కొనసాగించాలి
  • రాష్ట్ర ప్రగతిపై రోడ్ మ్యాప్ ప్రజలకు చెప్పాలి
  • నష్టం జరిగే చర్యలు అడ్డుకుంటాం.. పోరాటాలు చేస్తాం

తెలంగాణ శాసనమండలి నిరవధిక వాయిదా

  • ఇవాళ్టి అసెంబ్లీ సమావేశాలు వాడీవే‘ఢీ’గా
  • శాసన సభలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం
  • అనంతరం మండలిలోనూ అదే తరహా సీన్‌
  • సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీల అభ్యంతరం
  • చివరకు శాసన మండలి నిరవధిక వాయిదా

సీఎం రేవంత్‌ ప్రకటనపై కవిత సెటైర్లు

  • సీఎం ప్రకటన అనంతరం శాసనమండలిలో కల్వకుంట్ల కవిత ప్రసంగం 
  • మేడిగడ్డ ఏమైనా టూరింగ్‌ స్పాటా.. అందరినీ తీసుకెళ్లడానికి
  • నిపుణుల ఆధ్వర్యంలో కమిటీ వేసి.. వాళ్లను తీసుకెళ్లండి అని సీఎం రేవంత్‌కు చురక

మేడిగడ్డ, అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ: సీఎం రేవంత్‌

  • మేడిగడ్డ అన్నారంపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించనున్న తెలంగాణ ప్రభుత్వం
  • శాసన మండలిలో ప్రకటించిన సీఎం రేవంత్‌
  • ఎందుకు కుంగిపోయిందో.. ఎందుకు పనికి రాకుండా పోయిందో తెలుసుకుంటాం
  • అసెంబ్లీ సమావేశాలు ముగిశాక సభ్యులందరినీ మేడిగడ్డకు తీసుకెళ్తాం
  • విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయి
  • కాంట్రాక్టులు ఎవరిచ్చారు? వారి వెనుకున్న మంత్రులు ఎవరు?.. అధికారుల పాత్ర సహా అన్నీ బయటపడతాయి

ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

  • ముఖ్యమంత్రిలో గొప్ప పరిణితి  కన్పిస్తుంది
  • అసెంబ్లీ ముందు కూడా ఇంకా ముళ్ళ కంచె ఉంది.. వాటిని తొలగించాలి.
  • ముఖ్యమంత్రి బాష సంస్కార వంతంగా ఉండాలి
  • కాంగ్రెస్ పార్టీ అంటే ఒక్కరే కాదు అందరూ కలిస్తేనే ప్రభుత్వం
  • మీ పార్టీలో వ్యక్తి ఆరాధన ఎందుకు?
  • రీసెంట్ గా ఒక లాకప్ డెత్ జరిగింది
  • దానిపై ప్రభుత్వ వైఖరి ఏంటో చెప్పాలి.
  • ఒక జర్నలిస్ట్ ను చంపుతానని ఒక ఎమ్మెల్యే సెక్రటేరియట్ లో బెదిరించాడు.. దానిపై స్పందించాలి
  • రైతు బీమా పై వారి ఆలోచన ఏంటో చెప్పాలి.
  • భయపెట్టే విధంగా పాలకులు మాట్లాడకూడదు


మూసీని జీవనదిగా మారుస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

  • తెలంగాణ శాసన మండలిలో సీఎం రేవంత్‌ ప్రసంగం
  • స్వేచ్ఛకోసమే ప్రత్యేక రాష్ట్రం కావాలనుకున్నాం
  • ఇంకా ఉమ్మడి రాష్ట్రంలోలా పరిపాలన చేస్తామంటే ఎలా?
  • ఉక్కు కంచెలు వేసుకుని ఇన్ని రోజులు ప్రజలకు దూరమయ్యారు
  • ఇప్పుడు ప్రజావాణిని వింటున్నాం.. ప్రజావాణితో మార్పును తెచ్చాం
  • గత ప్రభుత్వంలో పేదలకు ఆరోగ్య శ్రీ అందలేదు
  • పాతబస్తీకి మెట్రో రైలు తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్‌ ప్రభుత్వానిది
  • మురికి మూసీని ప్రక్షాళన చేసి జీవనదిగా మారుస్తాం 
  • మూసీ పరివాహక ప్రాంతాన్ని ప్రత్యేక కారిడార్‌గా అభివృద్ధి చేస్తాం
  • ఈ ప్రభుత్వానికి ఎవరైనా.. ఎప్పుడైనా సూచనలు ఇవ్వొచ్చు
  • ప్రభుత్వం అంటే పాలకపక్షం, ప్రతిపక్షం

బానిస మనస్తత్వాన్ని ఇంకా కొందరు వదులుకోలేదు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి

  • ఎన్ని రకాల ఒడుదుడుకులు వచ్చినా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు: రేవంత్ రెడ్డి
  • జైపాల్‌ రెడ్డి కృషితోనే తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందింది
  • ప్రజల స్వేచ్ఛను ఏడో హామీగా ఇచ్చాం
  • ప్రగతి భవన్‌ ఉక్కు కంచెలు బద్ధలు కొట్టి.. చేసిన తప్పుల్ని సరిదిద్దాం
  • కొందరు నేతలు ఇంకా బానిస మనస్తత్వాన్ని వదులుకోలేదు
  • ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడే ప్రగతిభవన్‌ గేట్లు బద్దలుకొట్టాం
  • ఇంకా బానిస మనస్తత్వాన్ని కొందరు నేతలు వదులుకోవడం లేదు

బీఆర్‌ఎస్‌ నేతలు మోసం చేస్తూ వచ్చారు: మండలిలో సీఎం రేవంత్‌రెడ్డి

  • రాచరిక పోకడలను ఉద్యమాలతో నిర్మూలించిన చరిత్ర తెలంగాణది
  • ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు మూడోసారి ఉద్యమం చేశారు
  • ఉద్యమ నేపథ్యం ఉన్నవాళ్లకు, ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో స్వేచ్ఛ ఉంటుంది
  • ఇంతకాలం బీఆర్‌ఎస్‌ నేతలు అబద్ధాలు చెబుతూ వచ్చారు
  • తలసరి విద్యుత్‌ వినియోగంలో రాష్ట్రం 10వ స్థానంలో ఉంది
  • రైతుల ఆదాయంలో.. తెలంగాణ 25వ స్థానంలో ఉంది
  • రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉంది
  • రైతుల్ని ఆదుకుంటున్నామని అబద్ధం చెబుతూ వస్తున్నారు
  • రైతుల ఆదాయం పెంచడానికి.. వ్యవసాయం రంగం అభివృద్ధికి సరైన ప్రణాళిక రచించలేదు
  • నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చింది
  • ఇప్పటికీ నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో అదే వెనుకబాటుతనం ఉంది


గవర్నర్‌ ప్రసంగం ఎమ్మెల్సీ కవిత అభ్యంతరం

  • హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంలోని పలు అంశాలపై ఎమ్మెల్సీ కవిత తీవ్ర అభ్యంతరం
  • అభ్యంతరకరమైన వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత
  • విముక్తి, అణచివేత, నియంతృత్వ పాలన, వ్యవస్థల విధ్వంసం, వివక్ష వంటి పదాలను గవర్నర్ ప్రసంగం నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన
  • గవర్నర్ ప్రసంగంలోని అనుచిత వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రతిపాదన


ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది

  • మీడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు వ్యాఖ్యలు
  • ప్రధాన ప్రతిపక్షానికి కనీసం మాట్లాడే అవకాశం కూడా కల్పించలేదు
  • బీఆర్ఎస్‌కే కాదు బీజేపీ, ఎంఐఎం పార్టీలకు కూడా మాట్లాడే అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు
  • అబద్ధాలు చెప్తూ గోబెల్స్ ప్రచారం చేసింది
  • సత్య దూర మాటలు మాట్లాడింది కాంగ్రెస్ ప్రభుత్వం
  • డెమొక్రాటిక్ గా ఉంటామని చెప్పి ఇప్పుడెందుకు ఇవ్వలేదు
  • మేము మాట్లాడుతుంటే మా గొంతు నొక్కే ప్రయత్నం చేశారు
  • పీవీ నరసింహారావు చనిపోతే కనీసం నివాళులు అర్పించలేదు, కనీసం వెళ్లి చూడలేదు కాంగ్రెస్ పార్టీ
  • గుంటెడు జాగా కూడా ఇవ్వలేదు
  • అంజయ్యను అవమానించింది కాంగ్రెస్
  • అమరులను ప్రతిసారి నివాళులు అర్పించిన తర్వాతే కేసీఆర్ పనులు మొదలు పెడుతారు
  • సచివాలయం ముందు అమరుల స్థూపం ముందు కట్టింది బీఆర్ఎస్
  • ‘‘జై తెలంగాణ అంటే.. కాల్చేస్తా’’ అంటూ గన్ను పట్టుకొని వచ్చింది రేవంత్ రెడ్డి
  • యాది రెడ్డి శవాన్ని కనీసం చూడలేదు రేవంత్ రెడ్డి
  • అనేక ఉద్యమ కేసులు మాపై ఉన్నాయి
  • కేసులే లేవని అసెంబ్లీ చెప్తున్నాడు రేవంత్ రెడ్డి

అసెంబ్లీ బుధవారానికి వాయిదా 

  • హరీశ్‌రావు వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అభ్యంతరం
  • గవర్నర్‌ ప్రసంగంపై కేవలం క్లారిఫికేషన్స్ అడగాలని సూచన
  • సీఎం మాటలకు సమాధానం చెబుతానన్న హరీశ్‌రావు 
  • కాంగ్రెస్సే కుటుంబ పార్టీ అని కౌంటర్‌ 
  • పీవీ నరసింహారావును అవమానించారని ఫైర్‌ 
  • దీంతో సభను వాయిదా వేసిన స్పీకర్‌ 

సీఎం రేవంత్‌రెడ్డి స్పీచ్‌ 

  • ప్రగతిభవన్‌ గేట్లు బద్దలు కొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించాం 
  • కుటుంబ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు
  • బీఆర్‌ఎస్‌ పార్టీ కుటుంబ పాలనకే పరిమితమవుతుందని మరోసారి నిరూపించారు 
  • ఎంతోమంది సీనియర్లున్నా మాట్లాడేందుకు  బీఆర్‌ఎస్‌ వారికి అవకాశమివ్వలేదు
  • ప్రజాభవన్‌లో ప్రజావాణిని బీఆర్‌ఎస్‌ నేతలు భరించలేకపోతున్నారు 
  • హోం మంత్రిని ప్రగతిభవన్‌ లోపలికి రానివ్వలేదు
  • గద్దరన్నను ఎండలో నిలబెట్టిన ప్రగతిభవన్‌ గేట్లను బద్దలు కొట్టాం
  • ఫామ్ హౌస్ లో పండిన వడ్లకు 4200 లకు క్వింటాలు అమ్మారు
  • ఎవరికి అమ్మినారో...ఎలా అమ్మారో విచారణకు సిద్ధమా
  • బీఆర్‌ఎస్‌ వాళ్ళు ఒప్పుకుంటే నేను విచారణకు అదేశిస్తా
  • విద్యుత్ వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో లేదు
  • ప్రతిపక్షంలో కూడా అబద్ధాలు చెప్తూనే ఉన్నారు
  • కేంద్ర లెక్కల ప్రకారం తెలంగాణ 10వ స్థానంలో ఉంది
  • గోవా పంజాబ్, హరియాణ మొదటి స్థానంలో ఉన్నాయి
  • కాలువల ద్వారా నీళ్ళు ఇస్తే పంప్ సెట్లు పెరుగుతాయా?
  • కాళేశ్వరం ద్వారా నీళ్ళు ఇస్తునం అనే వాదన శుద్ధ అబద్ధం
  • తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం తెస్తాం 

అసెంబ్లీకి 15 నిమిషాలు టీ బ్రేక్‌ 

  • అసెంబ్లీలో గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ
  • ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడిన తర్వాత టీ బ్రేక్‌ ఇచ్చిన స్పీకర్‌ 

కూనంనేనికి మంత్రి హరీశ్‌రావు ఛాలెంజ్‌

  • బీఆర్‌ఎస్‌ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఎక్కడ చెప్పిందో నిరూపించాలి 
  • గవర్నర్‌ స్పీచ్‌పై కూనంనేని మాట్లాడితే మంచిదని సూచన


తెలంగాణ అసెంబ్లీలో వైఎస్సార్‌పై పొగడ్తల వర్షం

  • వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డిని పొగిడిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
  • ఒక వ్యక్తి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అనేదానికి నిదర్శనం వైఎస్సార్
  • ఎవ్వరూ ఊహించని విధంగా వైఎస్సార్ పాలన సాగింది
  • ఒక్కడే ఆరోగ్య, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పెన్షన్లు, ఇండ్లు, రేషన్, జలయజ్ఞం ఇలా అసాధ్యాలను సుసాధ్యం చేశారు
  • వైఎస్ఆర్ ఎన్నో హామీలు ఇచ్చారు...అన్ని అమలు చేసి చూపించారు
  • వైఎస్ఆర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్, కమిట్మెంట్ తో పని చేశారు
  • 50 ఏళ్లలో ఎంతో కొంత అభివృద్ధి జరిగింది
  • గత పదేళ్ల బీఆర్‌ఎస్‌ హయాంలోనూ అభివృద్ధి ఉంది 
  • ఏం చేయకపోవడం అనేది ఉండదు..అందరూ ఎంతో కొంత చేశారు
  • గత బీఆర్‌ఎస్‌ తప్పులు జరగకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చూసుకోవాలి
  • ఎమ్మెల్యేలను కొనుగోలు చేయొద్దు 
  • పార్టీ మార్పులను ప్రోత్సహించవద్దు 
  • ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛను కాంగ్రెస్‌ కాపాడాలి

కాంగ్రెస్- హామీలు చాలా ఇచ్చారు.. ఎన్ని నెరవేర్చారు అనేది ముఖ్యం.
* బీజేపీ ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయింది. 
* ముస్లింల అభివృద్దికి ఆ పార్టీలు ప్రాధాన్యం ఇవ్వడం లేదు.
* కాంగ్రెస్కు మేము దగ్గర ఉన్నామంటే.. అందుకు కారణం మాజీ సీఎం, వైఎస్ రాజశేఖర్రెడ్డి మాత్రమే.
* ముస్లింల సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్ ఎంతో కృషి చేశారు - అక్బరుద్దీన్ ఓవైసీ

అసెంబ్లీకి మాజీ కేంద్ర మంత్రి జైరాం రమేష్
* అసెంబ్లీ ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో  జైరాం రమేష్ భేటీ.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కామెంట్లు

*  ముస్లింలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ను గెలిపించారు కానీ వీళ్ళు మాత్రం ముస్లింలను గెలిపించడం లేదు.
* వాళ్ళు కూర్చునే ప్లేస్ మారుతుంది కానీ మేము ఎప్పుడూ అలానే ఉన్నాం.
* ముస్లింల కోసం మేము పోరాటం చేస్తున్నాం.. చేస్తూనే ఉంటాం.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌పై బీజేపీ ఎటాక్
• మెడికల్ కాలేజీలకు అనుమతి ఇచ్చింది కేంద్ర బీజేపీ.
• కేంద్రం నుంచి కాంగ్రెస్‌ను కాపాడేందుకు మేము రెస్క్యూ చేస్తామన్న కేటీఆర్ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఒకేటే అన్నట్లు అనిపిస్తోంది
• మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలను ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్
• తలుపులు మూసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ అవమానించారు - మంత్రి పొన్నం
• తెలంగాణను అవమానించిన బీజేపీలో ఉండటంపై సిగ్గుపడాలి - మంత్రి పొన్నం
• ఎంఐఎం, బీఆర్‌ఎస్‌, బీజేపీ.. ఒక్కటే అని బయట అనుకుంటున్నారు - పొన్నం ప్రభాకర్

రేవుల ప్రకాశ్‌రెడ్డి, బాలు నాయక్, కౌసర్ మోయినొద్ధిన్, కూనం నేని సాంబశివరావులను ప్యానెల్ స్పికర్లగా ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

అరు గ్యారెంటీలు అన్నారు.. అందులో రెండు అమలు అన్నారు.. కానీ పూర్తిగా అమలు కావడం లేదు - కేటీఆర్
* మార్చ్ 17 వరకు ఆరు గ్యారెంటీలు అమలు కోసం ప్రజలు వేచి చూస్తున్నారు.
* హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడే ఆరోగ్య శ్రీ 10లక్షలు అమలు మేము చేశాం.
* ప్రజావాణి ప్రతి మంగళవారం కలెక్టరేట్‌లో జరుగుతూనే ఉంది.
* ఫస్ట్ కేబినెట్‌లో ఆరు గ్యారెంటీలకు చట్ట భద్దత తెస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. ఇప్పటికీ మూడు కేబినెట్‌లు అయ్యాయి కానీ కాలేదు.
* 2లక్షల రుణమాఫీ అన్నారు చెప్పిన డేట్ దాటిపోయింది.
* రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి డీఎస్సీ, జాబ్ గ్యారెంటీ అన్నారు కానీ కాలేదు.
* మేము చేసిన అభివృధి కంటే ఎక్కువ అభివృద్ధి చేయాలని కోరుతున్నాం.
* అమరుల గురించి గవర్నర్ ప్రసంగంలో ఉంది. అమరులకు కారణం ఎవరు? అందరికీ తెలుసు!
* ఆల్రెడీ శ్వేత పత్రాలు ఉన్నాయి. కొత్తగా బయట పెట్టాల్సిన అవసరం లేదు.

అప్పుల సాకు చెప్పి ఆరు గ్యారెంటీలు ఎగ్గొట్టెందుకు ప్లాన్ వేస్తున్నారు: కేటీఆర్‌

* ట్రాన్స్‌కో ఆస్తులు 24వేలు జెంకో 53వేలు, డిస్కాంలు 59వేల ఉన్నాయి.
* 81వేల అప్పులు ఉంటే.. 1లక్ష 75వేలు ఉన్నాయి.
* ఆనాడు కొత్త ప్రభుత్వానికి 11వేల డిస్కాంల అప్పులు వదిలేస్తే దానితో పాటు 9వేల కోట్లు చెల్లించాం.
* మహిళలకు, మధ్యతరగతి ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలి.
* అప్పుల కంటే ఆస్తులు ఎక్కువగా ఉన్నాయి.

గతంలో వైఎస్సార్‌ గొప్పతనాన్ని, అభివృద్ధిని కేసీఆర్ గొప్పగా చెప్పారు

* విద్యుత్ డిమాండ్, పంప్సెట్ల సంఖ్య మా ప్రభుత్వంలో పెరిగింది.
* గావు కేకలతో విద్యుత్ సంస్థలు బాగుపడవు.
* 2014లో  24లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 1కోట్లు 30లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పెరిగింది.

కాంగ్రెస్ నాయకులు కష్టపడి కట్టుకున్న పుట్టలో చీమలు చొరబడట్లు పార్టీలోకి చొరబడి సీఎం అయింది రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే కేటీఆర్

* తెలంగాణ ప్రజలు ఎన్నుకుంటే రేవంత్ రెడ్డి సీఎం అవ్వలేదు.. హైకమాండ్ చేస్తే అయ్యారు.
* బయటదేశం నుంచి వచ్చిన వాళ్లకు అధ్యక్షులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎన్‌ఆర్‌ఐల గురించి మాట్లాడితే ఎలా?
* NRI అంటే బయట వాళ్ళే అనే కాంగ్రెస్ నాయకుల మాటలు ఎన్‌ఆర్‌ఐలు ఆలోచన చెయ్యాలి.
* బస్సు, బంగారం ఫ్రీ అని మభ్యపెట్టి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ.
* అధికారంలో కూర్చున్న ఒక్కరికీ కూడా ఐటీఐఆర్‌ తెల్వదు.
* అభ్యుదయం తెల్వని వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు.

•  పదవులను గడ్డిపోసలెక్క వదిలేసిన చరిత్ర కేసీఆర్ది : బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు. 
•  ఏబీవీపీ నుంచి మొదలై టీడీపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చి రేపు ఎక్కడా రేవంత్రెడ్డి ఉంటారో తెలియదు
•  పదవుల కోసం పార్టీలు మారిన చరిత్ర మీది.. మాది కాదు.

శాసన సభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు కామెంట్లు..
* గత ఐదేళ్లుగా ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉందో బీఆర్‌ఎస్‌ చెప్తూనే ఉంది. కానీ ప్రజలు మళ్ళీ కాంగ్రెస్‌కే అధికారం ఇచ్చారు.
* గవర్నర్ ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ సభ్యులు మాట్లాడితే బాగుంటుంది.

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు కామెంట్లు..
* సీఎం రేవంత్‌రెడ్డి సభను తప్పుదోవ పట్టించేలా మాట్లాడారు
* మేం పొత్తు పెట్టుకోవటం వల్లనే ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 
* ఆ రోజు కాంగ్రెస్‌ పార్టీకి జీవం పోసింది కేసీఆరే.

కొంతమంది ఎన్‌ఆర్‌ఐలకు తెలంగాణ ప్రజాస్వామ్యం విలువ తెలియదు: సీఎం రేవంత్‌రెడ్డి
*  గత పాలనలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్, సింగిల్ విండో చైర్మెన్గా ఓడినా  కేసీఆర్ను మంత్రిని చేసింది కాంగ్రెస్ పార్టీనే.
*  వైఎస్ఆర్ పాలనలో కేసీఆర్ కుటుంబం నుంచి ఎమ్మెల్యేగా లేకుండా మంత్రిగా చేశారు.
*  ప్రతిపక్షాలకు 2014కు ముందు అభివృధిపై చర్చ కావాలంటే ఒక రోజు అంతా చర్చించుకుందాం.
*  కేటీఆర్ చెప్పే పాపాల్లో ఇప్పుడు ఆయన చుట్టూ కూర్చున్న వాళ్ళదే పాత్ర ఉంది.
*  ఐదేళ్లు సమయం ఉంది. జరిగిన విధ్వంసం ఏంటో అన్ని బయటపడతాయి.
* పిల్లి శాపనార్థాలకు ఉట్లు తేగిపడవు.

గవర్నర్ ప్రసంగం పై కేటీఆర్ మాట్లాడుతుండగా గందరగోళం
• కేటీఆర్ వ్యాఖ్యలను తప్పు పట్టిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్
• పదేళ్ల పాలన పై కాంగ్రెస్ చర్చ జరగాలి అంటే.. 50 ఏళ్ల పాలనపై చర్చ జరగాలని బీఆర్‌ఎస్‌ పట్టు
• ఆనాడు అన్యాయం జరిగింది కాబట్టే తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిందన్న భట్టి
• సంపద రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చింది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమే
• తెలంగాణ అంటే 2014 నుంచి మాత్రమే లెక్క వేయాలన్న భట్టి విక్రమార్క
• బీఆర్‌ఎస్‌కు గోదావరి, కృష్ణలో ఒక్క చుక్క నీళ్లు తెలీదు
• బీఆర్‌ఎస్‌ పాలన విధ్వంసం చేసింది

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కామెంట్లు..
* ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సూచనలు చేస్తే స్వాగతిస్తాం.
* ప్రజాస్వామ్య యుతంగా సభను నడుపాలని మేము అనుకుంటున్నాం.
* అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ప్రతీ గల్లికి నీళ్ళు కాంగ్రెస్ పాలనలో నీళ్ళు ఇచ్చింది మేము లెక్కలు చెప్పగలం.

కేటీఆర్ స్పీచ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్డగింత
* తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందనే కదా తెలంగాణ తెచ్చుకున్నాం - పొన్నం ప్రభాకర్ మంత్రి

గవర్నర్ ప్రసంగం పూర్తిగా అసత్యాలు, అభూత కల్పనగా ఉంది - కేటీఆర్

* గవర్నర్ దారుణమైన ప్రసంగం విన్నాక రాష్ట్రం ఎలా ఉండబోతుందో అర్థం అవుతోంది.
* నక్క మోసం చేయనని, పులి మాంసం తినను అని వాగ్వాదం ఇచ్చినట్లు గవర్నర్ ప్రసంగం ఉంది.
* మేము ఎక్కడ ఉన్న ఉన్నా ప్రజా పక్షమే.
* కాంగ్రెస్ పాలనలో త్రాగు, సాగు, కరెంట్ దిక్కు లేదు.
* నల్గొండ జిల్లాలో ఫ్లోరోసిస్ తప్ప ఏమైనా ఉందా?
* కాంగ్రెస్ పాలనలో 50 ఎకరాల రైతు అయినా సరే గుంపు మేస్త్రి లాగా ఉండేవారు.

చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ కామెంట్లు...

* ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది.
* తెలంగాణ వస్తె భవిషత్ భాగుపడుతుందని ప్రజలు ఆశించారు.
* గత ప్రభుత్వం పాలనలో చాలా లోపాలు ఉన్నాయి.
* కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ చేపట్టాలి.
* రీ డిజైన్ ఎందుకు చేశారో? వేల కోట్లు ఎందుకు ఖర్చు చేశారో తేల్చాలి.
* బీఆర్‌ఎస్‌ పాలనలో పవర్ కార్పొరేషన్ వేల కోట్ల అప్పుల్లోకి వెళ్ళింది.
* బీఆర్‌ఎస్‌ పాలనలో నియంతృత్వం కొనసాగింది, అక్రమ కేసులు పెట్టారు.
* రేవంత్ సీఎం అవ్వగానే ప్రగతి భవన్ వద్ద ముళ్ళ కంచెలు తొలగించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.
*  90శాతం వరకు మిషన్ భగీరథ నీళ్ళు రాలేదు.
* ఏ గ్రామాల్లో కూడా డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలేదు.
* ఇందిరమ్మ పాలన మళ్ళీ తెలంగాణలో రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు.
* 60వేల ఉద్యోగులున్న సింగరేణి, బీఆర్‌ఎస్‌ వచ్చాక 39వేలకు పరిమితం అయింది.
*  తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారు.
*  మూడు వందల రిటైర్డ్ అధికారులకు మళ్ళీ ఉద్యోగం కల్పించారు.
* ప్రతి ఫైల్ పై విచారణ జరిగితే నిజాలు తెలుస్తాయి.

గత పదేళ్లు ఎన్నో నిర్బంధాలకు గురి అయ్యాము: పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

•బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో మా ప్రాంతానికి తీరని అన్యాయం జరిగింది.
•రీ-డిజైన్ పేరుతో బీఆర్‌ఎస్‌ మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసింది.
• ఫార్మసీటి రద్దు చేస్తాం, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తాం
• బాసర ట్రిపుల్ ఐటి టైప్ మరో నాలుగు ఏర్పాటు చేస్తాం.
• ధరణి ప్లేస్ భూమాత ఏర్పాటు చేస్తాం, బెల్ట్ షాప్ లను రద్దు చేస్తాం.
• బిసి కుల గణన చేస్తాం, ప్రతి జిల్లాకు బిసి భవన్ ఏర్పాటు చేస్తాం.
• ప్రజల కోసం ఎదైనా నిరసనకు పిలుపునివ్వగానే ఇంటి ముందు పోలీసులు ఉండే వాళ్ళు. 
• రేవంత్ రెడ్డి సీఎం అయిన 24గంటల్లోనే ప్రగతి భవన్ కంచెలు తొలగించారు.
• గత ప్రభుత్వం ఇంట్లో ఒకరికి మాత్రమే పెన్షన్ ఇచ్చేవాళ్లు.. మేము అర్హులైన అందరికీ ఇస్తాం.
• వచ్చే వంద రోజుల్లో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు తప్పకుండా అమలు చేస్తాం.
• వికారాబాద్, పరిగి సెగ్మెంట్‌లో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ గత ప్రభుత్వం ప్రారంభించలేదు.

•  గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానంను పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు.
•   చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ బలపరిచారు

• రెండవ అతిపెద్ద పార్టీగా బీఆర్‌ఎస్‌ పార్టీ ఉన్నట్లు స్పీకర్ వెల్లడి
• గవర్నర్ ప్రగంగంపై మొదలైన ధన్యవాదాల తీర్మానం

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
• ప్రతిపక్ష పార్టీ నేతగా కేసీఆర్‌ను సభలో ప్రకటించిన స్పీకర్ గడ్డం ప్రసాద్

• శాసనమండలిలో బీఆర్ఎస్ పార్టీ తరఫున గవర్నర్ ధన్యవాదాల తీర్మానంపై మాట్లాడనున్న మధుసూదనా చారి, దేశపతి శ్రీనివాస్

బీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో సమావేశమైన బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యేలు
• హాజరైన కేటీఆర్,హరీష్ రావు, తలసాని
• గవర్నర్ ప్రసంగంపై కౌంటర్ ఎటాక్ చేయాలని నిర్ణయం

శాసనసభ, శాసనమండలి ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి.
•  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లో నేడు చర్చ
•  ప్రభుత్వ సమాధానం ఉండనుంది.
•  కొత్త అసెంబ్లీ కొలువు తీరిన తర్వాత జరుగుతున్న మొదటి చర్చపై ఆసక్తి
•  నేడు శాసనసభతో పాటు మండలిలోనూ గవర్నర్ ప్రసంగం ధన్యవాదాలు తీర్మానం పై చర్చ ఉంటుంది.
• అసెంబ్లీలో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదా  తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు.
• చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద బలపరుస్తారు. 
• మండలిలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తీర్మానాన్ని ప్రతిపాదిస్తారు
• టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి బలపరుస్తారు. 
• బీఅర్ఎస్ పార్టి తరపున గవర్నర్ ప్రసంగంపై  ఎమ్మెల్యేలు కేటీఅర్‌, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు మాట్లాడనున్నారు.
• గత పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వ విధానాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ప్రసంగంలో తీవ్రంగా విమర్శించారు. 
• అప్పులు భారీగా పెరిగాయని, వ్యవస్థలను దెబ్బ తీశారని గవర్నర్ ఆరోపించారు.
• కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న మొదటి చర్చపై నెలకొన్న ప్రాధాన్యత. 
• గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌ ప్రసంగానికి, ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఎలా సాగుతుందన్న దానిపై ఆసక్తి. 
• అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి, కాంగ్రెస్ గెలుపు అనంతరం జరుగుతున్న మొదటి చర్చ హాట్ హాట్గా సాగనుంది. 
• గవర్నర్ ప్రసంగంలో పొందుపరిచిన అంశాలపై బీఆర్ఎస్ సభా వేదికగా ఎలా స్పందించనుంది..? 
• సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఎలా ఉండనుంది అన్న అంశం ఆసక్తికరంగా మారింది..?
• ఆరు గ్యారంటీలను అమలు చేయకపోతే అసెంబ్లీ వేదికగా పోరాటమే అంటున్న - బీజేపీ ఎమ్మెల్యేల హెచ్చరిక.
• ఇంకా కాన్స్టిట్యూట్ కానీ  బిజినెస్ అడ్వైజర్ కమిటీ.
• బీజేపీ, ఎంఐఎం ఫ్లోర్ లీడర్ల ఎంపిక విషయంలో స్పీకర్ కార్యాలయానికి అందని లేఖలు
• ఇక ఈ నెల 9న సమావేశాలు ప్రారంభమయ్యాయి.
• సభ్యుల ప్రమాణ స్వీకారాలు, స్పీకర్ఎన్నిక జరిగింది.
• ఉభయ సభల సంయుక్త సమావేశంలో  సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇప్పటి వరకు జరిగాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement