హైదరాబాద్ : శాసనసభ సమావేశాలు ఆరో రోజు కూడా విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య ప్రారంభం అయ్యాయి. గురువారం సభ ప్రారంభం కాగానే విపక్షాలు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాలను స్పీకర్ నాదెండ్ల మనోహర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ సభ్యులు సమైక్య తీర్మానం చేయాల్సిందేనంటూ స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సమైక్య నినాదాలతో సభను హోరెత్తించారు.
మరోవైపు తెలంగాణ ప్రాంత సభ్యులు కూడా స్పీకర్ పోడియం వద్దకు చేరి జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో సమైక్యంధ్రా, తెలంగాణ నినాదాలతో అసెంబ్లీ దద్దరిల్లింది. సభా కార్యక్రమాలు సజావుగా సాగేందుకు సహకరించాలని స్పీకర్ విజ్ఞప్తి చేసినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవటంతో స్పీకర్ సమావేశాలను అరగంట పాటు వాయిదా వేశారు. కాగా అసెంబ్లీ వాయిదా అనంతరం వైఎస్ఆర్ సీపీ సభ్యులు స్పీకర్తో చర్చలు జరుపుతున్నారు. గతంలో ఇచ్చిన సమైక్య తీర్మానం నోటీసు, విజయమ్మ లేఖపై వారు చర్చిస్తున్నారు.
నిరసనలు, నినాదాలు, అసెంబ్లీ వాయిదా
Published Thu, Jan 9 2014 9:54 AM | Last Updated on Tue, May 29 2018 4:09 PM
Advertisement