ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టిన వ్యవసాయ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రవేశపెట్టిన వ్యవసాయ బడ్జెట్ ప్రసంగం అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావు సభను 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అంతకు ముందు అసెంబ్లీలో ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ అంశాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా మాట్లాడేందుకు అవకాశం ఇవ్వలేదని ప్రతిపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.