హైదరాబాద్ : శాసనసభలో తీరు మారలేదు. నినాదాలు, నిరసనల మధ్య అసెంబ్లీ బుధవారానికి వాయిదా పడింది. సమైక్య నినాదాల మధ్య అసెంబ్లీలో ఎటువంటి చర్చ చేపట్టే పరిస్థితి లేకపోవడంతో డిప్యుటీ స్పీకర్ మల్లు భట్టీ విక్రమార్క సభను రేపటికి వాయిదా వేశారు. రెండుసార్లు వాయిదా పడిన అసెంబ్లీలో తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకపోవడంతో సభ రేపటికి వాయిదా పడింది.
మంగళవారం ఉదయం సభ ప్రారంభం కాగానే సమైక్యాంధ్ర నినాదాలతో దద్దరిల్లింది. సభ ప్రారంభం కాగానే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన సమైక్య తీర్మానంపై వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. దాంతో వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి సమైక్య నినాదాలతో హోరెత్తించారు. సభలో గందరగోళం తలెత్తడంతో తొలుత స్పీకర్ సభను గంటపాటు వాయిదా వేశారు. దీంతో వరుసగా నాలుగో రోజు కూడా వాయిదా పర్వం చోటుచేసుకుంది.
నినాదాలు, నిరసనలు, వాయిదాలు
Published Tue, Jan 7 2014 2:16 PM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
Advertisement