హైదరాబాద్ : శాసన సభలో సమైక్య తీర్మానం చేయాలి.. ఇది సాధ్యం కాకపోతే.. విభజన బిల్లుపై ఓటింగ్ పెట్టాలన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్‌తో అసెంబ్లీ శుక్రవారం దద్దరిల్లింది. అయితే దీనిపై సందర్భాన్నిబట్టి వ్యవహరిస్తామని మాత్రమే చెబుతున్న స్పీకర్, ప్రభుత్వం.. ఓటింగ్ ఉంటుందో లేదో ఏమాత్రం స్పష్టత ఇవ్వడంలేదు.
మరోవైపు.. కీలకమైన విభజన బిల్లుపై సభలో చర్చ జరుగుతున్నప్పటికీ..సీఎం, ప్రధాన ప్రతిపక్షనేత, శాసనసభా వ్యవహారాలశాఖా మంత్రి శైలజానాత్‌తోపాటు పలువురు మంత్రులు, సభ్యులు ఈ అంశాన్ని ఏమాత్రం సీరియస్‌గా తీసుకోవడంలేదు. ఈ ఉదయం తొమ్మిది గంటలకు సభ ప్రారంభమైనప్పుడు చాలా పల్చగా కనపడింది.
నినాదాల మధ్య ప్రారంభమైన అసెంబ్లీలో వైఎస్‌ఆర్ సీపీ సభ్యులు స్పీకర్ పోడియంను చుట్టుముట్టిసభను అడ్డుకోవడంతో సభ పట్టుమని మూడు నిమిషాలు కూడా సాగలేదు. సమావేశాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ నాదెండ్ల మనోహర్ సభను అరగంట వాయిదా వేశారు.