'కాంగ్రెస్ తానా... అంటే ప్రతిపక్షం తందానా' | srikanth reddy takes on kiran kumar reddy | Sakshi
Sakshi News home page

'కాంగ్రెస్ తానా... అంటే ప్రతిపక్షం తందానా'

Published Thu, Jan 23 2014 9:49 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

'కాంగ్రెస్ తానా... అంటే ప్రతిపక్షం తందానా' - Sakshi

'కాంగ్రెస్ తానా... అంటే ప్రతిపక్షం తందానా'

హైదరాబాద్ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై  వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు.  సీఎంకు సాహిత్య పోరాటంకు...సాయుధ పోరాటంకు తేడా తెలియటం లేదని ఎద్దేవా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ బిల్లుపై స్పష్టత ఇవ్వకుండా...హైకమాండ్‌కు అన్ని విధాల సహకరిస్తున్నాడని శ్రీకాంత్‌ రెడ్డి విమర్శించారు.

మరోవైపు కాంగ్రెస్‌ బృందం తానా అంటే....దానికి ప్రతిపక్షం తందానా అంటుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తెలంగాణ బిల్లుపై ఓటింగ్ విషయంలో స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ సీపీ అసెంబ్లీలో పట్టుబట్టింది. దాంతో సభా కార్యక్రమాలకు అంతరాయం కలగటంతో స్పీకర్ సమావేశాల్ని 15 నిమిషాలు వాయిదా వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement