హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు | YSR CP MLA Srikanth reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు

Published Thu, Dec 18 2014 10:09 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు - Sakshi

హేళన చేసేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబు బీఏసీ సమావేశంలో ప్రతిపక్షాన్ని హేళన చేసే విధంగా వ్యవహరించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్రెడ్డి ఆరోపించారు. గురువారం ప్రారంభమవుతున్నా అసెంబ్లీ సమావేశాల్లో తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ మృతి, పెషావర్ కాల్పుల్లో మృతులపై సంతాప తీర్మానం ప్రవేశపెడుతున్నట్లు చంద్రబాబు వెల్లడించారని శ్రీకాంత్రెడ్డి తెలిపారు.

హుదూద్ తుపాన్లో చనిపోయిన మృతులు, కరువు కారణంగా ఆత్మహత్య చేసుకున్న రైతులకు కూడా సభలో సంతాప తీర్మానం ప్రవేశ పెట్టాలని తాము కోరగా... ఆ సంప్రదాయం లేదని చంద్రబాబు తోసిపుచ్చారని చెప్పారు.  అసెంబ్లీ సమావేశాల్లో చర్చలు సజావుగా జరగకుంటే ప్రతిఘటిస్తామని ప్రభుత్వాన్ని శ్రీకాంత్రెడ్డి హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గురువారం ప్రారంభమైనాయి. అవి 23వ తేదీతో ముగియనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement