
సాక్షి, వైఎస్సార్ జిల్లా: మార్షల్ అధికారులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు యూజ్‌లెస్ ఫెలోస్ అని దూషించడం సరికాదని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కోడూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయనతో పాటు విప్ కొరముట్ల శ్రీనివాసులు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్బంగా చీఫ్ వీప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబుకు, లోకేష్‌కు టైమ్ అయిపోయిందని, ప్రజలు తమను గుర్తు పెట్టుకోవాలనే ఆలోచనతో అసెంబ్లీలో ప్రవర్తిస్తున్న తీరు ప్రజలు గమనిస్తూనే ఉన్నారని విమర్శించారు. దిశ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడుతుంటే టీడీపీ వాళ్లు వాకౌట్ చేయడం దారుణమన్నారు. అలాగే కొరముట్లు శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాలను పూర్తిగా అమలు చేశారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment