హుజూర్‌నగర్, న్యూస్‌లైన్: త్వరలో జరగనున్న స్థానిక, సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ సత్తా చాటాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ మూడో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుజూర్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డి స్థాపించిన వైఎస్సార్‌సీపీ అనతికాలంలోనే రాష్ట్ర ప్రజల అభిమానాన్ని చూరగొన్నదన్నారు. తమ పార్టీ ప్రతిపక్ష పార్టీల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన ప్రజా వ్యతిరేక విధానాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడిన విషయాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలను కోరారు. అసమర్థ కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరపకుండా కాలయాపన చేయడం వల్లే నేడు ఒకేసారి వరుస ఎన్నికలు వచ్చాయన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి ప్రజలపై పన్నుల భారం వేసి అధికారమే పరమావధిగా కాలయాపన చేసిన కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో పారదోలాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పథకాలను గడపగడపకు ప్రచారం చేసి ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అధిక స్థానాల్లో గెలిపించాలన్నారు.
వైఎస్సార్ స్వర్ణయుగ పాలన కోసం ఎదురు చూస్తున్న ప్రజల కల సాకారమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. జిల్లాలో కలిసొచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకొని రంగంలోకి దిగనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ హుజూర్‌నగర్ పట్టణ, మండల అధ్యక్షులు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, మేళ్లచెరువు మండల అద్యక్షుడు చిలకల శ్రీనివాసరెడ్డి, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు పోతుల జ్ఞాన య్య, కోడి మల్లయ్య, నాయకులు బుడి గె పిచ్చయ్య, జడ రామకృష్ణ, గుర్రం వెంకటరెడ్డి, గొట్టెముక్కల రాములు, ముసంగి శ్రీను, కస్తాల రామయ్య, మందా వెంకటేశ్వర్లు, బత్తిని సత్యనారాయణ, కస్తాల ముత్తయ్య, దేవరకొండ వెంకన్న, బెల్లంకొండ సతీశ్, నక్కా నరేశ్ పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల నియామకం
వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యులను నియమిస్తూ బుధవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. కోదాడ నియోజకవర్గానికి చెందిన తోట ఆధిత్య, పెంట్యాల పాపారావు, మైలారుశెట్టి భాస్కర్, కర్ల సుందర్ బాబులను నియమించారు.