నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ | worst conditions of nandyala roads says ysrcp mla bhuma nagireddy | Sakshi
Sakshi News home page

నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ

Published Fri, Mar 13 2015 9:53 AM | Last Updated on Fri, Oct 19 2018 8:11 PM

నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ - Sakshi

నంద్యాల పేరు గొప్ప...ఊరు దిబ్బ

హైదరాబాద్ : నంద్యాల నియోజవర్గం పేరు గొప్ప..ఊరు దిబ్బ అన్న చందంగా తయారైందని నంద్యాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అన్నారు.  ఆయన శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ నంద్యాలలో రోడ్ల వ్యవస్థ అస్తవ్యస్థంగా మారిందన్నారు.  పట్టణంలో రోడ్ల ఆక్రమణలు అధికం అయ్యాయని,  ఆక్రమణలు జరుగుతున్నా మున్సిపాలిటీ వారు పట్టించుకోవటం లేదని భూమా నాగిరెడ్డి అన్నారు. 

 

ఆక్రమణలను తొలగించే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. ఈ సమస్య వల్ల ఇంట్లో నుంచి బయటకు వెళ్లేందుకే వీలు లేకుండా ఉందన్ని, మహిళలు, పిల్లలు, విద్యార్థులు బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొందన్నారు. రోడ్ల ఆక్రమణల గురించి గతంలో మున్సిపల్ సమావేశాల్లో ప్రశ్నించినందుకే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని భూమా ఈ సందర్బంగా సభ దృష్టికి తీసుకు వచ్చారు.  భూమా నాగిరెడ్డి ప్రశ్నకు రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు  సమాధానం ఇస్తూ నంద్యాలలోనే కాదని, రాష్ట్రంలోన ఎక్కడా రోడ్లు బాగోలేదన్నారు. నంద్యాల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement