హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరిగింది. స్పీకర్పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పుడు స్పీకర్ శివప్రసాద్పై అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు.
4న అసెంబ్లీ-స్పీకర్పై అవిశ్వాస తీర్మానంపై చర్చ
Published Thu, Mar 26 2015 1:30 PM | Last Updated on Sat, Aug 18 2018 8:54 PM
Advertisement
Advertisement