no trust motion
-
ధన్‌ఖడ్‌పై అభిశంసన నోటీసు తిరస్కరణ
న్యూఢిల్లీ: అధికార పక్షం పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్‌పై విపక్షాల కూటమి పార్టీలు రాజ్యసభలో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం నోటీసు గురువారం తిరస్కరణకు గురైంది. వాస్తవికత లోపించిందని, వ్యక్తిగత దాడిని ఈ నోటీసు ప్రతిబింబిస్తోందని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ వ్యాఖ్యానించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ‘‘ నోటీసు మొత్తం తప్పుల తడకగా ఉంది. ప్రామాణిక విధానంలో రూపొందించ లేదు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రతిష్టను దురుద్దేశపూర్వకంగా దెబ్బతీసేలా నోటీసును సిద్ధంచేశారు. కేవలం ప్రచార ఆర్భాటం కోసమే ప్రవేశపెట్టిన నోటీస్ ఇది’’ అంటూ హరివంశ్ ఈ నోటీసును తిరస్కరించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ ఛైర్మన్ తీసుకున్న ఈ నిర్ణయానికి సంబంధిత వివరాలున్న మూడు పేజీల రూలింగ్‌ను రాజ్యసభ ప్రధాన కార్యదర్శి పీసీ మోడీ గురువారం సభ ముందు ఉంచారు. పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్న ధన్‌ఖడ్‌పై తాము విశ్వాసం కోల్పోయామని, ఆయనను ఆ పదవిని తప్పించాలని కోరుతూ 60 మంది విపక్ష పార్టీల ఎంపీలు డిసెంబర్ పదో తేదీన సంతకాలుచేసి ఆ అభిశంసన తీర్మాన నోటీసును రాజ్యసభలో అందించిన విషయం విదితమే. ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు వీలు కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 67(బీ) కింద విపక్షాలు ఈ నోటీసును ఇచ్చాయి. ‘‘ నోటీస్ ద్వారా విపక్ష సభ్యులు ఉపరాష్ట్రపతి అధికారాలను తక్కువ చేసి చూపించే అనవసర సాహసం చేశారు. పార్లమెంట్, పార్లమెంట్ సభ్యుల ప్రతిష్టకు భంగం కల్గించేలా ఉన్న ఈ నోటీసు డిప్యూటీ ఛైర్మన్ అభిప్రాయాలను కించపరిచేలా ఉంది. అయినా ఉపరాష్ట్రపతిని అభిశంసించేందుకు సంబంధించిన తీర్మానంపై ఓటింగ్ చేపట్టాలంటే కనీసం 14 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలి. డిసెంబర్ 10న సభ ముందుకొచ్చిన ఈ నోటీస్‌పై తీర్మానం, అనుమతి అనేవి నిబంధనల ప్రకారం డిసెంబర్ 24వ తేదీ తర్వాతే సాధ్యం. మంత్రిమండలి నవంబర్ ఆరో తేదీన నోటిఫై చేసిన ప్రకారం ప్రస్తుత రాజ్యసభ 266వ సెషన్ నవంబర్ 25న మొదలై డిసెంబర్ 20న ముగుస్తుంది. ఈ లెక్కన తీర్మానం తేదీ(డిసెంబర్ 24)కంటే ముందుగానే రాజ్యసభ సెషన్ ముగుస్తోంది. ఇలాంటి సందర్భంలో తీర్మానాన్ని ఆ తేదీలోపే అనుమతించడం కుదరదు’’ అని హరివంశ్ వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. -
‘మణిపూర్ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం’
Live Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై ఇవాళ రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా ప్రసంగం మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా.. కేంద్రం తరపున హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుంది కూడా. ప్రజలకు అంతా తెలుసు. వాళ్లు అంతా చూస్తున్నారు. ప్రజలకు మాపై పూర్తి విశ్వాసం ఉంది. ► ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్ వీడియో గురించీ ప్రస్తావించారు అమిత్ షా. ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్ అయ్యింది’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారు. నేను స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్ వెళ్లాను. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని నేనేనే. మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం. త్వరలోనే మణిపూర్ పరిస్థితులను అదుపులోకి తెస్తాం. ► మణిపూర్‌పై మేమేమీ మౌనవ్రతం చేయడం లేదు. మణిపూర్ అల్లర్లలో ఇప్పటివరకు 152 మంది చనిపోయారు. వీరిలో మే నెలలోనే 107 మంది చనిపోయారు. మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదు. మణిపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోయకండి. ► మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు బాధాకరం. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని మేమూ అంగీకరిస్తున్నాం. కానీ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మణిపూర్ అంశంపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మొదటి రోజు నుంచే చెబుతున్నాం. స్పీకర్‌కు లేఖ కూడా రాశాం. కానీ, కేంద్రం అంగీకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మణిపూర్ చర్చకు విపక్షాలే సిద్ధంగా లేవు. చర్చ నుంచి పారిపోతున్నాయి ఆ పార్టీలు. ► గత ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఆరున్నరేళ్లలో ఏనాడూ మణిపూర్‌లో కర్ఫ్యూ విధించలేదు. మే వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్ హింసకు కారణం అయ్యాయి. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాకే.. ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతోనే హింస ప్రజ్వరిల్లింది. మే 3వ తేదీన మొదలైన మణిపూర్ హింస నేటికీ కొనసాగుతున్నాయి. మణిపూర్ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోం. ► ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్లో ద్వంద్వ ప్రమాణాలను తొలగించాం. అది తొలగిస్తే కశ్మీర్ అల్లకల్లోలం అవుతుందని విపక్షాలు భయపెట్టాయి. మేం మాత్రం.. సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదాన్ని రూపుమాపే యత్నం చేశాం. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశాం. ► కాంగ్రెస్‌ది కరప్షన్ క్యారెక్టర్. బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ. ► వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుంది. ► మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్, అఖిలేష్ తప్పుబట్టారు. ► ఒక ఎంపీ 13సార్లు రీలాంచ్ అయ్యాడు. ఆ ఎంపీ 13సార్లూ ఫెయిల్ అయ్యాడు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా షా సెటైర్లు వేశారు. ► మీరు చాలా చెప్పారు. కానీ, ఏదీ చెయ్యలేదు. మేం చేసి చూపించాం అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ► యూపీఏ రూ.70 వేల కోట్ల రుణమాఫీ తాయిళాలు ఇచ్చింది. మేం తాయిళాలను పంచడం లేదు. రుణమాఫీలపై మాకు నమ్మకం లేదు. ఎవరూ లోన్ తీసుకోకూడదన్నదే మా ఉద్దేశం. మేం మాత్రం సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం మాత్రం అందిస్తున్నాం. రుణమాఫీ కాదు.. రుణభారం లేకుండా చేశాం. జన్‌ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారు. డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో నగదు జమ అవుతోంది. ► ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్ షా చురకలంటించారు. ► నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారు. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు జైలుకు వెళ్లారు. గతంలో డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉంది. కానీ, మేం అలా కాదు. కాంగ్రెస్‌లా జిమ్మిక్కు చేయలేదు. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం. ఫలితంగానే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. ► మోదీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ ప్రభుత్వం మైనార్టీలో లేదు. సంపూర్ణ మెజార్టీతో ఉంది. ప్రజలకు మోదీ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ► ఆగష్టు 9వ తేదీన నాడు గాంధీ క్విట్ఇండియా పిలుపు ఇచ్చారు. ఇండియా కూటమికి కౌంటర్‌గా మోదీ కూడా ఇప్పుడు క్విట్ ఇండియా పిలుపు ఇస్తున్నారు. అమిత్ షా పిలుపునకు బీజేపీ ఎంపీల స్పందనతో క్విట్ ఇండియా నినాదాలతో మారమోగిన లోక్‌సభ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం ► రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల దృష్టి మళ్లించేందుకే అవిశ్వాసం ► ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదు. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ► విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ పాటిస్తోంది. ఆదివాసీలు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావం ఉంది. ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసం పోయింది. మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాల్సిందే. :::అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ► ఈ దేశంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అయితే ఈ దేశానికి హిందువులకే కాదు.. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. ప్రధానమంత్రి ఒక రంగుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడు.. ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. గత 10 సంవత్సరాలలో మీరు (కేంద్రం) ఎంత మంది కశ్మీరీ పండిట్లను తిరిగి తీసుకువచ్చారు?. మేము భారతదేశంలో భాగం కాదని.. మేం పాకిస్తానీలమని, దేశద్రోహులమని మాత్రం చెప్పకండి. మనం ఈ దేశంలో భాగం.. అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ఆవేశపూరితంగా ప్రసంగించారు. #WATCH | National Conference MP Dr Farooq Abdullah during #NoConfidenceMotion debate in Lok Sabha "We stand proud to be part of this nation. But this nation has a responsibility not only to Hindus but to everybody who lives in India. PM doesn't represent only one colour, he… pic.twitter.com/kn4WRjhNT5 — ANI (@ANI) August 9, 2023 ► మా ఉద్దేశ్యం ఏంటంటే.. మణిపూర్‌పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తాయని. కానీ, ప్రధాని సభకు రావడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వం మా మాట వినడానికి సిద్ధంగా లేదు. నిరసనగా, మేము సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే సరైంది’’ ::కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మణిపూర్ ఇష్యూపై రాజ్యసభలో రచ్చ ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో రచ్చ జరిగింది. మణిపూర్‌పై రాజకీయం కాదు.. చర్చ జరగాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్‌పై ఒక్కరోజు చర్చ పెడితే సరిపోతుంది. కానీ పదిరోజులుగా సాగదీస్తున్నారు మండిపడ్డారాయన. ఈ దశలో చర్చకు సిద్దమని కేంద్రం ప్రకటించింది. మణిపూర్ అంశాన్ని లిస్ట్ చేసేందుకు రెడీ అని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. అయితే.. విపక్షాలకు చర్చ జరగడం ఇష్టం లేదని బీజేపీ ఎంపీలు అనడంతో.. సభ్యుల మధ్య వాగ్వాదం జరగ్గా.. కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. Congress MPs stage walkout in Rajya Sabha over Manipur issue "Our intention was that when a detailed discussion happens on Manipur in the House then some details will come out. PM is not ready to come to the House. The Government is not ready to listen to us. As a mark of… pic.twitter.com/sRGZ1sQu3z — ANI (@ANI) August 9, 2023 లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్ ►లోక్‌సభలో అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ ►రాహుల్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం ►ఒక దశంలో రాహుల్ ప్రసంగానికి అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ►ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన రాహుల్ ►రాజస్థాన్‌కు బయలు దేరిన రాహుల్ ►బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీ మణిపూర్ రెండుగా చీల్చలేదు ►భరత మాతను చంపేశారని సభలో ఇప్పటి వరకు ఎవరూ అనలేదు. ►మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు. ►మణిపూర్ భారత్‌లో అంతర్భాగం ►కశ్మీర్లో పండిట్లపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? ►ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్షం కోరుకుంటోంది. ►మణిపూర్‌లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ►ఇప్పటికే మణిపూర్ అల్లర్లపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం రాహుల్ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్ ►రాహుల్ భారతీయుడు కాదు. ►ఆయన వ్యాఖ్యలను జాతి క్షమించదు. ►భారతమాత హత్య గురించి మాట్లాడతారా? ►విపక్ష కూటమి ఇండియా కాదు ►అది అవినీతి,తుష్టీకరణ కూటమి ►న్యాయం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందా? ►గిరిజ టిక్కు, సరళ భట్‌కు ఎప్పుడు న్యాయం చేస్తారు? మోదీని రావణుడితో పోల్చిన రాహుల్ ► ప్రధాని మోదీ అమిత్ షా, అదానీ మాటలే వింటారు. ► ప్రధానిని రావణుడితో పోల్చిన రాహుల్ ►రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడు. ►మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడు. లోక్‌సభలో గందరగోళం ►హిందుస్థాన్‌ను మణిపూర్‌లో హత్యచేశారన్న రాహుల్ ► రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం ►రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ►అధికార , విపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ వాదనలు ►ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లిన లోక్ సభ ►స్పీకర్ జోక్యం చేసుకున్నా ఆగని మాటల యుద్దం జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది ► జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశాను. ►లక్షల మందితో తనతో కలిసి రావడంతో నాకు ధైర్యమొచ్చింది. ►నా యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్ వరకు వెళ్తాను ►పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నాను. ►యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేది. జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది. బీజేపీ సభ్యులపై రాహుల్ గాంధీ సెటైర్లు ►గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమో: రాహుల్ గాంధీ ►అదానీ గురించి ఈరోజు మాట్లాడను. భయపడాల్సిన పనిలేదు. ►నాదీ రాజకీయ ప్రసంగం కాదు. ►బీజేపీ సభ్యులు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్‌భలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ ప్రారంభం.. ►చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ►ఎంపీ పదవిని పునరుద్దరించినందుకు ధన్యవాదాలు. ►మరోసారి అదనీ పేరు ప్రస్తావించిన రాహుల్ ►రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం ►మణిపూర్ గురించి మాట్లాడుతా.. ►బీజేపీ నేతలు రిలాక్స్ అవ్వొచ్చు. ►ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు. ►కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చెపట్టా ►యాత్ర నా అహంకారాన్ని అణిచివేసింది. #WATCH | Congress MP Rahul Gandhi says, "Speaker Sir, first of all, I would like to thank you for reinstating me as an MP of the Lok Sabha. When I spoke the last time, perhaps I caused you trouble because I focussed on Adani - maybe your senior leader was pained...That pain might… pic.twitter.com/lBsGTKR9ia — ANI (@ANI) August 9, 2023 రాజ్యసభ వాయిదా ►ప్రతిపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ►ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష నేతలు మణిపూర్ మణిపూర్ అంటూ నిరసనలు చేపట్టడంతో లోక్‌సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ► స్వాతంత్య్ర ఉద్యమానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీకి క్విట్ ఇండియాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారి నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవం గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున.. ప్రధాని మోదీ సమక్షంలో పార్లమెంట్లో చర్చ పెట్టాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధాని పార్లమెంట్‌కు రావడం లేదని, మణిపూర్ సమస్య గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ►కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు(బుధవారం) రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై తప్పక చర్చలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే అది ఈ రోజా? రేపా అనేది క్లారిటీ లేదన్నారు. ►ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి అన్నారు. వాళ్లు బ్రిటీష్ వారికి లేఖలు రాస్తూ, వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన ఉద్యమ సమయంలో.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేవి లేవని అన్నారు. ఆకలి సూచీ, విద్య, ఆరోగ్యం, విదేశీ నిల్వల సంగత ఏంటీ అని ప్రశ్నిచారు. బీజేపీ కేవలం వ్యక్తిగత దాడికి దిగజారిందని విమర్శించారు. #WATCH | Congress MP Pramod Tiwari says, "They are scared of the I.N.D.I.A. alliance...We (Congress) have a history of participating in the freedom struggle, while they were writing letters to the British & acting as their informers...They have no achievements of theirs- what is… pic.twitter.com/ccLejPsHL9 — ANI (@ANI) August 9, 2023 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో రెండో చర్చ జరగనుంది. మణిపూర్ హింసతోపాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. రాహుల్ మాట్లాడకపోవడానికి కారణం అదేనా అయితే మంగళవారం అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. అయితే గాంధీ చర్చను ప్రారంభించకపోవడానికి ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. చర్చను ప్రారంభించిన గొగొయ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎంపీ కావడం మొదటిది. మణిపూర్ హింసపై ఆయన మాట్లాడితే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంపీగా సభలోకి తిరిగి వచ్చిన వెంటనే రాహుల్ అవిశ్వాసంపై మాట్లాడితే వారసత్వ రాజకీయాలను ఉద్ధేశిస్తూ అధికార బీజేపీ మాటల యుద్దానికి దిగుతుందని యోచించినట్లు సమాచారం. ఇక మరో కారణం ప్రధాని మోదీ నిన్న సభలో లేకపోవడం. మోదీ రేపు(గురువారం) లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా తొలిరోజు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన వీడి, ప్రకటన చేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. మరోవైపు ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను అసోం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. మణిపూర్‌పై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, : డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, బీజేడీఎంపీ పినాకి మిశ్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. -
Pakistan: భారత్, అమెరికాపై ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల అవిశ్వాస తీర్మానంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే, అవిశ్వాస తీర్మాణానికి ముందు ఇమ్రాన్.. సంచలన కామెంట్స్ చేశారు. పదవి కోల్పోవడానికి కొద్ది రోజుల ముందు కూడా తనపై విదేశీ కుట్రలు జరుగుతున్నాయని కామెంట్స్ చేశారు. తాజాగా స్వరం మార్చి వార్తల్లో నిలిచారు. కాగా, ఇమ్రాన్‌ఖాన్ తన మద్దతుదారులతో కలిసి.. కరాచీలో భారీ ర్యాలీ తలపెట్టారు. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ.. ‘‘నేను ఏ దేశానికి వ్యతిరేకం కాదు. భారత్, ఐరోపా, అమెరికా.. దేన్నీ ద్వేషించడం లేదు. ఏ వర్గానికీ వ్యతిరేకం కాదు’’ అని కామెంట్స్ చేశారు. అయితే, గతంలో ఇమ్రాన్ ఖాన్ పలు సందర్భాల్లో భారత్, అమెరికా సహా కొన్ని ఐరోపా దేశాలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. ఉక్రెయిన్ ఉద్రిక్తల సమయంలో మాస్కోలో పర్యటించడం నచ్చకనే అమెరికా తనను గద్దె దించాలని కుట్ర చేసిందని ఆరోపించాడు. ఈ క్రమంలోనే భారత్‌పై కూడా ఇమ్రాన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత్‌ను చూసి ఎంతో నేర్చుకోవాలి. అక్కడి ప్రజలు తమ దేశాన్ని గర్వంగా భావిస్తుంటారు. అందుకు కారణం.. ఏ మహాశక్తివంతమైన దేశాలు కూడా వాళ్లను శాసించలేవు కాబట్టి. వాళ్ల విధానాలు వాళ్లకు ఉంటాయి. అక్కడి రాజకీయాల్లోనూ బయటి శక్తుల జోక్యం ఉండదు. అందుకే భారత్‌ను ఏ దేశం శాసించలేదని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరోసారి అధికారం చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇందుకోసం విదేశాల్లో సెటిలైన పాకిస్తానీల నుంచి విరాళాలు అడగటం మొదలుపెట్టినట్టు సమాచారం. -
Pakistan: ఇమ్రాన్ ఖాన్ క్లీన్ బౌల్డ్
ఇస్లామాబాద్: అనేక నాటకీయ పరిణామాల మధ్య పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ముగిసింది. ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పదవిని కోల్పోయారు. శనివారం పాక్ జాతీయ అసెంబ్లీ అనేక వాయిదా పర్వాల మధ్య ఎట్టకేలకు ఇమ్రాన్‌కు గట్టి షాక్ తగిలింది. సుమారు 14 గంటల పాటు సాగిన జాతీయ అసెంబ్లీ.. అవిశ్వాస తీర్మానం ద్వారా ఇమ్రాన్‌ను సాగనంపింది. పాకిస్తాన్ చరిత్రలో అవిశ్వాసం ద్వారా పదవిని కోల్పోయిన తొలి ప్రధానిగా ఇమ్రాన్ రికార్డుల్లో నిలిచారు. ఆదివారం తెల్లవారుజామున అవిశ్వాస తీర్మానం జరిగింది. విపక్షాలు ఇమ్రాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి. ఓటింగ్‌లో ఇమ్రాన్ సర్కార్‌కు వ్యతిరేకంగా 174 ఓట్లు వచ్చినట్లు జాతీయ అసెంబ్లీ స్పీకర్ ఆయాజ్ సాదిఖ్ ప్రకటించారు. దీంతో ఆయన పదవిని కోల్పోయారు. ఓటింగ్ సందర్బంగా పాక్ జాతీయ అసెంబ్లీలో 342 మంది సభ్యులు ఉన్నారు. మెజార్టీకి 172 మంది బలం కావాల్సి ఉండగా అధికార పార్టీకి 2 ఓట్లు తగ్గాయి. దీంతో ఇమ్రాన్ పదవిని కోల్పోవాల్సి వచ్చింది. రెండు సీట్ల నుంచి ప్రధాని పదవి వరకు.. 1992లో పాక్‌కు ప్రపంచ కప్ అందించాక క్రికెట్‌కు గుడ్‌బై కొట్టిన ఇమ్రాన్‌ఖాన్ ప్రజాసేవ వైపు మళ్లారు. 1996లో అందరికీ న్యాయం అన్న నినాదంతో పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ (పీటీఐ) అన్న పార్టీని స్థాపించారు.మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు పీటీఐ కేవలం ఒక్క స్థానంలో మాత్రమే గెలుపొందింది. అవినీతికి వ్యతిరేకంగా 2008 ఎన్నికల్ని బహిష్కరించిన ఇమ్రాన్‌ఖాన్ 2011 వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకున్నారు. ప్రధాన పార్టీలైన నవాజ్ షరీఫ్‌కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఎన్), బేనజీర్ భుట్టోకు చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)ని ఢీ కొట్టి బలమైన మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగారు. 2013 నాటికల్లా పీటీఐ 35 సీట్లతో ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది. ప్రధానంగా ఆయన నవాజ్ షరీఫ్ అవినీతిపైనే న్యాయపోరాటం చేసి, చివరికి ఆయనని జైలు పాలు చేశారు. 2018 ఎన్నికల్లో జాతీయ అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రధాని పీఠం అందుకున్నారు. And who actually fulfilled the promise!!!! #imrankhanPTI#ImranKhan https://t.co/RwTscNbZPV — Iqra (@iqra_shahbaz214) April 10, 2022 -
రాజకీయ సంక్షోభం: పాక్ క్యాబినేట్ అత్యవసర సమావేశం
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం రోజుకో మలుపు తిరుగుతోంది. అంతేగాక పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ గద్దె దింపేందుకు ప్రతిపక్షాలతో పాటుగా సొంత పార్టీ అభ్యర్థులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు యత్నించారు కూడా. అయితే ఇమ్రాన్ కూడా ఈ విషయంలో పట్టు వదలడం లేదు. తాజాగా శనివారం ఈ రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు స్పీకర్ అంగీకరించలేదు. ఈ విషయమై ఆయన మాట్లాడుతూ.. తాను చేసిన పనికి సుప్రీంకోర్టు ఏ శిక్ష విధించినా సిద్ధమని స్పీకర్ అసద్ ఖైసర్ తెలిపారు. ఇదిలా ఉండగా శనివారం రాత్రి 9.30 గంటలకు పాక్ క్యాబినేట్ అత్యవసర సమావేశం కానుంది. ఈ భేటీకి మంత్రులంతా హాజరుకావాలని ఇమ్రాన్‌ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. -
Pakistan: పాక్ అసెంబ్లీలో ఓటింగ్‌పై సస్పెన్స్
ఇస్లామాబాద్: పాకిస్తాన్లో రాజకీయ సంక్షోభం ఇంకా కొనసాగుతూనే ఉంది. శనివారం పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానంపై కాసేపట్లో ఓటింగ్ జరుగనుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా అసెంబ్లీకి 176 మంది ఎంపీలు ప్రతిపక్ష నేతలు హాజరు కాగా, అధికార పార్టీ పీటీఐ పార్టీ నుంచి కేవలం 27 మంది ఎంపీలు మాత్రమే అసెంబ్లీకి వచ్చారు. కాగా, అవిశ్వాస తీర్మానంలో ఇమ్రాన్‌కు మిత్రపక్షాల నేతలు హ్యాండ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ మరోసారి అసెంబ్లీకి గైర్హాజరయ్యారు. పాక్ సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి ఇమ్రాన్ సభకు వస్తారని అంత భావించినప్పిటికీ ప్రధాని మాత్రం రాలేదు. దీంతో అవిశ్వాస తీర్మానం కంటే ముందే ఇమ్రాన్ రాజీనామా చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభలో ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశానుసారం మీరు (స్పీకర్) సభా కార్యకలాపాలను నిర్వహిస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాజ్యాంగం, చట్టం కోసం నిలబడాలని స్పీకర్ అసద్ ఖైజర్‌ను కోరారు. Pakistan National Assembly Speaker Asad Qaiser adjourns the House proceedings till 1230pm local time. (Source: PTV) pic.twitter.com/6MAeahkoAz — ANI (@ANI) April 9, 2022 ఈ సందర్బంగా పాక్ విదేశాంగ శాఖ మంత్రి, పీటీఐ నేత షా మహమూద్ ఖురేషీ మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ప్రతిపక్ష నేతలు అవిశ్వాసం తీర్మానం పెట్టడం వారికి రాజ్యంగం కల్పించిన హక్కు అని అన్నారు. ఈ తీర్మానాన్ని ప్రభుత్వం సమర్థించడం ప్రభుత్వం బాధత్య అని పేర్కొన్నారు. వీరు మాట్లాడిన అనంతరం సభలో గందరగోళం జరిగింది. అధికార పార్టీ నేతలు అవిశ్వాస తీర్మానంపై చర్చకు రావాలని పట్టుబట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలు అవిశ్వాసంపై ఓటింగ్ జరపాలని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటలకు వాయిదా వేశారు. మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంటకు సభ ప్రారంభం కానుంది. -
పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు తప్పిన పదవీ గండం
No Confidence Motion Against Imran Khan, ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు ఊరట లభించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం వెనుక విదేశీ కుట్ర ఉందన్న స్పీకర్.. పాక్ జాతీయ అసెంబ్లీని ఈనెల 25వ తేదీకి వాయిదా వేశారు. కాగా, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే క్రమంలో జాతీయ అసెంబ్లీకి ఇమ్రాన్‌ఖాన్ హాజరు కాలేదు. అదే సమయంలో జాతీయ అసెంబ్లీని రద్దు చేయాలని ఇమ్రాన్‌ఖాన్ సిఫారుసు చేశారు. అంటే అవిశ్వాస తీర్మానం కాకుండా నేరుగా ఎన్నికలకు వెళ్లాలని ఇమ్రాన్ భావిస్తున్నారు. అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ ఆమోదించకపోవడంతో ఇమ్రాన్‌ఖాన్‌కు అతి పెద్ద ఊరట లభించినట్లయ్యింది. ఫలితంగా ఇమ్రాన్‌ఖాన్‌కు పదవీ గండం తప్పింది. ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి ఎలాగైనా దింపేందుకు అవసరమైన బలాన్ని విపక్షాలు కూడగట్టాయి. నేటి అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఇమ్రాన్‌ఖాన్ పార్టీ పీటీఐ నుంచి 22 మంది మాత్రమే జాతీయ అసెంబ్లీకి హాజరు కాగా, విపక్షాల నుంచి 176 మంది హాజరయ్యారు. ఒకవేళ అవిశ్వాస తీర్మానాన్ని కానీ స్పీకర్ ప్రవేశపెట్టి ఉంటే ఇమ్రాన్ ఖాన్ తన పదవిని కోల్పోయేవారు. రాజీనామా చేయడం, అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోవడానికి ఇష్టపడని ఇమ్రాన్.. మళ్లీ నేరుగా ఎన్నికలకు వెళ్లాలనే భావించాడు. ఈ క్రమంలోనే జాతీయ అసెంబ్లీని రద్దు చేసి మధ్యంతర ఎన్నికలకు వెళ్లడానికి సిఫారుసు చేశారు. ఇమ్రాన్ సిఫారుసుతో పాక్‌లో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అనంతరం ఇమ్రాన్‌ఖాన్ జాతినుద్దేశించి మాట్లాడారు. పాక్‌లో ఎన్నికలకు సిద్ధం కావాలని ఇమ్రాన్ పిలుపునిచ్చారు. తనపై కుట్ర జరిగిందని, అది కూడా విదేశీ కుట్రలో భాగంగానే అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారన్నారు. మరొకవైపు పాక్ జాతీయ అసెంబ్లీ(పార్లమెంట్)ను ఆ దేశాధ్యక్షుడు అరిఫ్ అల్వీ రద్దు చేశారు. ముందుస్తు ఎన్నికలకు పాక్ అధ్యక్షుడు పిలుపు నిచ్చారు. ఫలితంగా పాక్‌లో ముందుస్తు ఎన్నికలు జరగడం ఖాయమైంది. -
Sakshi Cartoon: నా ప్రాణానికి హాని తలపెడుతున్నారు!
నా ప్రాణానికి హాని తలపెడుతున్నారు! -
ఇమ్రాన్ అవుట్! పాకిస్తాన్ కొత్త ప్రధాని ఆయనేనా.. ఎవరీ షాబాజ్ షరీఫ్?
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇన్నింగ్స్ చివరి దశకు చేరుకుంది. ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ, మిత్రపక్షం నుంచి కూడా ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా మద్దతివ్వడంతో ఆయన గద్దె దిగిపోవడం దాదాపు ఖరారు అయిపోయింది. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై పాక్ జాతీయ అసెంబ్లీలో ఏప్రిల్ మూడో తేదీన చర్చ జరుగనుంది. ఒకవేళ ఈ అవిశ్వాస తీర్మానం నెగ్గితే ఇమ్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సిందే. ఇతర పార్టీల నుంచి కొత్త ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. పాక్ నేషనల్ అసెంబ్లీకి ఆగస్టు 2023 వరకు గడువు ఉండటంతో అప్పటి వరకు కొత్త ప్రధాని పాలించవచ్చు. లేదా తాజాగా ఎన్నికలను నిర్వహించాలని కూడా కోరవచ్చు. మరి ఇమ్రాన్ ఖాన్ ప్రధాని నుంచి దిగిపోతే.. తదుపరి ప్రధాని ఎవరనే విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్ష కూటమి నేత, పీఎంఎల్-ఎన్ చీఫ్, నవాజ్ షరీఫ్ సోదరుడు షాబాజ్ షరీఫ్.. తదుపరి ప్రధాని అయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎట్టిపరిస్థితుల్లోనూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదు అంటున్నారు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్. చివరి బంతి వరకూ పోరాడతానని సవాల్ చేస్తున్నారు. చదవండి: పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ప్రకటన ఎవరీ షాబాజ్ షరీఫ్? పాకిస్థానీ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ అధినేత, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడే షాబాజ్ షరీఫ్. 1988లో రాజకీయల్లోకి వచ్చిన ఆయన పంజాబ్ సీఎంగా మూడు సార్లు బాధ్యతలు నిర్వహించి రికార్డు సృష్టించారు. భారీ ఇన్ఫ్రా ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తిచేయడంలో దిట్టగా పేరుంది. చైనా, టర్కీలతో విదేశీ వ్యవహారాలను నడపడంలో షాబాజ్‌కు మంచి పేరుంది. 1997లో మొదటిసారిగా పంజాబ్ ప్రావిన్స్‌కి ముఖ్యమంత్రి అయ్యారు. 1999లో సైనిక తిరుగుబాటు జరిగిన సమయంలో ఎనిమిదేళ్ల పాటు సౌదీ అరేబియాలో ప్రవాసం జీవితం గడిపారు. 2007లో తిరిగి పాకిస్థాన్‌కు వచ్చారు. 2008 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన పార్టీ విజయం సాధించడంతో మళ్లీ పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో పీఎంఎల్(ఎన్) ఓడిపోయింది. తర్వాత నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా నామినేట్ అయ్యారు. 2019లో పాక్ నేషనల్ అకౌంటబులిటీ బ్యూరో(ఎన్ఏబీ) షాబాజ్‌కు చెందిన 28 ఆస్తులను జప్తు జేసింది. ఇదే కేసులో 2020, సెప్టెంబర్‌లో ఆయనను ఎన్ఏబీ అరెస్ట్ చేసింది. ఏడు నెలల తర్వాత లాహోర్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 2021, ఏప్రిల్‌లో జైలు నుంచి విడుదలయ్యారు. ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాసంతో ప్రధాని పదవి రేసులోకి దూసుకొచ్చారు. -
లాస్ట్ ఓవర్.. ఐదు బంతులు.. 36 పరుగులు.. ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తాడో?
నయా పాకిస్థాన్ నినాదంతో 2018లో అధికార పీఠం ఎక్కిన ఇమ్రాన్ ఖాన్ పీటీఐ సర్కార్.. ఈ నాలుగేళ్లలో సాధించింది ఏం లేదన్నది అక్కడ ప్రజల మెదళ్లలో బలంగా పాతుకుపోయింది. అందుకే రాజకీయ సంక్షోభాన్ని పట్టించుకోకుండా తమ పనుల్లో మునిగిపోతున్నారు. పార్లమెంట్లో ఇప్పటికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా.. మార్చి 31వ తేదీన దీనిపై చర్చ జరగనుంది. బంధు ప్రీతి, దేశ ద్రవ్యోల్బణం.. అధిక ధరలు, కరోనా కట్టడిలో ఘోరంగా విఫలం, అప్పులు, నిరుద్యోగుల నిరసనలతో పీటీఐ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాక్‌లో నిరసనలు పెలుబిక్కాయి. ఈ నిరసనలనే ఆయుధంగా చేసుకుని ఖాన్ సాబ్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ప్రతిపక్ష పీఎంఎల్–ఎన్. పాక్ నేషనల్ అసెంబ్లీలో మొత్తం 342 మంది సభ్యులు ఉన్నారు. అవిశ్వాసం నుంచి ప్రభుత్వం గట్టెక్కాలంటే.. 172 మంది మద్ధతు అవసరం. అధికార పీటీఐకి 155 మంది సభ్యులుండగా, నాలుగు మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వానికి మొత్తం 179 మంది సభ్యుల బలముంది. కానీ, ఇమ్రాన్ సొంత పీటీఐ పార్టీకి చెందిన సుమారు 25 మంది, అధికార సంకీర్ణ కూటమిలోని 23 మంది.. ధిక్కార స్వరం వినిపించడంతో ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇమ్రాన్ ఖాన్ ముందు ఇప్పుడు కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో చాలావరకు అతనికి అనుకూలంగా లేవు. మొదటి నుంచి పొసగకపోవడం, పైగా తాము చెప్పినట్లు నడవడం లేదన్న కోపంతో పాక్ ఆర్మీ ఉంది. అందుకే ప్రభుత్వం పడిపోయే తరుణంలోనూ సాయం చేయలేమని తెగేసి చెప్పింది. పైగా రాజీనామా చేయాలంటూ ఇమ్రాన్ ఖాన్‌కు సూచించింది. ఇంకోవైపు వలసలు సైతం ఇమ్రాన్ ఖాన్‌కు తలనొప్పిగా మారాయి. ఈ తరుణంలో.. కేవలం రాజకీయాల ద్వారానే ఇప్పుడు పరిస్థితిని కొలిక్కి తెచ్చుకోవాలి. అందుకోసం ముందస్తు ఎన్నికలకు వెళ్తాననే హామీ సైతం ఇచ్చారాయన. కానీ, ప్రతిపక్షాలు ఆ హామీకి ఒప్పుకోకపోవచ్చు. అందుకే.. ఇమ్రాన్ ఖాన్ ముందున్న మరొకొన్ని ఆఫ్షన్స్పై మీద పీటీఐలో చర్చ నడుస్తోంది. ఎంక్యూఎం-పీ కోసం మంతత్రిత్వ శాఖ, గవర్నర్ పోస్ట్ ఎర వేస్తోంది. అదే సమయంలో తన ప్రభుత్వానికి వచ్చిన ఢోకా ఏం లేదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్. ఈ క్రమంలో ప్రతిపక్షాలతో పాటు సొంత పక్షం వాళ్లతోనూ ఇమ్రాన్ ఖాన్ మైండ్ గేమ్ ఆడుతుండడం స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చేస్తాడో.. క్రికెట్.. రాజకీయం రెండూ ఇమ్రాన్ ఖాన్‌కు ఒక్కటే. ఈ రెండింటిలోనూ.. తెలివిగా, లోతుగా, అభిమానుల నినాదాలు.. ఆశీర్వాదంతో చెలరేగడానికి ప్రయత్నించాడు. బహుశా ఇప్పుడున్న కష్టకాలంలోనూ.. ఈ పోలిక సరిపోయేదే!. ప్రభుత్వం ఎదుర్కొంటున్న కష్టమైన, అసాధ్యమైన పరిస్థితిని వివరించడానికి సరిపోతుంది. చివరి ఓవర్లో ఐదు బంతులు మిగిలి ఉన్నాయి. 36 పరుగులు అవసరం. ఏదో ఒక అద్భుతం జరిగితే తప్ప ఇమ్రాన్ ఖాన్ పొలిటికల్ మ్యాచ్ నెగ్గలేడు. ప్రత్యర్థి బౌలర్ల(ప్రతిపక్షాల) నుంచి నో బాల్స్(మద్ధతు) ఏదైనా పడాల్సిందే. లేదంటే అంపైర్లు(కోర్టు.. న్యాయమూర్తులు) ఏదైనా వివాదాస్పద నిర్ణయం తీసుకోవాలి. అదీ కాకుంటే మైదానంలో రచ్చ జరిగితే.. ఏకంగా మ్యాచ్ రద్దు అయ్యి పోవాలి(పార్లమెంట్లో గందరగోళం.. అరెస్టుల పర్వం). అప్పుడు కచ్చితంగా థర్డ్ అంపైర్(పాక్ ఆర్మీ) జోక్యం చేసుకుంటుంది. లేకుంటే చిన్నపిల్లలాగా మ్యాచ్ ఓడిపోయే తరుణంలో.. వికెట్లు గుంజుకుని, బాల్-బ్యాట్ ఎత్తుకుని మైదానం నుంచి పారిపోవచ్చు(చర్చకు సిద్ధపడకుండా బయటకు వెళ్లిపోవడం). ఇవేవీ కాకుంటే.. 1992 ప్రపంచకప్ సెమీస్‌లో మాదిరి డక్‌వర్త్ లూయిస్ లాంటి నిబంధన ఏదైనా కలిసొస్తే.. అది ఖాన్ సాబ్ అదృష్టమే! ఏది ఏమైనా.. పాక్ నేషనల్ అసెంబ్లీ అనే గ్రౌండ్లో జరిగే ఫైనల్ మ్యాచ్‌లో చివరి నిమిషం వరకు నరాలు తెగే ఉత్కంఠ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. -
సొంత పార్టీలోనే 24 మంది ఎంపీల తిరుగుబాటు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ చిక్కుల్లో పడ్డారు. పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి ముందే సొంత పార్టీలోనే ఆయనకు తిరుగుబాటు ఎదురైంది. 24 మంది ఎంపీలు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా గళమెత్తారు. పార్లమెంట్లో ప్రతిపక్షాలు ప్రవేశ పెట్టనున్న అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి ఇమ్రాన్‌ను గద్దె దింపేస్తామని హెచ్చరించారు. దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణానికి బాధ్యత ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్–ఎ–ఇన్సాఫ్ (పీటీఐ) ప్రభుత్వానిదేనని విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు పాకిస్తాన్ ముస్లిం లీగ్–నవాజ్ (పీఎంఎల్–ఎన్), పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ)కి చెందిన 100 మందికిపైగా ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసు ఇచ్చారు. మార్చి 21 నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో 28న అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సొంత పార్టీకి చెందిన నాయకులే ఇమ్రాన్‌పై తిరుగుబాటు చేస్తూ ఉండడంతో ఆయన సమస్యల సుడిగుండంలో పడిపోయారు. ఈ తిరుగుబాటు ఎమ్మెల్యేలందరూ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సింధ్ హౌస్‌లో ఉండగా పీటీఐకి చెందిన కొందరు శుక్రవారం అక్కడికెళ్లి, వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే, బయటకు వస్తే ప్రభుత్వం తమను అపహరిస్తుందని అసమ్మతి ఎంపీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విపక్ష పార్టీలే తమ ఎంపీలను కొనేస్తున్నాయంటూ అధికార పీటీఐ ఆందోళన వ్యక్తం చేసింది. పార్లమెంట్లో మొత్తం సభ్యులు 342 మంది కాగా అధికార పార్టీ బలం 155, మరో 23 మంది మద్దతిస్తున్నారు. అవిశ్వాసం నెగ్గాలంటే ఇమ్రాన్ ప్రభుత్వానికి మొత్తం 172 మంది సభ్యుల మద్దతు అవసరం. సొంత పార్టీలో సభ్యుల తిరుగుబాటుతో ఇమ్రాన్ ప్రభుత్వం గండం గట్టెక్కడం కష్టంగా మారనుందని పరిశీలకులు అంటున్నారు. -
కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం
సాక్షి, తూర్పు గోదావరి: కాకినాడ మేయర్‌పై అక్టోబర్ 5న అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. నిన్న కలెక్టర్‌ను కలిసిన 33 మంది కార్పొరేటర్లు.. నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. మేయర్ పావనికి కలెక్టర్ హరికిరణ్ నోటీసులు పంపించారు. నోటీసు తీసుకునేందుకు ఇంట్లో నుంచి మేయర్ పావని బయటకు రాకపోవడంతో మేయర్ ఇంటి గోడకు అధికారులు నోటీసును అతికించారు. చదవండి: అయ్యన్న వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ నిరసన ఏపీకి పార్లమెంట్ కమిటీ ప్రశంసలు -
కాకినాడ మేయర్‌పై అవిశ్వాస తీర్మానం
సాక్షి, తూర్పుగోదావరి: కాకినాడ మున్సిపల్ కౌన్సిల్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాకినాడ నగరపాలక సంస్థ మేయర్ పావని, డిప్యూటీ మేయర్-1 సత్తిబాబుపై కౌన్సిలల్ మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చారు. తీర్మానానికి సంబంధించి కలెక్టర్ హరికిరణ్‌కు 33 మంది కార్పొరేటర్లు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ను కోరారు. ఇటీవలే మేయర్ పావని, డిప్యూటీ మేయర్లు నాలుగేళ్ల పదవికాలం పూర్తి చేసుకోగా.. మాజీ ఎమ్మెల్యే కొండబాబు తీరుతో టీడీపీ పట్ల ఆపార్టీ కార్పొరేటర్లు అసమ్మతి వ్యక్తం చేశారు. -
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వెల్లడించారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఇక గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. -
‘ఆ విషయాన్ని మోదీయే ఒప్పుకున్నారు’
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారని ప్రధాని మోదీ శుక్రవారం లోక్‌సభలో పేర్కొనడంపై తెలంగాణ ప్రజలు ఆలోచించాలని టీపీసీసీ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. పరోక్షంగా తెలంగాణ ఏర్పాటుకోసం కృషి చేసింది కాంగ్రెస్సేనని మోదీ ఒప్పుకున్నారని ఆయన వెల్లడించారు. పార్టీ కార్యాలయంలో ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు. కేసీఆర్, మోదీ మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయనీ, అందుకే ప్రజల ముందు బీజేపీని విమర్శించే టీఆర్ఎస్ నాయకులు తెరవెనుక మద్దతు ఇస్తున్నారని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను మరచిన కేసీఆర్‌కు బుద్ధి చెప్పాలని అన్నారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ప్రత్యేక హోదా సాధన కోసం గళమెత్తితే, తెలంగాణ ఎంపీలు ఎందుకు నోరు మెదపలేదని మండిపడ్డారు. అవిశ్వాస తీర్మానంతో విభజన హామీల సాధనలో టీఆర్ఎస్ వైఖరి బయటపడిందని ఎద్దేవా చేశారు. ముస్లిం రిజర్వేషన్ల పెంపు కోసం ఎందాకైనా పోరాడతామని ప్రకటించిన కేసీఆర్ నిన్న లోక్‌సభలో టీఆర్ఎస్ ఎంపీలతో ఎందుకు మాట్లాడించలేక పోయారని దుయ్యబట్టారు. లోక్‌సభలో రాహుల్ ప్రసంగం ఆకట్టుకుందని ప్రశంసించారు. ప్రధాని మోదీని రాహుల్ ఆలింగనం చేసుకోవడం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమిత్ షా-మోదీల రాజకీయాలు వికృతంగా మారిపోయాయని విమర్శించారు. -
‘నాడు ధన్యవాద తీర్మానం. నేడు అవిశ్వాసం’
సాక్షి, విజయవాడ: పూటకో మాట మాట్లాడే చంద్రబాబు నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. చంద్రబాబు ఆడుతున్న నాటకాల్లో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ఒకటని ఎద్దేవా చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడంలో చంద్రబాబును మించిన వారు లేరని విమర్శించారు. పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో కేంద్రంపై పలువురు అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చారు. వాటిపై స్పందించిన చంద్రబాబు అవిశ్వాసం వల్ల ఏం ఒరుగుతుందని మాట్లాడారు. నేడు రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని గగ్గోలు పెడుతూ కేంద్రంపై అవిశ్వాసానికి పూనుకొన్నారని మండిపడ్డారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం అన్ని విధాలుగా చేయూతనిస్తోందని ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ప్రధాని మోదీ, ఇతర మంత్రుల సహాయ సహకారాలు మరువలేనివని పొగుడుతూ చంద్రబాబు గతంలో మండలిలో తీర్మానం ప్రవేశపెట్టారని ఆయన గుర్తు చేశారు. నేడు అదే చంద్రబాబు పూర్తి భిన్నంగా వ్యవహరించి రాష్ట్రం పరువు బజారున పడేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి మహానాడు తీర్మానాల్లో సైతం కేంద్రంపై ప్రశంసలు కురిపించి, ధన్యవాద తీర్మానాలు ప్రవేశపెట్టిన బాబు వైఖరి నేడు తేటతెల్లం అయిందన్నారు. -
కేంద్రంపై అవిశ్వాసం : నష్టాలు పాలైన మార్కెట్లు
ముంబై : డబుల్ సెంచరీని బీట్ చేస్తూ.. చరిత్రాత్మక గరిష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి ఢమాల్ అంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అంగీకరించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. వాల్‌స్ట్రీట్, ఆసియన్ షేర్లు బులిష్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 147 పాయింట్ల నష్టంలో 36,373 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల నష్టంలో 11వేల మార్కు కిందకి పడిపోయి 10,980 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు మెజార్టీ షేర్ల నుంచి క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కువగా మెటల్స్, ఆటో, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోయాయి. మిడ్‌క్యాప్స్‌లో నెలకొన్న ఒత్తిడి మార్కెట్లను కిందకి పడేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఓఎన్జీసీ, ఏషియన్ పేయింట్స్, ఇండియాబుల్స్ హౌజింగ్ టాప్ గెయినర్లుగా రెండు సూచీల్లోనూ లాభాలు పండించగా.. మెటల్ స్టాక్స్ టాటా స్టీల్, వేదంత, హిందాల్కోలు టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 10 పైసలు నష్టపోయి 68.57 వద్ద నమోదైంది. కాగ, నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన రోజే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు స్పీకర్‌కు అందాయి. ఈ నోటీసులపై స్పందించిన స్పీకర్, వాటిని ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఈ శుక్రవారమే అవిశ్వాసంపై చర్చను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర కదుపులకు లోనయ్యాయి. -
ఆయనకు ఇంగిత జ్ఞానం లేదు..!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం మొదటినుంచి పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు టీడీపీకి లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి పార్థసారథి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ కేంద్రంపై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తామని చెప్పిన టీడీపీ మాట మార్చి తామే అవిశ్వాసాన్ని ప్రవేశపెడతామంటోందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో ప్రత్యేక హోదా అంశంపై ఇతర పార్టీల మద్దతు కూడగట్టి కేంద్రంపై ఎందుకు పోరాటం చేయలేదని చంద్రబాబును నిలదీశారు. అవిశ్వాసంపై జాతీయస్థాయిలో వైఎస్సార్సీపీకి వస్తున్న మద్దతు చూసి చంద్రబాబు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మానవహారాలు నిర్వహిస్తాం.. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీల పోరాటానికి మద్దతుగా రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో సోమవారం మానవహారాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభద్రతాభావంతో టీడీపీ వైసీపీపై విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు జగన్‌పై వ్యక్తిగత విమర్శలకు దిగడం.. ఆయనకు ఇంగిత జ్ఞానం లేదనే విషయం తెలుపుతుందన్నారు. మోదీ సమాధానం చెప్పాలి.. కోర్టులకు హాజరు కాకుండా స్టేలు తెచ్చుకునే రాజకీయ నేరగాడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. అలాంటి నాయకుడిని ప్రధాని మోదీ ఎందుకు పక్కన సహించాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ‘దళిత మహిళను వివస్త్రను చేసిన నీ పాలనలో శాంతిభద్రతలు ఎక్కడున్నాయ’ని పార్థసారథి ప్రశ్నించారు. దోపీడీలు, మట్టి, ఇసుక అక్రమ రవాణా, కాంట్రాక్టుల్లో అవినీతితో రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిపారని మండిపడ్డారు. నాడు కేంద్రం ప్యాకేజీపై పొగడ్తలు గుప్పించి.. ఇప్పుడు అసెంబ్లీలో కేంద్రం సహాయం చేయడం లేదంటూ మొసలికన్నీరు కార్చడం చంద్రబాబుకే సాధ్యం అని అన్నారు. ఎన్టీఆర్‌ను ముంచాడు..మామను వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, అధికారాన్ని, గుర్తుని, నిధులను లాక్కున్న చంద్రబాబుది దొంగల పార్టీ అని తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తరిమికొడతారన్న భయంతో ఎన్డీయే నుంచి టీడీపీ బయటికొచ్చిందని అన్నారు. -
టీడీపీ పోతే పోయేదేముంది..
న్యూఢిల్లీ: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ భాగస్వామ్య పక్షం అకాలీదళ్ మోదీ ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఎన్డీయే నుంచి బయటకు వస్తున్నట్టు, రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టి కేంద్రంలో కొనసాగలేమని టీడీపీ ప్రకటించిన నేపథ్యంలో అకాలీదళ్ స్పందించింది. టీడీపీ ఎన్డీఏను వీడినా తాము ప్రభుత్వం వెన్నంటి ఉంటామని స్పష్టం చేసింది. ప్రత్యేక హోదా అంశంపై ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇస్తున్నట్టు చంద్రబాబు ప్రకటించి మళ్లీ తామే తీర్మానం పెడతామని యూటర్న్ తీసుకున్న విషయం తెలిసిందే. ‘ఎన్నో ఏళ్లుగా బీజేపీకి మిత్ర పక్షంగా ఉన్నాం. ఇలాంటి రాజకీయ సంక్షోభాల్ని, ఇబ్బందులను ఎన్నింటినో కలిసి ఎదుర్కొన్నామ’ని అకాలీదళ్ నాయకురాలు, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి హర్సిమ్రత్ కౌర్ అన్నారు. -
‘పక్కా ప్రణాళికతో అవిశ్వాస తీర్మానం’
సాక్షి, హైదారాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతోనే న్యాయం జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటించింది. అందుకే పార్లమెంట్లో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టబోతున్నామని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ గురువారం తెలిపారు. తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అవిశ్వాసం పెడుతున్నట్టు చెప్పారు. తమ ఎంపీలు అన్ని పార్టీల లోక్‌సభ సభ్యుల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నారని వెల్లడించారు. రాజధాని నిర్మాణానికి తాను ఎంతో చేస్తున్నానంటూ అసెంబ్లీలో మొసలికన్నీరు కార్చిన టీడీపీ అధినేత చంద్రబాబు.. వైఎస్సార్సీపీ ప్రవేశపెడుతున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తే టీడీపీ భేషరతుగా తమకు మద్దతివ్వాలన్నారు. ‘పార్లమెంట్లో ఫైనాన్స్ బిల్లు ఆమోదం పొందింది. రేపో, ఎల్లుండో రాజ్యసభలో కూడా బిల్లు అప్రూవ్ చేస్తారు. తర్వాత సభ నిరవధిక వాయిదా పడుతుందనే ముందస్తు ప్రణాళికతో అవిశ్వాస తీర్మానాన్ని రేపే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్నామ’ని ఆయన వెల్లడించారు. అవిశ్వాసం తర్వాత కేంద్రం నుంచి ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీ రాకుంటే తమ ఎంపీలు మూకుమ్మడి రాజీనామాలు చేస్తారని చెప్పారు. వైఎస్ జగన్ నాయకత్వంలో కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించుకుంటామని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా 5 కోట్ల ఆంధ్రుల హక్కు అని తెలిపారు. పవన్ కొత్తగా చెప్పిందేమీ లేదు పవన్‌కల్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో కొత్తగా చెప్పిందేమీ లేదని బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు. టీడీపీ అవినీతిపై తాము గత నాలుగేళ్లుగా చేస్తున్న ఆరోపణలనే పవన్‌కల్యాణ్ మళ్లీ చెప్పారని విమర్శించారు. పాత సీసాలో కొత్త సారా మాదిరిగా పవన్ ప్రసంగం సాగిందని చురకలంటించారు. చంద్రబాబు తనయుడు లోకేష్ అవినీతి చేస్తున్నాడని గగ్గోలు పెడుతున్న పవన్ 2014లో టీడీపీకి ఎందుకు మద్దతిచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ మద్దతుతోనే రాష్ట్రంలో టీడీపీ, బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అవినీతి ఏరులై పారుతోందంటున్న పవన్.. టీడీపీ రాజకీయాలకు నైతిక బాధ్యత వహించాలని అన్నారు. దేవాలయ భూములు, రైతుల భూములు టీడీపీ అధికార దాహంలో కబ్జాకి గురయ్యాయని ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ అవినీతిపై పవన్ నోరువిప్పడం సంతోషం కల్గించిందని వ్యాఖ్యానించారు. -
కార్యాచరణపై ఎమ్మెల్యేలతో భేటీ కానున్న వైఎస్ జగన్
హైదరాబాద్: ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ ను పున:పరిశీలనతో పాటు కాల్ మనీ, సెక్స్ రాకెట్ వ్యవహారంపై చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం సభ నుంచి బాయ్ కాట్ చేసింది. సభ నడుస్తున్న తీరుకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎమ్మెల్యే రోజాపై సస్పెన్షన్ తీరును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రోజా సస్పెన్షన్ నిబంధనలకు విరుద్ధమని చెప్పినా పునఃపరిశీలించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై కూడా చర్చించేందుకు ప్రభుత్వం విముఖత చూపడంపట్ల వైఎస్ఆర్ సీపీ నిరసన వ్యక్తం చేస్తూ బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై పార్టీ ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. -
4న అసెంబ్లీ-స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానంపై చర్చ
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభా వ్యవహరాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన ఆయన చాంబర్లో ఈ సమావేశం జరిగింది. స్పీకర్‌పై ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఎప్పుడు చర్చకు చేపట్టాలో ఈ భేటీలో నిర్ణయించారు. ఏప్రిల్ 4న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అప్పుడు స్పీకర్ శివప్రసాద్‌పై అవిశ్వాస తీర్మానంపై అసెంబ్లీలో చర్చించనున్నారు. బీఏసీ సమావేశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జ్యోతుల నెహ్రు, గడికోట శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. -
యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి మద్దతిస్తాం: ఎస్పీ
న్యూఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానం చేపడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తామని సమాజ్‌వాది పార్టీ ప్రకటించింది. 22 మంది ఎంపీలున్న ఎస్పీ.. యూపీఏకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. లోక్‌పాల్ బిల్లు విషయంలో ప్రభుత్వంపై ఈ పార్టీ తీవ్ర అసంతృప్తితో ఉంది. ప్రభుత్వంపై అవిశ్వాసం కోరుతూ సీమాంధ్రకు చెందిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీలు, టీడీపీ ఎంపీలు స్పీకర్‌కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఓటింగ్ జరగాలంటే కనీసం 50 మంది ఎంపీల మద్దతు కూడగట్టాల్సి ఉంది. ‘‘ప్రభుత్వంపై సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఇచ్చిన నోటీసులకు మేం మద్దతు ఇవ్వం. కానీ లోక్‌సభలో అవిశ్వాసంపై ఓటింగ్ జరిగితే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేస్తాం’’ అని ఎస్పీ ప్రధాన కార్యదర్శి రామ్‌గోపాల్ యాదవ్ చెప్పారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు వ్యతిరేకమని ఆయన స్పష్టం చేశారు. -
రేపటితో ముగింపు?
-
రేపటితో ముగింపు?
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలను ముందుగానే ముగించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. షెడ్యూల్ ప్రకారం ముగియాల్సిన తేదీ కంటే వారం ముందుగానే అంటే.. శుక్రవారం నుంచి ఉభయ సభలూ నిరవధికంగా వాయిదాపడే అవకాశాలున్నాయని పార్లమెంటు వర్గాలు చెబుతున్నాయి. ఉభయ సభల్లోనూ గురువారం సాయంత్రానికల్లా ఆర్థిక వ్యవహారాలను ముగించాలని కేంద్రం యోచిస్తున్నట్లు సమాచారం. అవి ముగిసిపోతే అసలు గురువారమే పార్లమెంటు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలూ లేకపోలేదని కొందరు నేతలు అంటున్నారు. మరోవైపు బుధ, గురు, శుక్రవారాల్లో పార్టీ ఎంపీలందరూ పార్లమెంటులో అందుబాటులో ఉండి.. ప్రభుత్వ వ్యవహారాలకు అనుగుణంగా ఓటేయాలంటూ కాంగ్రెస్ ఇప్పటికే విప్ జారీ చేసింది. ఈ నెల 5న మొదలైన పార్లమెంటు సమావేశాలు ఇంతకుముందు నిర్ణయించిన ప్రకారం.. ఈ నెల 20 వరకు సాగాల్సి ఉంది. వీటిని ముందే ముగిస్తారంటూ వస్తున్న వార్తలపై బీజేపీ మండిపడింది. మూడోరోజూ స్తంభించిన ఉభయ సభలు: పలు అంశాలపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై మూకుమ్మడి దాడికి దిగడంతో వరుసగా మూడోరోజు పార్లమెంట్ ఉభయసభలు స్తంభించా యి. ఉదయం 11లకు లోక్‌సభ సమావేశమైనపుడు స్పీకర్ మీరాకుమార్ లోపలికి అడుగుపెట్టారో లేదో పలు పార్టీల సభ్యులు నినాదాలతో ఆందోళనకు దిగారు. వివిధ సమస్యలపై పెద్దపెట్టున నినదించారు. ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో చలిపులి బారిన పడి మరణించిన 60మందికి సంతాపం తెలిపే ప్రకటనను ఈ నినాదాల మధ్యే స్పీకర్ చది వారు. మృతులకు అంజలి ఘటించడానికి సభ్యులందరూ తమ స్థానాల్లో నిలబడాలని ఆమె కోరారు. అయినా పలువురు సభ్యులు వెల్‌నుంచి వెళ్లకుండా అక్కడే ఉండటంతో ఆమె ఒకింత ఆగ్రహాన్ని వ్యక్తంచేయడంతో సభ్యులందరూ తమ స్థానాలకు వెళ్లారు. మృతులకు అంజలి ఘటించడం పూర్తయిన వెంటనే స్పీకర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ఆయా పక్షాల సభ్యులు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేయసాగారు. టీడీపీ సహా పలు పార్టీలవారు వెల్‌లో గొడవ చేయగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్, ఎంపీలు మేకపాటి, ఎస్పీవై రెడ్డి మొదటివరుస బెంచీలవరకు వెళ్లి అక్కడ నిలబడి ఆందోళన సాగించారు. ‘కీప్ ఆంధ్రప్రదేశ్ యునెటైడ్’(ఆంధ్రప్రదేశ్‌ను సమైక్యంగానే ఉంచండి) అనే నినాదం రాసివున్న ప్లకార్డులను మేకపాటి, ఎస్పీవై ప్రదర్శించారు. అవిశ్వాసానికి నోటీసిచ్చిన ఆరుగురు కాంగ్రెస్ సభ్యులు తమ స్థానాల్లోనే నిలబడగా అధికార పక్షానికే చెందిన తెలంగాణ ఎంపీలు కూడా మొదటివరుస బెంచీలవరకు వచ్చి పోటీ ఆందోళన జరిపారు. తమ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై బీఎస్పీ, ఎస్పీ, డీఎంకే, ఆర్జేడీ నినాదాలతో హోరెత్తించాయి. దీంతో సభలో ఎవరేం మాట్లాడుతున్నారో తెలీని పరిస్థితి ఉండటంతో స్పీకర్ సభను 12వరకు వాయిదావేస్తున్నట్టు 11.04 గంటలకు ప్రకటించారు. సభ తిరిగి మొదలైనపుడు ఉదయం దృశ్యాలే పునరావృతమయ్యాయి. గందరగోళం మధ్యే స్పీకర్ ఆదేశాల ప్రకారం మంత్రులు, కమిటీల సంబంధితులు తమ పత్రాలను సభకు సమర్పించారు. ఆర్థికమంత్రి పి.చిదంబరం అనుబంధ పద్దులను సభలో ప్రవేశపెట్టారు. ఇదయ్యాక స్పీకర్ అవిశ్వాసం నోటీసుల అంశాన్ని ప్రస్తావించారు. మూడు నోటీసులు అందాయి: అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మూడు నోటీసులు తనకు అందాయని స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. సభలో సాధారణ పరిస్థితులు నెలకొంటే తాను ఆ నోటీసులను సభ ముందుంచగలుగుతానన్నారు. దీంతో జగన్, మేకపాటి, ఎస్పీవై తమ స్థానాలకు తిరిగి వెళ్లగా వెల్‌లో ఆందోళన చేస్తున్న సభ్యులు అక్కడే ఉన్నారు. వారికి ఒకటికి రెండుసార్లు విజ్ఞప్తి చేసినా ఆందోళన సాగిస్తున్న ఇతర సభ్యులు తగ్గకపోవడంతో ఆమె 377వ నిబంధన కింద ప్రస్తావించే అంశాలను సభకు సమర్పించాల్సిందిగా సభ్యులను కోరారు. అనంతరం 12.07కు సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. రాజ్యసభదీ అదే తీరు: రాజ్యసభ ఉదయం 11లకు సమావేశమైన వెంటనే సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాలను చేపట్టిన సభాధ్యక్షుడు హమీద్ అన్సారీ ఆందోళన చేస్తున్న సభ్యులను శాంతింపచేయడానికి ప్రయత్నించినా వారు వినలేదు. దీంతో రెండు నిమిషాలకే సభను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. 12గంటలకు సభ తిరిగి ఆరంభమైనపుడు 2జీ స్కాంలో జేపీసీ నివేదికపై చర్చకు బీజేపీ పట్టుబట్టింది. మరోవైపు ఎస్పీ, బీఎస్పీ తమ రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై నినాదాలు కొనసాగించాయి. సభలో గందరగోళం నెలకొనడం తో డిప్యూటీ చైర్మన్ సభను వాయిదావేశారు. 2 గంటలకు సభ సమావేశమైనపుడు కూడా ఇదేపరిస్థితి పునరావృతం కావడం తో 2 నిమిషాలకే సభను డిప్యూటీ చైర్మన్ మరుసటి రోజుకు వాయిదావేసేశారు. -
కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎంపీలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. భోజన విరామ సమయంలో ఉద్యోగులు బుధవారం సచివాలయంలో ర్యాలీ నిర్వహించి అనంతరం సీ-బ్లాక్ ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సోనియా గో బ్యాక్, కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలి, డిగ్గీ రాజా గో బ్యాక్ అంటూ నినదించారు. ఈ సందర్భంగా నేతలు మురళీకృష్ణ, వెంకట్రామిరెడ్డి తదితరులు మాట్లాడుతూ, అసెంబ్లీలో టీ బిల్లుపై చర్చ జరిగే సమయంలో ఆందోళనలు మరింత తీవ్రం చేస్తామన్నారు. విభజనకు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్, టీడీపీలకు భవిష్యత్తుండదని హెచ్చరించారు. -
అవిశ్వాసానికి పెరుగుతున్న మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ యూపీఏ ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ, కాంగ్రెస్, టీడీపీలకు చెందిన సీమాంధ్ర ఎంపీలు వేర్వేరుగా ఇచ్చిన అవిశ్వాస తీర్మాన నోటీసులకు మద్దతు పెరుగుతోంది. కాంగ్రెస్‌కు చెందిన ఆరుగురు, వైఎస్సార్ సీపీకి చెందిన ముగ్గురు, టీడీపీ సీమాంధ్ర ఎంపీలు నలుగురు... మొత్తం 13 మంది సోమవారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానానికి నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. తాము ఈ అవిశ్వాసానికి మద్దతు తెలుపుతామని బిజూ జనతాదళ్ (బీజేడీ) మంగళవారం ప్రకటించింది. ఆ పార్టీ ఎంపీ జయ్‌పాండా ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. బీజేడీకి లోక్‌సభలో 14 మంది సభ్యుల బలముంది. అసెంబ్లీ తీర్మానం లేకుండా రాష్ట్రాల విభజనను వ్యతిరేకిస్తున్న శివసేన (11 మంది ఎంపీలు), ఏఐడీఎంకే (9)లు కూడా అవిశ్వాసంపై కలిసి వచ్చే అవకాశాలున్నాయి. అకాలీదళ్ (4) మద్దతు కూడా ఉన్నట్లు సమాచారం. అప్పుడు తీర్మానానికి మద్దతుగా నిలిచే వారి సంఖ్య 51కి చేరుతుంది. సభ సజావుగా సాగితే బుధవారం లోకసభలో తీర్మానం చర్చకు వస్తుంది. చర్చ అనంతరం ఓటింగ్ ఉంటుంది. అవిశ్వాస నోటీసులు అందాయని, సభలో ప్రశాంతత నెలకొంటే తప్ప తాను వాటిని సభ ముందుకు తేలేనని స్పీకర్ మీరాకుమార్ మంగళవారం సభలో తెలిపారు. ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదు: సమాజ్‌వాదీ అవిశ్వాసానికి మద్దతిచ్చే విషయంలో తమ పార్టీ ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోలేదని సమాజ్‌వాది పార్టీ సీనియర్ నేత ఒకరు మంగళవారం రాత్రి పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు. అవిశ్వాసం అనూహ్యంగా తెరపైకి వచ్చిందని, ఒకవేళ దీనిని ఓటింగ్ దాకా రానీయకుండా అడ్డుకోవడంలో ప్రభుత్వం విఫలమైతే... చిన్న రాష్ట్రాలకు తాము వ్యతిరేకం కాబట్టి అవిశ్వాసంపై తామొక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందన్నారు. తుది నిర్ణయాన్ని ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌కు వదిలేసినట్లు తెలిపారు. కాగా తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం ఆర్టికల్-3పై వాయిదా తీర్మానాలు తెస్తే మద్దతిస్తామని, అవిశ్వాసానికి మాత్రం మద్దతివ్వలేమని స్పష్టం చేశారు. -
అవిశ్వాస తీర్మానానికి మద్దతిస్తాం:బిజూ జనతాదళ్
ఢిల్లీ:యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి తమ మద్దతు ఉంటుందని బిజూ జనతాదళ్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసానికి తప్పకుండా మద్దతు తెలుపుతామని ఆ పార్టీ నేత, ఎంపీ జయపాండ వెల్లడించారు. లోక్‌సభలో బిజూ జనతాదళ్‌కు 14 మంది ఎంపీల ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన అవిశ్వాసం-యూపీఏ సర్కారు అంశంపై మీడియాతో మాట్లాడారు.. యూపీఏ విధానాలపై తాము మొదటి నుంచి వ్యతిరేకమన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి మాత్రం జయ పాండా నోరు మెదపలేదు. ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించిన ముసాయిదా బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించటంతో.. ఆరుగురు సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు.. సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ సర్కారుపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తూ లోక్‌సభ స్పీకర్‌కు నోటీసు అందించారు. కాంగ్రెస్ ఎంపీలు రాయపాటి సాంబశివరావు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్‌కుమార్, ఎ.సాయిప్రతాప్, లగడపాటి రాజగోపాల్, జి.వి.హర్షకుమార్ సోమవారం ఉదయం ఈమేరకు స్పీకర్ మీరాకుమార్‌కు నోటీసు ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా యూపీఏపై అవిశ్వాస తీర్మానానికి సిద్ధపడింది. -
మాజీ ప్రధాని దేవెగౌడతో వైఎస్ జగన్ భేటీ
-
ప్రజలు తగిన బుద్ధి చెప్పారు:వైఎస్ జగన్
కాంగ్రెస్‌కు నేడు నాలుగు రాష్ట్రాల్లో జరిగిందే రేపు దేశమంతా జరుగుతుంది: వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత అయినా కాంగ్రెస్‌కు బుద్ధి రావాలి. ఆ పార్టీ ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయడం కోసం ఆరాటపడుతుందని కోరుకుంటున్నా. ఇప్పుడు నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో జరిగిందే.. రేపు దేశమంతా జరుగుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌కు నాలుగు రాష్ట్రాల ప్రజలు, దేవుడు తగిన బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాదని చెప్పారు. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించడానికి జరుగుతున్న యత్నాలకు వ్యతిరేకంగా, ఆర్టికల్ 3ని సవరించేందుకు కృషి చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పక్షాల మద్దతును కూడగడుతున్న జగన్మోహన్రెడ్డి... అందులో భాగంగా సోమవారమిక్కడ సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) అధినేత ములాయంసింగ్ యాదవ్, జనతాదళ్(ఎస్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. ఉదయం పదిన్నర గంటలకు ములాయంతో పార్లమెంట్లో సమావేశమయ్యారు. ఇందులో ఎస్పీ నేత రాంగోపాల్ యాదవ్‌తోపాటు ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎస్పీవై రెడ్డి, పార్టీ నేతలు ఎంవీ మైసూరారెడ్డి, బాలశౌరి పాల్గొన్నారు. తర్వాత సాయంత్రం 4 గంటల సమయంలో దేవెగౌడతో ఆయన నివాసంలో జగన్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఇందులో జేడీ(ఎస్) నేతలు డానిష్ అలీ, ఓవీ రమణ కూడా పాల్గొన్నారు. ఈ భేటీల్లో ఆర్టికల్ 3 సవరణ ఆవశ్యకత, ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో యూపీఏ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, విభజనకు అసెంబ్లీ సమ్మతి లేని వైనం తదితర అంశాలను జగన్ సవివరంగా వారి దృష్టికి తీసుకెళ్లారు. ఒక రాష్ట్రాన్ని విభజించాలంటే అసెంబ్లీతోపాటు పార్లమెంట్‌లోనూ మూడింట రెండొంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ రాజ్యాంగాన్ని సవరిస్తేనే భవిష్యత్తులో ఢిల్లీ పాలకులు తమ ఇష్టానుసారం రాష్ట్రాలను విభజించే వీలుండదని, ఈ రాజ్యాంగ సవరణకు మద్దతునివ్వాలని కోరారు. జగన్ చెప్పినదంతా సావధానంగా ఆలకించిన ములాయం, దేవెగౌడ ఈ సవరణకు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించారు. భేటీ అనంతరం జగన్మోహన్రెడ్డి, దేవెగౌడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘ప్రజాస్వామ్యంలో ఒక రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు అందరూ మౌనంగా ఉండటం మంచిదికాదు. ఎవరూ మాట్లాడకుంటే.. వారి రాష్ట్రాలు కూడా విభజనకు ఎంతో దూరం లేవనే విషయాన్ని గుర్తించాలి. శాసనసభ తీర్మానం లేకుండా రాష్ట్ర విభజన చేయడం దేశ చరిత్రలో ఇంత వరకు జరగలేదు. ఆంధ్రప్రదేశ్ విషయంలో సంప్రదాయాలకు భిన్నంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోంది’’ అని జగన్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కేంద్రం విభజన నిర్ణయాన్ని తీసుకుందని, ఇది ఎవరికీ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. ఢిల్లీలో 272 స్థానాలున్న ఎవరికైనా రాష్ట్రాలను విభజించే అధికారం ఇస్తే.. అసెంబ్లీ తీర్మానంతో పనిలేకుండా, ప్రజలను విశ్వాసంలోకి తీసుకోకుండా రాష్ట్రాలను విభజించుకుంటూ పోయే ప్రమాదం ఉందన్నారు. అడ్డగోలు విభజనకు అవకాశం కల్పిస్తున్న ఆర్టికల్-3ని సవరించాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. జరుగుతున్న అన్యాయాన్ని నిలువరించడానికి మద్దతు ఇస్తానని హామీ ఇచ్చినందుకు దేవెగౌడకు కృతజ్ఞతలు తెలిపారు. ఆఖరు దాకా పోరాడతాం.. రాష్ట్ర విభజనను అడ్డుకోగలనన్న విశ్వాసం మీకుందా అని విలేకరులు అడగ్గా.. ‘‘రాష్ట్ర విభజనను ఆపడానికి, కేంద్రం చేస్తోన్న అన్యాయాన్ని అడ్డుకోవడానికి ఆఖరు వరకు పోరాడతాం’’ అని జగన్ సమాధానమిచ్చారు. ‘‘మాది చిన్న పార్టీ. నేను సామాన్యుడిని. మా పార్టీకి నాతో కలిపి ముగ్గురు ఎంపీల బలమే ఉంది. ముగ్గురు ఎంపీల బలంతో మొత్తం పరిస్థితిని మార్చలేం. కానీ ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాపాడటానికి మాత్రం వెనకాడం. ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారంతా.. గొంతెత్తాల్సిన సమయం ఇది. ప్రజాస్వామ్యంలో ఉన్నవారంతా కలసిరావాలి. జరుగుతున్న అన్యాయానికి అడ్డుకట్ట వేయాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు జరుగుతోంది. రేపు మరో రాష్ట్రానికి జరగచ్చు. అందుకే అందరూ కలసిరావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పారు. అన్యాయానికి వ్యతిరేకంగా మీడియా కూడా నినదించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సోషల్ మీడియా, ప్రతి పాత్రికేయుడు కూడా అన్యాయాన్ని అడ్డుకోవడానికి గొంతెత్తి నినదించాలని కోరారు. సవరణ కోసం పాటుపడతా: దేవెగౌడ ఇష్టారాజ్యంగా రాష్ట్రాల విభజన జరగకుండా చూడటానికి రాజ్యాంగంలోని ఆర్టికల్ 3ని సవరించాల్సిందేనని, ఈ సవరణ కోసం తాను పాటుపడతానని జేడీ(ఎస్) అధ్యక్షుడు దేవెగౌడ చెప్పారు. ‘‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 3కి సవరణ ఆవశ్యకతపై జగన్ నాతో చర్చించారు. ఏ రాష్ట్రాన్నయినా విభజించడానికి అటు అసెంబ్లీలో, ఇటు పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీని తప్పనిసరి చేస్తూ ఆర్టికల్ 3కి రాజ్యాంగ సవరణ తీసుకురావాల్సిన అవసరంపై మాట్లాడారు. అలాంటి సవరణ కోసం వాయిదా తీర్మానం రూపంలో ఆయన పార్లమెంట్లో ప్రయత్నించనున్నారు. ఈ తీర్మానం పెట్టడానికి లెఫ్ట్ అంగీకరించింది. నేను సహజంగానే లెఫ్ట్ పార్టీల మిత్రుడిని. కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో వారి మిత్రపక్షంగా మేమున్నాం. అందువల్ల వారు తీసుకున్న నిర్ణయానికి నేను కట్టుబడతాను. ఆర్టికల్ 3 సవరణ కోసం పెడుతున్న వాయిదా తీర్మానానికి మద్దతునిస్తాం’’ అని దేవెగౌడ అన్నారు. తెలంగాణ విషయంలో ఆర్టికల్-3 దుర్వినియోగం కాకుండా చూస్తామన్నారు. తెలంగాణపై మీ వైఖరి ఏమిటి? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తెలంగాణ విషయంలో వారు నిబంధనలను ఉల్లంఘించి వెళ్తున్నారు. రాష్ట్రాన్ని ఈ తరహాలో విభజించడం తెలివైన నిర్ణయం కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘తొమ్మిదిన్నరేళ్లు వారు ఎందుకు కిమ్మనకుండా ఉన్నారు? తమ హయాం ముగింపుకొచ్చిన సమయంలోనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు? రాజకీయ ప్రయోజనాల కోసం కాకపోతే మరెందు కోసం? భాషాప్రయుక్త రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలర్పించారు. ఇప్పుడు భాషాప్రయుక్త రాష్ట్రం ఏమైంది? తెలంగాణలో తెలుగు కాకుండా మరేదన్నా భాషను మాట్లాడుతున్నారా? కోస్తాంధ్రలో మాట్లాడుతున్నది కూడా అదే భాష కదా... మరి ఇలాంటి డిమాండ్‌తో ముందుకెళ్తే మనం ఎక్కడికి పోతాం? ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆందోళనకర పరిస్థితి ఎందుకు తీసుకువచ్చారు?’’ అని కేంద్రాన్ని నిలదీశారు. బిల్లును అడ్డుకుంటాం: ములాయం రాష్ట్రాల విభజనకు మేం వ్యతిరేకం పార్టీ సిద్ధాంతం రీత్యా రాష్ట్రాల విభజనకు తాము వ్యతిరేకమని ఎస్పీ అధినేత ములాయంసింగ్ యాదవ్ స్పష్టం చేశారు. ఏ రాష్ట్ర విభజననైనా సరే తమ పార్టీ వ్యతిరేకిస్తుందని, ఆంధ్రప్రదేశ్ విభజనను సైతం అదే తరహాలో వ్యతిరేకిస్తామని ఆయన జగన్‌తో భేటీ సందర్భంగా అన్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లును తమ పార్టీ పార్లమెంట్లో అడ్డుకుంటుందని చెప్పారు. ఆర్టికల్ 3 సవరణ కోసం జరిపే పోరాటంలో కలసిరావడానికి ఇప్పటికే సిద్ధమైన పలు పార్టీలతో కలిసి తాము కూడా పోరాడతామని ఆయన హామీ ఇచ్చారు.