ముంబై : డబుల్ సెంచరీని బీట్ చేస్తూ.. చరిత్రాత్మక గరిష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ చివరికి ఢమాల్ అంది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ చర్చకు అంగీకరించడంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు పడిపోయాయి. వాల్‌స్ట్రీట్, ఆసియన్ షేర్లు బులిష్ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా పడిపోయి 147 పాయింట్ల నష్టంలో 36,373 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 27 పాయింట్ల నష్టంలో 11వేల మార్కు కిందకి పడిపోయి 10,980 వద్ద స్థిరపడింది. ఇన్వెస్టర్లు మెజార్టీ షేర్ల నుంచి క్యాష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. ఎక్కువగా మెటల్స్, ఆటో, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్ నష్టపోయాయి. మిడ్‌క్యాప్స్‌లో నెలకొన్న ఒత్తిడి మార్కెట్లను కిందకి పడేసింది.
నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టపోయింది. ఓఎన్‌జీసీ, ఏషియన్ పేయింట్స్, ఇండియాబుల్స్ హౌజింగ్ టాప్ గెయినర్లుగా రెండు సూచీల్లోనూ లాభాలు పండించగా.. మెటల్ స్టాక్స్ టాటా స్టీల్, వేదంత, హిందాల్కోలు టాప్ లూజర్లుగా ఉన్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ కూడా 10 పైసలు నష్టపోయి 68.57 వద్ద నమోదైంది. కాగ, నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన రోజే కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మాన నోటీసులు స్పీకర్‌కు అందాయి. ఈ నోటీసులపై స్పందించిన స్పీకర్, వాటిని ఆమోదిస్తున్నట్టు తెలిపారు. ఈ శుక్రవారమే అవిశ్వాసంపై చర్చను చేపట్టబోతున్నారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు కూడా తీవ్ర కదుపులకు లోనయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment