
భారీ నష్టాల నుంచి లాభాల బాట పట్టిన దేశీయ స్టాక్ మార్కెట్లో భారీ లాభాల్లోనే ముగిశాయి. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి సెన్సెక్స్ 1,135.68 పాయింట్లు లేదా 1.55 శాతం లాభంతో.. 74,273.58 వద్ద, నిఫ్టీ 374.25 పాయింట్లు లేదా 1.69 శాతం లాభంతో.. 22,535.85 వద్ద నిలిచాయి.
సిల్లీ మాంక్స్ ఎంటర్టైన్మెంట్, కీనోట్ ఫైనాన్షియల్ సర్వీసెస్, వన్ పాయింట్ వన్ సొల్యూషన్స్ లిమిటెడ్, టెసిల్ కెమికల్స్ అండ్ హైడ్రోజన్, బినాని ఇండస్ట్రీస్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. డీసీఎమ్ ఫైనాన్షియల్, ఢిల్లీవరీ, ప్రోకాట్ మెరిడియన్, బోధి ట్రీ మల్టీమీడియా, ది వెస్ట్రన్ ఇండియా ప్లైవుడ్స్ వంటి కంపెనీలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్‌సైట్‌లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు).