Parliament Monsoon Session: No-Confidence Motion Live Updates - Sakshi
Sakshi News home page

లోక్‌సభలో అవిశ్వాసం: మణిపూర్‌ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం.. హోం మంత్రి అమిత్‌ షా

Published Wed, Aug 9 2023 9:50 AM | Last Updated on Wed, Aug 9 2023 7:14 PM

Parliament Sessions: No Confidence Vote Debate Day 2 Live Updates - Sakshi

Live Updates:

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై ఇవాళ రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది.

అవిశ్వాస తీర్మానంపై అమిత్‌ షా ప్రసంగం
మణిపూర్‌ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా.. కేం‍ద్రం తరపున హోం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రసంగించారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుంది కూడా. ప్రజలకు అంతా తెలుసు. వాళ్లు అంతా చూస్తున్నారు. ప్రజలకు మాపై పూర్తి విశ్వాసం ఉంది.

► ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్‌ వీడియో గురించీ ప్రస్తావించారు అమిత్‌ షా.  ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్‌ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్‌ అయ్యింది’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్‌ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారు. నేను స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్‌ వెళ్లాను. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని నేనేనే. మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం. త్వరలోనే మణిపూర్‌ పరిస్థితులను అదుపులోకి తెస్తాం. 

► మణిపూర్‌పై మేమేమీ మౌనవ్రతం చేయడం లేదు. మణిపూర్‌ అల్లర్లలో ఇప్పటివరకు 152 మంది చనిపోయారు. వీరిలో మే నెలలోనే 107 మంది చనిపోయారు. మణిపూర్‌ సీఎంను మార్చాల్సిన అవసరం లేదు. మణిపూర్‌ ఇప్పుడిప్పుడే  కోలుకుంటోంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోయకండి. 

► మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు బాధాకరం. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని మేమూ అంగీకరిస్తున్నాం. కానీ,  నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మణిపూర్‌ అంశంపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మొదటి రోజు నుంచే చెబుతున్నాం. స్పీకర్‌కు లేఖ కూడా రాశాం. కానీ, కేంద్రం అంగీకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మణిపూర్‌ చర్చకు విపక్షాలే సిద్ధంగా లేవు. చర్చ నుంచి పారిపోతున్నాయి ఆ పార్టీలు.

► గత ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది.  ఈ ఆరున్నరేళ్లలో ఏనాడూ మణిపూర్‌లో కర్ఫ్యూ విధించలేదు. మే వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు.  హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్‌ హింసకు కారణం అయ్యాయి. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాకే.. ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతోనే హింస ప్రజ్వరిల్లింది. మే 3వ తేదీన మొదలైన మణిపూర్‌ హింస నేటికీ కొనసాగుతున్నాయి. మణిపూర్‌ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోం. 

► ఆర్టికల్‌ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్‌లో ద్వంద్వ ప్రమాణాలను తొలగించాం. అది తొలగిస్తే కశ్మీర్‌ అల్లకల్లోలం అవుతుందని విపక్షాలు భయపెట్టాయి. మేం మాత్రం.. సర్జికల్‌ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదాన్ని రూపుమాపే యత్నం చేశాం. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశాం.  

► కాంగ్రెస్‌ది కరప్షన్‌ క్యారెక్టర్‌. బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ.

► వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుంది. 

►  మేకిన్‌ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్‌, అఖిలేష్‌ తప్పుబట్టారు. 

►  ఒక ఎంపీ 13సార్లు రీలాంచ్‌ అయ్యాడు. ఆ ఎంపీ 13సార్లూ ఫెయిల్‌ అయ్యాడు అంటూ రాహుల్‌ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా షా సెటైర్లు వేశారు. 

► మీరు చాలా చెప్పారు. కానీ, ఏదీ చెయ్యలేదు. మేం చేసి చూపించాం అంటూ విపక్షాలకు కౌంటర్‌ ఇచ్చారు అమిత్‌ షా.

► యూపీఏ రూ.70 వేల కోట్ల రుణమాఫీ తాయిళాలు ఇచ్చింది.  మేం తాయిళాలను పంచడం లేదు. రుణమాఫీలపై మాకు నమ్మకం లేదు. ఎవరూ లోన్‌ తీసుకోకూడదన్నదే మా ఉద్దేశం. మేం మాత్రం సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం మాత్రం అందిస్తున్నాం. రుణమాఫీ కాదు.. రుణభారం లేకుండా చేశాం. జన్‌ధన్‌ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారు. డీబీటీ ద్వారా జన్‌ ధన్‌ యోజనలో నగదు జమ అవుతోంది. 

► ఇది ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్‌ షా చురకలంటించారు.

►  నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారు. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్‌ నేతలు జైలుకు వెళ్లారు. గతంలో డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉంది. కానీ, మేం అలా కాదు. కాంగ్రెస్‌లా జిమ్మిక్కు చేయలేదు. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం. ఫలితంగానే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. 

► మోదీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ ప్రభుత్వం మైనార్టీలో లేదు. సంపూర్ణ మెజార్టీతో ఉంది. ప్రజలకు మోదీ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది.

► ఆగష్టు 9వ తేదీన నాడు గాంధీ క్విట్‌ఇండియా పిలుపు ఇచ్చారు. ఇండియా కూటమికి కౌంటర్‌గా మోదీ కూడా ఇప్పుడు క్విట్‌ ఇండియా పిలుపు ఇస్తున్నారు. అమిత్‌ షా పిలుపునకు బీజేపీ ఎంపీల స్పందనతో క్విట్‌ ఇండియా నినాదాలతో మారమోగిన లోక్‌సభ

అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం
► రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ

ప్రజల దృష్టి మళ్లించేందుకే అవిశ్వాసం
► ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదు.  కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారు. 

► విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ పాటిస్తోంది. ఆదివాసీలు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావం ఉంది. ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసం పోయింది.  మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాల్సిందే.
:::అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి

► ఈ దేశంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అయితే ఈ దేశానికి హిందువులకే కాదు.. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. ప్రధానమంత్రి ఒక రంగుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడు.. ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. గత 10 సంవత్సరాలలో మీరు (కేంద్రం) ఎంత మంది కశ్మీరీ పండిట్‌లను తిరిగి తీసుకువచ్చారు?.  మేము భారతదేశంలో భాగం కాదని.. మేం పాకిస్తానీలమని, దేశద్రోహులమని మాత్రం చెప్పకండి. మనం ఈ దేశంలో భాగం.. అంటూ నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీ ఫరూక్‌ అబ్దుల్లా ఆవేశపూరితంగా ప్రసంగించారు. 

► మా ఉద్దేశ్యం ఏంటంటే.. మణిపూర్‌పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తాయని. కానీ, ప్రధాని సభకు రావడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వం మా మాట వినడానికి సిద్ధంగా లేదు. నిరసనగా, మేము సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే సరైంది’’
::కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే

మణిపూర్‌ ఇష్యూపై రాజ్యసభలో రచ్చ 
► మణిపూర్‌ అంశంపై రాజ్యసభలో రచ్చ జరిగింది. మణిపూర్‌పై రాజకీయం కాదు.. చర్చ జరగాలని కాంగ్రెస్‌ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్‌పై ఒక్కరోజు చర్చ పెడితే సరిపోతుంది. కానీ పదిరోజులుగా సాగదీస్తున్నారు మండిపడ్డారాయన. ఈ దశలో చర్చకు సిద్దమని కేంద్రం ప్రకటించింది. మణిపూర్‌ అంశాన్ని లిస్ట్‌ చేసేందుకు రెడీ అని చైర్మన్‌ జగ్దీప్‌ ధన్‌ఖడ్‌ ప్రకటించారు. అయితే.. విపక్షాలకు చర్చ జరగడం ఇష్టం లేదని బీజేపీ ఎంపీలు అనడంతో.. సభ్యుల మధ్య వాగ్వాదం జరగ్గా.. కాంగ్రెస్‌ ఎంపీలు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్‌

►లోక్‌సభలో అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ
►రాహుల్‌ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం
►ఒక దశంలో రాహుల్‌ ప్రసంగానికి అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్‌
►ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన రాహుల్‌
►రాజస్థాన్‌కు బయలు దేరిన రాహుల్‌
►బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్న కాంగ్రెస్‌ ఎంపీ

మణిపూర్‌ రెండుగా చీల్చలేదు

►భరత మాతను చంపేశారని సభలో ఇప్పటి వరకు ఎవరూ అనలేదు.
►మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు.
►మణిపూర్‌ భారత్‌లో అంతర్భాగం
►కశ్మీర్‌లో పండిట్లపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా?
►ఆర్టికల్‌ 370 మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్షం కోరుకుంటోంది.
►మణిపూర్‌లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది.
►ఇప్పటికే మణిపూర్‌ అల్లర్లపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం

రాహుల్‌ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్‌

►రాహుల్‌ భారతీయుడు కాదు.
►ఆయన వ్యాఖ్యలను జాతి క్షమించదు.
►భారతమాత హత్య గురించి మాట్లాడతారా?
►విపక్ష కూటమి ఇండియా కాదు
►అది అవినీతి,తుష్టీకరణ కూటమి
►న్యాయం గురించి కాంగ్రెస్‌ మాట్లాడుతుందా?
►గిరిజ టిక్కు, సరళ భట్‌కు ఎప్పుడు న్యాయం చేస్తారు?

మోదీని రావణుడితో పోల్చిన రాహుల్‌

 ► ప్రధాని మోదీ అమిత్‌ షా, అదానీ మాటలే వింటారు.
 ► ప్రధానిని రావణుడితో పోల్చిన రాహుల్‌
 ►రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడు.
 ►మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడు.

లోక్‌సభలో గందరగోళం

►హిందుస్థాన్‌ను మణిపూర్‌లో హత్యచేశారన్న రాహుల్‌
► రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం
►రాహుల్‌​ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌
►అధికార , విపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ వాదనలు
►ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లిన లోక్‌ సభ
►స్పీకర్‌ జోక్యం చేసుకున్నా ఆగని మాటల యుద్దం

జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది

► జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశాను.
►లక్షల మందితో తనతో కలిసి రావడంతో నాకు ధైర్యమొచ్చింది.
►నా యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్‌ వరకు వెళ్తాను
►పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నాను.
►యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేది.
జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది.

బీజేపీ సభ్యులపై రాహుల్ గాంధీ సెటైర్లు

►గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమో: రాహుల్‌ గాంధీ
►అదానీ గురించి ఈరోజు మాట్లాడను. భయపడాల్సిన పనిలేదు.
►నాదీ రాజకీయ ప్రసంగం కాదు.
►బీజేపీ సభ్యులు నా సమయాన్ని వృధా చేస్తున్నారు.

లోక్‌భలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ ప్రారంభం.. 

►చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ.
►ఎంపీ పదవిని పునరుద్దరించినందుకు ధన్యవాదాలు.
►మరోసారి అదనీ పేరు ప్రస్తావించిన రాహుల్‌
►రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం
►మణిపూర్‌ గురించి మాట్లాడుతా..
►బీజేపీ నేతలు రిలాక్స్‌ అవ్వొచ్చు.
►ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు.
►కన్యాకుమారి నుంచి కశ్మీర్‌ వరకు యాత్ర చెపట్టా
►యాత్ర నా అహంకారాన్ని అణిచివేసింది.

రాజ్యసభ వాయిదా

►ప్రతిపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది.

►ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష నేతలు మణిపూర్‌ మణిపూర్‌ అంటూ నిరసనలు చేపట్టడంతో లోక్‌సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది.

► స్వాతంత్య్ర ఉద్యమానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీకి క్విట్‌ ఇండియాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారి నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని తెలిపారు. క్విట్‌ ఇండియా దినోత్సవం గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున.. ప్రధాని మోదీ సమక్షంలో పార్లమెంట్‌లో చర్చ పెట్టాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధాని పార్లమెంట్‌కు రావడం లేదని, మణిపూర్ సమస్య గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు.

►కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ నేడు(బుధవారం) రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ పేర్కొన్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై తప్పక చర్చలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే అది ఈ రోజా? రేపా అనేది క్లారిటీ లేదన్నారు.

►ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారి అన్నారు. వాళ్లు బ్రిటీష్‌ వారికి లేఖలు రాస్తూ, వారికి ఇన్‌ఫార్మర్లుగా వ్యవహరించిన ఉద్యమ సమయంలో.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేవి లేవని అన్నారు. ఆకలి సూచీ, విద్య, ఆరోగ్యం, విదేశీ నిల్వల సంగత ఏంటీ అని ప్రశ్నిచారు. బీజేపీ కేవలం వ్యక్తిగత దాడికి దిగజారిందని విమర్శించారు.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో రెండో చర్చ జరగనుంది. మణిపూర్‌ హింసతోపాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్‌ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. 

రాహుల్‌ మాట్లాడకపోవడానికి కారణం అదేనా
అయితే మంగళవారం అవిశ్వాస తీర్మానంపై రాహుల్‌ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్‌ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్‌ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. అయితే గాంధీ చర్చను ప్రారంభించకపోవడానికి ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. చర్చను ప్రారంభించిన గొగొయ్‌ ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎంపీ కావడం మొదటిది. మణిపూర్‌ హింసపై ఆయన మాట్లాడితే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కాంగ్రెస్‌ భావించినట్లు తెలుస్తోంది.

అదే విధంగా ఎంపీగా సభలోకి తిరిగి వచ్చిన వెంటనే రాహుల్‌ అవిశ్వాసంపై మాట్లాడితే వారసత్వ రాజకీయాలను ఉద్ధేశిస్తూ అధికార బీజేపీ మాటల యుద్దానికి దిగుతుందని యోచించినట్లు సమాచారం. ఇక మరో కారణం ప్రధాని మోదీ నిన్న సభలో లేకపోవడం. మోదీ రేపు(గురువారం) లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. 

కాగా తొలిరోజు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్‌ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన వీడి, ప్రకటన  చేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. మరోవైపు  ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు.

మణిపూర్‌ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్‌ సింగ్‌ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ సౌగతారాయ్‌ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే కుమారుడు శ్రీకాంత్‌ షిండే సభలో కాసేపు హనుమాన్‌ చాలీసా పఠించారు.

అవిశ్వాస తీర్మానంపై చర్చను అసోం కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ ప్రారంభించారు. మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రధాని మాట్లాడాలని డిమాండ్‌ చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ  నిషికాంత్‌ దూబే మాట్లాడుతుండగా కాంగ్రెస్‌ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, : డీఎంకే ఎంపీ టీఆర్‌ బాలు, టీఎంసీ ఎంపీ  సౌగత రాయ్, బీజేడీఎంపీ పినాకి మిశ్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్‌ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్‌ రాణే, కాంగ్రెస్‌ ఎంపీ మనీశ్‌ తివారీ తదితరులు మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement