Parliament mansoon sessions
-
ఐపీసీ, సీఆర్పీసీ స్దానంలో కొత్త చట్టాలు.. చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ
న్యూఢిల్లీ: స్వతంత్ర భారత చరిత్రలోనే చరిత్రాత్మకమని చెప్పదగ్గ ఘట్టం శుక్రవారం లోక్ సభలో ఆవిష్కృతమైంది. బ్రిటిష్ వలస పాలన తాలూకు అవశేషాలుగా కొనసాగుతూ వస్తున్న మూడు కీలక నేర న్యాయ చట్టాలకు చెల్లు చీటీ పాడే దిశగా పెద్ద ముందడుగు పడింది. వాటి స్థానంలో స్వదేశీ చట్టాలను తెచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్ లు చరిత్రగా మిగలనున్నాయి. వాటి స్థానంలో పూర్తి భారతీయ చట్టాలు రానున్నాయి. ఈ మేరకు న్యాయ సంహిత బిల్లు– 2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు–2023, భారతీయ శిక్షా బిల్లు–2023లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు. ‘ప్రతిపాదిత చట్టాలు దేశ నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయి. ప్రతి భారతీయుని హక్కులను పరిపూర్ణంగా పరిరక్షించాలన్న స్ఫూర్తికే పెద్ద పీట వేస్తాయి‘ అని ఈ సందర్భంగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడంతో పాటు సమకాలీన అవసరాలు, వారి ఆకాంక్షలను తీర్చేందుకు అవసరమైన అన్ని మార్పుచేర్పులను కొత్త బిల్లుల్లో పొందుపరిచినట్టు వివరించారు. వాటిని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పరిశీలనకు పంపాల్సిందిగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను మంత్రి కోరారు. మూడేళ్లలో న్యాయం ప్రతిపాదిత బిల్లులు ఆమోదం పొందితే నేర న్యాయ వ్యవస్థ సమూలంగా మెరుగు పడుతుందని అమిత్ షా అన్నారు. అంతేగాక ప్రతి పౌరునికీ గరిష్టంగా మూడేళ్లలో న్యాయం అందుతుందన్నారు. ‘కొత్త చట్టాల్లో మహిళలు, బాలలకు అత్యంత ప్రాధాన్యం దక్కనుంది. మూక దాడుల వంటి హేయమైన నేరాలకు కూడా నిర్దిష్టమైన శిక్షలను పొందుపరిచాం. తొలిసారిగా ఉగ్రవాదానికి కూడా నిర్వచించాం‘ అని ప్రకటించారు. ‘రాజద్రోహం సెక్షన్ ను పూర్తిగా ఎత్తేస్తున్నాం. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ భావ వ్యక్తీకరణ హక్కు ఉంటుంది‘ అని వివరించారు. ‘ఈ బిల్లులు మన నేర న్యాయ వ్యవస్థను సమూలంగా మెరుగు పరుస్తాయని సభకు హామీ ఇస్తున్నా. వీటి లక్ష్యం శిక్ష విధింపు కాబోదు. న్యాయం అందేలా చూడటమే ప్రధానోద్దేశం. కొత్త చట్టాల్లో కేవలం నేరాలను నియంత్రించే లక్ష్యంతో మాత్రమే శిక్ష విధింపులు ఉంటాయి‘ అన్నారు. బ్రిటిష్ కాలం నాటి ప్రస్తుత చట్టాల నిండా బానిసత్వపు చిహా్నలే ఉన్నాయని విమర్శించారు. ‘అధికారంలో ఉన్నవారిని వ్యతిరేకించే ప్రతి ఒక్కరినీ ఏదోలా శిక్షించడం వాటి ఏకైక లక్ష్యము. బ్రిటిష్ అధికారాన్ని పరిరక్షించడం, బలోపేతం చేయడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చట్టాలవి. శిక్షించడమే వాటి ప్రధాన లక్ష్యం తప్ప న్యాయం అందించడం కాదు‘ అని ఆరోపించారు. శిక్ష పడే రేటును కనీసం 90 శాతానికి పెంచడమే కొత్త చట్టాల లక్ష్యమన్నారు. ఇందుకోసం ఫోరెన్సిక్ సైన్స్ వాడకాన్ని మరింతగా పెంచే యోచన కూడా ఉందని హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ► మూక దాడులకు, మైనర్లపై అత్యాచారానికి మరణశిక్ష. ► దేశం పట్ల నేరాలను ఇకపై అతి తీవ్రమైనవిగా పరిగణిస్తారు. ► కొన్ని రకాల చిల్లర నేరాలకు శిక్షగా సామాజిక సేవ (అమల్లోకి వస్తే ఇలాంటి శిక్ష ఇదే తొలిసారి అవుతుంది). ► వేర్పాటువాదం, తత్సంబంధ చర్యలు, సాయుధ తిరుగుబాటు, భారత సార్వభౌమత్వాన్ని, ఐక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడవేయడం వంటి కొత్త నేరాలను పొందుపరిచారు. ► పలు నేరాలకు ఇకపై లింగ భేదం ఉండబోదు. ► పెళ్లి, ఉద్యోగం, ప్రమోషన్ల వంటి ప్రలోభాలు చూపి, గుర్తింపును దాచి మహిళలను లైంగికంగా దోచుకోవడం నేరంగా పరిగణనలోకి వస్తుంది. ► గ్యాంగ్ రేప్ కు 20 ఏళ్లు, లేదా జీవిత ఖైదు. ► తీవ్రతను బట్టి మూక దాడులకు ఏడేళ్లు, జీవిత ఖైదు, లేదా మరణ శిక్ష. ► తొలిసారిగా ఉగ్రవాదానికి నిర్వచనం. ► ఉగ్రవాదుల ఆస్తుల జప్తు రాజకీయ రెమిషన్లకు చెక్... శిక్ష తగ్గింపు (రెమిషన్) వంటి సదుపాయాలను రాజకీయ లబి్ధకి వాడుకోవడాన్ని నిరోధించేందుకు ప్రతిపాదిత బిలుల్లో కొత్త సెక్షన్లు పొందుపరిచారు. వాటి ప్రకారం... ► ఇకపై మరణశిక్షను కేవలం జీవిత ఖైదుగా మాత్రమే మార్చేందుకు వీలవుతుంది. ► జీవిత ఖైదును ఏడేళ్ల శిక్షగా మాత్రమే మార్చవచ్చు. ► బిహార్ కు చెందిన నేరమయ నేత ఆనంద్ మోహన్ కు క్షమాభిక్ష పెట్టి విడుదల చేయడానికి అమిత్ షా ఈ సందర్భంగా గుర్తు చేశారు. అందుకే రాజకీయ అండదండలున్న వారు చట్టం బారి నుంచి తప్పించుకోకుండా చూసేందుకే ఈ సెక్షన్లను చేర్చినట్లు వివరించారు. కొత్త నేర–న్యాయ ప్రక్రియ ఇదీ ► 90 రోజుల్లోపు ఛార్జ్ షీట్ దాఖలు చేయాలి. ► పరిస్థితిని సమీక్షించాక కోర్టు మరో 90 రోజుల సమయం ఇవ్వొచ్చు. ► దర్యాప్తును 180 రోజుల్లోపు పూర్తి చేసి విచారణకు పంపాలి. ► విచారణ ముగిశాక 30 రోజుల్లోపు తీర్పు వెలువడాలి. న్యాయ సంహిత బిల్లు ప్రకారం ఉగ్రవాది అంటే... ► దేశంలో గానీ, విదేశాల్లో గానీ భారత దేశ ఐక్యతను, సమగ్రతను, భద్రతను ప్రమాదంలో పడేసే చర్యలకు పాల్పడేవాడు. ► తద్వారా జన సామాన్యాన్ని, లేదా ఒక వర్గాన్ని భయభీతులను చేసేవాడు, శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేవాడు. రాజద్రోహం ఇక దేశద్రోహం బ్రిటిష్ కాలం నాటి వివాదాస్పద రాజద్రోహ చట్టాన్ని తొలగించనున్నట్టు కేంద్రం ప్రతిపాదించింది. అదే సమయంలో దేశద్రోహం పేరిట దానికి కొత్త రూపు ఇవ్వనుంది. బ్రిటిష్ సింహాసనాన్ని గుర్తు చేసే వలస వాసనలు వదిలించుకోవడమే పేరు మార్పు ఉద్దేశమని పేర్కొంది. బీఎన్ఎస్ బిల్లులో ప్రతిపాదించిన ఈ కొత్త చట్టాన్ని మరిన్ని కొత్త సెక్షన్లతో మరింత బలోపేతం కూడా చేయనుంది. దాని ప్రకారం... ఉద్దేశపూర్వకంగా నోటిమాట ద్వారా, రాతపూర్వకంగా, సైగలు, చిహ్నాల ద్వారా, అందరికీ బయటికి కనిపించేలా, ఎలక్ట్రానిక్ కమ్యూనికషన్స్ ద్వారా, ఆర్థిక సాధనాల ద్వారా, ఇతరత్రా, రెచ్చగొట్టే చర్యల ద్వారా, వేర్పాటువాదం ద్వారా, సాయుధ తిరుగుబాటు ద్వారా, అలాంటి ధోరణులను ప్రోత్సహించినా, దేశ సార్వ¿ౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను ప్రమాదంలో పడేసినా, అలాంటి మరే ఇతర చర్యలకు పాల్పడినా అది దేశ ద్రోహమే. ► దేశానికి వ్యతిరేకంగా చేసే ఎలాంటి పనినైనా దేశ ద్రోహంగానే పరిగణిస్తారు. ► శాంతి సమయంలో ప్రభుత్వంపై యుద్ధం చేసినా, అందుకు ప్రయతి్నంచినా, అందుకోసం విదేశీ ప్రభుత్వాలతో చేతులు కలిపినా, అలాంటి ప్రయత్నాలను ప్రోత్సహించినా అందుకోసం మూకలను, ఆయుధాలను సమీకరించినా, అందుకు ప్రయతి్నంచినా, అలాంటి ప్రయత్నాలు గురించి తెలిసీ చెప్పకపోయినా, వాటిని దాచినా, అది దేశ ద్రోహమే. ► నేర తీవ్రతను బట్టి అందుకు జీవిత ఖైదు, పదేళ్లకు మించని, లేదా ఏడేళ్ల ఖైదు, వాటితో పాటు జరిమానా కూడా పడవచ్చు. ‘నేర న్యాయ చట్టాలను సమూలంగా మదింపు చేయాల్సిన, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్చుకోవాల్సిన అవసరం చాలా ఉందని 70 ఏళ్ల ప్రజాస్వామ్య భారత అనుభవం చెబుతోంది. సబ్ కా సాత్ (అందరికీ తోడు), సాబ్ కా వికాస్ (అందరి అభివృద్ధి), సాబ్ కా విశ్వాస్ (అందరి నమ్మకం), సాబ్ కా ప్రయాస్ (అందరి ప్రయత్నం) అన్నదే కేంద్ర ప్రభుత్వ మంత్రం‘ – బీఎన్ఎస్ఎస్ బిల్లు లక్ష్య ప్రకటన -
చట్టాలకు ప్రక్షాళన.. IPC, CRPC స్థానంలో కొత్త చట్టాలు
ఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి చట్టాలను ప్రక్షాళన చేస్తూ కొత్త చట్టాలు తీసుకొచ్చే క్రమంలో కేంద్రం ముందడుగు వేసింది. 1860 ఇండియన్ పీనల్ కోడ్(భారత శిక్షా స్మృతి)తో పాటు క్రిమినల్ ప్రొసీజర్ కోడ్(CRPC), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్(IEA) చట్టాలను భర్తీ చేసేలా కొత్త చట్టాలను తెరపైకి తెచ్చింది. ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్పీసీ ప్లేస్‌లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్యా చట్టాలను తెచ్చింది. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా చివరిరోజైన శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రతిపాదనలను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్ స్థానాల్లో కొత్త చట్టాల్ని.. భారతీయ న్యాయ సంహిత- 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023, భారతీయ సాక్ష్య బిల్లు- 2023లను తదుపరి పరిశీలన కోసం పార్లమెంటరీ స్థాయీ సంఘానికి పంపిస్తామని చెప్పారు. ‘‘బ్రిటీష్ కాలం నాటి కాలం చెల్లిన చట్టాలను ప్రక్షాళన చేస్తున్నాం. కొత్త చట్టాలతో 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు ఖాయం’’ అని వెల్లడించారు. కొత్త చట్టాలు మహిళలు, పిల్లలపై నేరాలతో పాటు హత్యా నేరాలు, దేశానికి వ్యతిరేకంగా చేసే నేరాల కట్టడిని ప్రధానంగా దృష్టిలో ఉంచుకుని సవరణలు చేసినట్లు వెల్లడించారు. కొత్త చట్టాల ప్రతిపాదన ప్రకారం.. ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ తనిఖీ తప్పనిసరి చేశారు. రాజద్రోహం(Sedition) వంటి చట్టాన్ని తొలగించారు. ఉద్దేశపూర్వకంగా (ఏదైనా రూపంలో సరే).. సాయుధ తిరుగుబాటుకు ఉసిగొల్పడం, విధ్వంసక కార్యకలాపాలను ప్రేరేపించే ప్రయత్నాలు, వేర్పాటువాద కార్యకలాపాల భావాలను ప్రోత్సహించడం నేరం. అది భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఐక్యతాసమగ్రతలను ప్రమాదంలో పడేస్తుంది. ఇలాంటి చర్యలకు పాల్పడినా.. పాలుపంచుకున్నా జీవిత ఖైదు, లేదంటే ఏడు సంవత్సరాల జైలు శిక్ష విధించబడుతుంది అలాగే జరిమానా కూడా. ఇక మూక హత్యలకు మరణశిక్ష విధించేలా ప్రొవిజన్‌ను ప్రవేశపెట్టారు. గ్యాంగ్ రేప్‌లకు 20 ఏళ్ల జైలు శిక్ష నుంచి జీవితఖైదు, మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష విధిస్తారు. ఇక క్రిమినల్ ప్రొసీజర్‌లో 300పైకి మార్పులు చేశారు. ఎక్కడ నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదు చేయొచ్చు. కేసుల సత్వర పరిష్కారం కోసమేనని కేంద్రం వెల్లడించింది. మరణశిక్షను మాత్రం అలాగే ఉంచారు. వివిధ నేరాలకు జరిమానాలు, శిక్షలను కూడా పెంచారు. చిన్న చిన్న నేరాలకు సమాజ సేవలాంటి శిక్షలను సైతం విధిస్తారు. #WATCH | Union Home Minister Amit Shah says, "...Under this Bill, we have set the goal that the conviction ratio has to be taken above 90%. That is why, we have brought an important provision that the Sections which provide for 7 years or a greater jail term, under all those… pic.twitter.com/Ap0eSzdCsG — ANI (@ANI) August 11, 2023 అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతూ.. ‘1860 నుండి 2023 వరకు, దేశంలోని నేర న్యాయ వ్యవస్థ బ్రిటిష్ వారు చేసిన చట్టాల ప్రకారం పనిచేసింది. వాటిని ఈ మూడు చట్టాలు భర్తీ చేస్తాయన్నారు. దేశంలో నేర న్యాయ వ్యవస్థలో పెనుమార్పు వస్తుందన్నారు. కొత్త మూడు చట్టాలు.. భారత పౌరుల హక్కులను పరిరక్షిస్తాయి. ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌లు బ్రిటిష్ కాలంనాటి చట్టాలు. ఆంగ్లేయుల పాలనను రక్షించడం, బలోపేతం చేయడంతోపాటు శిక్షించడమే లక్ష్యంగా వాటిని ప్రవేశపెట్టారు. బాధితులకు న్యాయం చేయడం వాటి ఉద్దేశం కాదు. కానీ, శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యం. అలాగే నేరాలను అరికట్టేందుకు శిక్షలు ఉంటాయని స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah says, "...Under this law, we are repealing laws like Sedition...," as he speaks on Bharatiya Nyaya Sanhita Bill, 2023; The Bharatiya Sakshya Bill, 2023 and The Bharatiya Nagrik Suraksha Sanhita Bill in Lok Sabha. pic.twitter.com/CHlz0VOf7Z — ANI (@ANI) August 11, 2023 -
లోక్‌సభలో బండి సంజయ్ భావోద్వేగ కామెంట్స్
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై వాడీవేడి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. కేసీఆర్ సర్కార్, కాంగ్రెస్ పార్టీపై సభలో సంజయ్ విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఓ గజినీ అని అన్నారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని సెటైరికల్ పంచ్ వేశారు. కేసీఆర్.. ఖాసిం చంద్రశేఖర రజ్వీ అని కామెంట్స్ చేశారు. అవిశ్వాసంలో భాగంగా బీజేపీ పక్షాన బండి సంజయ్ 10 నిమిషాలపాటు మాట్లాడారు. సభకు శిరస్సు వంచి నమస్కారం.. లోక్‌సభలో బండి సంజయ్ తెలుగులోనే మాట్లాడుతూ.. దేశ్ కీ నేత.. దిన్ బర్ పీతా. యే కాంగీ, బెంగాల్ దీదీ, ఢిల్లీ కేజ్రీ, బీహార్ జేడీ, ఔర్ తెలంగాణ కేడీ.. మోదీని ఏమీ చేయలేరు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్ పవిత్ర దేవాలయం.. శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. సుష్మా స్వరాజ్‌కు నా సెల్యూట్. చీమల పుట్టలో పాములా తెలంగాణలో కేసీఆర్ కుటుంబం చేరింది. కేంద్రం పుష్కలంగా నిధులిచ్చినా కేసీఆర్ సహకరించడం లేదు. రైతు సగటు ఆదాయంకంటే సాగుపై కేసీఆర్ కుటుంబ ఆదాయం వందల రెట్ల ఎట్లా పెరిగాయి? అని ప్రశ్నించారు. ఇక, మణిపూర్‌కు ప్రధాని మోదీ వెళ్లలేదని అడిగే నైతిక అర్హత మీకుందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. ఇందుకు ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనం అని అన్నారు. రాహుల్ గాంధీపై ఫైర్.. భారతమాతను హత్య చేశారంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సంజయ్ విరుచుకుపడ్డారు. ‘ఆయన ఎప్పుడేం చేస్తడో ఆయనకే తెలియదు. ఒకసారి కన్ను కొడతడు.. ఒకసారి కౌగిలించుకుంటాడు. ఇంకోసారి ఫ్లయింగ్ కిస్ ఇస్తాడు. గజినీలాగా తయారయ్యాడు. ఇలాంటి వ్యక్తితో కలిసి అవకాశవాద కూటమి అవిశ్వాసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం హాస్యాస్పదం. ఏ కాంగీ.. బెంగాల్ దీదీ.. ఢిల్లీ క్రేజీ.. బీహార్ జేడీ.. ఔర్ ఔర్.. తెలంగాణ కేడీ.. సభ్ లోగ్ మిల్ కర్ ఆయే తోబీ మోదీజీ కో నహీ రోకేంగే. భరతమాత జోలికొస్తే కన్ను పీకే ఆదర్శనేత నరేంద్ర మోదీ’అంటూ విరుచుకుపడ్డారు. మోదీ నాయత్వంలో ఎన్డీయే ప్రభుత్వం శక్తివంతమైన దేశంగా మారుతోందన్నారు. బీఆర్ఎస్ ఎంపీలకు సవాల్.. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నిరంతరాయంగా ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామంటూ బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు పార్లమెంట్‌ను పూర్తిగా తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ‘తెలంగాణలో 24 గంటలపాటు నిరంతరాయంగా వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. ఇదిగో నా రాజీనామా.. నిరూపించే దమ్ముందా? నిరూపించలేకపోతే మీరు రాజీనామా చేస్తారా? ముక్కు నేలకు రాసి సభకు క్షమాపణ చెబుతారా?’ అంటూ సవాల్ విసిరారు. సుష్మా స్వరాజ్‌కు సెల్యూట్.. ఈ పవిత్రమైన పార్లమెంట్‌కు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నీళ్లు-నిధులు-నియామకాల నినాదంతో సాధించుకున్న తెలంగాణను సాకారం చేసిన దేవాలయమిది. ఆనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వల్ల 1400 మంది యువకులు బలయ్యారు. జై తెలంగాణ అంటూ రివాల్వర్‌తో కాల్చుకున్నారు. ట్రైన్‌కు ఎదురుగా పోయి చనిపోయారు. ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే సభ వేదికగా తెలంగాణ బిల్లు పెడతారా, మేం వచ్చాక ఇవ్వమంటారా? అంటూ సుష్మా స్వరాజ్ నిలదీస్తే ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని చూడటానికి మీరు బతికి ఉండాలని అప్పీల్ చేస్తే యువతకు భరోసా ఇచ్చిన మహానేత. చిన్న రాష్ట్రాలకు బీజేపీ మొదటి నుండి అనుకూలం. తెలంగాణకు అనుకూలంగా కాకినాడ తీర్మానం చేసిన పార్టీ బీజేపీ అని అన్నారు. బీఆర్ఎస్పై సెటైర్లు.. చీమల పుట్టలో తాచుపాము జొర్రినట్లు.. తెలంగాణలో ఒక కుటుంబం చేరింది. బీఆర్ఎస్ అంటే.. భ్రష్టాచార్ రాక్షస సమితి. బీఆర్ఎస్ లీడర్ పేరు ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ. తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేశాడు. బీఆర్ఎస్ నేతది ఒకే పని.. అదేమిటంటే.. రాత్ బర్ పీతా.. దిన్ బర్ సోతా.. కిస్ సే బీ నహీ మిల్ తా.. యే హై దేశ్ కీ నేత అని సెటైర్లు వేశారు. కేసీఆర్ ఆస్తులు ఎంత పెరిగాయంటే.. అధికారంలోకి రాకముందుతో పోలిస్తే 2018 నాటికి ఖాసీం రజ్వీ కొడుకు ఆస్తులు 400 రెట్లు పెరిగాయి. ఆయన భార్య ఆస్తులు 18వందల శాతం పెరిగాయి. ఆశ్యర్యమైన విషయమేంటంటే.. తెలంగాణ రైతుల సగటు ఆదాయం 1 లక్షా 12 వేల 836 రూపాయలు.. కేసీఆర్ వ్యవసాయం ఆదాయం కోటి రూపాయలు.. కేటీఆర్ 59 లక్షల 85 వేలు. రైతుల కంటే 5 వేల శాతం అధికం. ఆయన కోడలు ఆదాయం 2 వేల శాతం అధికం. నా తెలంగాణలో రైతులు నష్టపోతున్నారని అన్నారు. నిధులు దారి మళ్లించిన కేసీఆర్.. కొత్త రాష్ట్రానికి కేంద్రం పుష్కలంగా నిధులిచ్చింది. తొమ్మిదేళ్లలో రూ.5 లక్షల కోట్లకుపైగా నిధులు ఖర్చు చేసింది. రూ.9 లక్షల 60 వేల కోట్లకుగా అప్పులిచ్చింది. సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు ప్రజలకు అవసరమైన సౌకర్యాలను కల్పిస్తున్న ఘనత మోదీదే. టాయిలెట్లకు నిధులిస్తే దోచుకున్నారు. రూ.4 వేల కోట్ల అంచనాలతో రూపొందించిన భగీరథను 40 వేల కోట్లకు పెంచి దోచుకున్నారు. ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇస్తున్న ఘనత మోదీదే. ఉచితంగా రేషన్ అందిస్తుంటే వాటిని అమ్ముకుంటున్న దొంగలు బీఆర్ఎస్ నేతలు. జాతీయ ఉపాధి హామీ పైసలను కూడా దారి మళ్లించారు. మణిపూర్ సరే.. తెలంగాణ సీఎం చేస్తున్నదేమిటి? మణిపూర్ ఘటనపై అమిత్ షా జీ చెప్పారు. దాంట్లోకి నేను వెళ్లను. తెలంగాణలో ఎంత పెద్ద దుర్ఘటన జరిగినా తెలంగాణ సీఎం ఎందుకు వెళ్లలేదు? రైతులు చనిపోయినా వెళ్లరు. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా వెళ్లరు.. మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడుతున్నారు. తెలంగాణాలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలు, భూ కబ్జాల సంగతేంది? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు.. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయి. గల్లీలో కుస్తీ పడుతున్నట్లు యాక్షన్ చేస్తూ ఢిల్లీలో దోస్తీ చేస్తూ మోదీపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాయి. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్ఎస్కు ఓటేసినట్లే. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కవల పిల్లలు. తెలంగాణలో కాంగ్రెస్ పని ఖతమైంది. కాంగ్రెస్ గల్లీలో లేదు.. ఢిల్లీలో లేదు. తెలంగాణలో జరిగిన ఉప ఎన్నికలు, జీహెచ్ఎంసీ, దుబ్బాక, హుజురాబాద్, మునుగోడు ఎన్నికలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ స్థానిక ఎన్నికల్లో జీరో. ఈ ఫలితాలే నిదర్శనం. తెలంగాణలో అభివృద్ధి డబుల్ ఇంజిన్ సర్కార్ తోనే సాధ్యం అని స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: బుద్వేల్ భూముల వేలం.. తొలి సెషన్లో రికార్డులు బ్రేక్ చేసిన ప్లాట్స్ -
‘మణిపూర్ ఘటనలు సిగ్గుచేటని అంగీకరిస్తున్నాం’
Live Updates: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. అవిశ్వాసంపై ఇవాళ రెండోరోజు కూడా వాడీవేడీ చర్చ సాగింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటన అనంతరం.. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. అవిశ్వాస తీర్మానంపై అమిత్ షా ప్రసంగం మణిపూర్ అంశంపై అవిశ్వాస తీర్మానంపై లోక్‌సభలో చర్చ సందర్భగా.. కేంద్రం తరపున హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అవిశ్వాసం ఒక రాజ్యాంగ ప్రక్రియ.. మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. పైగా అవిశ్వాసంతో కూటముల బలమెంతో తెలుస్తుంది కూడా. ప్రజలకు అంతా తెలుసు. వాళ్లు అంతా చూస్తున్నారు. ప్రజలకు మాపై పూర్తి విశ్వాసం ఉంది. ► ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపుల వైరల్ వీడియో గురించీ ప్రస్తావించారు అమిత్ షా. ‘‘ఆ వీడియోను పోలీసులకు ఇచ్చి ఉండాల్సింది. పార్లమెంట్ సమావేశాలకు ముందే వీడియో రిలీజ్ అయ్యింది’’ అని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ మణిపూర్‌ను రాజకీయం చేశారు. నేను స్వయంగా మూడు రోజులపాటు మణిపూర్ వెళ్లాను. అల్లర్ల ప్రాంతాల్ని సందర్శించిన మొదటి వ్యక్తిని నేనేనే. మా సహాయ మంత్రి కూడా 23 రోజులపాటు పర్యటించారు. మెయితీ, కుకీ వర్గాలతో చర్చిస్తున్నాం. త్వరలోనే మణిపూర్ పరిస్థితులను అదుపులోకి తెస్తాం. ► మణిపూర్‌పై మేమేమీ మౌనవ్రతం చేయడం లేదు. మణిపూర్ అల్లర్లలో ఇప్పటివరకు 152 మంది చనిపోయారు. వీరిలో మే నెలలోనే 107 మంది చనిపోయారు. మణిపూర్ సీఎంను మార్చాల్సిన అవసరం లేదు. మణిపూర్ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఇప్పుడు అగ్నికి ఆజ్యం పోయకండి. ► మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు బాధాకరం. మణిపూర్‌లో ఘటనలు సిగ్గు చేటని మేమూ అంగీకరిస్తున్నాం. కానీ, నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారు. మణిపూర్ అంశంపై కేంద్రం చర్చకు సిద్ధంగా ఉంది. ఈ విషయాన్ని మొదటి రోజు నుంచే చెబుతున్నాం. స్పీకర్‌కు లేఖ కూడా రాశాం. కానీ, కేంద్రం అంగీకరించడం లేదని ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే మణిపూర్ చర్చకు విపక్షాలే సిద్ధంగా లేవు. చర్చ నుంచి పారిపోతున్నాయి ఆ పార్టీలు. ► గత ఆరున్నరేళ్లుగా మణిపూర్‌లో బీజేపీ అధికారంలో ఉంది. ఈ ఆరున్నరేళ్లలో ఏనాడూ మణిపూర్‌లో కర్ఫ్యూ విధించలేదు. మే వరకు ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగలేదు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మణిపూర్ హింసకు కారణం అయ్యాయి. మెయితీలను గిరిజనులుగా ప్రకటించాకే.. ఉద్రిక్తతలు మొదలయ్యాయి. కుకీ గ్రామాల్లో పుకార్లు వ్యాపించడంతోనే హింస ప్రజ్వరిల్లింది. మే 3వ తేదీన మొదలైన మణిపూర్ హింస నేటికీ కొనసాగుతున్నాయి. మణిపూర్ ఇష్యూలో దాచడానికి ఏం లేదు. ఘటనలను ఎట్టి పరిస్థితుల్లో సమర్థించబోం. ► ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ము కశ్మీర్లో ద్వంద్వ ప్రమాణాలను తొలగించాం. అది తొలగిస్తే కశ్మీర్ అల్లకల్లోలం అవుతుందని విపక్షాలు భయపెట్టాయి. మేం మాత్రం.. సర్జికల్ స్ట్రయిక్స్‌తో ఉగ్రవాదాన్ని రూపుమాపే యత్నం చేశాం. పాకిస్తాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని స్పష్టం చేశాం. ► కాంగ్రెస్‌ది కరప్షన్ క్యారెక్టర్. బీజేపీ విలువల కోసం సిద్ధాంతాల కోసం పోరాడే పార్టీ. ► వచ్చే ఐదేళ్లలలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్‌తిరుగులేని శక్తిగా మారుతుంది. ► మేకిన్ ఇండియా కాన్సెప్ట్‌ను రాహుల్, అఖిలేష్ తప్పుబట్టారు. ► ఒక ఎంపీ 13సార్లు రీలాంచ్ అయ్యాడు. ఆ ఎంపీ 13సార్లూ ఫెయిల్ అయ్యాడు అంటూ రాహుల్ గాంధీని ఉద్దేశించి పరోక్షంగా షా సెటైర్లు వేశారు. ► మీరు చాలా చెప్పారు. కానీ, ఏదీ చెయ్యలేదు. మేం చేసి చూపించాం అంటూ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ► యూపీఏ రూ.70 వేల కోట్ల రుణమాఫీ తాయిళాలు ఇచ్చింది. మేం తాయిళాలను పంచడం లేదు. రుణమాఫీలపై మాకు నమ్మకం లేదు. ఎవరూ లోన్ తీసుకోకూడదన్నదే మా ఉద్దేశం. మేం మాత్రం సాగుకు ఇబ్బంది పడకుండా రైతులకు సాయం మాత్రం అందిస్తున్నాం. రుణమాఫీ కాదు.. రుణభారం లేకుండా చేశాం. జన్‌ధన్ యోజన తెచ్చినప్పుడు ఎగతాళి చేశారు. డీబీటీ ద్వారా జన్ ధన్ యోజనలో నగదు జమ అవుతోంది. ► ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు సినిమా ఇంకా ఉందంటూ విపక్షాలకు అమిత్ షా చురకలంటించారు. ► నాడు పీవీ సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నెగ్గారు. కానీ, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలు జైలుకు వెళ్లారు. గతంలో డబ్బులిచ్చి అవిశ్వాసం గెలిచారనే ఆరోపణ కాంగ్రెస్‌పై ఉంది. కానీ, మేం అలా కాదు. కాంగ్రెస్‌లా జిమ్మిక్కు చేయలేదు. వాజ్‌పేయి సర్కార్‌పై అవిశ్వాసం పెట్టినప్పుడు నిజాయితీగా వ్యవహరించాం. ఫలితంగానే ఒక్క ఓటుతో ప్రభుత్వం పడిపోయింది. ► మోదీ తీసుకున్న నిర్ణయాలు చారిత్రాత్మకమైనవి. ఈ ప్రభుత్వం మైనార్టీలో లేదు. సంపూర్ణ మెజార్టీతో ఉంది. ప్రజలకు మోదీ సర్కార్‌పై సంపూర్ణ విశ్వాసం ఉంది. ► ఆగష్టు 9వ తేదీన నాడు గాంధీ క్విట్ఇండియా పిలుపు ఇచ్చారు. ఇండియా కూటమికి కౌంటర్‌గా మోదీ కూడా ఇప్పుడు క్విట్ ఇండియా పిలుపు ఇస్తున్నారు. అమిత్ షా పిలుపునకు బీజేపీ ఎంపీల స్పందనతో క్విట్ ఇండియా నినాదాలతో మారమోగిన లోక్‌సభ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రసంగం ► రోజులో 17 గంటలు పని చేసే వ్యక్తి ప్రధాని నరేంద్ర మోదీ ప్రజల దృష్టి మళ్లించేందుకే అవిశ్వాసం ► ఈ అవిశ్వాస తీర్మానానికి ప్రజల్లో మద్దతు లేదు. కేవలం గందరగోళం సృష్టించేందుకు.. ప్రజల దృష్టిని మళ్లించేందుకు తీసుకొచ్చారు. ప్రజలు బీజేపీ ప్రభుత్వం పట్ల అమితమైన విశ్వాసంతో ఉన్నారు. ► విభజించు పాలించు అనే విధానాన్ని బీజేపీ పాటిస్తోంది. ఆదివాసీలు, గిరిజనుల పట్ల ప్రధానికి చులకన భావం ఉంది. ప్రధాని మోదీపై ప్రజలకు విశ్వాసం పోయింది. మణిపూర్‌లో జరిగిన దాడులపై ప్రధాని మోదీ జాతికి క్షమాపణ చెప్పాల్సిందే. :::అవిశ్వాసంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి ► ఈ దేశంలో భాగమైనందుకు మేము గర్విస్తున్నాము. అయితే ఈ దేశానికి హిందువులకే కాదు.. భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికీ బాధ్యత ఉంది. ప్రధానమంత్రి ఒక రంగుకు మాత్రమే ప్రాతినిధ్యం వహించడు.. ఆయన భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. గత 10 సంవత్సరాలలో మీరు (కేంద్రం) ఎంత మంది కశ్మీరీ పండిట్లను తిరిగి తీసుకువచ్చారు?. మేము భారతదేశంలో భాగం కాదని.. మేం పాకిస్తానీలమని, దేశద్రోహులమని మాత్రం చెప్పకండి. మనం ఈ దేశంలో భాగం.. అంటూ నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా ఆవేశపూరితంగా ప్రసంగించారు. #WATCH | National Conference MP Dr Farooq Abdullah during #NoConfidenceMotion debate in Lok Sabha "We stand proud to be part of this nation. But this nation has a responsibility not only to Hindus but to everybody who lives in India. PM doesn't represent only one colour, he… pic.twitter.com/kn4WRjhNT5 — ANI (@ANI) August 9, 2023 ► మా ఉద్దేశ్యం ఏంటంటే.. మణిపూర్‌పై సభలో సవివరమైన చర్చ జరిగినప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తాయని. కానీ, ప్రధాని సభకు రావడానికి సిద్ధంగా లేరు, ప్రభుత్వం మా మాట వినడానికి సిద్ధంగా లేదు. నిరసనగా, మేము సభ నుంచి బయటకు వెళ్లిపోవడమే సరైంది’’ ::కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మణిపూర్ ఇష్యూపై రాజ్యసభలో రచ్చ ► మణిపూర్ అంశంపై రాజ్యసభలో రచ్చ జరిగింది. మణిపూర్‌పై రాజకీయం కాదు.. చర్చ జరగాలని కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. మణిపూర్‌పై ఒక్కరోజు చర్చ పెడితే సరిపోతుంది. కానీ పదిరోజులుగా సాగదీస్తున్నారు మండిపడ్డారాయన. ఈ దశలో చర్చకు సిద్దమని కేంద్రం ప్రకటించింది. మణిపూర్ అంశాన్ని లిస్ట్ చేసేందుకు రెడీ అని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ప్రకటించారు. అయితే.. విపక్షాలకు చర్చ జరగడం ఇష్టం లేదని బీజేపీ ఎంపీలు అనడంతో.. సభ్యుల మధ్య వాగ్వాదం జరగ్గా.. కాంగ్రెస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. Congress MPs stage walkout in Rajya Sabha over Manipur issue "Our intention was that when a detailed discussion happens on Manipur in the House then some details will come out. PM is not ready to come to the House. The Government is not ready to listen to us. As a mark of… pic.twitter.com/sRGZ1sQu3z — ANI (@ANI) August 9, 2023 లోక్‌సభ నుంచి వెళ్లిపోయిన రాహుల్ ►లోక్‌సభలో అవిశ్వాసంపై వాడీవేడీ చర్చ ►రాహుల్ ప్రసంగాన్ని అడుగడుగునా అడ్డుకున్న అధికార పక్షం ►ఒక దశంలో రాహుల్ ప్రసంగానికి అడ్డుపడి అభ్యంతరం వ్యక్తం చేసిన స్పీకర్ ►ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయిన రాహుల్ ►రాజస్థాన్‌కు బయలు దేరిన రాహుల్ ►బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో ఆదివాసీల ర్యాలీలో పాల్గొననున్న కాంగ్రెస్ ఎంపీ మణిపూర్ రెండుగా చీల్చలేదు ►భరత మాతను చంపేశారని సభలో ఇప్పటి వరకు ఎవరూ అనలేదు. ►మణిపూర్‌ను ఎవరూ ముక్కలు చేయలేరు. ►మణిపూర్ భారత్‌లో అంతర్భాగం ►కశ్మీర్లో పండిట్లపై జరుగుతున్న దారుణాలు మీకు కనిపించడం లేదా? ►ఆర్టికల్ 370 మళ్లీ తీసుకురావాలని ప్రతిపక్షం కోరుకుంటోంది. ►మణిపూర్‌లో శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ►ఇప్పటికే మణిపూర్ అల్లర్లపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాం రాహుల్ వ్యాఖ్యలకు స్మృతి ఇరానీ కౌంటర్ ►రాహుల్ భారతీయుడు కాదు. ►ఆయన వ్యాఖ్యలను జాతి క్షమించదు. ►భారతమాత హత్య గురించి మాట్లాడతారా? ►విపక్ష కూటమి ఇండియా కాదు ►అది అవినీతి,తుష్టీకరణ కూటమి ►న్యాయం గురించి కాంగ్రెస్ మాట్లాడుతుందా? ►గిరిజ టిక్కు, సరళ భట్‌కు ఎప్పుడు న్యాయం చేస్తారు? మోదీని రావణుడితో పోల్చిన రాహుల్ ► ప్రధాని మోదీ అమిత్ షా, అదానీ మాటలే వింటారు. ► ప్రధానిని రావణుడితో పోల్చిన రాహుల్ ►రావణుడు ఇద్దరి మాటలే(మేఘనాథుడు, కుంభకర్ణుడు) వింటాడు. ►మోదీ కూడా ఇద్దరి మాటలే వింటాడు. లోక్‌సభలో గందరగోళం ►హిందుస్థాన్‌ను మణిపూర్‌లో హత్యచేశారన్న రాహుల్ ► రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం ►రాహుల్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ ►అధికార , విపక్ష సభ్యుల మధ్య పోటాపోటీ వాదనలు ►ఇరు పక్షాల వాదనలతో దద్దరిల్లిన లోక్ సభ ►స్పీకర్ జోక్యం చేసుకున్నా ఆగని మాటల యుద్దం జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది ► జోడో యాత్రలో ప్రజల సమస్యలను దగ్గరుండి చూశాను. ►లక్షల మందితో తనతో కలిసి రావడంతో నాకు ధైర్యమొచ్చింది. ►నా యాత్ర ఇంకా ముగియలేదు.. లద్ధాఖ్ వరకు వెళ్తాను ►పాదయాత్రలో ఎన్నో నేర్చుకున్నాను. ►యాత్రకు ముందు నాకు అహంకారం ఉండేది. జోడో యాత్ర నా అహంకారాన్ని అణచివేసింది. బీజేపీ సభ్యులపై రాహుల్ గాంధీ సెటైర్లు ►గతంలో అదానీ గురించి మాట్లాడినప్పుడు ఓ పెద్ద నేతకు ఇబ్బంది అనిపించిందేమో: రాహుల్ గాంధీ ►అదానీ గురించి ఈరోజు మాట్లాడను. భయపడాల్సిన పనిలేదు. ►నాదీ రాజకీయ ప్రసంగం కాదు. ►బీజేపీ సభ్యులు నా సమయాన్ని వృధా చేస్తున్నారు. లోక్‌భలో అవిశ్వాస తీర్మానంపై రెండో రోజు చర్చ ప్రారంభం.. ►చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ►ఎంపీ పదవిని పునరుద్దరించినందుకు ధన్యవాదాలు. ►మరోసారి అదనీ పేరు ప్రస్తావించిన రాహుల్ ►రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం ►మణిపూర్ గురించి మాట్లాడుతా.. ►బీజేపీ నేతలు రిలాక్స్ అవ్వొచ్చు. ►ఒకటి రెండు తూటాలు పేలుతాయి.. కానీ భయం వద్దు. ►కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు యాత్ర చెపట్టా ►యాత్ర నా అహంకారాన్ని అణిచివేసింది. #WATCH | Congress MP Rahul Gandhi says, "Speaker Sir, first of all, I would like to thank you for reinstating me as an MP of the Lok Sabha. When I spoke the last time, perhaps I caused you trouble because I focussed on Adani - maybe your senior leader was pained...That pain might… pic.twitter.com/lBsGTKR9ia — ANI (@ANI) August 9, 2023 రాజ్యసభ వాయిదా ►ప్రతిపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. ►ప్రతిపక్షాల నినాదాల మధ్య లోక్‌సభ సమావేశాలు ప్రారంభమయ్యాయి. విపక్ష నేతలు మణిపూర్ మణిపూర్ అంటూ నిరసనలు చేపట్టడంతో లోక్‌సభ మొదలైన కాసేపటికే మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. ► స్వాతంత్య్ర ఉద్యమానికి బీజేపీ పూర్తిగా వ్యతిరేకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ విమర్శించారు. బీజేపీకి క్విట్ ఇండియాకు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. వారి నేతలు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనలేదని తెలిపారు. క్విట్ ఇండియా దినోత్సవం గురించి బీజేపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఈ చారిత్రాత్మకమైన రోజున.. ప్రధాని మోదీ సమక్షంలో పార్లమెంట్లో చర్చ పెట్టాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రధాని పార్లమెంట్‌కు రావడం లేదని, మణిపూర్ సమస్య గురించి మాట్లాడడం లేదని మండిపడ్డారు. ►కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేడు(బుధవారం) రాజస్థాన్‌లో పర్యటిస్తున్నారని ఆ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగూర్ పేర్కొన్నారు. బన్స్వారా జిల్లాలోని మాన్‌గర్ ధామ్‌లో జరిగే ర్యాలీలో పాల్గొంటున్నట్లు చెప్పారు. లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై తప్పక చర్చలో పాల్గొంటారని ఆయన తెలిపారు. అయితే అది ఈ రోజా? రేపా అనేది క్లారిటీ లేదన్నారు. ►ఇండియా కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ ఎంపీ ప్రమోద్ తివారి అన్నారు. వాళ్లు బ్రిటీష్ వారికి లేఖలు రాస్తూ, వారికి ఇన్ఫార్మర్లుగా వ్యవహరించిన ఉద్యమ సమయంలో.. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న చరిత్ర కాంగ్రెస్‌కు ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలేవి లేవని అన్నారు. ఆకలి సూచీ, విద్య, ఆరోగ్యం, విదేశీ నిల్వల సంగత ఏంటీ అని ప్రశ్నిచారు. బీజేపీ కేవలం వ్యక్తిగత దాడికి దిగజారిందని విమర్శించారు. #WATCH | Congress MP Pramod Tiwari says, "They are scared of the I.N.D.I.A. alliance...We (Congress) have a history of participating in the freedom struggle, while they were writing letters to the British & acting as their informers...They have no achievements of theirs- what is… pic.twitter.com/ccLejPsHL9 — ANI (@ANI) August 9, 2023 న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై బుధవారం లోక్‌సభలో రెండో చర్చ జరగనుంది. మణిపూర్ హింసతోపాటు పలు అంశాలపై తీర్మానంపై చర్చ సందర్భంగా విపక్ష సభ్యులు కేంద్రాన్ని నిలదీయనున్నారు. తీర్మానంపై కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా తదితరులు బుధవారం మాట్లాడనున్నారు. రాహుల్ మాట్లాడకపోవడానికి కారణం అదేనా అయితే మంగళవారం అవిశ్వాస తీర్మానంపై రాహుల్ గాంధీ ఎందుకు చర్చను ప్రారంభించలేదనేది పెద్ద ప్రశ్నగా మారింది. కాంగ్రెస్ తరపున మాట్లాడేవారి జాబితాలో తొలుత రాహుల్ గాంధీ పేరును చేర్చారు. కానీ, చివరి క్షణంలో తొలగించారు. అయితే గాంధీ చర్చను ప్రారంభించకపోవడానికి ప్రధానంగా పలు కారణాలు కనిపిస్తున్నాయి. చర్చను ప్రారంభించిన గొగొయ్ ఈశాన్య ప్రాంతానికి చెందిన ఎంపీ కావడం మొదటిది. మణిపూర్ హింసపై ఆయన మాట్లాడితే ప్రాధాన్యత కలిగి ఉంటుందని కాంగ్రెస్ భావించినట్లు తెలుస్తోంది. అదే విధంగా ఎంపీగా సభలోకి తిరిగి వచ్చిన వెంటనే రాహుల్ అవిశ్వాసంపై మాట్లాడితే వారసత్వ రాజకీయాలను ఉద్ధేశిస్తూ అధికార బీజేపీ మాటల యుద్దానికి దిగుతుందని యోచించినట్లు సమాచారం. ఇక మరో కారణం ప్రధాని మోదీ నిన్న సభలో లేకపోవడం. మోదీ రేపు(గురువారం) లోక్‌సభలో మాట్లాడే అవకాశం ఉంది. కాగా తొలిరోజు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. వాడీవేడిగా చర్చ జరిగింది. మణిపూర్ హింసపై ప్రధాని నరేంద్ర మోదీ మౌన వీడి, ప్రకటన చేయడానికే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టామని ప్రతిపక్షాలు స్పష్టం చేశాయి. మరోవైపు ప్రజల సంక్షేమం కోసం కష్టపడి పనిచేస్తున్న పేదల బిడ్డ నరేంద్ర మోదీపై విశ్వాసం లేదంటూ సభలో ఓటు వేస్తారా? అని అధికార బీజేపీ సభ్యులు ప్రతిపక్షాలపై మండిపడ్డారు. మణిపూర్ హింసాకాండకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే సహా పలువురు విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు. దేశంలో సమాఖ్య వ్యవస్థను ప్రధాని మోదీ ధ్వంసం చేస్తున్నారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతారాయ్ ఆరోపించారు. శివసేన ఎంపీ, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుమారుడు శ్రీకాంత్ షిండే సభలో కాసేపు హనుమాన్ చాలీసా పఠించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చను అసోం కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. మణిపూర్‌పై పార్లమెంట్లో ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. అనంతరం బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో కాసేపు లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే, : డీఎంకే ఎంపీ టీఆర్ బాలు, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్, బీజేడీఎంపీ పినాకి మిశ్రా, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్, సీపీఎం నేత ఎ.ఎం.అరీఫ్, బీజేపీ సభ్యుడు నారాయణ్ రాణే, కాంగ్రెస్ ఎంపీ మనీశ్ తివారీ తదితరులు మాట్లాడారు. -
‘మోదీ ఏమైనా స్పెషలా.. మన్మోహన్, వాజ్‌పేయి చేశారుగా..’
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మంగళవారం లోక్‌సభలో చర్చ జరుగుతోంది. అవిశ్వాసంపై లోక్‌సభలో చర్చను కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగొయ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా మణిపూర్ అంశంపై గొగొయ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధాని మోదీ.. ఇప్పటి వరకు మణిపూర్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాగా, లోక్‌సభలో గౌగవ్ గగొయ్ మాట్లాడుతూ.. తప్పనిసరి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని తీసుకురావాల్సి వచ్చింది. అయితే, ఇది సంఖ్యా బలానికి చెందిన విషయం కాదు. మణిపూర్‌కు న్యాయం చేయాలన్నదే తమ ఉద్దేశమన్నారు. ప్రభుత్వంపై అవిశ్వాసాన్ని వ్యక్తం చేయడం కోసమే తాము తీర్మానాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. మణిపూర్ కోసం ఈ తీర్మానం తెచ్చామని, మణిపూర్‌కు కచ్చితంగా న్యాయం జరగాలన్నారు. మణిపూర్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాకా డ్రగ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అసోం రైఫిల్స్ మణిపూర్ పోలీసులు కొట్టుకున్నారు. ఇదేనా నవభారతం అని ప్రశ్నించారు. ప్రభుత్వంపై నమ్మకం లేకే సుప్రీంకోర్టు కమిటీ వేసింది చురకలు అంటించారు. వాజ్‌పేయి, మన్మోహన్ వెళ్లారుగా.. ఇదే సమయంలో పార్లమెంట్లో మాట్లాడరాదు అని ప్రధాని మోదీ మౌనవ్రతం చేపట్టారు. ఆయన మౌనాన్ని బ్రేక్ చేసేందుకే ఈ తీర్మానాన్ని తీసుకువచ్చామన్నారు. ఆయన్ను మూడు ప్రశ్నలు అడగాలని ఉందని, ఇప్పటి వరకు ఆయన ఎందుకు మణిపూర్‌ను విజిట్ చేయలేదని, 80 రోజుల తర్వాత ఆ అంశంపై కేవలం 30 సెకన్లు మాట్లాడారని, ఎందుకు ఆయన ఇంత సమయాన్ని తీసుకున్నారని, మణిపూర్ సీఎంను ఎందుకు ఇంత వరకు తొలగించలేదని గౌరవ్ గగోయ్ ప్రశ్నించారు. అలాగే, కోక్రాఝర్‌లో హింస జరిగినప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అసోంకు వెళ్లారు. ఇక, 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో అప్పటి ప్రధాని వాజ్పేయూ కూడా అక్కడికి వెళ్లారని గుర్తు చేశారు. మణిపూర్‌లో హింస జరుగుతుంటే ఇండియా కూటమిని తిట్టడంపైనే ప్రధాని మోదీ ఫోకస్ పెట్టారని విమర్శించారు. మేము అధికారాన్ని కాదు, శాంతిని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు. When i talked about PM, CM & Home Minister no one had problems but, when i talked about ADANI, why BJP MPs stood in anger? -Gaurav Gogoi schooling BJP🔥 pic.twitter.com/yUvkzSPCal — Amock (@Politics_2022_) August 8, 2023 సంక్షోభ సమయాల్లో మౌనమే మోదీ సమాధానమా? పలు సందర్భాల్లో మోదీ మౌనంపై గగొయ్ విరుచుకుపడ్డారు. చైనా విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. బాలీలో జిన్‌పనింగ్, మోదీ ఏం మాట్లాడుకున్నారో కేంద్రం దాచేసింది. చైనా గురించి మీరు మాట్లాడుతున్నారా అని ప్రశ్నించారు. ఢిల్లీ అల్లర్ల సమయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రెజర్ల ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే. రైతు ఆందోళన విషయంలోనూ మోదీ సమాధానం మౌనమే అని అన్నారు. తన తప్పును దేశ ప్రజల ముందు మోదీ ఒప్పుకోవడం లేదని అన్నారు. ఎంతమంది మాట్లాడినా ప్రధాని స్పందిస్తే వేరుగా ఉంటుందన్నారు. మణిపూర్‌లో కేంద్ర ఇంటెలిజెన్స్ విఫలమైంది. అక్కడ ఇప్పటి వరకు 150 మంది చనిపోయారు. 5 వేల వరకు ఇళ్లు ధ్వంసమయ్యాయి. 60 వేల మంది శిబిరాల్లో ఉన్నారు. 60 ఎఫ్ఐఆర్లు నమోదయినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మణిపూర్ సీఎంను ఎందుకు తొలగించలేదు? అని ప్రశ్నించారు. మణిపూర్ అంతా బాగుందని మీరు అంటున్నారు. ఇప్పటికీ ఇంటర్నెట్ లేదు, పిల్లలు స్కూళ్లకు దూరమయ్యారు. ఇద్దరు మహిళలను రోడ్డుపై నగ్నంగా ఊరేగించారు, అయినా మోదీ మౌనం వీడలేదు. డబుల్ ఇంజన్ సర్కార్ విఫలమైందని మాట్లాడాల్సి వస్తుందని మోదీ స్పందించడం లేదా? అని ప్రశ్నించారు. అక్కడి ప్రజలు న్యాయం కోరుతున్నారని స్పష్టం చేశారు. #WATCH | Congress MP Gaurav Gogoi says, "PM took a 'maun vrat' to not speak in the Parliament. So, we had to bring the No Confidence Motion to break his silence. We have three questions for him - 1) Why did he not visit Manipur to date? 2) Why did it take almost 80 days to… pic.twitter.com/rfAVe77sNY — ANI (@ANI) August 8, 2023 ఇది కూడా చదవండి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చ.. మోదీపై కాంగ్రెస్ నిప్పులు -
Parliament Monsoon Session: అదే ప్రతిష్ఠంభన!
న్యూఢిల్లీ: పార్లమెంటులో మణిపూర్ ప్రతిష్టంభన వీడకపోగా గురువారం పీటముడి మరింతగా బిగుసుకుంది. ఈ విషయమై విపక్షాలను అనునయించేందుకు గురువారం అధికార బీజేపీ ఒక మెట్టు దిగినా లాభం లేకపోయింది. లోక్‌సభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర ప్రతిపక్ష నేతలతో కేంద్రం తరఫున రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, మరో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అరగంటకు పైగా చర్చలు జరిపారు. కానీ తమ డిమాండ్లపై పట్టు వీడేందుకు విపక్షాలు ససేమిరా అన్నాయి. మణిపూర్ హింసాకాండపై ప్రధాని ఉభయ సభల్లోనూ ప్రకటన చేయడంతో పాటు పార్లమెంటులో లోతైన చర్చ జరగాల్సిందేనని పట్టుబట్టాయి. దాంతో చర్చలు ఎటూ తేలకుండానే ముగిశాయి. 267 నిబంధన కింద ఈ అంశంపై చర్చకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసినా, ప్రధాని ప్రకటన డిమాండ్‌కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించరాదని పట్టుదలగా ఉంది. అంతగా అయితే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటన చేస్తారని చెబుతోంది. చివరికి కేంద్రం మరింత దిగొచ్చి మణిపూర్‌పై 176 నిబంధన కింద ఆగస్టు 11న రాజ్యసభలో స్వల్ప వ్యవధి చర్చకు సిద్ధమని ప్రతిపాదించింది. విపక్ష ఇండియా కూటమి మాత్రం 267, 176 నిబంధనల్లో దేని కిందా చర్చకు ఒప్పుకునేది లేదంటోంది. ‘‘నిబంధనతో మాకు నిమిత్తం లేదు. ఇరు పక్షాలకూ ఆమోదయోగ్యమైన నిబంధన కింద పూర్తిస్థాయి చర్చ మాత్రం జరిగి తీరాల్సిందే’’ అని డిమాండ్ చేస్తోంది. మణిపూర్‌పై ఏదోలా పార్లమెంటులో చర్చ జరిగి ప్రతిష్టంభనకు తెరపడవచ్చంటున్నారు. తాము ప్రతిపాదించిన మధ్యేమార్గానికి మోదీ సర్కారు అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్టు కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ చెప్పారు. -
సభకు నమస్కారం.. రెండువారాలు రచ్చ రచ్చే!
ఢిల్లీ: వరుసగా ఏడోసారి పార్లమెంట్ సమావేశాలు నిర్ణీత షెడ్యూల్ కంటే ముందుగానే ముగిశాయి.పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయని.. ఉభయసభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు సోమవారమే ప్రకటించారు స్పీకర్, రాజ్యసభ చైర్మన్లు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. డ్యూ డేట్ కంటే ఐదురోజులు ముందుగానే ఇలా ఉభయ సభలు వాయిదా పడడం ఇదే ఏడోసారి. మిగిలిన ఐదురోజుల్లో రెండు రోజులు సెలవులే ఉన్నాయి. ఒకటి ఆగష్టు 9వ తేదీ మొహర్రం, మరొకటి ఆగస్టు 11 రక్షా బంధన్. ఈ రెండు రోజులు ఎలాగూ సభలు జరగవు. పండుగల కోసం వాళ్ల వాళ్ల నియోజకవర్గాలు, స్వస్థలాలకు ఎంపీలు వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్రమంలో.. ప్రభుత్వానికి చాలామంది ఎంపీలు విజ్ఞప్తి చేయగా.. ఐదు రోజులు ముందుగానే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం.. జులై 18 నుంచి ఆగష్టు 12వ తేదీవరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగాలి. ధరల పెరుగుదల అంశం చర్చగా.. విపక్షాల నిరసనలతో తొలి రెండువారాల పాటు సభాకార్యక్రమాలు అసలు జరగనేలేదు.ఒక వారం పాటుగా మాత్రమే ఉభయ సభాకార్యకలాపాలు సాగాయి. అయితే.. సమయం సంగతి ఏమోగానీ.. చట్టపరమైన ఎజెండా మాత్రం సంతృప్తికరంగా ఉన్నట్లు పార్లమెంట్ వర్గాలు చెప్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో.. లోక్‌సభ పదహారు రోజులు మాత్రమే సమావేశం అయ్యిందని, ఏడు చట్టాలకు ఆమోదం తెలిపినట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. ఇక రాజ్యసభ వాయిదాకు ముందు.. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ చేయనున్న వెంకయ్యనాయుడు సైతం రాజ్యసభ కార్యకలాపాల గురించి వివరించారు. సభ 38 గంటలు పని చేసిందని.. 47 గంటలకంటే ఎక్కువ వాయిదాలతోనే వృథా అయ్యిందని ప్రకటించారాయన. ఇక పార్లమెంట్ సమావేశాల పేరిట చేసిన పద్దుల వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది. మేజర్ హైలెట్స్ ► ధరల పెంపుపై విపక్షాల నిరసనలు.. నిత్యం నిరసన గళాలతో నినాదాలు ► సభ్యుల సస్పెన్షన్ నేపథ్యంలో.. పార్లమెంట్ ఆవరణలో ఉంటూ నిరసన ► రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. వాటి ఫలితాలు ► రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధురి అభ్యంతరకర వ్యాఖ్యల నేపథ్యంలో ఉభయ సభల్లో బీజేపీ ఆందోళనతో హోరెత్తించింది. దీంతో ఆయన క్షమాపణలు చెప్పారు. ► పలు కీలక బిల్లులపై ఆమోదం ► టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా తన ఖరీదైన హ్యాండ్ బ్యాగ్‌ను.. ధరల చర్చ జరుగుతున్న టైంలో టేబుల్ కింద దాయడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్. ► జపాన్ మాజీ ప్రధాని షింజో అబే దారుణ హత్య పట్ల పార్లమెంట్ తీవ్ర సంఘీభావం వ్యక్తం చేసింది. -
ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు
సాక్షి, ఢిల్లీ: ఆర్బిట్రేషన్ సెంటర్ బిల్లుకు వైఎస్సార్సీపీ మద్దతు ప్రకటించింది. సోమవారం ఈ బిల్లుపై చర్చ సందర్భంగా.. ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ఆర్బిట్రేషన్ కేవలం కార్పొరేట్ల కంపెనీలకే పరిమితం కాకూడదన్న ఆయన.. కింది స్థాయి లో కూడా ఆర్బిట్రేషన్ వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. కింద స్థాయిలో ఎన్నో కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్న సంగతిని వైఎస్సార్సీపీ ఎంపీ గుర్తు చేశారు. -
Rashtrapatni Row: పార్లమెంట్లో బీజేపీ ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంట్ దద్దరిల్లింది. లోక్‌సభలో బీజేపీ ఆందోళన చేపట్టింది. రాష్ట్రపతిని కాంగ్రెస్ పార్టీ అవమానించిందని, క్షమాపణలు చెప్పాల్సిందేనని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గురువారం లోక్‌సభలో గళం వినిపించారు. రాష్ట్రపతి పదవిలో ఓ తోలుబొమ్మను కూర్చోబెట్టారని, ఆమె రాష్ట్రపతి కాదని, ‘రాష్ట్రపత్ని’ అంటూ కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ అభ్యంతరకర వ్యాఖ్యలే చేశారు. ఈ కామెంట్లపై అధికార బీజేపీ భగ్గుమంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కాంగ్రెస్ అవమానించింది. కాంగ్రెస్ పార్టీ క్షమాపణలు చెప్పాల్సిందే అని స్మృతి ఇరానీ మండిపడ్డారు. తన వ్యాఖ్యలు తప్పే అని అధిర్ రంజన్ ఒప్పుకున్నా.. వ్యవహారం చల్లారలేదు. ‘తన వ్యాఖ్యలు తప్పేనని, ఉరి తీస్తే ఉరి తీయండంటూ’ ఆవేశంగా మాట్లాడారాయన. ఇప్పటికే అధిర్ రంజన్ క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వివరణ ఇచ్చినా.. అధికార పక్షం శాంతించలేదు. దేశ అత్యున్నత పదవిలో ఉన్న ఓ వ్యక్తిని అవమానించేందుకు సోనియా గాంధీ తన సభ్యులకు అనుమతి ఇచ్చినట్లు అయ్యిందని స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఈ క్రమంలో ఒకానొక టైంలో బీజేపీ సభ్యులంతా లేచి.. స్మృతి ఇరానీకి మద్ధతుగా గళం వినిపించారు. ఈ గందరగోళం నడుమే లోక్‌సభ 12 గం. దాకా వాయిదా పడింది. పార్లమెంట్ ఆవరణలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన తోటి ఎంపీలతో కలిసి ఫ్లకార్డులు చేతబట్టి నిరసన వ్యక్తం చేశారు. అధిర్ రంజన్‌వి సెక్సీయెస్ట్ కామెంట్లు అని, ఇది గిరిజన బిడ్డకు జరిగిన అవమానం అంటూ ఆమె పేర్కొన్నారు. It was a deliberate sexist insult. Sonia Gandhi should apologise to the President of India and the country: Finance Minister & BJP leader Nirmala Sitharaman on Cong MP Adhir Chowdhury's 'Rashtrapatni' remark pic.twitter.com/4CSGFzH2TE — ANI (@ANI) July 28, 2022 #WATCH | "He has already apologised," says Congress interim president Sonia Gandhi on party's Adhir Chowdhury's 'Rashtrapatni' remark against President Droupadi Murmu pic.twitter.com/YHeBkIPe9a — ANI (@ANI) July 28, 2022 In another low, Leader of #Congress in LS, Adhir Ranjan Chowdhury, condescendingly refers to President Droupadi Murmu as “राष्ट्रपत्नी”. Shameful indeed pic.twitter.com/k0yAnsLNRu — Ramanathan B (@ramanathan_b) July 28, 2022 -
లోక్‌సభ నుంచి టీఆర్ఎస్ ఎంపీల వాకౌట్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నాల్గవరోజూ కూడా నిరసనల గళమే వినిపిస్తోంది. గురువారం ఉదయం పదకొండు గంటలకు ఉభయ సభలు ప్రారంభమై.. కాసేపటికి వాయిదా పడ్డాయి. ఉదయం 11.30 గంకు లోక్‌సభ, మధ్యాహ్నాం 12 గం. రాజ్యసభ వాయిదా పడ్డాయి. అనంతరం ఉభయ సభలు మొదలుకాగా.. విపక్షాల నిరసనల నడుమే సభా కార్యకలాపాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో లోక్‌సభలో జీఎస్టీ పన్ను భారంపై చర్చకు టీఆర్ఎస్ఎంపీల పట్టుబట్టారు. స్పీకర్ చర్చకు నిరాకరించడంతో.. ఎంపీలు వాకౌట్ చేశారు. టీఆర్ఎస్ తో పాటు డీఎంకే, ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ వాకౌట్ చేశారు. -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు గురువారానికి వాయిదా
Monsoon Session 2022 Day 3 Updates: ►జీఎస్టీ, ధరల పెరుగుదలపై ప్రతిపక్ష నాయకులు వరుసగా మూడో రోజు తమ నిరసనలు కొనసాగించడంతో లోక్‌సభ సైతం గురువారానికి వాయిదా పడింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిరసన పర్వం కొనసాగుతోంది. ధరల పెరుగుదలపై విపక్షాల నిరంతర నిరసనల మధ్య లోక్‌సభ వాయిదా పడింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు సభ తిరిగి సమావేశం కానుంది. ► ధరల పెరుగుదలపై ఉభయసభల్లో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళనతో రాజ్యసభ సమావేశాలనుగురువారానికి వాయిదా పడింది. జులై 18 నుండి ఐదు శాతం జిఎస్టి పన్ను అమలులోకి వచ్చిన క్రమంలో పాలు, పెరుగు ప్యాకెట్లను పట్టుకుని కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. దీంతో వరుసగా మూడో రోజు కూడా సభా కార్యకలాపాలకు అంతరాయం కలగడంతో రేపు ఉదయం 11 గంటలకు రాజ్యసభ వాయిదా పడింది. టీఆర్ఎస్ ఎంపీల నిరసన ► ధరల పెంపు, ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎంపీలు గళమెత్తారు. పాలు, పాల అనుబంధ ఉత్పత్తులపై జీఎస్టీ పన్నుపోటును నిరసిస్తూ.. నిరసన చేపట్టారు. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. పాలు, పాల ఉత్పత్తులు, ఇతర ఆహార పదార్థాలను ప్రదర్శిస్తూ నిరసనలో పాల్గొన్నారు. గ్యాస్ ధరల పెంపుపై ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనలో టీఆర్ఎస్ ఎంపీలతోపాటు ఇతర విపక్ష ఎంపీలు కూడా పాల్గొన్నారు. ► రాజ్యసభలో ధరల పెంపుపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం చర్చించేందుకు సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ధరల పెరుగుదలపై పార్లమెంట్లో చర్చకు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోందని, ఎలాంటి చర్చకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు ►ద్రవ్యోల్బణం, కొన్ని నిత్యావసర వస్తువులపై జీఎస్టీ పెంపుపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనల్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సహా పలువురు ఎంపీలు పాల్గొన్నారు. #WATCH Opposition MPs protest in Parliament against the Central government over inflation and recent GST hike on some essential items pic.twitter.com/rgpYrHjlZo — ANI (@ANI) July 20, 2022 రాజ్యసభలోనూ అదే తీరు ► విపక్షాల నినాదాలతో.. రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటలకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్య నాయుడు. లోక్‌సభ వాయిదా ► ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణాన్ని నిరసిస్తూ ఉభయసభల్లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభలో క్వశ్చన్ అవర్‌కు అంతరాయం కలిగించారు కాంగ్రెస్ సహా మిగిలిన విపక్ష ఎంపీలు. దిగజారుతున్న రూపాయి విలువ, ధరల పెంపుపై చర్చించాలని డిమాండ్ చేశారు. ప్రశ్నోత్తరాలకు సహకరించాలని స్పీకర్ ఓంబిర్లా పదే పదే విజ్ఞప్తిచేసినా పట్టించుకోలేదు. దీంతో కాంగ్రెస్ సభ్యుల తీరుపై అసహనం వ్యక్తంచేశారు స్పీకర్. క్వశ్చన్ అవర్‌ను అడ్డుకోవడం సరికాదన్నారు. పార్లమెంట్ చర్చల కోసమని.. నిరసనల కోసం కాదని స్పష్టంచేశారు. లోక్‌సభను మధ్యాహ్నం 2గంటలవరకూ వాయిదా వేశారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభం. ► వర్షాకాల సమావేశాల మూడో రోజు దరిమిలా.. ధరల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణం సమస్యలపై పార్లమెంటులోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు కాంగ్రెస్ ఎంపీలు మల్లికార్జున్ ఖర్గే మరియు అధిర్ రంజన్ చౌదరి నిరసనల్లో పాల్గొన్నారు. Delhi | Congress MPs Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury join the Joint Opposition protest in front of the Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation, on the third day of the Monsoon session pic.twitter.com/z2OcRAILEv — ANI (@ANI) July 20, 2022 ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు విపక్షాల ఆందోళన ఆటంకంగా మారింది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుకొచ్చాయి. ఈ తరుణంలో.. ► ఆహార పదార్థాలపై పెంచిన జీఎస్టీ, ద్రవ్యోల్బణంపై చర్చించేందుకు బుధవారం ఉదయం రాజ్యసభలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వాయిదా నోటీసు ఇచ్చారు. ► పార్లమెంట్ ఉభయ సభల్లో అంతరాయాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఆయనెప్పుడూ పార్లమెంట్లో గళం వినిపించింది లేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించింది లేదు. ఎప్పుడూ పార్లమెంట్ కార్యకలాపాలను అగౌరవపరుస్తూ వస్తున్నాడు. పార్లమెంట్లో 40% కంటే తక్కువ హాజరు ఉన్న వ్యక్తి ఆయనే. అలాంటి రాజకీయంగా ఉత్పాదకత లేని వ్యక్తి.. ఇప్పుడు పార్లమెంటులో చర్చ జరగకుండా చూసుకోవడానికి తనను తాను అంకితం చేసుకుంటున్నాడు’’ అంటూ ఎద్దేవా చేశారు స్మృతి ఇరానీ. Rahul Gandhi never posed a question,always disrespected Parliamentary proceedings...He's the one to have less than 40% attendance in Parliament...Today, the person who's been politically unproductive is dedicating himself to ensure there's no debate in Parliament:Smriti Irani,BJP pic.twitter.com/FpA5pnL1zs — ANI (@ANI) July 20, 2022 ► ఇక పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా.. మూడో రోజూ ఆందోళనకు విపక్షాలు సిద్ధం అయ్యాయి. సమావేశాల ప్రారంభం కంటే ముందుగానే నిత్యావసరాలపై జీఎస్టీరేట్ల పెంపు, పెరిగిన ధరలు తదితర అంశాలపై నిరసన తెలపాలని నిర్ణయించుకున్నాయి. ► మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన మధ్యాహ్నాం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. సభలో వ్యవహరించాల్సిన తీరు.. విపక్షాల విమర్శలకు తగిన సమాధానాలు సిద్ధం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. మంత్రులకు సూచించనున్నట్లు తెలుస్తోంది. -
Monsoon session of Parliament: పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రెండో రోజు LIVE అప్డేట్స్ 2.00PM ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల, ధరల పెంపుపై ప్రతిపక్ష ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తూ సభా వెల్‌లోకి దూసుకెళ్లారు. దీంతో విపక్షాల ఆందోళనల మధ్య లోక్‌సభ, రాజ్యసభ్య రెండూ బుధవారం ఉదయం 11 గంటలకు వాయిదా పడ్డాయి. 11.48AM ► టీఆర్ఎస్ ఎంపీల ధర్నా పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేపట్టారు. ద్రవ్యోల్బణం, పెరిగిన ధరలకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ నిరసనలో పాల్గొన్నారు. Delhi | TRS MPs hold protest in front of Mahatma Gandhi statue in Parliament on the issues of price rise and inflation pic.twitter.com/agdkAOXVaN — ANI (@ANI) July 19, 2022 11.29AM ► ఆప్ ఎంపీల నిరసన ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సింగపూర్ పర్యటనకు అనుమతి మంజూరు ఆలస్యాన్ని.. కేంద్రానికి వ్యతిరేకంగా గాంధీ విగ్రహం ఎదుట ఆప్ ఎంపీలు నిరసన చేపట్టారు. Delhi | Aam Aadmi Party MPs protest against the Centre in front of Gandhi statue in Parliament against the delay in nod for Singapore visit to Arvind Kejriwal pic.twitter.com/gSpKUYSidX — ANI (@ANI) July 19, 2022 11.17AM ►లోక్‌సభ సైతం వాయిదా విపక్షాల ఆందోళనలతో పార్లమెంట్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ క్రమంలో లోక్‌సభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు స్పీకర్ ఓం బిర్లా. అంతకు ముందు రాజ్యసభ సైతం మధ్యాహ్నానికి వాయిదా పడింది. 11.05AM ► రాజ్యసభ మధ్యాహ్నానికి వాయిదా విపక్షాల ఆందోళనతో ప్రారంభమైన కొన్ని నిమిషాలకే రాజ్యసభను మధ్యాహ్నాం 2 గంటల వరకు వాయిదా వేశారు చైర్మన్ వెంకయ్యనాయుడు. #SansadUpdate#RajyaSabha adjourned till 2 PM #MonsoonSession2022 pic.twitter.com/55AhC4yv6b — SansadTV (@sansad_tv) July 19, 2022 11.03AM ► లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే ధరల పెరుగుదలపై విపక్షాలు నిరసన చేపట్టాయి. గందరగోళం నడుమే లోక్ సభ కార్యాకలాపాలు నడుస్తున్నాయి. Opposition MPs raise slogans against price hike and inflation in Lok Sabha as house proceedings begin on the second day of Parliament pic.twitter.com/c3HTjMRsGj — ANI (@ANI) July 19, 2022 ► సోమవారం మొదటి రోజు సమావేశాల్లో భాగంగా ధరల పెరుగుదల నుంచి అగ్నిపథ్ వరకూ కీలక అంశాలపై చర్చించాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ఫలితంగా తొలి రోజు ఉభయసభల్లో ఎటువంటి కార్యకలాపాలు సాగలేదు. ► ఇక రెండో రోజు సమావేశాల ప్రారంభానికి ముందే.. గాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. పెరుగుతున్న ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ భారాలు,అగ్నిపథ్ సహా ప్రజా సమస్యల పై పార్లమెంట్ లో చర్చ జరపాలని డిమాండ్ బలంగా వినిపిస్తోంది. Delhi | Congress leader Rahul Gandhi joins Opposition protest over the issues of inflation and price rise, at Parliament, on the second day of the Monsoon session pic.twitter.com/KqMp3rrLSM — ANI (@ANI) July 19, 2022 ► ప్రధాని మోదీ.. మంత్రులతో సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపైనా చర్చలు జరిపారు. ► పార్లమెంట్ వర్షాకాల సమావేశాల రెండో రోజు సెషన్స్ ప్రారంభమయ్యాయి. తొలి రోజు గందరగోళం నడుమే ఉభయ సభలు వాయిదా పడటంతో రెండో రోజు ఎలా సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. -
విపక్షాల ఆందోళన.. రాజ్యసభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మొదటి రోజు అవాంతరం ఎదురైంది. విపక్షాల ఆందోళనతో సోమవారం రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తూ సభ వెల్ దాకా దూసుకెళ్లారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. -
సభా విలువలు కాపాడాలి
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలో సభ్యత, క్రమశిక్షణ పాటించాలని కోరారు. సభా సంప్రదాయాలను, విలువలను కాపాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు. అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఎల్జేపీ, ఆప్నాదళ్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు. -
అన్పార్లమెంటరీకి నిర్వచనం ఇదే.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ఎంపీల నిషేధిత పదాల జాబితాపై విస్తృత స్థాయి చర్చ నడుస్తోంది ఇప్పుడు. లోక్‌సభ సెక్రటేరియెట్ విడుదల చేసిన బుక్‌లెట్‌లో.. జుమ్లాజీవి, బాల్ బుద్ధి, కోవిడ్ స్ప్రెడర్, స్నూప్‌గేట్, అరాచకవాది, శకుని, నియంత, నియంతృతత్వం, తానాషా, తానాషాహి, వినాశ్ పురుష్, ఖలీస్థానీ.. ఇలాంటి పదాలెన్నింటినో లిస్ట్‌లో చేర్చారు. జులై 18 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల కోసం ఈ లిస్ట్ రిలీజ్ చేసింది. అయితే ఈ పదాలపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యంగ్యం ప్రదర్శించారు. అన్‌పార్లమెంటరీగా నిర్వచనం.. అంటూ న్యూ డిక్షనరీ ఫర్ న్యూ ఇండియా ట్విటర్లో ఓ పోస్ట్ చేశారు. ప్రధాని ప్రభుత్వాన్ని ఎలా నడిపిస్తున్నారో.. సరిగ్గా ఆ అంశంపై చర్చలకు, ఉపన్యాయాలకు సరిపోయే పదాలనే ఇప్పుడు అన్‌పార్లమెంటరీ పదాలుగా పేర్కొంటున్నారు. వాటిని నిషేధించారు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. అంతేకాదు ఆ పదాలన్నింటితో కలిపి ఒక సెంటెన్స్‌ను సైతం ఉదాహరణగా పేర్కొన్నారు. New Dictionary for New India. pic.twitter.com/SDiGWD4DfY — Rahul Gandhi (@RahulGandhi) July 14, 2022 పై లిస్ట్పదాలతో పాటు.. పార్లమెంట్ చర్చల్లో తరచూ వినిపించే సిగ్గుచేటు, మోసం, అవినీతి, వెన్నుపోటు, డ్రామా, హిప్పోక్రసీ లాంటి పదాలను సైతం అన్‌పార్లమెంటరీ లిస్ట్‌లో చేర్చారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఒబ్రెయిన్ మాత్రం ఆ పదాలను ఉపయోగించే తీరతానని, సస్పెండ్‌చేస్తే చేసుకోండంటూ సవాల్ విసిరారు. Session begins in a few days GAG ORDER ISSUED ON MPs. Now, we will not be allowed to use these basic words while delivering a speech in #Parliament : Ashamed. Abused. Betrayed. Corrupt. Hypocrisy. Incompetent I will use all these words. Suspend me. Fighting for democracy https://t.co/ucBD0MIG16 — Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) July 14, 2022 All words used by the Opposition to describe the reality of Modi Sarkar now to be considered ‘unparliamentary’. What next Vishguru? pic.twitter.com/lx7MqIVutw — Jairam Ramesh (@Jairam_Ramesh) July 14, 2022 -
పార్లమెంటులో హింసాత్మక ధోరణి.. 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, 2021 చివరి రోజున రాజ్యసభలో హింసకు పాల్పడిన 12 మంది విపక్ష ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు విధించారు. వీరంతా పార్లమెంటు శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సభకు హాజరుకాకుడదని తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. భద్రతా సిబ్బందిపై ఉద్దేశపూర్వకంగా అసాధారణ దుష్ప్రవర్తన, ధిక్కార, హింసాత్మక, వికృత ప్రవర్తన కారణంగా వీరిని సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు. సస్పెండ్ చేసిన వారిలో ఆరుగురు కాంగ్రెస్ నేతలతో పాటు శివసేన నేత ప్రియాంక చతుర్వేది, అనిత్ దేశాయ్, టీఎంసీ డోలా సేన్, శాంతా ఛెత్రి, సీపీఎం నేత ఎలమరం కరీం, మరో సీపీఐ నేత ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాల పార్లమెంట్ సమావేశాల చివరి రోజైన ఆగస్టు 11న లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్‌పై చర్చించాల్సిందిగా అధికార, విపక్షాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో విపక్ష నేతలు మహిళా సిబ్బందిపై చేయి చేసుకున్నారనే ఆరోపణలు వెలుగు చూశాయి. (చదవండి: క్రిప్టోకరెన్సీపై కేంద్రం కీలక నిర్ణయం..!) జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి సూచించాలని డిమాండ్ చేసినప్పటికీ దాన్ని ఆమోదించడంతో సభ దద్దరిల్లింది. ఇక సీసీటీవీ ఫుటేజీలో ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో భద్రతా సిబ్బంది మీదకు దూసుకెళ్లడం కనిపించింది. నల్లజెండాలు చేతపట్టుకున్న ఎంపీలు టేబుల్స్ పైకిఎక్కి ఫైళ్లు, పత్రాలు చెల్లాచెదురు చేయడం సీసీటీవీలో రికార్డయ్యింది. (చదవండి: మహిళా ఎంపీలతో సెల్ఫీ.. ‘ఇదేం బుద్ధి’ అంటూ శశి థరూర్‌పై విమర్శలు) మహిళా మార్షల్స్‌పై విపక్షాలు అసభ్యంగా ప్రవర్తించాయని ప్రభుత్వం ఆరోపించగా, ప్రతిపక్షం ఒక ఉమ్మడి ప్రకటనలో "మహిళా ఎంపీలతో సహా ప్రతిపక్ష నాయకులు, సభ్యులపై చేయి చేసుకోవడానికిగాను ప్రభుత్వం బయటి వ్యక్తులను తీసుకువచ్చింది" అని ఆరోపించింది. ఈ క్రమంలో నాటి హింసాత్మక ఘటనకు సంబంధించి 12 మంది ఎంపీలపై తాజాగా సస్పెన్షన్ వేటు వేశారు. చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్ -
చర్చలు కోసమే చట్ట సభలు: వెంకయ్య
బెంగళూరు: పార్లమెంట్, శాసన సభలు ఉన్నది చర్చలు, నిర్ణయాల కోసమే తప్ప గొడవలు, అంతరాయాల కోసం కాదని ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. ఆయన బుధవారం బెంగళూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడారు.ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో చోటుచేసుకున్న అనుచిత పరిణామాలను వెంకయ్య ప్రస్తావించారు. ప్రజల చేత ఎన్నికైన నేతలు వారి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని హితవు పలికారు. ‘‘పార్లమెంట్లో ఇటీవల ఏం జరిగిందో మీరు చూశారు. సార్.. మీరు ఈ దేశానికి ఉపరాష్ట్రపతి. రాజ్యసభలో మీరెందుకు కన్నీళ్లు పెట్టుకున్నారు అని కొందరు యువతీ యువకులు అడిగారు. సభలో కొందరు ఎంపీల ప్రవర్తన వల్లే కన్నీళ్లు పెట్టుకోవాల్సి వచ్చిందని సమాధానమిచ్చినట్లు చెప్పారు. -
ప్రజాస్వామ్యంలో పార్లమెంటే దేవాలయం
న్యూఢిల్లీ: ‘‘దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ ఒక దేవాలయం. ప్రజల సంక్షేమం కోసం చర్చలు, సంవాదాలు జరిగే, నిర్ణయాలు తీసుకొనే అత్యున్నత వేదిక’’ అని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉద్ఘాటించారు. నిరంతర అంతరాయాలతో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో తీవ్ర ప్రతిష్టంభన నెలకొనడం, పాలక– ప్రతిపక్షాలు పట్టుదలకు పోవడంతో షెడ్యూల్‌కంటే రెండురోజుల ముందే సమావేశాలు అర్ధంతరంగా ముగిసిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రథమపౌరుడు ప్రజాస్వామ్యంలో పార్లమెంటుకున్న విశిష్టతపై మాట్లాడటం గమనార్హం. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం కోవింద్ టీవీలో దేశ ప్రజలకు సందేశమిచ్చారు. ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారతీయులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలను రాష్ట్రపతి ప్రస్తావించారు. కోవిడ్–19 రెండో వేవ్ సృష్టించిన విలయం నుంచి దేశం ఇంకా బయటపడలేదని చెప్పారు. మహమ్మారి విషయంలో ఇప్పుడు మనం మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని, అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. కరోనాపై జరుగుతున్న పోరాటంలో మధ్యలోనే అస్త్ర సన్యాసం చేయొద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ఇంకా ఏం మాట్లాడారంటే.. ► మన స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను ఎప్పటికీ మర్చిపోలేం. ► కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలపై రైతు సంఘాల్లో నెలకొన్న అపోహలను తొలగించాలి. రైతుల అనుమానాలను నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది. ► వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలు మన అన్నదాతలకు లబ్ధి చేకూరుస్తాయి. వారు తమ పంట ఉత్పత్తులకు మరింత మేలైన ధర పొందడానికి ఈ సంస్కరణలు ఉపకరిస్తాయి. ► కరోనా ఉధృతి కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా వైద్య రంగంలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించింది. ► వైద్యులు, ఆరోగ్య సిబ్బంది కృషి వల్ల కరోనా సెకండ్ వేవ్‌పై పైచేయి సాధించగలిగాం. ► కరోనా ప్రతికూల కాలంలో కూడా వ్యవసాయ రంగంలో పురోగతి సాధించాం. మహమ్మారి కారణంగా ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వ్యాపారులు, వలస కార్మికులు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. ► కరోనా వ్యాప్తి వల్ల నష్టపోయిన రంగాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది. తిరిగి కోలుకునేందుకు తగిన సాయం అందిస్తోంది. ► కోవిడ్–19 నియంత్రణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఇప్పటిదాకా 50 కోట్లకు పైగా టీకా డోసులను ప్రజలకు పంపిణీ చేసింది. కరోనా నుంచి కాపాడుకోవడానికి వ్యాక్సిన్లే రక్షణ కవచం. కరోనా తీవ్రత కొంత తగ్గినప్పటికీ వైరస్ ఇంకా పూర్తిగా పోలేదన్న సంగతిని గుర్తుపెట్టుకోవాలి. ► భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన తొలి రోజుల్లో దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని చాలామంది అనుమానించారు. ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ► పురాతన కాలంలోనే భారత గడ్డపై ప్రజాస్వామ్యానికి పునాదులు పడ్డాయి. ఆధునిక యుగంలోనూ ఎలాంటి భేదాలు లేకుండా ప్రజలకు ఓటు హక్కు కల్పించే విషయంలో ఎన్నో పశ్చి మ దేశాల కంటే భారత్ ముందంజలో ఉంది. ► సులభతర జీవనం, వాణిజ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ► మన పార్లమెంట్ త్వరలో కొత్త భవనంలోకి మారబోతోంది. ఇది భారతీయులందరికీ గర్వకారణం. ► మీ కుమార్తెలకు జీవితంలో పైకి ఎదగడానికి అవకాశాలు కల్పించండి అని తల్లిదండ్రులను కోరుతున్నా. ► ఉన్నత విద్యా సంస్థల నుంచి సైనిక దళాల దాకా.. ప్రయోగశాల నుంచి క్రీడా మైదానాల దాకా ప్రతిచోటా ఆడబిడ్డలు వారిదైన ముద్ర వేస్తున్నారు. ► ఇటీవల జరిగిన టోక్యో ఒలింపిక్ క్రీడల్లో మన ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వారికి అభినందనలు. 121 ఏళ్లుగా ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న మన దేశం ఈసారి గతంలో కంటే అధికంగా పతకాలు సాధించడం గర్వించదగ్గ విషయం. ► భారత క్రీడాకారిణులు ఎన్నో అవరోధాలను అధిగమించి ఒలింపిక్స్‌లో అత్యుత్తమ ప్రతిభ చూపారు. ► మన ఆడబిడ్డల ప్రతిభా పాటవాలు, వారు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే భవిష్యత్తుకు సంబంధించిన అభివృద్ధి చెందిన భారత్‌ను ఇప్పుడే దర్శించగలుగుతున్నా. అగ్రస్థానానికి ఎదిగిన ఆడపిల్లల కుటుంబాల నుంచి నేర్చుకోవాలని, వారికి అవకాశాలు కల్పించేందుకు తోడ్పడాలని తల్లిదండ్రులకు నా సూచన. ► జమ్మూకశ్మీర్‌లో కొత్త పొద్దు పొడిచింది. యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. కలలను నిజం చేసుకొనేందుకు ప్రజాస్వామిక మార్గాల్లో కృషి చేయాలి. ► ఆధునిక పారిశ్రామిక విప్లవం మానవళికి ఎన్నో సవాళ్లు విసురుతోంది. వాతావరణ మార్పులు పెనుశాపంగా మారుతున్నాయి. ► మంచు కరిగిపోయి సముద్రాలు ఉప్పొంగుతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. పారిస్ వాతావణ ఒప్పందానికి భారత్ కట్టుబడి ఉంది. అంతేకాదు వాతావరణ పరిరక్షణకు భారత్ చేయాల్సిన దానికంటే ఎక్కువ కృషి చేస్తోంది. ఈ విషయంలో మిగతా ప్రపంచ పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ► ను ఇటీవల బారాముల్లాలో డాగర్ వార్ మెమోరియల్‌ను సందర్శించా. అక్కడ ‘నేను చేసే ప్రతి పని దేశం కోసమే’అని రాసి ఉంది. ఇదే మన నినాదం కావాలి. దేశ ప్రగతి కోసం పూర్తి అంకితభావంతో పని చేయాలి. భారత్‌ను అభివృద్ధి దిశగా ముందుకు నడిపించడానికి మనమంతా ఒక్క తాటిపైకి రావాలి. -
ప్రభుత్వ ప్రతిపక్షాలు రెండు కళ్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రతిపక్షాలు తనకు రెండు కళ్లని రాజ్యసభ ౖచైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభివర్ణించారు. ఇరుపక్షాలు సమష్టి బాధ్యతతో వ్యవహరిస్తేనే పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరుగుతాయన్నారు. రాజ్యసభలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో వెంకయ్య అభిప్రాయాలతో ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో అధికార, విపక్ష పార్టీల పరస్పర మొండి వైఖరితో ఉభయ సభలూ వాయిదాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. పెగసస్, వివాదాస్పద వ్యవసాయ చట్టాలుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టడంతో పాటు నిరసన ప్రదర్శనలతో ఉభయ సభల్ని స్తంభింపజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు కళ్లతోనే సరైన దృష్టి కుదురుతుందని, ఇరుపక్షాలను తాను సమానంగా గౌరవిస్తాననని వెంకయ్య చెప్పినట్లు ప్రకటన తెలిపింది. చట్టసభలు చర్చలకోసం ఉద్దేశించినవని గుర్తు చేశారు. బయట చేసుకోవాల్సిన రాజకీయ పోరాటాలను సభలో చేయాలనుకోవడం సరికాదని ఆయన హితవు చెప్పారు. రభస ఘటనలపై పరిశీలన ఇటీవలి సమావేశాల్లో కొందరు అనుచితంగా ప్రవర్తించి సభా గౌరవాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన విషయంలో చర్యలు తీసుకోవడంపై లోతుగా పరిశీలిస్తున్నట్టు వెంకయ్యనాయుడు చెప్పారని ప్రకటన తెలిపింది. బుధవారం సమావేశాల్లో విపక్ష సభ్యులు, పార్లమెంట్ సెక్యూరిటీ మధ్య తీవ్ర ఘర్షణ నెలకొన్న సంగతి తెలిసిందే! గురువారం సాయంత్రం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాతో జరిగిన సమావేశంలో కూడా పార్లమెంట్లో ఘటనలపైనే చర్చించారని తెలిసింది. -
ప్రతిపక్షాలు క్షమాపణ చెప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రతిపక్షాలు మొసలి కన్నీరు మాని పార్లమెంటులో వారి ప్రవర్తనపై దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని కేంద్ర మంత్రులు పేర్కొన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని, ప్రభుత్వం ఎంపీలపై దాడి చేసిందని విపక్షాలు నిరసన ర్యాలీలో విమర్శలు గుప్పించగా దీనికి కౌంటర్‌గా 8 మంది కేంద్ర మంత్రులు గురువారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి విపక్షాలు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మార్షల్స్‌పై విపక్ష సభ్యులు దురుసుగా ప్రవర్తించారని ప్రత్యారోపణ చేశారు. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, ప్రహ్లాద్ జోషి, అనురాగ్ ఠాకూర్, నఖ్వీ, భూపేంద్ర యాదవ్, అర్జున్ మేఘ్వాల్, వి.మురళీధరన్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజాహితంపై వారికి చింతలేదు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ ‘దేశ ప్రజలు తమ సమస్యలు పార్లమెంటు సమావేశాల్లో చర్చకు వస్తాయని ఆశించారు. దేశ ప్రజల హితం కానీ, రాజ్యాంగ విలువలపై గానీ వారికి చింత లేదు. విపక్షాలు మొసలి కన్నీరు కార్చడం ఆపి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి’ అని పేర్కొన్నారు. ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ ‘పార్లమెంటు సమావేశాల ముందు అఖిలపక్ష సమావేశం జరిగినప్పుడే విపక్షాలు సభను నడవనివ్వమన్న సంకేతాలు ఇచ్చాయి. సభను నడవనివ్వబోమని చెప్పేశారు. మేం చాలా సందర్భాల్లో వారితో మాట్లాడాం. కనీసం మొదటి రోజు మంత్రి మండలిలోని నూతన సభ్యుల పరిచయ కార్యక్రమాన్ని అనుమతించాలని కోరాం. అందుకు కూడా ఒప్పుకోలేదు. రెండు సభల్లో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశాల్లో వారు వారి డిమాండ్లను పెట్టారు. స్వల్పకాలిక చర్చలు జరపాలని కోరారు. ధరల పెరుగుదల, కోవిడ్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చకు చైర్మన్ అనుమతించారు. పెగసస్ వంటి అంశాలను పట్టుబట్టుతూ కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు సభాకార్యకలాపాలకు విఘాతం కలిగించారు. ముఖ్యమైన బిల్లులను కూడా చర్చకు అనుమతించలేదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఇలా ఎన్ని చేశారో రికార్డులు చూడొచ్చు.. ఆనాడు ఏపీ విభజన వంటి ముఖ్యమైన బిల్లులు కూడా గందరగోళంలో ఆమోదింపజేసుకున్నారు’ అని దుయ్యబట్టారు. ‘నాలుగో తేదీన ఆరుగురు సభ్యులను సస్పెండ్ చేయగా.. గ్లాసులు పగలగొట్టుకుని లోపలికి వచ్చేందుకు ప్రయత్నించారు. అధికారులకు గాయాలయ్యేలా చేశారు. రాజ్యసభలో టేబుల్ ఎక్కి ఆందోళన చేశారు. అది బిల్లుపై చర్చ కూడా కాదు. చర్చకు సిద్ధంగా ఉంటే సభను సోమవారం వరకూ నిర్వహిస్తామని చెప్పాం. కానీ వారు సహకరించకపోగా.. ఇన్సూరెన్స్ బిల్లు, ఓబీసీ బిల్లు ఆమోదింపజేసుకుంటే మంగళవారం నాటి పరిణామాల కంటే తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇప్పుడేమో మహిళా ఎంపీలపై పురుష మార్షల్స్ దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తున్నారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని రాహుల్ గాంధీ ప్రకటన చేశారు. దేశ ప్రజలు చూస్తున్నారు. వారికి ఏమాత్రం ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్నా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. మేం రాజ్యసభ చైర్మన్‌ను కూడా కోరాం. విపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరాం.. ఏపార్టీ అధికారంలో ఉన్నా ఇది పునరావృతం కాకూడదు..’ అని పేర్కొన్నారు. మార్షల్స్‌పై దాడులకు దిగారు: గోయల్ రాజ్యసభలో సభా నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారని మండిపడ్డారు. సభ ఆస్తులను ధ్వంసం చేశారని, మార్షల్స్‌పై దురుసుగా ప్రవర్తించారని, భౌతిక దాడులకు దిగారని, వారి దుష్ప్రవర్తనపై కఠిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. 12 మంది మహిళా మార్షల్స్, 18 మంది పురుష మార్షల్స్.. మొత్తం 30 మంది మార్షల్స్ మాత్రమే ఉన్నారని వివరించారు. విపక్షాలది కేవలం డ్రామా అని, ఓబీసీ బిల్లు విషయంలో కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చర్చను సాగనిచ్చారని వ్యాఖ్యానించారు. అంతకుముందు ఈ మంత్రులంతా రాజ్యసభ చైర్మన్ వెంకయ్యని కలిసి సభలో పార్లమెంటరీ సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దురదృష్టకరమైన రీతిలో ప్రవర్తించిన సభ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. బయటివారెవరూ లేరు.. ఉభయ పక్షాలు తనతో భేటీ అయిన అనంతరం రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు అధికారులతో సమావేశం నిర్వహించి మంగళవారం నాటి పరిణామాలను మరోసారి ఆరాతీశారు. బయటివారెవరూ సభలోకి రాలేదని, తొలుత 14 మంది మార్షల్స్ ఉన్నారని, క్రమంగా సభలో పరిస్థితిని బట్టి మార్షల్స్ సంఖ్య 42కు చేరిందని వారు చైర్మన్‌కు నివేదించారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందే! పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చోటు చేసుకున్న సంఘటనలు, సభాకార్యకలాపాలకు కొందరు ఎంపీలు విఘాతం కలిగించిన తీరుపై ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తను సహించకూడదని, తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డారు. పార్లమెంటులో చోటుచేసుకున్న దురదృష్టకరమైన సంఘటనలను సమీక్షించేందుకు గురువారం వీరిద్దరూ సమావేశమయ్యారని ఉపరాష్ట్రపతి కార్యాలయం తెలిపింది. సభాపతులు పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా, నిబంధనలను ఉల్లంఘిస్తూ అత్యున్నత చట్టసభ హుం దాతనాన్ని దిగజార్చేలా వ్యవహరించారని వీరిరువూ అభిప్రాయపడ్డట్లు అధికారులు తెలిపారు. గతంలో జరిగిన సంఘటనల ను, తీసుకున్న చర్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, భవిష్యత్తు కార్యాచరణకు ఇవి ఉపయుక్తంగా ఉంటాయని సభాపతులు అభిప్రాయపడ్డారు. -
ప్రజాస్వామ్యం ఖూనీ
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలు ముగిసినా ఢిల్లీలో రాజకీయ వేడి తగ్గలేదు. ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కిందంటూ, రాజ్యసభలో భౌతికంగా దాడులకు దిగిందంటూ నిరసన వ్యక్తం చేస్తూ గురువారం విపక్షాలు ర్యాలీగా వచ్చి విజయ్‌చౌక్‌లో ధర్నా నిర్వహించాయి. ముందుగా గురువారం ఉదయం పార్లమెంట్లో రాజ్యసభలో ప్రతిపక్షనేత ఖర్గే కార్యాలయంలో ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే తదితర పార్టీల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం పార్లమెంట్ నుంచి విజయ్‌చౌక్‌కు నిరసన ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష ఎంపీలంతా ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ప్రజల గొంతుకను నొక్కేశారని నినదిస్తూ విజయ్ చౌక్‌కు చేరుకున్నారు. అక్కడ కొద్దిసేపు ధర్నా నిర్వహించారు. మార్షల్స్‌లా బయటి వ్యక్తులొచ్చారు: శివసేన శివసేన పక్షనేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ ‘ప్రతిపక్షాలకు తమ అభిప్రాయాలను పార్లమెంటులో వెల్లడించేందుకు అవకాశం రాలేదు. మహిళా ప్రజాప్రతినిధుల పట్ల జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికి చేటు. పాకిస్తాన్ సరిహద్దు వద్ద నిలబడినట్లు అనిపించింది..’ అని విమర్శిచారు. బయటి వ్యక్తులు మార్షల్స్ యూనిఫారమ్ ధరించి మహిళలను కొట్టడానికి వచ్చారని ఆరోపించారు. అధికార పార్టీయే కారణం: డీఎంకే డీఎంకే రాజ్యసభ పక్ష నేత శివ మాట్లాడుతూ ‘ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించేందుకు తెచ్చిన ఇన్సూరెన్స్ బిల్లును లక్షలాది మంది ఉద్యోగులు వ్యతిరేకిస్తున్నారు. దీనిని సెలక్ట్ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఈ బిల్లును బలవంతంగా ఆమోదించుకుంది. దీనిపై ప్రతిపక్ష సభ్యులు ఆందోళన చేశారు. ఇద్దరు మహిళా ఎంపీలు దాడికి గురయ్యారు. ఈ నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు ఐక్యంగా ఉద్యమిస్తున్నాయి. పార్లమెంట్ సజావుగా జరగకపోవడానికి అధికార పార్టీనే కారణం‘ అని విమర్శించారు. ఉపరాష్ట్రపతితో భేటీ.. విజయ్ చౌక్‌లో నిరసన అనంతరం విపక్షాలు రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడుతో సమావేశమయ్యాయి. ఆగస్టు 11న రాజ్యసభలో భారీ సంఖ్యలో మార్షల్స్ కాని వారిని మోహరించారని ఫిర్యాదు చేశారు. సమావేశాలు సజావుగా సాగేలా, విపక్షాలు ప్రజా సమస్యలపై తమ వాణి వినిపించేలా చూడాలని కోరారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును కేంద్రం తెచ్చిన తీరును నివేదించారు. ఈ సమావేశం అనంతరం 15 పార్టీల ఉమ్మడి ప్రకటనను విడుదల చేశాయి. ‘పార్లమెంటు వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పట్టాలు తప్పించింది. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను అగౌరవ పరుస్తుంది. ప్రారంభంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో సంయుక్తంగా ప్రతిపక్షాలు ముఖ్యమైన అంశాలపై చర్చించాలని ప్రతిపాదించాయి. పెగసస్ గూఢచార్యం, రైతుల ఆందోళనలు, ధరలు పెరుగుదల, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితి వంటి అంశాలపై చర్చించాలని కోరాం.. చర్చ కోసం పట్టుపట్టిన ప్రతిపక్షాల డిమాండ్లను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రస్తుత ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనంపై నమ్మకం లేదు. పెగసస్‌పై చర్చ నుంచి పారిపోతోంది. ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రతిపక్ష పార్టీలతో చర్చించాల్సింది. కానీ ప్రభుత్వం అహంకారపూరితంగా నిర్లక్ష్యంగా ఉంది. ప్రతిష్టంభనకు పూర్తిగా బాధ్యత ప్రభుత్వమే వహించాలి’ అని పేర్కొన్నాయి. ‘ప్రభుత్వ నిరంకుశ వైఖరిని, అప్రజాస్వామిక చర్యలను ప్రతిపక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై దాడికి వ్యతిరేకంగా మా పోరాటాన్ని కొనసాగించడానికి, జాతీయ ప్రాముఖ్యత అంశాలు, ప్రజా సమస్యలపై ఆందోళన చేయడానికి మేం కట్టుబడి ఉన్నాం..’ అని పేర్కొన్నాయి. -
సభ్యుల తీరుపై వెంకయ్య కంటతడి
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సభలో భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. సభలో సభ్యులు వ్యవహరించిన తీరుతో తాను నిద్రలేని రాత్రి గడిపినట్టు పేర్కొన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ముందురోజు మంగళవారం సభలో విపక్ష సభ్యులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ ప్రకటన చేశారు. పార్లమెంటును ప్రజాస్వామ్య దేవాలయంగా, సభలో సెక్రటరీ జనరల్, ఇతర అధికారులు కూర్చునే టేబుల్ ఉండే చోటును గర్భగుడిగా అభివర్ణిస్తూ, అలాంటి ప్రదేశం పవిత్రతను నాశనం చేస్తున్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. ‘నిన్న ఈ పవిత్రతను నాశనం చేశారు. కొంతమంది సభ్యులు టేబుల్ మీద కూర్చున్నారు. మరికొందరు టేబుల్ పైకి ఎక్కారు. నా ఆవేదనను తెలియజేయడానికి, ఈ చర్యను ఖండించడానికి నాకు మాటలు లేవు..’ అని పేర్కొన్నారు. మంగళవారం జరిగిన సంఘటన వల్ల తాను నిద్ర లేని రాత్రి గడిపానని చెబుతూ చైర్మన్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ‘వ్యవసాయ సమస్యలు, పరిష్కారాలు’ అంశం చర్చ జరుగుతున్నప్పుడు సభ్యులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి, ప్రత్యేకించి గత సంవత్సరం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్న వారికి సువర్ణావకాశం లభించిందని, కానీ చర్చ జరపకుండా సభ్యులు అంతరాయం సృష్టించారని ఆవేదన వ్యక్తంచేశారు. -
పార్లమెంటు నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ కంటే రెండు రోజులు ముందే ముగిసిపోయాయి. ఉభయ సభలు బుధవారం రవధికంగా వాయిదా పడ్డాయి. జనాభాలో ఇతర వెనుకబడిన కులాలను (ఓబీసీ) గుర్తించి జాబితాను తయారు చేసే అధికారాలను రాష్ట్రాలకు పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. పెగసస్ స్పైవేర్ వివాదం, వ్యవసాయ చట్టాలు, పెట్రో ధరలు పెంపు వంటి అంశాలపై విపక్ష పార్టీల సభ్యులు ఈసారి వర్షాకాల సమావేశాలను అడుగడుగునా అడ్డుకున్నారు. జూలై 19న మొదలైన ఈ సమావేశాలు ఆగస్టు 13న ముగియాల్సి ఉంది. అయితే సభా కార్యకలాపాలు జరగకుండా విపక్షాలు నిరంతరాయంగా అడ్డుకోవడంతో సభలో ప్రతిష్టంభన నెలకొంది. ప్రతిపక్ష సభ్యుల గందరగోళం మధ్య లోక్‌సభలో 19 బిల్లులు పాసయ్యాయి. విపక్షాలు కలిసి రావడంతో ఓబీసీ బిల్లుపై మాత్రమే ఉభయసభల్లో పూర్తిస్థాయి చర్చ జరిగింది. లోక్‌సభ సమావేశాలు మొత్తం కేవలం 21 గంటలు మాత్రమే జరిగాయి. సభ ఉత్పాదకత 22 శాతం మాత్రంగానే ఉంది. ఈ సమావేశాల్లో విపక్ష సభ్యులు పెగసస్‌పై చర్చకు పట్టుబట్టడం వంటి దృశ్యాలే ప్రతీరోజూ కనిపించాయి. బుధవారం సభను నిరవధికంగా వాయిదా వేసినప్పుడు ప్రధాని మోదీ సభలోనే ఉన్నారు. ఓబీసీ బిల్లుని ఆమోదించిన రాజ్యసభ ఇతర వెనుకబడిన కులాల జాబితాను సొంతంగా రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే 127వ రాజ్యాంగ సవరణ బిల్లు 2021కి రాజ్యసభ ఆమోద ముద్ర వేసింది. 187 మంది సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. ఈ బిల్లును లోక్‌సభ మంగళవారం ఆమోదించింది. కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వి ఈ చర్చలో పాల్గొంటూ ప్రభుత్వం కుల జనాభా గణన చేపట్టడానికి ఎందుకు వెనకడుగు వేస్తోందన్నారు. మార్షల్స్ మోహరింపు ఓబీసీ బిల్లుకు సభ ఆమోద ముద్ర వేసిన తర్వాత రాజ్యసభలో గందరగోళం జరిగింది. జనరల్ ఇన్సూరెన్స్ సవరణ బిల్లుని ప్రవేశపెట్టిన సమయంలో సభ్యులు మళ్లీ సభను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్రభుత్వ రంగంలోని జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రైవేటుపరం చేయడానికి వీలు కల్పించే ఈ బిల్లును విపక్షసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. కాగితాలు చింపి విసిరేశారు. మార్షల్స్‌తో ఎంపీలకు తోపులాట జరిగింది. మార్షల్స్ తమతో దురుసుగా ప్రవర్తించారని కాంగ్రెస్ మహిళా ఎంపీలు ఆరోపించారు. రెండుసార్లు వాయిదాపడ్డాక రాత్రి ఏడు తర్వాత సభ తిరిగి ప్రారంభం కాగా... టీఎంసీ, డీఎంకేలు దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం తోసిపు చ్చింది. కాగా మంగళవారం సభ్యులు టేబుల్స్ పైకి ఎక్కి రభస చేయడంతో అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేశారు. వెల్లోనికి ఎవరూ రాకుండా 50 మంది మార్షల్స్‌ని మోహరించారు. ఇన్సూరెన్స్ బిల్లుతోపాటు మరో రెండు బిల్లులు ఆమోదించాక సభ నిరవధికంగా వాయిదా పడింది. కఠిన చర్యలు తీసుకోవాలి: జోషి ప్రతిపక్ష సభ్యులే మార్షల్‌ను తోసివేశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తోసిపుచ్చారు. మార్షల్ ఎంపీలను తాకే సాహసం చేయరని, సీసీటీవీ ఫుటేజీ చూస్తే ఎవరు అబద్ధాలు చెబుతున్నారో తెలిసిపోతుందని అన్నారు. -
రాజ్యసభ నిరవధిక వాయిదా
► పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం రాజ్యసభ నిరవధిక వాయిదా పడింది. ► ఓబీసీ బిల్లుకు రాజ్యసభ బుధవారం ఆమోదం తెలిపింది. మంగళవారం లోక్‌సభలో ఓబీసీ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. 127 రాజ్యాంగ చట్ట సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించింది. ఓబీసీలను గుర్తించే అధికారం రాష్ట్రాలకే ఇస్తూ చట్ట సవరణ చేసింది. ► కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించారు. జనరల్ ఇన్సూరెన్స్ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ► ఓబీసీ రాజ్యంగ సవరణ బిల్లుపై రాజ్యసభ ఓటింగ్ చేపడుతోంది. ► రాజ్యసభలో ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుకు మద్దతు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. వైస్సార్సీపీ పార్టీ తరఫున మాట్లాడిన ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లును ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ► విపక్షాల ఆందోళనల నేపథ్యంలో లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు సమావేశాలు జరగాల్సి ఉండగా.. రెండు రోజుల ముందే లోక్‌సభ నిరవధిక వాయిదా పడింది. వర్షాకాల సమావేశాల్లో భాగంగా 17 రోజుల పాటు లోక్‌సభ సమావేశాలు కొనసాగాయి. ఇప్పటికే లోక్‌సభలో కీలక బిల్లులు ఆమోదం పొందాయి. ► విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ► రాజ్యసభ ప్రారంభమైన వెంటనే చైర్మన్ వెంకయ్య నాయుడు భావోద్వేగానికి లోనయ్యారు. సభలో గందరగోళ పరిస్థితులపై కంటతడి పెట్టిన వెంకయ్య నాయుడు.. విపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న సభలో సభ్యుల ప్రవర్తన కలచివేసిందని, విపక్ష సభ్యులు హంగామా చేసి చర్చను అడ్డుకున్నారని వాపోయారు. ►లోక్‌సభలో పోలవరంపై వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరంపై నోటీస్ ఇచ్చిన ఎంపీ బెల్లాన చంద్రశేఖర్.. పోలవరం సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదముద్ర వేయాలని నోటీస్ ఇచ్చారు. ►లోక్‌సభలో మంగళవారం ఆమోందం పొందిన ఓబీసీ రాజ్యంగ సవరణ బిల్లు నేడు(బుధవారం) రాజ్యసభ ముందుకు రానుంది. జనాభాలో ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ)లను గుర్తించి సొంతంగా జాబితా తయారు చేసుకునే హక్కును రాష్ట్రాలకు తిరిగి కట్టబెట్టే కీలక బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలిపింది. న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ బుధవారం కొలువుదీరాయి. వరుసగా 17వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలయ్యాయి. -
విపక్ష సభ్యుల ఆందోళనలతో రాజ్యసభ రేపటికి వాయిదా
► రాజ్యసభలో విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. పెగాసస్ వ్యవహారంపై విపక్ష సభ్యుల నిరసన తెలిపారు. విపక్ష సభ్యుల ఆందోళన నేపథ్యంలో రాజ్యసభ బుధవారానికి వాయిదా పడింది. ► రాజ్యసభ మధ్యాహ్నం 2 వరకు వాయిదా ►లోక్‌సభలో ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లుపై చర్చ ►ఓబీసీ బిల్లుకు మద్దతు తెలిపిన వైఎస్ఆర్సీపీ ►పార్టీ తరఫున లోక్‌సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతున్నారు. ►పార్లమెంట్ ఉభయ సభలు మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడ్డాయి. ఉభయ సభల్లో పెగాసస్‌పై చర్చకు విపక్షాల పట్టు. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా ►రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా ► పెగసస్‌పై చర్చకు విపక్షాల పట్టుపట్టడంతో రాజ్యసభను వాయిదా వేస్తున్నట్లు చైర్మన్ వెంకయ్య నాయుడు తెలిపారు. న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ మంగళవారం కొలువుదీరాయి. వరుసగా 16వ రోజు ఉదయం 11 గంటలకు సమావేశాలు మొదలవ్వగా.. నేడు లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టనుంది. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితా ఏర్పాటు చేసుకునే అధికారం కలిగిన ఓబీసీ సవరణ బిల్లు.. సమాఖ్య స్ఫూర్తికి ప్రతిబింబమమని కేంద్ర ప్రభుత్వ ం పేర్కొంది. అయితే ఓబీసీ సవరణ బిల్లుకు మద్దతివ్వాలని 15 విపక్ష పార్టీల నిర్ణయం తీసుకున్నాయి. ఓబీసీ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం తమ మద్దతు ప్రకటించింది. పార్టీ తరఫున లోక్‌సభలో ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడనున్నారు. అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టనుంది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీసులు ఇచ్చింది. లోక్‌సభలో ఎంపీ మిథున్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాజ్యసభ సభ్యులకు కాంగ్రెస్ విప్ జారీ చేసింది. రాజ్యసభకు కచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. కాగా, ఈ బిల్లు ద్వారా కేంద్రం.. రాష్ట్రాల్లో ఓబీసీ జాబితాను నిర్వహించే అధికారాన్ని రాష్ట్రాలకే కట్టబెట్టనుంది. జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు ప్రతిపాదించకుండానే తమ రాష్ట్రాల్లోని ఓబీసీ, సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలను గుర్తించి నోటిఫై చేసే అధికారం రాష్ట్రాలకు దక్కనుంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లుకు ఆమోదం దక్కాలంటే మూడవ వంతు మద్దతు అవసరం. అయితే ఆ బిల్లుకు విపక్షాలు మద్దతు ఇస్తున్న నేపథ్యంలో.. బిల్లు పాస్ కావడం అనివార్యమే అవుతుంది. -
‘ఎన్ఎస్ఓ’తో ఎలాంటి లావాదేవీల్లేవ్
న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ టెక్నాలజీ సంస్థతో తాము ఎలాంటి లావాదేవీలు జరుపలేదని భారత రక్షణ శాఖ తేల్చిచెప్పింది. ప్రస్తుతం భారత్‌ను కుదిపేస్తున్న పెగసస్ మిలటరీ–గ్రేడ్ స్పైవేర్‌ను ఇదే సంస్థ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. రాజ్యసభలో సోమవారం సీపీఎం సభ్యుడు వి.సదాశివన్ అడిగిన ప్రశ్నకు రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ స్పందిస్తూ ఒక లిఖితపూర్వక ప్రకటన జారీ చేశారు. రక్షణ శాఖ చేసిన వ్యయాలపై ప్రశ్నలు సంధిస్తూ ఎన్ఎస్ఓ గ్రూప్‌తో ఏవైనా లావాదేవీలు నిర్వహించారా? అని సదాశివన్ అడిగారు. 2018–19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు కేంద్రం రూ.4,04,364 కోట్లు కేటాయించిందని, ఇందులో రూ.4,03,459 కోట్లు ఖర్చు చేసినట్లు అజయ్ భట్ తెలిపారు. 2019–20లో రూ.4,31,010 కోట్లు కేటాయించగా, వ్యయం మాత్రం రూ.4,51,902 కోట్లకు చేరినట్లు పేర్కొన్నారు. 2020–21లో రూ.4,71,378 కోట్లు కేటాయించగా, ఖర్చు రూ.4,85,726 కోట్లకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వ మొత్తం బడ్జెట్లో రక్షణకు శాఖకు కేటాయించిన నిధులు 2018–19లో 16.56 శాతం, 2019–20లో 15.47 శాతం, 2020–21లో 15.49 శాతమని అజయ్ భట్ వివరించారు. విదేశాల నుంచి ఆయుధాలు, రక్షణ పరికరాల కొనుగోలు కోసం 2019–20లో రూ.47,961 కోట్లు, 2020–21లో రూ.53,118 కోట్లు వెచ్చించామని తెలియజేశారు. పార్లమెంట్లో ఆరని పెగసస్ మంటలు భారత ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులు, జర్నలిస్టులు, జడ్జీల ఫోన్లపై నిఘా పెట్టిందని, ఇందుకోసం ఎన్ఎస్ఓ గ్రూప్ నుంచి కొనుగోలు చేసిన పెసగస్ స్పైవేర్‌ను ఉపయోగిస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ఆందోళనలు, నినాదాలు కొనసాగిస్తున్నాయి. పెగసస్ వ్యవహారంలో పార్లమెంట్లో చర్చించాలని, దేశ భద్రతకు సంబంధించిన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని విపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. జూలై 19న పార్లమెంట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ఉభయ సభల్లో పెగసస్ మంటలు ఆరడం లేదు. అయితే, ప్రతిపక్షాల ఆరోపణలను ఎన్ఎస్ఓ గ్రూప్ కొట్టిపారేసింది. భారత పౌరులపై ప్రభుత్వం నిఘా పెట్టిందంటూ మీడియాలో వస్తున్న వార్తలను కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇదివరకే లోక్‌సభలో ఖండించారు. భారత ప్రజాస్వామ్య వ్యవస్థను అప్రతిష్ట పాలు చేయడమే లక్ష్యంగా సరిగ్గా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందే ఈ అంశాన్ని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. దేశంలో ఎన్నో నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయని, అనధికార వ్యక్తులు చట్టవిరుద్ధంగా పౌరులపై నిఘా పెట్టడం భారత్‌లో సాధ్యం కాదని వెల్లడించారు. -
ఆరు బిల్లులు.. మూడింటికి ఆమోదం
న్యూఢిల్లీ: పెగసస్ నిఘా వ్యవహారం, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రతిపక్షాలు తమ నిరసన, నినాదాలను కొనసాగించాయి. లోక్‌సభలో విపక్ష సభ్యుల ఆందోళనల మధ్యే ప్రభుత్వం ఆరు బిల్లులను ప్రవేశపెట్టింది. వీటిలో మూడు బిల్లులు ఆమోదం పొందాయి. తమ డిమాండ్లపై చర్చించాలంటూ సభా కార్యకలాపాలకు ప్రతిపక్షాలు అడ్డు తగులుతుండడంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. సభ సజావుగా సాగకున్నా బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదిస్తుండడం పట్ల కాంగ్రెస్ పార్టీ సభ్యులు అధిర్ రంజన్ చౌదరి, మనీష్ తివారీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య నియమాలను ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. 10 నిమిషాల్లోనే బిల్లులా? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్(అమెండ్మెంట్) బిల్లు–2021, ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021, కానిస్టిట్యూషన్(షెడ్యూల్డ్ ట్రైబ్స్) ఆర్డర్ (అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషన్ ఫర్ హోమియోపతి(అమెండ్మెంట్) బిల్లు–2021, నేషనల్ కమిషనర్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్(అమెండ్మెంట్) బిల్లు–2021తోపాటు కానిస్టిట్యూషన్ (127వ సవరణ) బిల్లు–2021ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే బిల్లులను ప్రవేశపెట్టారని ఆర్ఎస్పీ సభ్యుడు ప్రేమచంద్రన్ విమర్శించారు. ఇలా చేయడాన్ని దోసెలు వేయడంతో పోల్చారు. లోక్‌సభ సోమవారం ఉదయం ప్రారంభమైన తర్వాత స్పీకర్ బిర్లా క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి సభ తరపున నివాళులరి్పంచారు. టోక్యో ఒలంపిక్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులకు ఓంబిర్లా అభినందనలు తెలిపారు. పెగసస్‌పై కాంగ్రెస్ సభ్యుడు అధిర్ రంజన్ చౌదరి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి మేఘవాల్ మధ్య వాగ్వాదం జరిగింది. పెగసస్, సాగు చట్టాలపై ప్రతిపక్షాలు పట్టు వీడకుండా ఆందోళనలు కొనసాగిస్తుండడంతో సోమవారం రాజ్యసభను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ట్యాకేషన్ చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టడానికంటే కేవలం కొన్ని నిమిషాల ముందు సప్లిమెంటరీ అజెండాను అందజేయడం ఏమిటని కాంగ్రెస్ ఎంపీ ఖర్గే ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు విధానాలను తాము అంగీకరించబోమంటూ కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే సభ్యులు వాకౌట్ చేశారు. లోక్‌సభలో.. రాష్ట్రాలకు ‘ఓబీసీ’ అధికారాల పునరుద్ధరణ బిల్లు ఇతర వెనకబడిన తరగతుల జాబితాను సొంతంగా సిద్ధంచేసే అధికారాలను రాష్ట్రాలకు మళ్లీ కట్టబెట్టేందుకు ఉద్దేశించిన 127వ రాజ్యాంగ సవరణ బిల్లు–2021ను కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్ సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. సమాఖ్య స్ఫూర్తిని మరింతగా పెంపొందించేందుకు వీలుగా సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన తరగతు(ఎస్ఈబీసీ)ల జాబితాలను రాష్ట్రాలు సొంతంగా రూపొందించుకునేందుకుగాను ఆర్టికల్ 342ఏ, తదనుగుణంగా ఆర్టికల్ 338బీ, 366లకు రాజ్యంగ సవరణలు చేయాల్సి ఉందని మంత్రి చెప్పారు. బిల్లును సభలో ప్రవేశపెట్టగానే కొందరు కాంగ్రెస్ సభ్యులు సహా చాలా మంది సభ్యులు ఈ బిల్లుకు తమ పూర్తి మద్దతు తెలిపారు. పెగసస్ అంశంపై వెల్‌లోకి దూసుకెళ్లి సభ కొనసాగుతున్నంతసేపూ నిరసన తెలుపుతున్న సభ్యులు నిరసనలు ఆపి వెనక్కి వచ్చి కూర్చుని బిల్లుకు మద్దతు పలకడం గమనార్హం. -
Parliament Live Updates: లోక్ సభ మంగళవారానికి వాయిదా
► పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. విపక్షాల ఆందోళన నేపథ్యంలో లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేశారు. ►ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు ఆమోదం ► లోక్‌సభలో గందరగోళం నెలకొంది. విపక్షాల ఆందోళనల మధ్యే మూడు బిల్లులకు లోక్‌సభ ఆమోద ముద్ర వేసింది. రాజ్యాంగ సవరణ (ఎస్టీ) బిల్లు, ది డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (సవరణ) బిల్లు, ది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (సవరణ) బిల్లు ఆమోదం పొందాయి. ► పెగాసస్‌పై విపక్షాల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. ►లోక్‌సభలో ఓబీసీ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టింది. ఓబీసీ బిల్లుకు 15 విపక్ష పార్టీలు మద్దతు తెలిపాయి. హడావుడిగా ఓబీసీ బిల్లు ప్రవేశపెట్టడంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ►రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. నేడు పార్లమెంట్ ముందుకు ఓబీసీ బిల్లు రానుంది. బిల్లుకు మద్దతిస్తామని 15 విపక్ష పార్టీలు తెలిపాయి. ►నీరజ్ చోప్రాకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రాకు ఉభయ సభల సభ్యులు అభినందించారు. ► లోక్‌సభలో పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టు పట్టాయి. విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ ఉదయం 11.30 గంటల వరకు వాయిదా పడింది. ►15వ రోజు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. ఈ వారంతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. గత మూడు వారాల్లో 10 బిల్లులకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. చర్చ లేకుండా బిల్లులు ఆమోదించడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పార్లమెంట్ ప్రతిష్టంభనకు విపక్షాలే కారణమని అధికారపక్షం ఆరోపణలు చేస్తోంది. నేడు పార్లమెంట్లో మరో నాలుగు బిల్లులు ప్రవేశపెట్టనున్నారు. వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ►పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీస్ ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ లోక్‌సభలో వాయిదా తీర్మానం అందజేశారు. -
మోదీజీ.. మా గోడు వినండి
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్, రైతులపై పార్లమెంటులో చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రధానమంత్రి మోదీ గారూ మా గోడు వినండి అంటూ తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఒబ్రియాన్ మూడు నిముషాలు ఉన్న ఒక వీడియోని ఆదివారం విడుదల చేశారు. రాజ్యసభ టీవీలో ప్రసారమైన దృశ్యాలు, విపక్ష నేతల వ్యాఖ్యలతో ఈ వీడియోను రూపొందించారు. ఇందులో సభ్యులు పెగసస్, రైతు సమస్యలపై చర్చకు పట్టుపట్టే దృశ్యాలు, వారు సభలో చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి. పెగసస్, రైతు సమస్యలపై పార్లమెంటులో చర్చ జరగాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. పార్లమెంటులో చర్చకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో తమ డిమాండ్లు ఏమిటో ప్రజలకు చేరడానికే సరికొత్త పంథాలో ఈ వీడియో విడుదల చేశామని ఒబ్రియాన్ ఈ సందర్భంగా చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లోనూ పెగసస్, రైతులు, స్పైవేర్ అన్న మాటలు ప్రతిధ్వనించాలని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే ఈ వీడియోని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు.‘‘ప్రధాని మోదీకి వణుకు పుడుతున్నట్టుంది. పార్లమెంటులో అడిగే ప్రశ్నలకు ఆయన ఎందుకు సమాధానం ఇవ్వరు. చర్చకు విపక్ష సభ్యులం సిద్ధంగా ఉన్నప్పటికీ బీజేపీ సభ్యులు అడ్డం పడుతున్నారు. ఫలితంగా నిజానిజాలేంటో ప్రజలకు తెలిసే అవకాశం లేకుండా పోతోంది’’అని ఖర్గే ట్వీట్ చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, టీఎంసీ, శివసేన, ఎస్పీ, టీఆర్ఎస్, ఆప్, డీఎంకే, వామపక్షాల సభ్యులు ఈ వీడియోలో ఉన్నారు. శివసేన ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఈ వీడియోలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంటులో ప్రతిష్టంభనను తొలగించడానికి ప్రధాని జోక్యం చేసుకోవాలని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా డిమాండ్ చేశారు. అవసరమైతే పార్లమెంటు సమావేశాలు పొడిగించి అయినా పెగసస్‌పై చర్చ జరిపి తీరాలన్నారు. పార్లమెంటరీ కమిటీలోనూ బీజేపీయే అడ్డుపడుతోంది: శశిథరూర్ ఐటీపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలోనూ పెగసస్ చర్చకు బీజేపీ సభ్యులే అడ్డం పడుతున్నారని కాంగ్రెస్ నేత, కమిటీ చైర్మన్ శశిథరూర్ తెలిపారు. గత జూలై 28న జరిగిన సమావేశంలో బీజేపీ పథకం ప్రకారం కోరం లేకుండా చేసి చర్చ జరగనివ్వలేదన్నారు. సమావేశానికి హాజరైనప్పటికీ కొందరు సభ్యులు రిజిస్టర్లో సంతకాలు చేయలేదన్నారు. ఈ అంశంపై ప్రభుత్వం సమాధానం ఇవ్వకపోవడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేయడమేనని మండిపడ్డారు. -
Parliament LIVE updates: సోమవారానికి వాయిదా పడిన ఉభయ సభలు
► విపక్షాల ఆందోళనతో పార్లమెంట్ దద్దరిల్లుతోంది. ► పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి ► ఆందోళనల మధ్యే సెంట్రల్ వర్సిటీ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం ►గాసస్పై విపక్షాల ఆందోళనలతో రాజ్యసభ సోమవారానికి వాయిదా పడింది. ►మధ్యాహ్నం 12 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ శుక్రవారం ప్రారంభమయ్యాయి. వరుసగా 14వ రోజు కూడా పార్లమెంట్లో పెగసస్ దుమారం రేగుతోంది. ఉదయం 11 గంటలకు ఉభయ సభలు ప్రారంభమవ్వగా.. రాజ్యసభలో 3 ప్రైవేట్ మెంబర్ బిల్లులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టనున్నారు. చిన్నారుల ఉచిత, నిర్బంధ విద్యా సవరణ బిల్లు.. ఐపీసీ సవరణ బిల్లుతోపాటు రాజ్యాంగ సవరణ బిల్లులను ఎంపీ విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టనున్నారు. ► పాఠశాలలో విద్యార్థుల శాతాన్ని పెంచేందుకు తల్లిదండ్రులకు ఆర్థిక ప్రోత్సాహకం ఇవ్వాలని చిన్నారుల ఉచిత, నిర్బంధ విద్య సవరణ బిల్లు ► 18 నుంచి 60 ఏళ్ల వయసులో ఉన్న పట్టభద్రులైన నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని రాజ్యాంగ సవరణ బిల్లు ► దేవాలయాలు, ప్రార్థనా స్థలాలను ధ్వంసం చేసే వారికి జైలుశిక్షను రెండు ఏళ్ల నుంచి 20 ఏళ్లకు పెంచాలని ఐపీసీ సవరణ బిల్లు అయితే లోక్‌సభ, రాజ్యసభలో పెగసస్ స్పైవేర్ నిఘా, కొత్త వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు పట్టిన పట్టు వీడకుండా ఆందోళన కొనసాగిస్తున్నాయి. సభా వ్యవహారాలకు అంతరాయం కలిగిస్తూ నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శనతో విపక్ష సభ్యులు హోరెత్తించారు. పెగసస్ వివాదంపై, రైతుల చట్టాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎంతకీ ప్రతిపక్షాలు శాంతించకపోవడంతో ఉభయసభలు పలుమార్లు వాయిదా పడ్డాయి. -
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఏపీభవన్‌లో ధర్నా
► కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలంటూ ఏపీభవన్‌లో నిర్వహించిన ధర్నాకు టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్.. వైఎస్సార్ సీపీ ఎంపీ చింతా అనురాధ మద్దతు పలికారు. ► రాజ్యసభ : దేశ రాజధాని వాయునాణ్యత కమిషన్ బిల్లుకు వైఎస్సార్ సీపీ మద్దతు తెలిపింది. వ్యవసాయ ఉత్పత్తి, సేవా మౌలిక సదుపాయాల రంగాల నుంచే..అధికంగా కాలుష్యం ఉత్పన్నమవుతోందని చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి తెలిపారు. ఢిల్లీకి 150 కి.మీ పరిధిలో కాలుష్యం అధికంగా ఉందని, కాలుష్య నియంత్రణ పర్యవేక్షణకు అనేక యంత్రాంగాలు ఉన్నాయని, ఇవన్నీ సమర్థవంతంగా పనిచేయాలంటే ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆయన తెలిపారు. ► పురుషుల హాకీ జట్టుకు పార్లమెంట్ అభినందనలు తెలిపింది. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మన్‌ప్రీత్ టీంకు శుభాకాంక్షలు తెలిపారు. 41 ఏళ్ల కలను నిజం చేశారని కొనియాడారు. అదే విధంగా బాక్సర్ లవ్లీనాకు కూడా ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు. ►పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ప్రవేశం పెట్టింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైఎస్సార్సీపీ సభ్యులు స్పీకర్‌కు నోటీసు అందజేశారు. లోక్‌సభలో ఎంపీ డాక్టర్ సత్యవతి స్పీకర్‌కు వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భాగంగా లోక్‌సభ, రాజ్యసభ 13వ రోజైన గురువారం కొలువుదీరాయి. అయితే, పెగాసస్ వివాదం పార్లమెంట్‌ను అట్టుడికిస్తోంది. ఈ వ్యవహారంపై జరుగుతున్న రభస కారణంగా ఉభయ సభలు (రాజ్యసభ, లోక్‌సభ) పదేపదే వాయిదా పడుతూనే ఉన్నాయి. పెగాసస్ వివాదంపై, రైతుల చట్టాలపై ప్రభుత్వం చర్చలు జరపాలని రాజ్యసభలో విపక్షాలు పట్టుబడుతున్నాయి. చర్చ జరపాల్సిందేనని ప్రతిపక్షాల నిరసనలు, వాగ్వాదాలతో పార్లమెంట్ స్తంభింస్తోంది. ఇక ప్రతిపక్షాల రాద్దాంతాన్ని పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. పెగాసస్ నిఘాపై చర్చకు అంగీకరించేది లేదని బీజేపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేస్తున్న పెగాసస్ గూఢచర్య వ్యవహారంపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఈ స్పైవేర్ వ్యవహారంపై దాఖలైన తొమ్మిది వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడి ధర్మాసనం విచారించనుంది. -
పార్లమెంట్లో ప్రతిపక్షాల రగడ
న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ఆందోళనలు, నినాదాల మధ్యే లోక్‌సభలో బుధవారం రెండు కీలక బిల్లులను ప్రవేశపెట్టి, ఆమోదించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు సభలో ఆందోళన కొనసాగించారు. శాంతించాలంటూ సభాపతి పదేపదే చేసిన విజ్ఞప్తులను పట్టించుకోకుండా నినాదాలతో హోరెత్తించారు. దీంతో పలుమార్లు సభను వాయిదా వేయాల్సి వచ్చింది. ఉదయం సభ ప్రారంభమైన తర్వాత ఇటీవల మరణించిన 8 మంది లోక్‌సభ మాజీ సభ్యులకు బుధవారం సభలో నివాళులర్పించారు. తర్వాత పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ ఇన్ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అండ్ అడ్జాయినింగ్ ఏరియాస్ బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు సభ ఆమోదం తెలియజేసింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ పునఃప్రారంభమైన తర్వాత వ్యవసాయ మంత్రి తోమర్ ‘కోకోనట్ డెవలప్మెంట్ బోర్డు(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లు చట్టరూపం దాలిస్తే కొబ్బరి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తోమర్ చెప్పారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందింది. కొబ్బరి బోర్డులో ఇకపై ఆరుగురు సభ్యులను నియమిస్తారు. నాన్–ఎగ్జిక్యూటివ్ చైర్మన్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఎక్స్–అఫీషియో జాయింట్ సెక్రటరీని నియమిస్తారు. ప్రతిపక్ష సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ సభను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఎగువ సభలో.. పార్లమెంట్ ఎగువ సభలో ప్రతిపక్షాల ఆందోళనల పర్వం కొనసాగుతోంది. పెగసస్ నిఘా, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై విపక్ష సభ్యుల వెల్‌లోకి దూసుకొచ్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సభను పలుమార్లు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజ్యసభలో ‘ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు–2021’ను ఆమోదించారు. అంతకు ముందు దీనిపై స్వల్పంగా చర్చ జరిగింది. ఈ బిల్లు లోక్‌సభలో జూలై 29న ఆమోదం పొందింది. రాజ్యసభలో బుధవారం లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ (అమెండ్మెంట్) బిల్లు–2021, డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్(అమెండ్మెంట్) బిల్లు–2021ను కూడా ఆమోదించారు. రాజ్యసభ వ్యవహారాలను కొందరు సభ్యులు తమ సెల్ఫోన్లలో చిత్రీకరిస్తుండడాన్ని డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ తప్పుపట్టారు. ఇలా చేయడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ప్రతిపక్షాలు ఆందోళనను ఎంతకీ ఆపకపోవడంతో సభను గురువారానికి వాయిదా వేశారు. ఆరుగురు టీఎంసీ ఎంపీల సస్పెన్షన్ సభలో అనుచిత ప్రవర్తనకు గాను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య బుధవారం తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి(టీఎంసీ) చెందిన ఆరుగురు ఎంపీలను సభ నుంచి బహిష్కరించారు. తమను రోజంతా బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు రాజ్యసభ లాబీ ఎదుట ఆందోళనకు దిగారు. రాజ్యసభ చాంబర్లోకి బలవంతంగా ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బందితో ఘర్షణకు దిగారు. ఘటనపై రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు చెప్పారు. డోలా సేన్, మహమ్మద్ నదీముల్ హక్, అబీర్ రంజన్ బిశ్వాస్, శాంతా ఛెత్రీ, అర్పితా ఘోస్, మౌసమ్ నూర్‌ను రాజ్యసభ నుంచి రూల్ 255 కింద సస్పెండ్ చేసినట్లు పార్లమెంటరీ బులెటిన్‌లో పేర్కొన్నారు. సస్పెండ్‌కు నిరసనగా సమావేశాల్లో మిగిలిన రోజుల్లో సభకు హాజరు కాబోమని ఆ ఎంపీలు పేర్కొన్నారు. పార్లమెంట్లో ప్రతిష్టంభనకు కేంద్రమే కారణం 14 విపక్ష పార్టీల ఉమ్మడి ప్రకటన పార్లమెంట్లో వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు కేంద్ర ప్రభుత్వమే కారణమని 14 ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. పెగసస్ స్పైవేర్, కొత్త వ్యవసాయ చట్టాలతోపాటు ఇతర కీలక అంశాలపై పార్లమెంట్లో చర్చించాలన్న తమ డిమాండ్‌ను ఆమోదించాలని అన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని కేంద్రానికి హితవు పలికారు. ఈ మేరకు 14 విపక్ష పార్టీలకు చెందిన 18 మంది నేతలు బుధవారం ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. పార్లమెంట్లో విపక్షాలు కలిసికట్టుగా వ్యవహరిస్తుండడంపై ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని విమర్శించారు. విపక్షాల డిమాండ్‌ను అంగీకరించేందుకు సర్కారు అంగీకరించకపోవడం దారుణమన్నారు. పెగసస్ అనేది జాతి భద్రతకు సంబంధించిన అంశమని, దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి సమాధానం చెప్పాలని ఉద్ఘాటించారు. కొత్త సాగు చట్టాలతోపాటు రైతు సమస్యలపైనా చర్చించాలని చెప్పారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌తోపాటు కాంగ్రెస్, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, శివసేన, ఆర్జేడీ, సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ పార్టీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్ఎస్పీ, ఎల్జేడీ తదితర పార్టీల నాయకులు ఉమ్మడి ప్రకటనపై సంతకం చేశారు. -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: లోక్‌సభ రేపటికి వాయిదా
► కొకనట్ డెవలప్మెంట్ బోర్డు సవరణ బిల్లు 2021 ఆమోదం పొందిన వెంటనే లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. ►విపక్షాల ఆందోళనల మధ్య రాజ్యసభ రేపటి వరకు వాయిదా పడింది. ►ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో మధ్యాహ్నాం రెండు గంటల వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ►రాజ్యసభలో విపక్ష ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. వెల్‌లోకి దూసుకొచ్చిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. దీంతో రూల్ 225 ప్రకారం ఆరుగురు టీఎంసీ ఎంపీలను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఒకరోజుపాటు సస్పెండ్ చేశారు. ► పోలవరంపై వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీలు లోక్‌సభలో వాయిదా తీర్మానం చేశారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి స్పీకర్‌కు నోటీసు అందజేశారు. పోలవరం సవరించిన అంచనాలకు క్యాబినెట్ ఆమోదముద్ర వేయాలని వైఎస్సార్సీపీ సభ్యులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ► పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై ఉభయ సభల్లో ప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల సభ్యులు నినాదాలు చేస్తున్నారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభల్లో గందరగోళం నెలకొంది. న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. అయితే, బుధవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్ది సేపటికే పెగసస్ వేడి మరోసారి రాజుకుంది. పెగసస్‌పై చర్చకోసం ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. పెగసస్ స్పైవేర్ నిఘా వ్యవహారంపై చర్చ, వివాదాస్పద నూతన వ్యవసాయ చట్టాల రద్దు డిమాండ్‌తో ప్రతిపక్షాలు వెల్‌లోకి దూసుకొచ్చి ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన గళాన్ని వినిపిస్తున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు: రాజ్యసభ రేపటికి వాయిదా
►లోక్‌సభ సాయంత్రం 4 గంటల వరకు వాయిదా పడగా.. రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ►దివాలా & దివాలా కోడ్ సవరణ బిల్లు-2021కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. ►అత్యవసర రక్షణ సేవల బిల్లు-2021ని లోక్‌సభ ఆమోదించింది. ►2031 తర్వాతే తెలుగు రాష్ట్రాల నియోజకవర్గాల పునర్విభజన ఉండనున్నట్లు కేంద్రం తెలిపింది. లోక్‌సభలో ఎంపీ రేవంత్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పింది. ఆర్టికల్ 170 (3)కి లోబడి 2026 జనాభా లెక్కల తర్వాతే పునర్విభజన ఉంటుందని.. విభజన చట్ట ప్రకారం ఏపీలో 225, తెలంగాణలో 153 సీట్లు ఉండనున్నట్లు తెలిపింది. తమిళనాడును విభజించే ఆలోచన లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ►పార్లమెంట్లో ప్రతిష్టంభన తొలగించేందుకు రాజ్యసభ ఛైర్మన్ యత్నించారు. అధికార, విపక్ష నేతలతో చర్చించారు. నిన్న కేంద్రమంత్రులతో భేటీ అయిన రాజ్యసభ ఛైర్మన్.. ఇవాళ మల్లికార్జున ఖర్గేతో మాట్లాడారు. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ►వాయిదా అనంతరం ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. విపక్షాల ఆందోళనతో ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. ►పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. టీఎంసీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడింది. ►పెగాసస్ వ్యవహారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. పార్లమెంట్ ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగిస్తున్నాయి. పెగాసస్‌పై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడుతున్నాయి. బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో విపక్షాలపై ప్రధాని సీరియస్ అయ్యారు. పార్లమెంట్ సమావేశాలను అడ్డుకోవడంపై ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షం తీరు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ►11వ రోజు పార్లమెంట్ ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని నోటీసు అందజేసింది. ఎంపీ మాగుంట శ్రీనివాస్‌రెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. రాహుల్ ఆధ్వర్యంలో విపక్షాల సైకిల్ ర్యాలీ ►రాహుల్ అధ్యక్షతన 14 ప్రతిపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించాయి. సమావేశం అనంతరం రాహుల్ ఆధ్వర్యంలో పెట్రోల్ ధరలకు నిరసనగా విపక్షాలు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. పార్లమెంట్‌కు విపక్షాల సైకిల్ ర్యాలీ సాగింది. గత కొన్నిరోజులుగా విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి. పెగాసస్, సాగు చట్టాలపై ఆందోళన కొనసాగిస్తున్నాయి. -
పార్లమెంట్ సమావేశాలు: రాజ్యసభ రేపటికి వాయిదా
లైవ్ అప్డేట్స్: ► రాజ్యసభ మంగళవారినికి వాయిదా పడింది. ► పార్లమెంట్లో సమావేశాల్లో భాగంగా లోక్ సభలో విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో లోక్ సభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడింది. ► వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని విపక్ష ఎంపీలు పెద్ద ఎత్తున రాజ్యసభలో నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. దీంతో రాజ్య సభ మధ్యాహ్నం 3.30 గంటల వరకు వాయిదా పడింది. ►రాజ్యసభలో పీవీ సింధుకు అభినందనలు తెలిపిన అనంతరం విపక్ష సభ్యులు పెగసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబట్టారు. వరుసగా పదో రోజు విపక్షాల ఆందోళన చేపట్టింది. చర్చ లేకుండా బిల్లులు ఆమోదిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ►పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు పదో రోజు ప్రారంభం అయ్యాయి. టోక్యో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ పోటీల్లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం పూసర్ల వెంకట సింధు (పీవీ)కు పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు అభినందనలు తెలిపారు. ►పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం చేసింది. పోలవరం అంచనా వ్యయాన్ని కేబినెట్ ఆమోదించాలని వైఎస్సార్సీపీ ఎంపీ మాధవి స్పీకర్‌కు నోటీసు అందజేశారు. -
పార్లమెంట్ సమావేశాలు: ఉభయ సభలు సోమవారానికి వాయిదా
పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ► పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ దుమారం చెలరేగుతోంది. విపక్షాలు ఆందోళన దిగాయి. పెగాసస్ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతున్నాయి. లోకసభ వాయిదా విపక్షాల ఆందోళనల నడుమ లోక్‌సభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడింది. రాజ్యసభ వాయిదా విపక్షాల ఆందోళనల నడుమ రాజ్యసభ మధ్యాహ్నం 12.00 గంటల వరకు వాయిదా పడింది. ►తొమ్మిదవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమాయ్యాయి. పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించాలని ఎంపీ తలారి రంగయ్య ఈ వాయిదా తీర్మానం ఇచ్చారు. కాగా, ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. -
లఘు, చిన్న పరిశ్రమలకు చేయూత
న్యూఢిల్లీ: సూక్ష్మ, లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నిధులకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చూడ్డానికి ఉద్దేశించిన ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ (సవరణ) బిల్లుకు పార్లమెంటు గురువారం ఆమోదముద్ర వేసింది. జూలై 26న బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించగా, తాజాగా రాజ్యసభ ఆమోదం పొందింది. ఈ బిల్లు ఆమోదం వల్ల ఎంఎస్ఎంఈ రంగానికి వర్కింగ్ క్యాపిటల్ లభ్యత కొంత సులభతరం అవుతుంది. ప్రభుత్వం రంగ సంస్థలుసహా తమకు బకాయిలు చెల్లించాల్సిన కంపెనీల నుంచి ఎంఎస్ఎంఈలు త్వరిత గతిన వసూళ్లును చేయగలుగుతాయి. తమకు రావాల్సిన మొత్తాలను మూడవ పార్టీకి విక్రయించి తక్షణ నిధులు పొందడానికి ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. చిన్న పరిశ్రమలు వర్కింగ్ క్యాపిటల్ విషయంలో ఎటువంటి ఇబ్బందీ ఎదుర్కొనకుండా తాజా బిల్లు ఆమోదం దోహదపడుతుందని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బిల్లు ఆమోదం చర్చ సందర్భంగా పేర్కొన్నారు. యూకే సిన్హా కమిటీ చేసిన పలు సిఫారసులను ఈ బిల్లులో చేర్చారు. 2020 సెప్టెంబర్‌లో బిల్లును తీసుకువచ్చారు. అనంతరం హౌస్ స్థాయి సంఘానికి రిఫర్ చేశారు. -
పట్టువీడని ప్రతిపక్షాలు
న్యూఢిల్లీ: పెగసస్ స్పైవేర్, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపై పార్లమెంట్లో ప్రతిపక్షాలు పట్టువీడడంలేదు. వీటిపై కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు సమాధానం చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తూ గురువారం సైతం ఉభయసభల్లో ఆందోళన కొనసాగించాయి. ఉదయం 11 గంటలకు లోక్‌సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు వెల్‌లోకి దూసుకొచ్చారు. నినాదాలు ప్రారంభించారు. దీంతో స్పీకర్ సభను 11.30 గంటలకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు ప్రశ్నోత్తరాల సమయం ముగిసింది. జీరో అవర్ ప్రారంభించబోతున్నామని, నినాదాలు ఆపి, సీట్లలోకి వెళ్లాలంటూ స్పీకర్ స్థానంలో ఉన్న రాజేంద్ర అగర్వాల్ ప్రతిపక్షాలను కోరారు. వారు వినిపించుకోకపోవడంతో సభను మధ్యాహ్నం 12.30 గంటలదాకా వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు యథావిధిగా ఆందోళనకు దిగారు. వెల్‌లోకి దూసుకొచ్చి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెళ్లి మీ సీట్లలో కూర్చోండి అంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న కిరిట్ ప్రేమ్‌జీబాయ్ సోలంకీ పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యే లోక్‌సభలో ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(అమెండ్మెంట్) బిల్లు, ఇన్లాండ్ వెస్సెల్స్ బిల్లును ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించారు. నిన్నటి ఘటన బాధించింది: స్పీకర్ లోక్‌సభలో సభాధ్యక్ష స్థానంపై కొందరు ప్రతిపక్ష సభ్యులు కాగితాలను చించి విసిరివేయడం తనను ఎంతగానో బాధించిందని స్పీకర్ ఓంబిర్లా గురువారం అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ కుర్చీపై కాగితాలు, ప్లకార్డులను చించి విసిరేసిన సంగతి తెలిసిందే. గురువారం సభ ప్రారంభం కాగానే స్పీకర్ ఓంబిర్లా ఇదే అంశంపై మాట్లాడారు. ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులంతా పార్లమెంట్ గౌరవాన్ని కాపాడాలన్నారు. రాజ్యసభలోనూ అదే దృశ్యం పెగసస్ వ్యవహారం, కొత్త సాగు చట్టాలు, ధరల పెరుగుదలపైచర్చించాలంటూ ప్రతిపక్ష సభ్యులు రాజ్యసభలో డిమాండ్ చేశారు. వారు విరమించే పరిస్థితి కనిపించకపోవడంతో సభ శుక్రవారానికి వాయిదా పడింది. అంతకుముందు, మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్(సవరణ) బిల్లును ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై చర్చించేందుకు ముందుకు రావాలంటూ సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ కోరినప్పటికీ ప్రతిపక్ష సభ్యులు లెక్కచేయలేదు. బీజేపీ, ఏఐఏడీఎంకే, టీఆర్ఎస్ సభ్యులు మాత్రం ఈ బిల్లుకు మద్దతుగా సభలో మాట్లాడారు. నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చిన అనంతరం బిల్లు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్ ప్రకటించారు. సభను శుక్రవారం ఉదయం 11 గంటలకు వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఈసీ ప్రతిపాదనలు పరిశీలిస్తున్నాం ఎన్నికల సంస్కరణల విషయంలో ఎన్నికల సంఘం(ఈసీ) చేసిన ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు రాజ్యసభలో లిఖితపూర్వకంగా వెల్ల డించారు. ఓటర్ల జాబితాను ఆధార్ వ్యవస్థతో అనుసంధానించాలన్న ప్రతిపాదనను సైతం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
విపక్ష ఫ్లోర్‌లీడర్లను కలిసిన కేంద్రమంత్రులు
► పార్లమెంట్లో ప్రతిష్టంభనలు తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. కేంద్రమంత్రులు ప్రహ్లాద్ జోషి, పీయూష్ గోయల్‌లు విపక్ష ఫ్లోర్‌లీడర్లను కలిశారు. కీలక బిల్లుల ఆమోదానికి సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అయితే, పెగాసస్‌పై చర్చ విషయంలో వెనక్కితగ్గే ప్రసక్తేలేదని విపక్షాలు స్పష్టం చేశాయి. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. పెగసస్‌పై విపక్షాలు పట్టుబట్టి ఆందోళనకు దిగడంతో రాజ్యసభ 12 గంటల వరకు, లోక్‌సభ 11:30 గంటల వరకు వాయిదా పడ్డాయి. ► ఎనిమిదవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పోలవరంపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఎంపీ చింతా అనురాధ పోలవరంపై నోటీస్ ఇచ్చారు. వరించిన అంచనాలకు ఆర్థికశాఖ ఆమోదముద్ర వేయాలని ఈ నోటీసు ఇచ్చారు. -
సభాపతి పైకి పేపర్లు
న్యూఢిల్లీ: పార్లమెంట్ బుధవారం ఎలాంటి చర్చలు లేకుండా గురువారానికి వాయిదా పడింది. ఉభయసభల్లో ప్రతిపక్షాల సభ్యులు సభాకార్యక్రమాలు జరగకుండా ఆందోళన కొనసాగించారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్స్థానంపైకి విసరడం కలకలం సృష్టించింది. రెండు సభలు పలుమార్లు వాయిదా పడినా విపక్షాల నిరసన ఆగకపోవడంతో సభాధిపతులు మరుసటిరోజుకు సభలను వాయిదా వేశారు. పెగసస్, రైతు చట్టాలపై చర్చకు పట్టుపడుతూ విపక్ష సభ్యులు సమావేశాలు జరగకుండా ఆందోళన జరుపుతున్న సంగతి తెలిసిందే! బుధవారం లోక్‌సభ సమావేశం కాగానే స్పీకర్ ఓంబిర్లా ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. కానీ వెంటనే విపక్షాలు తమ ఆందోళనను ఆరంభించాయి. పలువురు సభ్యులు సభ వెల్‌లోకి చేరుకొని నినాదాలతో సభను అడ్డుకున్నారు. కానీ స్పీకర్ ప్రశ్నోత్తరాలను కొనసాగించారు. ఈ సందర్భంగా ఆయన హౌస్ప్రొసీజర్స్ పుస్తకాన్ని రిఫర్ చేస్తూ కనిపించారు. ఎట్టకేలకు వర్షాకాల సమావేశాలు ఆరంభమైన తర్వాత తొలిసారి లోక్‌సభలో క్వశ్చన్ అవర్ జరిగినట్లయింది. అనంతరం స్పీకర్ సభను వదిలివెళ్లగా డిçప్యూటీ స్పీకర్ రాజేంద్ర అగర్వాల్ సభా నిర్వహణ బాధ్యత తీసుకున్నారు. ఈ సమయంలో సభలో అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. కొందరు కాంగ్రెస్ సభ్యులు పేపర్లు, ప్లకార్డులు చింపి లోక్‌సభ స్పీకర్స్థానం పైకి విసిరేశారు. కాంగ్రెస్‌కు చెందిన గుర్జీత్ ఔజాలా, ప్రతాపన్, హిబి ఈడెన్ తదితరులు పేపర్లు చింపి స్పీకర్ స్థానం మీదకు, ట్రెజరీ బెంచ్‌ల మీదకు విసిరారు. సాయంకాలానికీ సభలో నిరసనలు ఆగకపోవడంతో గురువారానికి సభను వాయిదా వేస్తున్నట్లు సభాపతి ప్రకటించారు. రాజ్యసభలో కొనసాగిన నిరసనలు పెగసస్, రైతు చట్టాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళన రాజ్యసభలో బుధవారం కొనసాగింది. అయితే ఆందోళనల నడుమ సభ జువెనైల్ జస్టిస్ సవరణ చట్టం 2021కు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదముద్ర వేసింది. బుధవారం రాజ్యసభ సభాధిపతి వెంకయ్య జీరోఅవర్‌ను ఆరంభించారు. కాంగ్రెస్, టీఎంసీ, ఇతర విపక్ష సభ్యులు నినదిస్తూ సభను అడ్డుకున్నారు. కొందరు ప్లకార్డులతో వెల్‌లోకి వెళ్లేందుకు యత్నించగా వెంకయ్య అడ్డుకున్నారు. అనంతరం సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. తిరిగి సమావేశం కాగానే వెంకయ్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం చేపట్టారు. కానీ విపక్ష సభ్యులు స్లోగన్లు ఉధృతం చేసి సభను అడ్డుకున్నారు. ఈ సమయంలో సభ్యులు ముందే అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానాలిచ్చారు. అనంతరం తిరిగి సభ వాయిదా పడింది. అదనపు వ్యయానికి సభామోదం ప్రభుత్వం అదనంగా రూ.23వేల కోట్ల వ్యయం చేసుకునేందుకు పార్లమెంటు బుధవారం ఆమోదం తెలిపింది. రూ. 17వేల కోట్లు ఆరోగ్యమంత్రిత్వ శాఖకు కేటాయించారు. దీన్ని కోవిడ్ సంబంధిత వ్యయాలకు ఉపయోగిస్తారు. రూ. 2050 కోట్లు పౌరవిమానయాన శాఖకు వెళ్తాయి. -
రాజ్యసభ రేపటికి వాయిదా
►రాజ్యసభ రేపటికి వాయిదా ►విపక్ష సభ్యుల నిరసనతో రాజ్యసభ రేపటికి వాయిదా ►పెగాసస్, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ విపక్షాల నిరసన ►ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన లోక్‌సభ ►కరోనా మృతుల కుటుంబాలకు ఈఎస్ఐ పెన్షన్ ►రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు లోక్‌సభ ►లోక్‌సభ నుంచి ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ►ఈ సెషన్ మొత్తం ఐదుగురు కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ ►విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 1 గంట వరకు లోక్‌సభ వాయిదా పడింది. రాజ్యసభ వాయిదా పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. విపక్షాల ఆందోళనల మధ్య మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది. ఏడవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పోలవరంపై వైఎస్సార్ సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరంపై ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు నోటీసు ఇచ్చారు. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు. -
ఆరో రోజు: మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ
► మెరైన్ ఎయిడ్స్ అండ్ నావిగేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ జరిగింది. వైఎస్సార్సీపీ తరఫున చర్చలో ఎంపీ మోపిదేవి వెంకటరమణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామాయపట్నం పోర్టును కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి చేయాలని కోరారు. పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పెగాసస్, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో.. లోక్‌సభ మధ్యాహ్నం 3.30 గంటలకు.. రాజ్యసభ మధ్యాహ్నం 4 గంటలకు వాయిదా పడింది. ► పార్లమెంట్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పెగాసస్, రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2.30 గంటలకు వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా పడింది. ► విపక్షాల ఆందోళలనతో పార్లమెంట్ ఉభయ సభలు మరోసారి మధ్యాహ్నం 2 గంటలవరకు వాయిదా పడ్డాయి. ► మధ్యాహ్నం 12 గంటల తర్వాత పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. ► విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ► లోక్‌సభలో విపక్షాల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా ఉభయ సభలు వాయిదా పడ్డాయి. ►పోలవరంపై లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ వాయిదా తీర్మానం ►పోలవరం అంచనా వ్యయాన్ని ఆమోదించాలని వైఎస్ఆర్సీపీ నోటీసు ►లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చిన ఎంపీ వంగా గీత ► లోక్‌సభలో విపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. పెగాసస్ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుపట్టాయి. ► రామప్ప ఆలయానికి యునెస్కో గుర్తింపుపై రాజ్యసభ హర్షం వ్యక్తం చేసింది. సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల ఉభయ సభ సమావేశాలు ఆరో రోజు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై చర్చకు కాంగ్రెస్ ఎంపీలు మనీష్ తివారి,మాణిక్యం ఠాగూర్ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. అస్సాం-మిజోరాం సరిహద్దు ఘర్షణపై చర్చకు లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్ గౌరవ్ గొగోయ్ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఉభయసభల్లో పెగాసస్ స్పైవేర్ ప్రాజెక్ట్ అంశంపై విపక్షాల ఆందోళన కొనసాగనుంది. అదే విధంగా పోలవరంపై లోక్‌సభలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పోలవరం సవరించిన అంచనాలు ఆమోదించాలని నోటీసు ఇచ్చింది. లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును వైఎస్సార్సీపీ ఎంపీ వంగా గీత ఇచ్చారు. మంగళవారం కూడా పార్లమెంట్ ఉభయ సభల్లో పెగాసస్ అంశంపై విపక్షాల నిరసనలు కొనసాగనున్నాయి. -
పార్లమెంట్‌ను కుదిపేసిన పెగసస్
న్యూఢిల్లీ: పెగసస్ దుమారం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. ఫోన్ ట్యాపింగ్‌పై నిగ్గు తేల్చాలంటూ ప్రతిపక్షాలు ఉభయసభలను అడ్డుకున్నాయి. దీంతో పలుమార్లు సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం సభ ఆరంభమైన వెంటనే సభ్యులు కార్గిల్ యుద్ధవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం ఒలింపిక్స్‌లో పతకం సాధించిన మీరాబాయి చానును అభినందించారు. వెంటనే రాజ్యసభలో కాంగ్రెస్, టీఎంసీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి దూసుకుపోయారు. రూల్ 267 కింద విపక్ష నేతలు మల్లిఖార్జున్ ఖర్గే, వేణుగోపాల్, తిరుచ్చి శివ, సుకేందు శేఖర్ రాయ్, ఎలమారమ్ కరీన్ తదితరులు ఇచ్చిన నోటీసులను అనుమతించేది లేదని రాజ్యసభ చైర్మన్ వెంకయ్య చెప్పారు. సభ్యులు కోరుకునే అంశాలపై చర్చ సభా సాధారణ సమయంలో చేయవచ్చన్నారు. రోజూవారీ కార్యకలాపాలను నిలిపివేసి ప్రత్యేక అంశంపై చర్చించేందుకు రూల్ 267 కింద నోటీసులు ఇస్తారు. విపక్ష సభ్యులు ప్రజాసంబంధమైన అంశాలను చర్చించకుండా అడ్డుకుంటున్నారంటూ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. కరోనా టీకాలు, నిరుద్యోగిత, విద్యాసమస్యలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెంపు, దక్షిణాఫ్రికాలో భారతీయులపై దాడులు, పత్రికా స్వేచ్ఛ, కావేరీ జలాల పంపిణీ వంటి పలు అంశాలు చర్చకు రాకుండా ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. సభ ఐదుమార్లు వాయిదా పడింది. సాయంత్రమైనా సాగని సభ రాజ్యసభ సాయంత్రం సమావేశమైన తర్వాత వెల్‌లో నిరసన తెలుపుతున్న విపక్ష సభ్యులు తమ తమ సీట్లకు వెళ్లారు. నావిగేషన్ బిల్లుపై చర్చ ఆరంభం కాగానే తిరిగి సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. రూల్ 267 కింద చర్చకు అనుమతించాలని ఖర్గే డిమాండ్ చేశారు. పెగసస్ విషయమై ఐటీ మంత్రి ఇప్పటికే సమాధానమిచ్చారని మరో మంత్రి అబ్బాస్ నఖ్వీ గుర్తు చేశారు. ప్రభుత్వం సభా కార్యకలాపాలు సాగేందుకు వీలుగా సభ్యుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని ఆర్జేడీ విమర్శించింది. అయితే విపక్ష నేతలను తాము సంప్రదించామని, కానీ వారిలో వారికే ఏకాభిప్రాయం రాలేదని లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ తెలిపారు. సభా నియమాల ప్రకారం ప్రధాని, విపక్ష నేత ప్రసంగించే సమయంలో ఎవరూ అడ్డుకోకూడదని, కానీ విపక్ష నేత ఖర్గే ప్రసంగాన్ని ఒకమంత్రి అడ్డుకున్నారని డీఎంకే విమర్శించింది. ఈ వాదోపవాదాల మధ్య సభ మంగళవారానికి వాయిదా పడింది. లోక్‌సభలో అదే ధోరణి రాజ్యసభలో కార్గిల్ వీరులకు నివాళులు అర్పించారు. అనంతరం పెగసస్‌పై చర్చించాలని విపక్షాలు సభను అడ్డుకున్నాయి. ప్రధాని వచ్చి సభకు సమాధానమివ్వాలని సభ్యులు డిమాండ్ చేశారు. మోదీ సర్కార్ జవాబ్‌దో(మోదీ ప్రభుత్వమా, సమాధానమివ్వు) అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వం సమాధానమిచ్చేందుకు రెడీగా ఉందని, అందుకు ముందుగా సభ్యులు తమ సీట్లకు వెళ్లాలని స్పీకర్ కోరారు. సభ్యులు వినకపోవడంతో సభ వాయిదా పడింది. అనంతరం సమావేశమవగానే ప్రభుత్వం రెండు కీలక బిల్లులను సభలో ప్రవేశపెట్టింది. ఫ్యాక్టరింగ్ నియంత్రణ బిల్లు, ఎన్ఐఎఫ్టీఈఎం బిల్లులను సంబంధిత మంత్రులు సభలో ప్రవేశపెట్టారు. అయితే వీటిపై చర్చకు విపక్ష సభ్యులు అంగీకరించకుండా వెల్‌లో నిరసనలు కొనసాగించారు. కొందరు రైతు చట్టాలకు వ్యతిరేకంగా, రైతులకు మద్దతుగా ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యులు చర్చలో పాల్గొనాలని పార్లమెంట్ వ్యవహారాల మంత్రి జోషీ పలుమార్లు విజ్ఞప్తి చేశారు. లోకసభ స్పీకర్ స్థానంలో ఉన్న రమాదేవి సైతం సభాకార్యకలాపాలు కొనసాగించేందుకు సహకరించాలని సభ్యులను కోరారు. అయినా పరిస్థితి మారలేదు. నిరసనలు ఆగకపోవడంతో చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందినట్లు రమాదేవి ప్రకటించారు. మధ్యాహ్న సమయంలో ఆర్థికమంత్రి దివాలా చట్ట సవరణ బిల్లును సభ ముందుంచారు. దీనిపై చర్చ జరగలేదు. అనంతరం సభ తర్వాతి రోజుకు వాయిదా పడింది. రెండు బిల్లులకు ఆమోదం నిరసనల మధ్య లోక్‌సభలో రెండు బిల్లులు ఆమోదం పొందాయి. ఫ్యాక్టరింగ్ నియంత్రణ సవరణ చట్టం 2020ని ఆర్థిక మంత్రి నిర్మల ప్రవేశపెట్టారు. ఎంఎస్ఎంఈ రంగానికి చేయూతనిచ్చేందుకు ఈ సవరణలు తెచ్చామన్నారు. ఫ్యాక్టరింగ్ చట్టానికి తాజా సవరణలు చేశారు. బిల్లుపై స్టాండింగ్ కమిటీ సూచనలు సైతం ప్రభుత్వం అంగీకరించిందని నిర్మల చెప్పారు. ఎంఎస్ఎంఈ సంస్థలకు మరింత మూలధనం దొరికేందుకు ఈ బిల్లు వీలు కల్పించనుంది. గతేడాది సెప్టెంబర్‌లో ఈ బిల్లును లోక్‌సభ తొలుత ముందుకు తెచ్చారు. అనంతరం నేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఆఫ్ ఫుడ్‌టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, మేనేజ్మెంట్ బిల్ 2021ను సైతం లోక్‌సభ ముందుకు ప్రభుత్వం తెచ్చింది. కొన్ని కీలక ఫుట్టెక్నాలజీ సంస్థలను జాతీయంగా కీలక సంస్థలుగా ప్రకటించడంతో పాటు, ఆయా రంగాల్లో ప్రయోగాలకు సంబం« దించిన వివరాలు ఈ బిల్లులో పొందుపరిచారు. రాజ్యసభలో ఈ బిల్లుకు మార్చిలోనే ఆమోదం లభించింది. విపక్షాల నిరసనతో చర్చలేకుండానే రెండు బిల్లులు మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. కార్గిల్ వీరులకు నివాళి కార్గిల్ వీరులకు పార్లమెంట్ ఉభయసభలు ఘనంగా నివాళులు అర్పించాయి. కార్గిల్ విజయ్ దివస్ 22వ వార్షికోత్సవం సందర్భంగా 1999 కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరులకు శ్రద్ధాంజలి ఘటించాయి. ‘‘22 సంవత్సరాల క్రితం ఇదే రోజు మన సాహసిక సైనికులు దేశంలో కొంత భూభాగాన్ని ఆక్రమించిన శత్రుమూకను ఓడించాయి. కార్గిల్ హైట్స్‌ను తిరిగి సాధించి దేశానికి గర్వించే విజయాన్ని అందించాయి’’అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు రాజ్యసభలో నివాళులు అర్పించారు. భారత జవానుల సాహసాన్ని, త్యాగాన్ని ఆయన కీర్తించారు. అనంతరం సభ్యులు మౌనంగా నిలబడి వీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయ్ చానును సభ అభినందించింది. అద్భుత ప్రదర్శనతో చాను వెయిట్‌లిఫ్టింగ్‌లో పతకం కోసం 21 సంవత్సరాల నిరీక్షణకు తెరదించిందని వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు. లోక్‌సభ సభ్యులు సైతం కార్గిల్ వీరులకు నివాళులు అర్పించడంతో పాటు చానును అభినందించారు. రాజ్యసభలో మాట్లాడుతున్న ఖర్గే -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: లోక్‌సభ రేపటికి వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పెగాసస్‌పై విచారణ కోసం ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. చట్టసభలో నినాదాలు చేస్తూ అధికార పక్షాన్ని నిలదీస్తున్నారు. దీంతో లోక్‌సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. తాజాగా సోమవారం వెల్‌లోకి విపక్ష సభ్యులు దూసుకొచ్చారు. పెగాసస్ వ్యవహారంపై చర్చ జరపాలని డిమాండ్ చేశాయి. మధ్యాహ్నం 2.45 గంటలకు తిరిగి ప్రారంభమైన లోక్‌సభలో గందరగోళం కొనసాగడంతో స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. వాయిదా పడి పునఃప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు మళ్లీ మధ్యాహ్నం 2.45కు వాయిదా పడ్డాయి. లోక్‌సభ మధ్యాహ్నం 2.45 గంటల వరకు వాయిదా పడింది. ఇక రాజ్యసభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. పెగాసస్‌పై ఉభయసభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా విపక్షాలు పెగాసస్‌పై ఉభయసభల్లో ఆందోళన చేపట్టాయి. పెగాసస్ అంశంపై చర్చకు పట్టుబట్టాయి. విపక్షాల ఆందోళనలతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ మ.12 గంటల వరకు.. లోక్‌సభ మ.2 గంటల వరకు వాయిదా పడ్డాయి. రైతులకు మద్దతుగా రాహుల్ ట్రాక్టర్ ర్యాలీ రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు వెళ్లారు. వ్యవసాయ చట్టాలు రైతులకు వ్యతిరేకమని, నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐదో రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. పెగాసస్ అంశంపై లోక్‌సభలో కాంగ్రెస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. పెగాసస్‌పై ఉభయసభల్లో విపక్షాల ఆందోళనలు కొనసాగనున్నాయి. వైఎస్సార్ సీపీ లోక్‌సభలో పోలవరంపై వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఈ వాయిదా తీర్మానాన్ని ఇచ్చారు. -
పార్లమెంట్లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?
ఢిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలని వైఎస్సార్ సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈరోజు(శుక్రవారం) మధ్యాహ్నం గం. 12.00ల వరకూ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత వైఎస్సార్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ మాట్లాడుతూ.. ‘పోలవరం సవరించిన అంచనాలను కేంద్రం ఆమోదించాలి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్ అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యత కేంద్రానిదే. పోలవరం జాతీయ ప్రాజెక్టు అన్న విషయం కేంద్రం మరిచిపోతోంది. 55 వేల కోట్ల రూపాయలు కేంద్రం నుంచి రావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం 2వేల రూపాయలు ఈ ప్రాజెక్టు కోసం ఖర్చు చేసింది’అని పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యురాలు వంగా గీత మాట్లాడుతూ.. ‘పోలవరం ప్రాజెక్ట్‌పై కేంద్రం నిర్లక్ష్యం వీడాలి. విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్ట్‌ను ఆమోదించారు. తిరుపతిలో స్వయంగా ప్రధానే ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలే అమలుకాకుంటే ప్రజాస్వామ్యానికి విలువేది?. పునరావాస ప్యాకేజీ ఎందుకు ఇవ్వడం లేదు?, గిరిజనులపై కేంద్రానికి ప్రేమ లేదా?’ అని ప్రశ్నించారు. -
రాజ్యసభలో గందరగోళం.. ఎంపీపై సస్పెన్షన్ వేటు
► రాజ్యసభ : టీఎంసీ ఎంపీ సంతనూసేన్ సస్పెండైనా సభలోనే ఉంటంతో.. ఆయన్ని బయటకు వెళ్లాలని రాజ్యసభ ఛైర్మన్ కోరారు. దీంతో గందరగోళం నెలకొంది. ► లోక్‌సభ : పెగాసస్ అంశంపై విపక్షాల ఆందోళన నేపథ్యంలో సభ సోమవారానికి వాయిదా పడింది. ► లోక్‌సభ : ఏపీ విభజన చట్టం హామీల అమలుపై చర్చకు లోక్‌సభలో వైఎస్సార్ సీపీ నోటీసు ఇచ్చింది. లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి రూల్ 193 కింద చర్చకు నోటీసు ఇచ్చారు. వచ్చే వారం చర్చకు అనుమతిస్తామని స్పీకర్ తెలిపారు. ► రాజ్యసభ : టీఎంసీ ఎంపీ సంతనూ సేన్‌ను సస్పెండ్ చేస్తూ సభలో తీర్మానం జరిగింది. ఈ సందర్భంగా ఐటీ మంత్రి వైష్ణవ్ మాట్లాడుతూ.. ‘‘ టీఎంసీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తించారు. బెంగాల్ హింసా రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. టీఎంసీ నేతలు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు?’’ అని అన్నారు. ► పార్లమెంట్‌ను పెగాసస్ అంశం కుదిపేస్తోంది. లోక్‌సభలో పెగాసస్‌పై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. హోంమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. పార్లమెంట్ ఆవరణలో కాంగ్రెస్, శివసేన, డీఎంకే ఎంపీల ధర్నా నిర్వహించారు. రాజకీయ ప్రయోజనాలకోసమే పెగాసస్ తెచ్చారని, కేంద్రహోంమంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళన మధ్య లోక్ సభ మధ్యాహ్నం 12 వరకు వాయిదా పడింది. ► రాజ్యసభలో పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్చకు వైఎస్సార్ సీపీ నోటీసు ఇచ్చింది. వైఎస్సార్ సీపీ ఎంపీ వేమిరెడ్డి రూల్ 267 కింద నోటీసు ఇచ్చారు. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్న ఎంపీలపై వేటు వేయాలని, పార్టీ ఫిరాయింపులపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఈ నోటీసు ఇచ్చారు. ►రాజ్యసభలో విప్ జారీ చేసిన బీజేపీ.. పార్టీ సభ్యులు అందుబాటులో ఉండాలని ఆదేశించింది. ► పెగాసస్ అంశంపై చర్చకు కాంగ్రెస్ ఉభయసభల్లో వాయిదా తీర్మానాలు ఇచ్చింది. -
రాజ్యసభలో రగడ
న్యూఢిల్లీ: పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశం మరోసారి పార్లమెంట్ సభాకార్యక్రమాలను పట్టి కుదిపేసింది. దేశంలోని ప్రముఖ నాయకులు, సుప్రీంకోర్టు జడ్జి, కేంద్రప్రభుత్వ ఉన్నతాధికారులు, సామాజిక కార్యకర్తలు, పాత్రికేయుల ఫోన్ల హ్యాకింగ్ ఉదంతంపై కేంద్రప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా సవివరణ ఇవ్వాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ప్రభుత్వం తరఫున కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరణ ఇవ్వాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల సభ్యులు రాజ్యసభ వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. దీంతో ఈ అంశంపై రాజ్యసభలో వివరణ ఇచ్చేందుకు ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లేచి నిలబడి తన చేతుల్లోని పేపర్లను చదవడం మొదలుపెట్టారు. కొన్ని వాక్యాలు చదవడం పూర్తయ్యేలోపే తృణమూల్ ఎంపీ శంతను సేన్.. మంత్రి వైష్ణవ్ చేతుల్లోని పేపర్లు లాక్కొని, చింపేసి, గాల్లోకి విసిరేశారు. దీంతో మంత్రి తన ప్రసంగాన్ని ఆపేయాల్సి వచ్చింది. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ కలగజేసుకుని.. సభ్యులు సభలో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు. ఆ తర్వాత తన వివరణ/నివేదికకు సంబంధించిన ప్రతిని ఒకదాన్ని డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి అందజేశారు. వెల్‌లో ఆందోళనలు ఆగకపోవడంతో సభను వాయిదావేస్తున్నట్లు డెప్యూటీ చైర్మన్ ప్రకటించారు. పెగసస్ వివాదం మొదలయ్యాక 19వ తేదీన మంత్రి మీడియాతో మాట్లాడిన అంశాలే.. సభలో డిప్యూటీ చైర్మన్‌కు మంత్రి ఇచ్చిన నివేదికలో ఉన్నాయి. ‘ప్రముఖులపై నిఘా పెట్టారంటూ ది వైర్ వెబ్‌పోర్టల్ ద్వారా వెల్లడైన నివేదికలన్నీ అబద్ధాలు. భారత ప్రజాస్వామ్యాన్ని, ప్రభుత్వ సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేందుకు సృష్టించినవి ’అని మంత్రి వివరణలో ఉంది. మంత్రి హర్దీప్ దూషించారు: శంతను సేన్ ‘సభలో మంత్రి వైష్ణవ్ చేతిలోని పేపర్లు చింపేసి నిరసన తెలిపాను. అదే సమయంలో అక్కడే ఉన్న మంత్రి హర్దీప్సింగ్ పూరీ నన్ను బూతులు తిట్టారు. నాపై దాడికి సైతం ప్రయత్నించారు. తోటి ఎంపీలు నన్ను వెనక్కి లాగి కాపాడారు’అని తృణమూల్ ఎంపీ శంతను సేన్ మీడియాతో చెప్పారు. మంత్రి వైష్ణవ్సహా పలువురి పట్ల సభామర్యాదలు ఉల్లంఘించి ప్రవర్తించిన విపక్ష సభ్యులపై ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. ఎంపీ శంతను సేన్‌పై సస్పెన్షన్ విధించాలని రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టనున్నట్లు తెలిసింది. -
పార్లమెంట్లో రైతు గర్జన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం పార్లమెంట్లో ప్రతిబింబించింది. రైతుల డిమాండ్లను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. తొలుత పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. తర్వాత ఉభయ సభలు సమావేశమయ్యాక వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలను స్తంభింపజేశారు. రైతులు డిమాండ్లు నెరవేర్చాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని నినదించారు. రైతుల ఉద్యమం, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై లోక్‌సభలో కాంగ్రెస్ తదితర విపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మిథున్‌రెడ్డి పోలవరం అంశంపై సావధాన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్యసభలో విపక్షాలు రైతు ఆందోళన, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశాలపై చర్చకు నోటీసులిచ్చారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆయా నోటీసులను తిరస్కరించారు. వాయిదాల పర్వం.. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యక్రమాలు కొద్దిసేపు కొనసాగినా తర్వాత పదేపదే సభ వాయిదాపడింది. తొలుత 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తర్వాత నాలుగు గంటలకు వాయిదాపడింది. నాలుగింటికి సభ మొదలైనా నిరసనలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు. అటు రాజ్యసభలో ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్దిసేపటికే 2 గంటలకు వాయిదాపడింది. తర్వాత మొదలైనా గందరగోళం నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్, శశి థరూర్, మనీష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రక్షణ రంగ ఉపకరణాలు, ఉత్పత్తుల్ని తయారుచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది సమ్మెలను నిరోధించడానికి ఉద్దేశించిన ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశీయజల్లాల్లో సరకు రవాణాకు ఉద్దేశించిన ఇన్‌ల్యాండ్ వెసెల్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంక్షల నడుమ ‘కిసాన్ సంసద్’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సుమారు ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్న రైతన్నలు ఎట్టకేలకు పార్లమెంట్‌కు కూతవేటు దూరానికి చేరుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని తీవ్రతరం చేసే దిశలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏర్పాటుచేసిన కిసాన్ సంసద్(రైతు పార్లమెంట్) కార్యక్రమం గురువారం పోలీసు ఆంక్షల నడుమ ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొన్నారు. కిసాన్ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వ్యవహరించగా డిప్యూటీ స్పీకర్‌గా మన్జీత్ సింగ్ ఉన్నారు. తమ నిరసనల వాడి తగ్గలేదనీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలో తమకు కూడా తెలుసుననే విషయం ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావించని అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కిసాన్ పార్లమెంట్ వేదిక వద్దే ఉంటామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజాబ్, హరియాణా, యూపీలకు చెందిన రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
మూడవ రోజు పార్లమెంట్ సమావేశాలు: లోక్‌సభ రేపటికి వాయిదా
►లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. తిరిగి శుక్రవారం ఉదయం 11 గంటలకు సమావేశాలు ఆరంభం కానున్నాయి. ►విపక్షాల ఆందోళన మధ్య రాజ్యసభ రేపటికి వాయిదా పడగా.. లోక్ సభ సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా పడింది. లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళన.. రాజ్యసభ వాయిదా.. మధ్యాహ్నం 12 గంటలకు ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రారంభమైన కొద్దిసేపటికే రాజ్యసభ వాయిదా పడింది. సభ మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి ప్రారంభం కానుంది. ఉభయ సభలు వాయిదా : మూడవ రోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి. విపక్షాల ఆందోళనల మధ్య సభలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. ► లోక్ సభలో వైఎస్సార్ సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. అనేక ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం కడుతోంది.. విభజన చట్టానికి భిన్నంగా.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న.. తెలంగాణ ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై కేంద్ర మంత్రి షెకావత్ సమాధానం ఇస్తూ.. ‘‘ ఏపీ వాదన సరైందే, నిబంధనలకు విరుద్ధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న.. తెలంగాణ ప్రభుత్వానికి లేఖలు కూడా రాశాం. ఈ సమస్య పరిష్కారానికే గెజిట్ విడుదల చేశాం’’ అని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ -
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు
లైవ్ అప్డేట్స్: ►లోక్‌సభ గురువారానికి వాయిదా ►లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా ►వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళనలతో రాజ్యసభ తాత్కాలిక వాయిదా ►రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా నినాదాలు ► వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: ఎంపీలు ► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్సీపీ ఎంపీలు ► కరోనా గురించి చర్చిద్దాం.. ఆందోళన విరమించండి.. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరిన పీయూష్ గోయల్ ► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు ► రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన ► వెల్‌లోకి దూసుకెళ్లిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ పట్టు ► ఫ్లకార్డులతో పోడియం వద్ద వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన ► రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ ► సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరిన పీయూష్ గోయల్ ► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్సీపీ ఎంపీల నినాదాలు ► రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్సీపీ ప్రత్యేక హోదా నినాదాలు ► వెల్‌లోకి వచ్చి ఆందోళన చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు ► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: వైఎస్సార్సీపీ ► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్సీపీ ఎంపీలు ► రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు. ►ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్సీపీ పట్టు ► రాజ్యసభలో కోవిడ్‌పై చర్చ ► ప్రధాని ప్రజంటేషన్ కంటే ముందే చర్చకు విపక్షాల పట్టు ► విపక్షాల డిమాండ్‌కు సుముఖత వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్ ►మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ వాయిదా ►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాజ్య సభలో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ ఎంపీలు పట్టుపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో మరోసారి రాజ్యసభ వాయిదా పడింది. ►రాజ్యసభలో రెండో రోజు ఏపీకి ప్రత్యేక హోదాపై నోటీసు ►ఫ్లకార్డుతో పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన ►ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత అంశం: ఎంపీ విజయసాయిరెడ్డి ►రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్ ►పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. ►పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి: మాగుంట ►రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్లో ప్రస్తావిస్తాం: మాగుంట ► లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా ► రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా ► పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు. ► మరి కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాటి సమావేశాల్లో విపక్షపార్టీలు పెగాసస్ వ్యవహారాన్ని లేవనెత్తనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కోవిడ్ పరిస్థితులపై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ► మంగళవారం నాటి సమావేశాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఫోన్ల హ్యాకింగ్ వార్తలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పెగాసస్ వ్యవహారంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మధ్యాహ్నం రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. పార్లమెంట్లో వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగనున్నాయి. -
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు: తొలి రోజే వాయిదా పర్వం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో పోలవ రం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ప్రధాని మోదీ ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన కొత్త మంత్రులను పరిచయం చేసేందుకు లేచి నిలబడగానే లోక్‌సభలో విపక్షాలు తమ ఆందోళన ప్రారంభించాయి. దాం తో, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని అర్ధంతరం గా ముగించాల్సి వచ్చింది. విభిన్న అంశాలపై చర్చ కు పట్టుబట్టుతూ నోటీసులు ఇచ్చిన పలు విపక్ష పా ర్టీల సభ్యులు వెల్‌లోకి వచ్చి ఆందోళన చేయడంతో ఉభయ సభలు పలుమార్లు వాయిదాపడ్డాయి. ప్రధాన మంత్రికీ తప్పని నిరసన సెగ విపక్షాల ఆందోళనల మధ్య మంత్రులను పరిచయం చేయకుండానే ప్రధాన మంత్రి లోక్‌సభలో అర్ధాంతరంగా తన ప్రసంగం ముగించాల్సి వచ్చింది. ప్రధాన మంత్రి కొత్త మంత్రులను సభకు పరిచయడం చేయడం సంప్రదాయంగా వస్తోంది. సోమవారం వర్షకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో ప్రధాన మంత్రి తన నూతన మంత్రివర్గ సహచరులను ఉభయ సభలకు పరిచయం చేయాలని ప్రయత్నించగా విపక్షాలు నిరసనలతో అడ్డుపడ్డాయి. దీంతో ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని కొద్ది సేపట్లోనే ముగించారు. ఈ సందర్భంగా విపక్షాల వైఖరిని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో స్పందిస్తూ ‘కాంగ్రెస్ ప్రవర్తన విచారకరం. దురదృష్టకరం. ఈ ధోరణి అనారోగ్యకరమైనది’అని వ్యాఖ్యానించారు. విపక్ష సభ్యుల ఆందోళనతో సభాపతి ఓంబిర్లా నేరుగా మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభను వాయిదా వేశారు. మళ్లీ సమావేశమైనప్పటికీ రెండు నిమిషాలకే వాయిదా పడింది. తిరిగి 3.30 గంటలకు ప్రారంభమై 8 నిమిషాల పాటు మాత్రమే కొనసాగి మంగళవారానికి వాయిదాపడింది. మరోవైపు, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలను నిరసిస్తూ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు సమావేశాలకు సైకిళ్లపై వచ్చారు. ఇంధన ధరల పెరుగుదలపై సభలోనూ ఆందోళన చేపట్టారు. రైతుల ఆందోళనకు మద్దతుగా శిరోమణి అకాలీదళ్ సభ్యులు ప్లకార్డులు ప్రదర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొందరికి బాధగా ఉంది: ప్రధాని మోదీ పార్లమెంట్లో విపక్షాల వైఖరిని ప్రధాని మోదీ తప్పుబట్టారు. ఇలాంటి వ్యతిరేక వైఖరిని పార్లమెంట్లో ఎన్నడూ చూడలేదన్నారు. గ్రామీణ నేపథ్యం ఉన్నవారు, దళితులు, ఓబీసీలు, మహిళలు పెద్ద సంఖ్యలో మంత్రులు కావడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. తన ప్రసంగాన్ని ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడంపై స్పందిస్తూ.. ‘అధ్యక్షా.. కేబినెట్లోని కొత్త సభ్యులను ఈ సభకు పరిచయం చేయాలని మీరు నన్ను ఆదేశించారు. దేశ గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన రైతు కుటుంబాలకు చెందిన వారు మంత్రులు కావడం ద్వారా ఈ సభకు పరిచయం అవుతున్నప్పుడు కొంతమంది చాలా బాధపడుతున్నారు. ఈ రోజు ఈ సభలో మంత్రులుగా మారిన మహిళలను పరిచయం చేస్తుంటే.. వారిని పరిచయం చేసుకునేందుకు కూడా విపక్షాలు సిద్ధంగా లేవు. మహిళా వ్యతిరేక మనస్తత్వం వారిలో ఉంది. మహిళల పేరు వినడానికి కూడా సిద్ధంగా లేరు. షెడ్యూల్ తెగకు చెందిన మన ఎంపీలు పెద్ద సంఖ్యలో మంత్రులుగా మారారు. ఈ సభలో గిరిజన మంత్రులను పరిచయం చేయడం కూడా వారికి ఇష్టం లేదు. మన గిరిజనుల పట్ల వారికి అలాంటి కోపం ఉంది. ఈ సభలో పెద్ద సంఖ్యలో దళిత మంత్రులు వచ్చారు. దళిత సమాజం ప్రతినిధుల పేర్లు వినడానికి విపక్షాలు సిద్ధంగా లేవు. ఇది ఎలాంటి మానసిక స్థితి. దళితులను గౌరవించడానికి, రైతు బిడ్డలను గౌరవించడానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? మహిళలను గౌరవించటానికి సిద్ధంగా లేని ఈ మనస్తత్వం ఏమిటి? ఈ రకమైన వికృత మనస్తత్వాన్ని సభ మొదటిసారి చూసింది’అని విమర్శించారు. రాజ్యసభ మొత్తం నాలుగుసార్లు వాయిదాపడింది. వివిధ అంశాలపై చర్చించేందుకు రాజ్యసభలో నిబంధన 267 కింద 17 నోటీసులు వచ్చాయని, ఏపీకి ప్రత్యేక హోదా సహా అన్ని అంశాలు చర్చించదగినవేనని, అయితే ఇతర సందర్భాల్లో వాటిని చర్చించవచ్చని చెబుతూ రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు వాటిని తిరస్కరించారు. కొత్తగా సహాయ మంత్రి పదవి చేపట్టిన వ్యక్తి బంగ్లాదేశీయుడని పేర్కొంటూ, ఆ అంశాన్ని లేవనెత్తేందుకు విపక్షం ప్రయత్నించింది. అయితే, అవి నిరాధార వార్తలని ప్రభుత్వం కొట్టిపారేసింది. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గిరిజన నేతను అవమానించడం సరికాదని పేర్కొంది. 40 కోట్ల బాహుబలులు పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోందన్నారు. ‘టీకాను బాహువుకు ఇస్తారు. అందువల్ల టీకా తీసుకున్నవారు బాహుబలులు అవుతారు. మనం కరోనాపై పోరాడగలిగే బాహుబలిగా మారాలంటే టీకా తీసుకోవడం ఒక్కటే మార్గం’అని వ్యాఖ్యానించారు. ప్రదాని చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చరిత్ర సృష్టించిన తెలుగు సినిమా బాహుబలిని పలువురు గుర్తు చేశారు. టీకా మొదటి డోసు ‘బాహుబలి 1’అని రెండో డోసు ‘బాహుబలి 2’అని ట్విటర్ యూజర్ ఒకరు సరదాగా వ్యాఖ్యానించారు. ‘కరోనా వైరస్ కట్టప్పలాంటిది. వెన్నుపోటు పొడుస్తుంది. బాహుబలి సినిమాలా నిజ జీవితంలో రెండో పార్ట్ ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి’అని మరో యూజర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి మోదీ వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడారు. పార్లమెంటులో అన్ని సమస్యలపై ఆరోగ్యకరమైన రీతిలో చర్చ జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ‘కరోనా మహమ్మారికి సంబంధించిన అన్ని అంశాలు, మహమ్మారిపై మా పోరాటం చర్చకు వస్తుందని నేను ఆశిస్తున్నాను’అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు పదునైన, కఠినమైన ప్రశ్నలను అడగాలని, అయితే స్నేహపూర్వక వాతావరణంలో వాటిపై స్పందించడానికి ప్రభుత్వాన్ని కూడా అనుమతించాలని కోరారు. కోవిడ్–19 రెండో వేవ్ నిర్వహణ వైఫల్యాలు, ఇంధన ధరల పెరుగుదల, రైతుల ఆందోళన సహా పలు అంశాలపై ప్రతిపక్షాలు ఆందోళన వెలిబుచ్చుతున్న తరుణంలో ప్రధానమంత్రి ఈ విజ్ఞప్తి చేశారు. ‘మేం సభలో, సభ వెలుపల అన్ని స్థాయిల్లో నాయకులతో చర్చించాలనుకుంటున్నాం. నేను నిరంతరం ముఖ్యమంత్రులను సంప్రదిస్తున్నా. అన్ని రకాల చర్చలు వేర్వేరు వేదికల ద్వారా జరుగుతున్నాయి. సభ జరుగుతున్నందున నేను ఫ్లోర్ లీడర్లను కలవాలనుకుంటున్నాను. ఇది సౌకర్యవంతంగా ఉంటుంది. మహమ్మారి గురించి ముఖాముఖి మాట్లాడవచ్చు’అని ఆయన అన్నారు. -
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు: ఉభయసభలు రేపటికి వాయిదా
సాక్షి, న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి. పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. కోవిడ్ ప్రోటోకాల్స్‌ను సభ్యులందరూ అనుసరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాలు పత్యక్షంగా జరపటం సంతోషకరమన్నారు. లోక్‌సభలో వైఎస్ఆర్సీపీ ఎంపీల ఆందోళన లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీలు ఆందోళనకు దిగారు. పోలవరంపై చర్చకు వైఎస్సార్సీపీ ఎంపీల పట్టుబట్టారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళన రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఆందోళన చేశారు. ఎంపీ విజయసాయిరెడ్డి వెల్‌లోకి దూసుకెళ్లారు. ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై చర్చించాలని పట్టుపట్టారు. వైఎస్సార్సీపీ ఎంపీల ఆందోళనతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్సార్ సీపీ నోటీసు రాజ్యసభ: ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు వైఎస్సార్ సీపీ నోటీసు ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డి రూల్ 267 కింద ఛైర్మన్‌కు నోటీసు అందజేశారు. ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం. రాష్ట్ర విభజన సమయంలో అప్పటి ప్రధాని ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించారు.. ఏపీకి ప్రత్యేక హోదాపై 2014లో కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.. ఆమోదం తెలిపి ఏడేళ్లైనా కేంద్ర కేబినెట్ ప్రత్యేక హోదా హామీని నెరవేర్చలేదు.. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించాలని ఎంపీ విజయసాయిరెడ్డి నోటీసు ఇచ్చారు. రాజ్యసభలో గందరగోళం రాజ్యసభలో గందరగోళం నెలకొంది. కొత్త మంత్రుల పరిచయ కార్యక్రమాన్ని విపక్షాలు అడ్డుకున్నాయి. విపక్షాల తీరుపై ప్రధాని మోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయ సభలు వాయిదా.. ►లోక్‌సభలో విపక్షాల ఆందోళన మధ్యే ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని కొనసాగించారు. కేబినెట్లో ఎస్సీలు, మహిళల ప్రాతినిధ్యం శుభపరిణామమన్నారు. అనంతరం ఇటీవల మరణించిన ఎంపీలకు లోక్‌సభ సంతాపం తెలిపింది. లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను విపక్షాలు అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాల ఆందోళనలతో మధ్యాహ్నం 2 వరకు లోక్‌సభ వాయిదా పడింది. ►రాజ్యసభలో ఇటీవల మరణించిన మాజీ ఎంపీలకు సభ్యులు నివాళులు అర్పించారు. ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ మృతిపై రాజ్యసభ సంతాపం తెలిపింది. అనంతరం మధ్యాహ్నం 12:24 వరకు రాజ్యసభ వాయిదా పడింది. లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన పోలవరం అంచనా వ్యయం ఆమోదించాలని వైఎస్సార్ సీపీ.. పెట్రోల్ ధరల పెంపుపై కాంగ్రెస్.. వ్యాక్సినేషన్, ఆర్ధిక వృద్ధి పతనంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టాయి. ►పార్లమెంట్ వద్ద రైతు చట్టాలకు వ్యతిరేకంగా అకాలీదళ్ ఎంపీలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. లోక్‌సభలో తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణం లోక్‌సభలో ఇటీవల ఉప ఎన్నికల్లో గెలిచిన నలుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం ప్రధాని మోదీ కొత్త మంత్రులను సభకు పరిచయం చేశారు. ఈ సమావేశాల సందర్భంగా కేంద్రం 17 కొత్త బిల్లులతో సహా మరో 2 ఆర్థిక బిల్లులను ప్రవేశపెట్టనుంది. ఇటీవల జారీ చేసిన 3 ఆర్డినెన్స్‌లకు చట్టరూపం ఇవ్వనుంది. ప్రతి పక్షాలు పెట్రో ధరల పెంపు, వ్యాక్సినేషన్ ప్రక్రియ, ప్రభుత్వ వైఫల్యం.. సాగు చట్టాలు, రైతుల ఆందోళన వంటి అంశాలపై ప్రశ్నించనున్నారు. -
కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేతగా అధిర్ రంజన్
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఉభయసభల్లో పార్టీ గళం వినిపించడానికి లోక్‌సభ, రాజ్యసభల నేతలను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియాగాంధీ పునర్ నియమించారు. లోక్‌సభలో పార్టీ నేతగా అధిర్ రంజన్ చౌధురి, ఉపనేతగా గౌరవ్‌గొగోయ్, చీఫ్ విప్‌గా కె.సురేశ్, విప్‌లుగా రవ్నీత్ సింగ్ బిట్టు, మాణిక్కం ఠాగూర్, ఇంకా మనీష్ తివారి, శశిథరూర్‌లను నియమించారు. రాజ్యసభలో నేతగా మల్లికార్జున ఖర్గే, ఉపనేతగా ఆనంద శర్మ, చీఫ్ విప్‌గా జైరాం రమేశ్‌లను నియమించారు. ఇంకా సీనియర్ నేతలు అంబికా సోని, పి.చిదంబరం, దిగ్విజయ్ సింగ్, కేసీ వేణుగోపాల్లను నియమించారు. ఆయా నేతలు ఎప్పటికప్పుడు సమావేశమై సభల్లో లేవనెత్తాల్సిన అంశాలను చర్చించాలని సోనియా గాంధీ ఆదేశించారు. ఉభయసభల నేతలు సమావేశమైనప్పుడు మల్లికార్జున ఖర్గే సమన్వయకర్తగా వ్యవహరించనున్నారు. -
సభా సమరం షురూ..!
న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అర్థవంతమైన, ఆరోగ్యకరమైన చర్చలు జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. అన్ని పార్టీ లు సహకరించాలని, ఈ సమావేశాలు సజావుగా సాగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా కారణంగా కొందరు సభ్యులు మృతిచెందడం పట్ల ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. సోమవారం నుంచి వర్షాకాల సమావేశాల ప్రారంభం నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ప్రతిపక్షాల నుంచి నిర్మాణాత్మక సూచనలు అవసరమని, ఇవి చర్చలను మరింత ఫలప్రదంగా మారుస్తాయని చెప్పారు. సభ్యుల్లో అధికులు టీకాలు తీసుకున్నందున సభలు మరింత సజావుగా సాగుతాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. నిబంధనల ప్రకారం ఏ అంశంపైనైనా చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఉభయ సభలు సజావుగా సాగడానికి అన్ని పార్టీలు సహకరించాలని కోరారు. సమస్యలపై నిర్మాణాత్మక చర్చలు జరగాలన్నారు. సోమవారం నుంచి ఆగస్టు 13 వరకూ నిర్వహించే వర్షాకాల సమావేశాల్లో మొత్తం 19 సార్లు సభ సమావేశం అవుతుందన్నారు. 30 పైచిలుకు బిల్లులు వర్షాకాల సమావేశాల సందర్భంగా రెండు ఆర్థిక బిల్లులు సహా మొత్తం 30కి పైచిలుకు బిల్లులు ప్రవేశపెట్టనున్నట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు. వీటిలో ఇప్పటికే జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ట్రైబ్యునల్ సంస్కరణల బిల్లు, ఇన్సాల్వెన్సీ, బ్యాంక్రప్టసీ కోడ్ బిల్లు, హోమియోపతి సెంట్రల్ కౌన్సిల్ తదితర బిల్లులున్నాయి. వీటితో పాటు పలు కీలక బిల్లులు సైతం సమావేశాల్లో చర్చకు రానున్నాయి. ఈ అఖిలపక్ష సమావేశంలో టీఎంసీ, డీఎంకే, వైఎస్సార్సీపీ, శివసేన, జేడీయూ, బీజేడీ, ఎస్పీ, టీఆర్ఎస్, ఏఐడీఎంకే, బీఎస్పీ, ఎన్సీపీ, టీడీపీ, అకాలీదళ్ సీపీఐ, ఆప్ సహా 33 పార్టీల నేతలు పాల్గొన్నారు. వీరిలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గే, లోక్‌సభలో కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ సింగ్, టీఎంసీకి చెందిన డెరిక్ ఓబ్రెయిన్, డీఎంకే నుంచి తిరుచ్చి శివ, ఎస్పీ నుంచి రామ్‌గోపాల్ యాదవ్, బీఎస్పీకి చెందిన సతీష్ మిశ్రా, అప్నాదళ్ నేత అనుప్రియ, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ ఉన్నారు. ప్రధానితో పాటు హోం, రక్షణ మంత్రులు, రాజ్యసభ లీడర్ ఆఫ్ హౌస్ పీయూష్ గోయల్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. కేబినెట్ తాజా విస్తరణ అనంతరం జరుగుతున్న తొలి సమావేశాలు కావడంతో వీటిపై ఆసక్తి నెలకొంది. అందుకు ఒప్పుకోం దేశంలో కరోనా పరిస్థితిని పార్లమెంట్ ఉభయసభల ఎంపీలకు పార్లమెంట్ బయట ఏర్పాటు చేసే సమావేశంలో ప్రధాని వివరిస్తారనే కేంద్ర ప్రతిపాదనకు ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. ఇది పార్లమెంటరీ నియమాలను ఉల్లంఘించేందుకు మరోమార్గమని దుయ్యబట్టాయి. జూలై 20న ప్రధాని రెండు సభల ఎంపీలనుద్దేశించి పార్లమెంట్ అనుబంధ భవనంలో ప్రసంగిస్తారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ప్రకటించగానే, తొలుత టీఎంసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. పార్లమెంటు జరుగుతోందని, సభకు వచ్చి మాట్లాడాలని ఆపార్టీ ఎంపీ డెరిక్ అభిప్రాయపడ్డారు. దీనికి పలు ఇతర పక్షాల నేతలు కూడా మద్దతు ప్రకటించారని తెలిసింది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కొందరు నేతలు సూచించారు. పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఏం చెప్పాలన్నా సభలోనే చెప్పాలన్నది తమ అభిప్రాయమని సీపీఎం వ్యాఖ్యానించింది. వేరుగా ఎంపీలనుద్దేశించి ప్రసంగించడం తగదని పేర్కొంది. సోమవారం సభలు ఆరంభం కాగానే ఉప ఎన్నికల్లో ఎన్నికైన నూతన ఎంపీల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఎన్డీఏ నేతలతో ప్రధాని భేటీ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సందర్భంగా ప్రధాని మోదీ ఎన్డీఏలోని పార్టీల పార్లమెంటరీ నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. హోంమంత్రి అమిత్‌షా, రక్షణమంత్రి రాజ్నా«థ్, బీజేపీ అధ్యక్షుడు నడ్డా కూడా పాల్గొన్నారు. ఎన్డీఏ పక్షాల నేతల్లో అప్నాదళ్‌కు చెందిన అనుప్రియ, జేడీయూ నేత రామ్‌నాథ్ ఠాకూర్, ఏఐఏడీఎంకే నేత నవనీతకృష్ణన్, ఆర్పీఐ నేత రామ్‌దాస్ అథవాలే, ఎల్జేపీ నేత పశుపతి పరాస్ తదితరులున్నారు. ఈ సమావే శాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో ప్రధాని చర్చించారు. సభ పవిత్రతను గౌరవించాలి: ఓం బిర్లా సభ పవిత్రత, గౌరవాన్ని సభ్యులందరూ గౌరవించాలని సభాపతి ఓంబిర్లా తెలిపారు. ఆదివారం సభాపతి ఆధ్వర్యంలో నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. సభ సజావుగా సాగడానికి గత సమావేశాల మాదిరిగానే సహకరించాలని పార్టీల నేతలను ఓం బిర్లా కోరారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి అందరికీ తగిన సమయం కేటాయిస్తానన్నారు. త్వరలోనే ఒక యాప్ తీసుకొస్తున్నామని పార్లమెంటరీ వ్యవహారాలకు సంబంధించి వన్‌స్టాప్ సొల్యూషన్‌గా అది ఉపకరిస్తుందని ఓం బిర్లా తెలిపారు. కరోనా నేపథ్యంలో సభ్యులు, సిబ్బంది, మీడియా అందరికీ తగిన భద్రతా చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం ఓం బిర్లా మీడియాతో మాట్లాడుతూ.. దేశ ఆకాంక్షలకు సభ ప్రాతినిధ్యం వహిస్తుందని, ప్రజల సమస్యలను తెలియజేయడం సభ్యుల బాధ్యత అన్నారు. ప్రజా ప్రయోజనాలపై చర్చించడానికి అవకాశం ఉండాలని .. చిన్నపార్టీలు, ఏక సభ్యుడున్న పార్టీలకు కూడా తగిన సమయం కేటాయిస్తానని సభాపతి ఓంబిర్లా తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ, టీడీపీ, టీఆర్ఎస్ లోక్‌సభాపక్షనేతలు మిథున్‌రెడ్డి, రామ్మోహన్నాయుడు, నామా నాగేశ్వరరావులు పాల్గొన్నారు. ఎంపీలాడ్ ఫండ్స్ పునరుద్ధరించాలి! రాజకీయ పార్టీల డిమాండ్ ఎంపీ లాడ్ నిధులను పునరుద్ధరించాలని కాంగ్రెస్ సహా పలు పార్టీలు డిమాండ్ చేశాయి. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో పలు పార్టీలు ఈ డిమాండ్‌ను వినిపించాయి. పార్టీల డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతానని స్పీకర్ హామీ ఇచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి జోషీ ముందు ఎంపీ లాడ్ నిధులు మరలా ఇవ్వాలనే డిమాండ్‌ను వైఎస్ఆర్సీపీ నేత మిథున్ రెడ్డి, కాంగ్రెస్ నేత అధిర్ రంజన్, టీఎంసీ నేత సుదీప్ బందోపాధ్యాయ లేవనెత్తారు. ప్రజాప్రయోజన అంశాలపై మాట్లాడేందుకు సభ్యులకు తగిన సమయం ఇస్తానని ఈ సందర్భంగా స్పీకర్ హామీ ఇచ్చారు. ఎంపీలంతా సభ సజావుగా నడిచేందుకు సహకరించాలని కోరారు. ఐదు సెషన్లుగా పార్లమెంట్ సాఫీగా జరిగేందుకు సహకరించినందుకు నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆటంకాలు లేకుండా సభ నడిచేందుకు సహకరిస్తామని పార్టీల నేతలు స్పీకర్‌కు చెప్పినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కోవిడ్ నేపథ్యంలో సభా సమావేశాల ఏర్పాట్లను కట్టదిట్టం చేశామని స్పీకర్ చెప్పారు. -
సభ సజావుగా సాగేందుకు సహకరించాలి
సాక్షి, న్యూఢిల్లీ: సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సజావుగా నిర్వహించేందుకు ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరికొకరు సహకరించుకోవాలని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు కోరారు. శనివారం ఉపరాష్ట్రపతి నివాసంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయపక్షాల నేతలు తమ అభిప్రాయాలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్ళారు. కోవిడ్ వల్ల దేశంలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ప్రజల పక్షాన నిలబడాలని, సంబంధిత అంశాలపై చర్చించాలని వెంకయ్య నాయుడు కోరారు. వర్షాకాల సమావేశాల్లో 6 ఆర్డినెన్స్‌లతో కలిపి మొత్తం 29 బిల్లులను సభ ముందు ఉంచుతున్నామని, సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీల సహకారాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి కోరారని సమాచారం. ఈ సమావేశానికి రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రైల్వే, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సహా పలువురు మంత్రులు హాజరయ్యారు. -
పాపం సోనియాజీ.. మ్యాథ్స్‌లో పూర్ అనుకుంటా!
సాక్షి, న్యూ ఢిల్లీ: కేంద్రం ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు బలనిరూపణకు పావులు కదుపుతున్నాయి. అటు అధికార పార్టీ కూడా అవిశ్వాసం వీగిపోవడం ఖాయమని ధీమాగా ఉంది. ఈ క్రమంలో అధికార-ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. అవిశ్వాసం గెలవడానికి అవసరమైన సంఖ్యా బలం తమకు ఉందని, బీజేపీయేతర శక్తులను కలపుకొని మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని యూపీఏ ఛైర్పర్సన్ సోనియా గాంధీ ధీమా వ్యక్తం చేశారు. సోనియా వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి అనంతకుమార్ స్పందించారు. సోనియాజీ.. పాపం మ్యాథ్స్‌లో పూర్ అనుకుంటా అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముందుగా వారి పార్టీ ఎంపీల సంఖ్య ఎంతో చూసుకోండని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. మోదీ ప్రభుత్వానికి ఇంటా బయట స్పష్టమైన మద్దతుందని తెలిపారు. శివసేన పార్టీ ఎన్డీయేలో భాగస్వామేనని ఓ ప్రశ్నకి సమాధానంగా తెలిపారు. ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమి బలం 313 ఉండటంతో అవిశ్వాసంలో తమదే గెలుపని అనంతకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. 15 సంవత్సరాల తర్వాత తొలిసారి అవిశ్వాసంపై చర్చ జరగనుంది. చివరిసారిగా 2003లో వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఇలాంటి సందర్భాన్ని ఎదుర్కొన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభత్వం పెండింగ్‌లో ఉన్న బిల్లులను వీలైనన్ని ఆమోదించుకోవాలని భావిస్తోంది. ఇప్పటివరకు 68 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో కనీసం 25 బిల్లులకైనా ఆమోద్రముద్ర లభించే దిశగా పావులు కదుపుతోంది. ఇక ప్రతిపక్షాలు కూడా మోదీ ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగాలనే ఉద్దేశంతో ఉంది. దళితులపై దాడులు, మహిళల రక్షణ, రైతు సమస్యలు, నిరుద్యోగం తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. -
'అందంగా ఉంటుందనే ప్రేమించొద్దు'
న్యూఢిల్లీ: 'అందంగా ఉంటుందని మాత్రమే కశ్మీర్ ను ప్రేమించకండి.. అక్కడి ప్రజల్ని, వాళ్ల పిల్లల్ని, ఆందోళనల్లో కళ్లు పోయినవారినికి కూడా ప్రేమను పంచండి' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు కశ్మీరీ నేత, రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్. గడిచిన 32 రోజులుగా కశ్మీర్ లో అట్టుడుకుతున్న ఆందోళనలపై బుధవారం రాజ్యసభలో చర్చను ప్రారంభించిన ఆయన.. మిగతా భారతీయులలాగే కశ్మీరీలను సమదృష్టితో చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. (కశ్మీర్‌పై పెదవి విప్పిన ప్రధాని మోదీ) '32 రోజుల తర్వాతైన కశ్మీర్ ఆందోళనలపై ఎట్టకేలకు చర్చను అంగీకరించినందుకు ప్రభుత్వానికి ధన్యవాధాలు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగమనే నిజం. కానీ అక్కడి ప్రజలతో మనం కలిసిపోయామా?లేదా? అని ఆలోచించుకోవాలి. దాదాపు ప్రతి కశ్మీరీ కుటుంబం ఉగ్రవాద పీడను అనుభవించింది. ప్రస్తుతం అక్కడి పరిస్థితులు అత్యంత సున్నితంగా మారాయి. 32 రోజులుగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆగ్రహావేశాలకు కారణం ఏదైనా కావచ్చు.. దాన్ని పరిష్కరించే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించలేదు. కనీసం ఇప్పుడైనా కశ్మీరీలకు సంఘీభావం తెలపండి. అఖిలపక్షాన్ని పంపి, పరిస్థితులు చక్కబెట్టేందుకు చర్యలు తీసుకోండి. పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోపే ఆపని చేస్తే.. కశ్మీరీలకు భరోసా ఇచ్చినవాళ్లం అవుతాం'అని గులాం నబీ ఆజాద్ అన్నారు. తెలంగాణలో మాట్లాడితే ఢిల్లీకి వినబడుతుందా? దళితులపై దాడులు, కశ్మీర్ సమస్యలపై ప్రభుత్వ స్పందన కోసం పార్లమెంట్ లో ఎంపీలు ఆందోళనలు చేస్తోంటే.. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం ఆ సమస్యలపై పార్లమెంట్ లో కాకుండా బయటి సభల్లో స్పందించడమేమిటని ఆజాద్ ప్రశ్నించారు. 'తెలంగాణలో జరిగిన సమావేశంలో మీరు(ప్రధాని) దళితులపై దాడులను ఖండించారు. ఆ మాటలు పార్లమెంట్ వరకు వినబడలేదు. ఆ ప్రకటనేదో ఇక్కడి నుంచే చేస్తే సబబుగా ఉండేది'అని ఆజాద్ వ్యాఖ్యానించారు. -
చంద్రబాబుతో మాట్లాడుతున్నాం.. మీరు కూర్చోండి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైఎస్సార్ సీపీ ఎంపీల ఆందోళనలు నేడు కూడా కొనసాగాయి. శుక్రవారం ఉదయం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగిన వైఎస్సార్ సీపీ ఎంపీలు.. సభ ప్రారంభమైన తర్వాత హోదా నినాదాలు చేశారు. అయితే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాత్రం ప్రశ్నోత్తరాలను యథావిథిగా కొనసాగించారు. దీంతో అరుపులు, నినాదాల మధ్యే సభ కొనసాగుతున్నది. కాగా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ మధ్యలో కలుగజేసుకుంటూ.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇదివరకే ప్రకటించినట్లు కేంద్రం ఏపీకి ఇచ్చిన అన్ని హమీలు నిరవేర్చుతుందని, ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో సంప్రదింపులు జరుపుతున్నామని, దయచేసి మీరు(వైఎస్సార్ సీపీ ఎంపీలు) ఆందోళన విరమించి, స్థానాల్లోకి వెళ్లి కూర్చోవాలని విజ్ఞప్తి చేశారు. 'కూర్చోమని నేను కూడా చెప్పాను. కానీ వాళ్లు వినడంలేదు'అని స్పీకర్ వైఎస్సార్ సీపీ ఎంపీలను ఉద్దేశించి మంత్రికి చెప్పారు. విరణతో సంతృప్తి చెందని వైఎస్సార్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుకలు హోదా నినానాదాలు కొనసాగించారు. ఉదయం గాంధీ విగ్రహం వద్ద జరిగిన ధర్నాలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా పాల్గొన్నారు. -
కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ
-
కశ్మీర్ పై రాజ్యసభలో వాడివేడి చర్చ
న్యూఢిల్లీ: గడిచిన 12 రోజులుగా కశ్మీర్ లోయలోని 10 జిల్లాల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై రాజ్యసభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. హిజబుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్ కౌంటర్ అనంతరం చెలరేగిన ఆందోళనలు, భద్రతా బలగాల కాల్పుల్లో 41మంది పౌరులు మరణం, దాదాపు 2 వేల మందికి గాయాలు, సుదీర్ఘ కర్ఫ్యూతో నిత్యావసరాలకు సైతం జనం పడుతోన్న ఇబ్బందులు తదితర అంశాలపై విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశాయి. సోమవారం మధ్యాహ్నం కశ్మీర్ పై చర్చను ప్రారంభించిన కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్.. పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత బీజేపీ నేతల రెచ్చగొట్టే ప్రకటనలతో లోయలో ప్రశాంతత దెబ్బతిన్నదని ఆరోపించారు. ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఉపయోగించాల్సిన బుల్లెట్లను పౌరులపైకి ఎక్కుపెట్టడం దారుణమన్నారు. గడిచిన 12 రోజులుగా కశ్మీర్ లోయలో కర్ఫ్యూ కొనసాగుతున్నదని, పాలు, నీరు, ఆహారం లాంటి కనీస అవసరాలు కూడా ప్రజలకు అందడం లేదని వాపోయారు. కశ్మీర్ లో శాంతి నెలకొనేలా ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి చర్యలకైనా కాంగ్రెస్ పార్టీ బేషరతుగా మద్దతు ఇస్తుందని అన్నారు. (చదవండి: ప్రజలూ మీ దృష్టిలో మిలిటెంట్లేనా?) తర్వాత ఆర్థిక మంత్రి, రాజ్యసభలో బీజేపీ పక్ష నేత అరుణ్ జైట్లీ మాట్లాడారు. కశ్మీర్ లో వేర్పాటువాదులకు, దేశానికి మధ్య పోరాటం జరుగుతున్నదని, అన్ని సమస్యలకు కారణం దాయాది పాకిస్థానే అని జైట్లీ అన్నారు. కశ్మీర్ భారత్ లో అంతర్భాగంగా ఉండటాన్ని పాక్ ఎన్నటికీ జీర్ణించుకోలేదని, అందుకే వీలైనంత మేరలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నదని జైట్లీ ఆరోపించారు. లోయలో ప్రశాంతత నెలకొనేలా చర్యలకు ఉపక్రమిస్తామన్నారు. అరుణ్ జైట్లీ పదేపదే పాకిస్థాన్ ను నిందించడంపై సీపీఎం పక్ష నేత సీతారాం ఏచూరి అసహనం వ్యక్తం చేశారు. మితిమీరిన భద్రతా బలగాల వల్లే కశ్మీర్ లోయలో అశాంతిని రాజేస్తున్నదని ఆయన మండిపడ్డారు. ఈ అంశంపై విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. పాకిస్థాన్ తో సంబంధాల విషయంలో మోదీ ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తోందని, కొన్నిసార్లు అతి సామరస్యంగా.. మరికొన్నిసార్లు దుందుడుకు తనాన్ని ప్రదర్శిస్తూ గందోరగోళం సృష్టిస్తున్నదని విమర్శించారు. వారంతా భారతీయులే అనే భావన కశ్మీరీల్లో కలగజేయాల్సిన అవసరం ఉందని అన్నారు. సీసీఐ పార్టీ ఎంపీ డి. రాజా మాట్లాడుతూ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి కశ్మీర్ లో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించాలన్నారు. అవసరమైతే కశ్మీర్ లోయకు పార్లమెంటరీ ప్రతినిధి బృందాన్ని పంపాలని సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేశ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. జేడీయూ ఎంపీ శరద్ యాదవ్ మాట్లాడుతూ కశ్మీర్ లో ప్రస్తుత పరిణామాలు బాధకలిగిస్తున్నాయన్నారు. ఇంకా టీఎంసీ, ఏఐడీఎంకే, డీఎంకే, ఎన్సీపీ, బీఎస్పీ సభ్యులు కూడా కశ్మీర్ అంశంపై ప్రభుత్వానికి సూచనలు చేశారు.