లైవ్ అప్‌డేట్స్:
►లోక్‌సభ గురువారానికి వాయిదా
►లోక్‌సభ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా
►వైఎస్ఆర్‌సీపీ ఎంపీల ఆందోళనలతో రాజ్యసభ తాత్కాలిక వాయిదా
►రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా నినాదాలు
► వెల్‌లోకి వెళ్లి ఆందోళన చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: ఎంపీలు
► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► కరోనా గురించి చర్చిద్దాం.. ఆందోళన విరమించండి.. వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని కోరిన పీయూష్ గోయల్
► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీల నినాదాలు
► రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
► వెల్‌లోకి దూసుకెళ్లిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్‌సీపీ పట్టు
► ఫ్లకార్డులతో పోడియం వద్ద వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన
► రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్
► సభ సజావుగా జరిగేలా సహకరించాలని కోరిన పీయూష్ గోయల్
► ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైఎస్సార్‌సీపీ ఎంపీల నినాదాలు
► రాజ్యసభలో దద్దరిల్లిన వైఎస్సార్‌సీపీ ప్రత్యేక హోదా నినాదాలు
► వెల్‌లోకి వచ్చి ఆందోళన చేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► ఇదే సభలో హోదా ఇస్తామని నాడు హామీ ఇచ్చారు: వైఎస్సార్‌సీపీ
► కేంద్రం ఇచ్చిన హోదా హామీ నిలబెట్టుకోండి: వైఎస్సార్‌సీపీ ఎంపీలు
► రాజ్యసభ ప్రారంభమైన తర్వాత కూడా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగిస్తున్నారు.
►ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్ఆర్‌సీపీ పట్టు
► రాజ్యసభలో కోవిడ్‌పై చర్చ
► ప్రధాని ప్రజంటేషన్ కంటే ముందే చర్చకు విపక్షాల పట్టు
► విపక్షాల డిమాండ్‌కు సుముఖత వ్యక్తం చేసిన రాజ్యసభ ఛైర్మన్
►మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాజ్యసభ వాయిదా
►మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన రాజ్య సభలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై చర్చకు వైఎస్సార్‌సీపీ ఎంపీలు పట్టుపట్టారు. వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనతో మరోసారి రాజ్యసభ వాయిదా పడింది.
►రాజ్యసభలో రెండో రోజు ఏపీకి ప్రత్యేక హోదాపై నోటీసు
►ఫ్లకార్డుతో పోడియం వద్ద ఎంపీ విజయసాయిరెడ్డి ఆందోళన
►ప్రత్యేక హోదా అత్యంత ప్రాధాన్యత అంశం: ఎంపీ విజయసాయిరెడ్డి
►రూల్ 267 కింద ఇచ్చిన నోటీసును అనుమతించాలని డిమాండ్
►పోలవరం ప్రాజెక్ట్‌ను సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు..
►పోలవరం సవరించిన అంచనాలు వెంటనే ఆమోదించాలి: మాగుంట
►రాష్ట్రానికి రావాల్సిన నిధులపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం: మాగుంట
► లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా
► రాజ్యసభ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా
► పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కాగా విపక్షాల ఆందోళనల నేపథ్యంలో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. పెగాసస్ వ్యవహారంపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుపట్టాయి. అదేవిధంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరంపై ఉభయ సభల్లో వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆందోళన కొనసాగించారు.
► మరి కాసేపట్లో పార్లమెంటు వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభం కానున్నాయి. మంగళవారం నాటి సమావేశాల్లో విపక్షపార్టీలు పెగాసస్ వ్యవహారాన్ని లేవనెత్తనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ కోవిడ్ పరిస్థితులపై ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
► మంగళవారం నాటి సమావేశాల్లో కరోనా పరిస్థితులపై ప్రధాని మోదీ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఫోన్ల హ్యాకింగ్ వార్తలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. పెగాసస్ వ్యవహారంపై ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మధ్యాహ్నం రాజ్యసభలో ప్రకటన చేయనున్నారు. పెగాసస్ స్పైవేర్‌తో ప్రముఖుల ఫోన్లపై నిఘా ఉంచినట్లు ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే.
ఇక ప్రజాసమస్యలపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య పార్లమెంటు వర్షాకాల సమావేశాలు తొలిరోజు స్తంభించిపోయాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల, కోవిడ్ కట్టడి వైఫల్యాలపై కాంగ్రెస్, ఇతర పక్షాలు సోమవారం ఉభయ సభల్లో ఆందోళన చేపట్టాయి. లోక్‌సభలో పోలవరం ప్రాజెక్టుకు నిధుల అంశంపై, రాజ్యసభలో ప్రత్యేక హోదా అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. పార్లమెంట్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీల ఆందోళనలు ఈరోజు కూడా కొనసాగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment