న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని అఖిలపక్ష నేతలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. సభలో సభ్యత, క్రమశిక్షణ పాటించాలని కోరారు. సభా సంప్రదాయాలను, విలువలను కాపాడాలన్నారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓం బిర్లా శనివారం అఖిలపక్ష భేటీ నిర్వహించారు.
అగ్నిపథ్ పథకం, నిరుద్యోగం, రైతుల సమస్యలపై ఉభయ సభల్లో చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశానికి కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ, డీఎంకే, ఐయూఎంఎల్, ఎల్‌జేపీ, ఆప్నాదళ్ తదితర పార్టీల నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరపున పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్వాల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment