
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మొదటి రోజు అవాంతరం ఎదురైంది. విపక్షాల ఆందోళనతో సోమవారం రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది.
ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తూ సభ వెల్ దాకా దూసుకెళ్లారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది.
Comments
Please login to add a commentAdd a comment