Rajyasabha adjourned
-
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
విపక్షాల ఆందోళన.. రాజ్యసభ వాయిదా
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు మొదటి రోజు అవాంతరం ఎదురైంది. విపక్షాల ఆందోళనతో సోమవారం రాజ్యసభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది. ద్రవ్యోల్బణం, జీఎస్టీ రేట్ల పెంపుపై ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు రాజ్యసభలో నిరసన వ్యక్తం చేస్తూ సభ వెల్ దాకా దూసుకెళ్లారు. దీంతో సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరుగుతుండడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు లోక్‌సభ వాయిదా పడింది. -
‘ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా తయారుచేశారు’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంటులో తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి రాజ్యసభ లోపల, వెలుపలు ఆందోళనలను తీవ్రతరం చేశారు. గురువారం కూడా పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ వరప్రసాద్ ఆందోళన చేపట్టారు. ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. విపత్తును విఠలాచార్య సినిమా లాగా జయించానని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. విపత్తులను ఆపడానికి చంద్రబాబు ఏమైనా భగవంతుడా అని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా కావాలని చంద్రబాబు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా తెలుపలేదని అన్నారు. ఇటు ప్రత్యేక హోదా రాక.. అటు ప్యాకేజీ నిధులూ లేక.. ఏపీని రెంటికి చెడ్డ రేవడిలా చంద్రబాబు తయారు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అనే పదానికి అర్థం తెలియని చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనని విమర్శించారు. చంద్రబాబు తన స్వార్ధ ప్రయోజనాల కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. పెథాయ్ తుపాన్ కారణంగా జనం అల్లాడుతుంటే చంద్రబాబు రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లలో అందరికీ స్వీట్లు పంచుతున్నారని విమర్శించారు. వరప్రసాద్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా తెస్తామని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు దానిని గాలికి వదిలేశారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ ఒత్తిడితో చంద్రబాబు మళ్లీ ప్రత్యేక హోదా పాట పాడుతున్న విషయాన్ని గుర్తుచేశారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడారని తెలిపారు. ప్రజల నుంచి చంద్రబాబు ఊసరవెల్లిలాగా రంగులు మార్చారని వ్యాఖ్యానించారు. దుగ్గరాజపట్నం పోర్టు నిర్మాణం చేయాలని రాష్ట్రం నుంచి కేంద్రానికి ఒక లేఖ కూడా చంద్రబాబు రాయలేదని మండిపడ్డారు. కేంద్రం నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. ఓ ప్రైవేటు పోర్టును కాపాడేందుకు దుగ్గరాజపట్నం పోర్టు కోసం బాబు ప్రయత్నించలేదని ఆరోపించారు. కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. రాజ్యసభ రేపటికి వాయిదా.. విపక్షాల ఆందోళన నడుమ రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. సభ ప్రారంభమైన తర్వాత విపక్ష సభ్యులు ఆందోళనకు దిగడం సభ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడింది. ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్ సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, ప్రభాకర్ రెడ్డిలు వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. -
వెల్ లోకి దూసుకెళ్లిన సభ్యులు, రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు, నినాదాలతో ఆందోళనకు దిగారు. సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ సభ్యులను కోరినా పరిస్థతిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి. -
తెలంగాణ బిల్లుపై చర్చ జరుగకుండానే రాజ్యసభ వాయిదా
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)పై చర్చ జరుగకుండానే రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. తెలంగాణ బిల్లు ఈ రోజు చర్చకు రావడంలేదని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ చెప్పారు. బిల్లుపై ఈ రోజు చర్చకు అనుమతించడంలేదని ఆయన తెలిపారు. తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ముగ్గురు సీమాంధ్ర సభ్యులు వెల్ వద్ద ప్లకార్డులు పట్టుకొని నిలబడ్డారు. లోక్‌సభలో నిన్న ఆమోదం పొందిన విభజన బిల్లుపై రాజ్యసభలో ఈ రోజు చర్చ జరపాలని అనుకున్నారు. ఈ నేపథ్యంలో బిల్లు ప్రతులను రాజ్యసభ సభ్యులకు పంపిణీ చేశారు. మధ్యాహ్నం సభలో విభజన బిల్లుపై చర్చ జరుగుతుందని భావించారు. చర్చకు రెండు గంటల సమయం కూడా కేటాయించారు. సభ పలుమార్లు వాయిదాలు పడుతూ ఇతర బిల్లులను ఆమోదించారు. తెలంగాణ బిల్లు మాత్రం చర్చకు రాకుండానే డిప్యూటీ చైర్మన్ రేపటికి వాయిదా వేశారు.