విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు
న్యూఢిల్లీ : విపక్షాల నిరసనల మధ్య రాజ్యసభ ప్రారంభం అయిన కొద్ది నిమిషాల్లోనే వాయిదా పడింది. బుధవారం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు నిరసనలు, నినాదాలతో ఆందోళనకు దిగారు. సభ్యులపై సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వెల్ లోకి దూసుకెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అయితే సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ టిజి కురియన్ సభ్యులను కోరినా పరిస్థతిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో సమావేశాలను మధ్యాహ్నం 12 గంటల వరకూ వాయిదా వేశారు. మరోవైపు లోక్ సభ సమావేశాలు కొనసాగుతున్నాయి.