
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్‌ఖడ్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.
17వ లోక్‌సభలో ఈ ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై చర్చించారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా సభనుద్దేశించి ప్రసంగించారు.
ఈ ఐదేళ్లలో సాధించిన విజయాలను ఇరువరు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ అధికార,విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.