rajyasabha
-
అమిత్ షాకు ‘టీఎంసీ’ షాక్.. రాజ్యసభలో ప్రివిలేజ్ మోషన్
న్యూఢిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) షాకిచ్చింది. రాజ్యాంగంపై చర్చ సందర్భంగా మంగళవారం రాజ్యసభలో అంబేద్కర్‌పై చేసిన వ్యాఖ్యలకుగాను టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రియెన్ షాపై రాజ్యసభలో సభా హక్కుల ఉల్లంఘన (ప్రివిలేజ్ మోషన్) నోటీసు ఇచ్చారు. నోటీసు ఇచ్చిన అనంతరం డెరెక్ ఒబ్రియెన్ మాట్లాడుతూ అమిత్ షా వ్యాఖ్యలు అంబేద్కర్‌ను తక్కువ చేయడమే కాకుండా సభా మర్యాదను తగ్గించాయన్నారు. సభా మర్యాదను కించపరిచినందుకు షా పై చర్య తీసుకోవాలని ఒబ్రియెన్ కోరారు.అమిత్ షా రాజీనామా చేయాలి:కాంగ్రెస్అంబేద్కర్పై చేసినవ్యాఖ్యలకు గాను అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే డిమాండ్ చేశారు. ఈ విషయమై ఆయన బుధవారం(డిసెంబర్ 18) పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేయడమే కాకుండా దేశ ప్రజలకు షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
రాజ్యాంగంపై చర్చ.. వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి కీలక ప్రసంగం
సాక్షి,న్యూఢిల్లీ: రాజ్యాంగంలోని ఆర్టికల్ 81,82 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన జరగాలని వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం(డిసెంబర్16) రాజ్యసభలో రాజ్యాంగంపై జరిగిన చర్చలో నిరంజన్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘దేశ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనలో తగిన ప్రోత్సాహం ఉండాలి. నియోజకవర్గాల పునర్విభజన సమయంలో మా రాష్ట్రాల అభిప్రాయాలను కచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. ఎన్నికల సంస్కరణలను తీసుకురావాల్సిన అవసరం ఉంది. రోజురోజుకి ఎన్నికల ఖర్చు భారీగా పెరిగిపోతోంది. ఎన్నికల్లో పోటీకి దిగాలంటే ఖర్చును చూసి భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తగిన చట్టాలు రావాలి. ప్రజా ప్రాతినిధ్య చట్టాలలో తగిన మార్పులు రావాలి. నాణ్యమైన విద్య,వైద్యం తమ పిల్లలకు అందించే క్రమంలో తల్లిదండ్రులు పేదరికంలోకి జారుకుంటున్నారు. పేదరికానికి ప్రధాన కారణాలు విద్య,వైద్యం ఖర్చు పెరగడమే. దేశంలో ఆర్థిక అసమానతలు,ఆదాయ వ్యత్యాసాలు పెరుగుతున్నాయి.రాజ్యాంగ ఉద్దేశాలు ఇంకా పరిపూర్ణంగా సాధించలేదు. రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ కనుక రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలి.సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పని భారం పెరుగుతోంది.141 కోట్ల జనాభాకు కేవలం 35 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తులున్నారు. ట్రిబ్యునల్స్ నుంచి నేరుగా సుప్రీంకోర్టుకే అప్పీల్‌కు వెళ్లకుండా, హైకోర్టులకు తగిన ప్రాధాన్యత కల్పించాలి’అని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు.ఇదీ చదవండి: ఏపీలో రాజ్యాంగ విరుద్ధ పాలన జరుగుతోంది: ఎంపీ విజయసాయిరెడ్డి -
రాజ్యసభలో నోట్ల కలకలం
సాక్షి, న్యూఢిల్లీ: కరెన్సీ నోట్ల వ్యవహారం శుక్రవారం రాజ్యసభను కుదిపేసింది. అధికార, విపక్ష సభ్యుల వాగ్వాదం, మాటల యుద్ధంతో దుమారం రేగింది. పరస్పర విమర్శలతో వాతావరణం వేడెక్కింది. ఉదయం సభ సమావేశమవగానే చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభిõÙక్ మను సంఘ్వీ సీటు నుంచి రూ.500, రూ.100 నోట్ల కట్ట దొరికినట్టు ప్రకటించారు. ‘‘గురువారం సభ వాయిదా పడ్డాక భద్రతా సిబ్బంది రోజువారీ తనిఖీలో 222 నంబర్ సీటు వద్ద నోట్ల కట్ట దొరికింది. అది తెలంగాణ నుంచి ఎంపికైన సంíఘ్వీకి కేటాయించిన స్థానం. అవి అసలైనవో, నకిలీవో తెలియదు. నిబంధనల ప్రకారం దీనిపై విచారణకు ఆదేశించా. దీన్ని సభ ముందుంచడం నా బాధ్యత. కనుక మీ దృష్టికీ తీసుకొస్తున్నా’’ అని వివరించారు. ‘‘అవి తమవేనని ఎవరైనా చెబుతారేమోనని చూశా. కానీ ఇప్పటికైతే ఎవరూ ముందుకు రాలేదు. ఇలా నోట్ల కట్టలను కూడా ఎక్కడో పెట్టి మర్చిపోయేన్ని డబ్బులున్నాయేమో మరి!’’ అన్నారు. చైర్మన్ ప్రకటన సభలో తీవ్ర గందరగోళానికి దారితీసింది. కాంగ్రెస్ సభ్యులు ఏకంగా సభలోకే నోట్ల కట్టలు తెస్తున్నారంటూ బీజేపీ ఎంపీలు విమర్శలకు దిగారు. దీనిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ సభా కార్యకలాపాలను అడ్డుకున్నారు. చైర్మన్ సింఘ్వీ పేరు చెప్పడాన్ని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. విచారణ జరగకుండానే నేరుగా సభ్యుని పేరు బయట పెట్టి ఆయన గౌరవం తగ్గిస్తారా అంటూ ఆక్షేపించారు. అందులో తప్పేముందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ప్రశ్నించారు. ఏ సభ్యుని సీట్లో నోట్లు దొరికాయో చెబితే అభ్యంతరపెట్టడం ఎందుకన్నారు. ‘‘ఇలా సభలోకి నోట్ల కట్టలు తేవడం సరికాదు. దీనిపై సమగ్ర విచారణ జరగాల్సిందే’’ అన్నారు. పార్లమెంటులోకి రసాయనాలు వెంట పెట్టుకుని వచి్చన ఉదంతాలను ధన్‌ఖడ్ గుర్తు చేశారు. ‘‘అందుకే విద్రోహ నివారణ తనిఖీలు కఠినంగా జరగాలన్నది నా ఉద్దేశం. భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఆ కోణంలోనే పకడ్బందీగా రోజువారీ తనిఖీలు జరుగుతున్నాయి’’ అని వివరించారు. ‘‘సదరు సభ్యుడు గురువారం సభకు హాజరయ్యారు. ఆయన పేరు ప్రస్తావించినంత మాత్రాన విచారణపై ప్రభావమేమీ చూపదు’’ అని చెప్పారు. ఇది సభ గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయమని సభా నాయకుడు జేపీ నడ్డా అభిప్రాయపడ్డారు. ‘‘దీనిపై విపక్ష సభ్యులు తలో అభిప్రాయం వెలిబుచ్చడం సరికాదు. అంతా ఒక్కతాటిపైకి వచ్చి దీన్ని ఖండిస్తూ తీర్మానం చేద్దాం’’ అని సూచించారు. ‘‘కొన్ని అంశాలపై చర్చ కోసం అత్యుత్సాహం చూపిస్తారు. ఇలాంటి కొన్ని అంశాలనేమో దాచేసే ప్రయత్నం చేస్తారు’’ అంటూ విపక్షాలపై విమర్శలు గుప్పించారు. వాటిని ఖర్గే తీవ్రంగా ఖండించారు. ఆ అలవాటు అధికార పక్షానిదే తప్ప తమది కాదన్నారు. అధికార పక్ష ఎంపీలను కేంద్ర మంత్రులే తమపైకి ఉసిగొల్పుతున్నారని తిరుచ్చి శివ (డీఎంకే) ఆరోపించారు. ‘‘వాటిని నేను కళ్లారా చూశాను. ఇది ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు. దాంతో సభలో మరింత గందరగోళం నెలకొంది. దర్యాప్తుకు తాము అడ్డుచెప్పడం లేదని ఖర్గే స్పష్టం చేశారు. సభలో ప్రత్యేకంగా చర్చ అవసరం లేదని మాత్రమే చెబుతున్నామన్నారు. ‘‘ఈ రోజు నోట్లు దొరికాయి. రేపు ఇంకేమీ దొరుకుతాయో తెలియడం లేదు’’ అని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. దీనిపై లోతైన విచారణ జరగాల్సిందేనన్నారు. పరిస్థితి సద్దుమణిగాక జీరో అవర్ కొనసాగింది.గ్లాస్ సీలింగ్ వేయాలేమో: సింఘ్వీ నోట్ల వ్యవహారంపై బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని సింఘ్వీ మండిపడ్డారు. గురువారం రాజ్యసభకు వచి్చనప్పుడు తన వద్ద కేవలం ఒకే ఒక్క రూ.500 నోటుందని ఆయన స్పష్టం చేశారు. ‘‘నేను మూడు నిమిషాలే సభలో ఉన్నా! మధ్యాహ్నం 12.57 గంటలకు సభలో ప్రవేశించా. ఒంటిగంటకే సభ వాయిదా పడింది. 1:30 దాకా క్యాంటీన్లో ఉండి వెళ్లిపోయా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘‘ఇంకొకరి సీటు వద్ద నోట్ల కట్ట ఎలా వేస్తారు? ఇకపై గంజాయి వంటివి కూడా పెడతారేమో. ఇకపై సభ్యులు ఎవరి సీటుకు వారు వైర్ ఫెన్సింగో, గ్లాస్ సీలింగో ఏర్పాటు చేసి, దానికి తాళం వేసి కీస్ తమతో పాటు ఇంటికి తీసుకెళ్లాలేమో!’’ అంటూ విమర్శలు గుప్పించారు. ‘‘దీనిపై విచారణ జరగాలి. భద్రతా వైఫల్యముంటే ఆ విషయాలూ వెలుగులోకి రావాలి’’ అని సింఘ్వీ డిమాండ్ చేశారు. -
మరోసారి పార్లమెంట్ ను కుదిపేసిన అదానీ వ్యవహారం
-
రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా
సాక్షి,న్యూఢిల్లీ:రాజ్యసభ ఎంపీ పదవికి ఆర్.కృష్ణయ్య రాజీనామా చేశారు.కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించారు. కృష్ణయ్య రాజీనామాతో రాజ్యసభలో ఆయన స్థానం ఖాళీ అయినట్లు రాజ్యసభ స్రెటేరియట్ మంగళవారం(సెప్టెంబర్24) నోటిఫై చేసింది. బీసీ సంఘం జాతీయ నేతగా ఉన్న ఆర్.కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున రాజ్యసభకు ప్రాతినిథ్యం వహించారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామాపై కృష్ణయ్య స్పందించలేదు. -
మెడికల్ కౌన్సిలింగ్లో ఓబీసీ కోటా అమలు చేయాలి: ఎంపీ బీదమస్తాన్‌రావు
సాక్షి,న్యూఢిల్లీ: మెడికల్ కౌన్సిలింగ్లో 27శాతం ఓబీసీ రిజర్వేషన్లను నూటికి నూరు శాతం అమలు చేయాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు డిమాండ్ చేశారు. రాజ్యసభలో మంగళవారం(ఆగస్టు 6) జీరో అవర్‌లో మస్తాన్‌రావు మాట్లాడారు. మెరిట్ కోటా కింద సీట్లు పొందిన ఓబీసీ విద్యార్థులను రిజర్వేషన్ కోటా కింద లెక్కించడంపై మస్తాన్‌రావు అభ్యంతరం తెలిపారు. అభ్యర్థుల స్లైడింగ్ సందర్భంగా ఓబీసీలు ఖాళీ చేసిన ఓపెన్ కాంపిటీషన్ సీటును అదే రిజర్వ్డ్ కేటగిరీకి చెందిన అభ్యర్థి తో భర్తీ చేయాలన్నారు. ఓబీసీ విద్యార్థులకు సంవత్సరాల తరబడి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. -
ఈ చిన్నారిని గుర్తుపట్టారా? ఇపుడు రాజ్యసభ ఎంపీ!
రాజ్యసభ, ఎంపీ, రచయిత సుధానారాయణమూర్తి సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అనేక సామాజిక అంశాలపై తన అభిప్రాయాలను పంచుకుంటూ ఉంటారు. ఒక్కోసారి తన వ్యక్తిగత విషయాలను జోడిస్తూ, మరికొన్ని అవగాహన కల్పించే అంశాలను తన అభిమానులతో కూడా షేర్ చేస్తూ ఉంటారు. తాజాగా తన చిన్నప్పటి ఫోటో ఒకటి ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఇది అభిమానులను ఆకట్టుకుంటోంది.‘‘ఈ ఫోటో నాకు సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు హుబ్లీలోని ఒక స్టూడియోలో తీసింది. ఆ సమయంలో, మేము షిగ్గావ్‌లో ఉండేవాళ్లం, కానీ అక్కడ స్టూడియోలు లేనందున, మేము ఈ ఫోటో కోసం హుబ్లీకి వెళ్లాం’’ అంటూ సుధామూర్తి తన బాల్య స్మృతులను నెమరు వేసుకున్నారు.This picture was taken in a studio in Hubli when I was around 1 year old. At the time, we were living in Shiggaon, but since there were no studios there, we travelled to Hubli for this photograph. pic.twitter.com/YjhjJ3Aw5L— Smt. Sudha Murty (@SmtSudhaMurty) July 30, 2024 -
‘తల్లీ నిర్మల’.. ఖర్గే మాటలతో రాజ్యసభలో నవ్వులు
న్యూఢిల్లీ: రాజ్యసభలో బుధవారం(జులై 24) బడ్జెట్‌పై చర్చ సందర్భంగా నవ్వులు పూశాయి. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ను ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ‘మాతాజీ’ అని సంబోధించారు.వెంటనే చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుని ఆమె మీకు కూతురులాంటిది అని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. దీంతో సభ్యులంతా ఒక్కసారిగా విరగబడినవ్వారు. కేంద్ర బడ్జెట్లో ఈసారి కేవలం బిహార్, ఏపీల ప్లేట్లలోనే జిలేబి, పకోడి వడ్డించారని, మిగతా రాష్ట్రాల ప్లేట్లన్నీ ఖాళీగానే ఉన్నాయని ఖర్గే అన్నారు. ఇంతలో ఆర్థిక మంత్రి నిర్మల మాట్లాడతారని చైర్మన్ ఖర్గేతో అన్నారు. మాతాజీ నిర్మల మాట్లాడడంలో మంచి నేర్పరి..నేను మాట్లాడడం అయిన తర్వాత ఆమెను మాట్లాడమనండి అని ఖర్గే చైర్మన్‌ను కోరారు. దీనికి స్పందించిన చైర్మన్ ఆమె మీకు కూతురులాంటిది అనడంతో సభలో నవ్వులు పూశాయి. -
ఏపీలో హింస పెరిగింది: ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతోందని, టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నాయని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం(జులై1) రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వైఎస్ఆర్సీపీ తరపున రఘునాథ్‌రెడ్డి మాట్లాడారు. ‘వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ అభిమానులు, సానుభూతిపరులపై హింసకు తెగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్జగన్ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.ప్రత్యేక హోదా వల్ల రాయితీలు, నిధులు ఏపీకి వస్తాయి. ఏపీలో మీడియా ఛానల్స్ ను అణిచి వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ మారిటైమ్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అనేక ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు’అని వివరించారు. -
రాజ్యసభ ఎంపీగా 'సుధామూర్తి' ప్రమాణ స్వీకారం
ఇంజనీర్ నుంచి పరోపకారిగా మారి ఎంతోమందికి సహాయం చేస్తున్న'సుధామూర్తి' ఈ రోజు (గురువారం) తన భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి సమక్షంలో రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని తన ఛాంబర్లో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పీయూష్ గోయల్ కూడా పాల్గొన్నారు. ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ చైర్పర్సన్, రచయిత్రి సుధామూర్తి పిల్లల కోసం అనేక పుస్తకాలను రచించింది. కన్నడ, ఇంగ్లీష్ సాహిత్యానికి ఆమె చేసిన కృషికి సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కారంలభించింది. అంతే కాకుండా ఈమెను 2006లో పద్మశ్రీ, 2023లో పద్మ భూషణ్ అవార్డులు వరించాయి. గత శుక్రవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సుధామూర్తి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఈ రోజు ప్రమాణస్వీకారం చేశారు. TELCOతో పనిచేసిన మొదటి మహిళా ఇంజనీర్ అయిన సుధామూర్తి.. నేడు వేలకోట్ల సామ్రాజ్యంగా మారిన ఇన్ఫోసిస్ ప్రారంభానికి ప్రధాన కారకురాలు కూడా. #WATCH | Author and philanthropist Sudha Murty, nominated to the Rajya Sabha by President Droupadi Murmu, takes oath as a member of the Upper House of Parliament, in the presence of House Chairman Jagdeep Dhankhar Infosys founder Narayan Murty and Union Minister Piyush Goyal… pic.twitter.com/vN8wqXCleB — ANI (@ANI) March 14, 2024 -
ముగిసిన 17వ లోక్‌సభ.. పార్లమెంట్ నిరవధిక వాయిదా
న్యూఢిల్లీ: పదిహేడవ లోక్‌సభ చివరి సమావేశాలు శనివారం ముగిశాయి. దీంతో పార్లమెంట్ ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. బడ్జెట్ సమావేశాలు ముగియడంతో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ దన్ఖడ్ సభలను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. 17వ లోక్‌సభలో ఈ ఐదేళ్లలో మొత్తం 222 బిల్లులు ఆమోదం పొందినట్లు స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. సమావేశాల చివరిరోజున రామమందిరం నిర్మాణంపై చర్చించారు. దీనిపై ప్రధాని మోదీతో పాటు హోం మంత్రి అమిత్‌షా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఐదేళ్లలో సాధించిన విజయాలను ఇరువరు వివరించారు. స్పీకర్ ఓంబిర్లా మాట్లాడుతూ అధికార,విపక్ష బెంచ్‌లను సమానంగా చూశానని, సభా గౌరవం కాపాడేందుకు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఇదీ చదవండి.. నాథుడు లేని పార్టీకి అందలమెలా..? -
NDA: ఉపరాష్ట్రపతికి సంఘీభావంగా..
సాక్షి, ఢిల్లీ: దేశ ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ను హేళన చేస్తూ టీఎంసీ ఎంపీ ఒకరు చేసిన చేష్టలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది. చైర్మన్ ధన్కడ్ ఈ చర్యను ఖండించగా.. ప్రధాని మోదీ ఈ ఉదయం ఉపరాష్ట్రపతికి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు కూడా. ఈ క్రమంలో.. బుధవారం పెద్దల సభలో ఎన్డీయే ఎంపీలు, ధన్కడ్కు సంఘీభావం ప్రకటించారు. ‘‘ఈ చర్యను మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. వాళ్లు రాజ్యాంగ బద్ధమైన స్థానాల్లో ఉన్నవాళ్లను పదే పదే అవమానిస్తున్నారు. అన్నివిధాలుగా పరిధి దాటి ప్రవర్తించారు. ఓబీసీ కమ్యూనిటీ నుంచి వచ్చిన ఓ ప్రధానిని అవమానిస్తూ వస్తున్నారు. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని అవమానించారు. జాట్ కమ్యూనిటీ నుంచి ఉపరాష్ట్రపతి అయిన తొలి వ్యక్తి మీరు. ఓ సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. అలాంటి మిమ్మల్ని ఇప్పుడు అవమానించారు. మీరు ఉన్న ఉన్నతస్థానం పట్ల వాళ్లకు గౌరవం లేదు. రాజ్యాంగాన్ని, ఉపరాష్ట్రపతిని అవమానించడం మేం సహించలేం అని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి రాజ్యసభలో తెలిపారు. వాళ్లకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ.. మీకు గౌరవసూచికంగా ప్రశ్నోత్తరాల సమయం మొత్తం మేం నిలబడాలని నిర్ణయించుకున్నాం అని తెలిపారాయన. ఏం జరిగిందంటే.. ఎంపీల సస్పెన్షన్ పరిణామం అనంతరం.. పార్లమెంటు వెలుపల మంగళవారం ఓ ఘటన చోటుచేసుకుంది. ఎంపీలను మూకుమ్మడిగా సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ వెలుపల విపక్ష ఎంపీలు ఆందోళన నిర్వహించారు. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్కడ్ను ఉద్దేశించేలా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ అనుకరణ చేశారు. ఆయన గొంతును అనుకరిస్తూ.. విచిత్రంగా ప్రవర్తించారు. ఆ సమయంలో విపక్ష సభ్యులు నవ్వులు కురిపిస్తుండగా.. రాహుల్ గాంధీ ఆ దృశ్యాలను తన ఫోన్లో చిత్రీకరించారు. దీనిపై ధన్కడ్ మండిపడుతూ.. ఎంపీ స్థానంలో ఉండి ఛైర్మన్‌ని హేళన చేయడం సిగ్గుచేటన్నారు. ఇది ఎంత మాత్రం ఆమోదయోగ్యం కాదని అన్నారు. If the country was wondering why Opposition MPs were suspended, here is the reason… TMC MP Kalyan Banerjee mocked the Honourable Vice President, while Rahul Gandhi lustily cheered him on. One can imagine how reckless and violative they have been of the House! pic.twitter.com/5o6VTTyF9C — BJP (@BJP4India) December 19, 2023 మరోవైపు రాజకీయంగా ఈ ఘటన దుమారం రేపుతోంది. అధికార-విపక్ష ఎంపీలు తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సైతం స్పందించారు. రాహుల్ జీ(రాహుల్ గాంధీ) వీడియో తీసి ఉండకపోతే.. ఈ వ్యవహారంపై ఇంత రాద్దాంతం జరిగి ఉండి కాదేమో అనేలా ఆమె ప్రకటన ఇచ్చారు. మరోవైపు టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, ధన్కడ్కు క్షమాపణలు చెప్పాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. జాట్ కమ్యూనిటీ సైతం ఈ డిమాండ్‌తో నిరసనలకు దిగింది. #WATCH | On TMC MP mimicry row, West Bengal CM Mamata Banerjee says, "...You wouldn't have come to know if Rahul ji had not recorded a video..." pic.twitter.com/t1gNmnI69p — ANI (@ANI) December 20, 2023 -
డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం సీరియస్
సాక్షి, న్యూఢిల్లీ: డీప్ ఫేక్ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముఖ్యమైన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌కు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సూచనలు చేసింది. ఈ వివరాలను కేంద్ర సహయమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. ‘డీఫ్ ఫేక్’ ఫొటోలు, వీడియోల సృష్టికర్తల ఆగడాలను ఊపేక్షించేదిలేదని, భారీ జరిమానాలను వి«ధిస్తామని ఇటీవల కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ సంస్థల సమావేశంలో హెచ్చరించిన విషయం తెల్సిందే. సంబంధిత మార్గదర్శకాలను, త్వరలో తీసుకురాబోయే చట్టాలను, నిబంధనలను రాజ్యసభ దృష్టికి తీసికెళ్లినట్లు మంత్రి పేర్కొన్నారు. సెక్షన్ 66డీ కింద కంప్యూటర్ ఆధారిత సాంకేతికతతో ఇలాంటి చర్యలకు పాల్పడితే మూడేళ్ల జైలు శిక్ష, రూ.1 లక్ష జరిమానా విధిస్తామని మంత్రి చంద్రశేఖర్ రాజ్యసభకు తెలిపారు. -
బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలకు ప్రివిలేజ్ నోటీసులు
-
రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ సస్పెన్షన్
న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభ నుంచి టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ సస్పెండ్ చేస్తున్నట్లు సభ చైర్మన్ జగదీప్ ధన్కర్ మంగళవారం వెల్లడించారు. ఈ సస్పెన్షన్ వేటు వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు పూర్తయ్యే వరకు కొనసాగుతుందని చెప్పారు. మంగళవారం రాజ్యసభ సమావేశాలు మొదలవుతూనే ఢిల్లీ అధికారాలు గురించిన వాడి వేడి చర్చ మొదలైంది. ఇదే క్రమ్మలో టీఎంసీ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి అదేపనిగా నినాదాలు చేశారు. స్పీకర్ పలు మార్లు వారించే ప్రయత్నం చేసినా కూడా ఆయన వినిపించుకోకుండా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో విసుగు చెందిన స్పీకర్ ఒబ్రెయిన్ పై ససపెన్షన్ వేటు విధించారు. సభలో అనుచితంగా వ్యవహరించి సభా కార్యకలాపాలకు అడ్డంకిగా నిలిచినందుకు ఆయనపై సస్పెన్షన్ విధిస్తున్నట్లు తెలిపారు. ఈ సస్పెన్షన్ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే వరకు వర్తిస్తుందని అన్నారు. స్పీకర్ మాట్లాడుతూ.. ఇది మీకు అలవాటుగా మారిపోయింది. ఇదంతా మీ ప్రణాళికలో భాగమేనని మాకు అర్ధమవుతుంది. ఇలా చేస్తే మీకు బయట పబ్లిసిటీ వస్తుందన్నది మీ ఉద్దేశ్యం. మీ హోదాని దిగజార్చుకుంటూ చాలా అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. సభా గౌరవాన్ని కించపరచడం భావ్యం కాదని చెబుతూ డెరెక్ ఒబ్రెయిన్ పై సస్పెన్షన్ వేటు వేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ పైన కూడా స్పీకర్ ఇదే విధంగా సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. ఇది కూడా చదవండి: ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు -
రాజ్యసభలో ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లు.. వైఎస్సార్సీపీ మద్దతు..!
-
కొత్త పార్లమెంట్ ఇన్సైడ్ ఫస్ట్ లుక్.. వీడియో అదుర్స్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముస్తాబైంది. అధికార బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆధునిక హంగులతో పార్లమెంట్ భవనాన్ని నిర్మించింది. ఇక, కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం మే 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుంది. ఈ నేపథ్యంలో కొత్త భవనం ఫస్ట్ లుక్ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో పార్లమెంట్ లోపలి, బయటి దృశ్యాలు ఉన్నాయి. లోక్‌సభ, రాజ్యసభ.. ఆ రెండు సభల్లో సీటింగ్ అమరికకు సంబంధించిన దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి. కాగా, కొత్త పార్లమెంట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. - పార్లమెంట్ లోపలి భాగంలో మూడు జాతీయ చిహ్నాలు ఉన్నాయి. - కమలం, నెమలి, మర్రి చెట్టు - దాని ఇతివృత్తాలు. - త్రిభుజాకారంలో నాలుగు అంతస్తుల పార్లమెంటు భవనం 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. - ఈ భవనంలో మూడు ప్రధాన ద్వారాలు ఉన్నాయి - జ్ఞాన్ ద్వార్, శక్తి ద్వార్ మరియు కర్మ ద్వార్. - స్పీకర్ కుర్చీకి సమీపంలో సెంగోల్‌ను ఏర్పాటు చేస్తారు. #WATCH | Delhi: First look at the New Parliament building that will be inaugurated by Prime Minister Narendra Modi on May 28.#NewParliamentBuilding pic.twitter.com/ouZoz6dLgu — ANI (@ANI) May 26, 2023 ఇది కూడా చదవండి: రెగ్యులర్ పాస్‌పోర్టు కోసం రాహుల్ గాంధీ.. లైన్ క్లియర్ -
రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. -
ఖర్గే వ్యాఖ్యలపై ఛైర్మన్ జగ్దీప్ ధన్కడ్ సీరియస్
-
'దేశ ప్రజలను కాంగ్రెస్ వంచించింది.. పాపాలకు శిక్ష అనుభవిస్తోంది'
న్యూఢిల్లీ: బుధవారం లోకసభ్‌లో విపక్షాలను ఏకిపారేసిన ప్రధాని మోదీ.. గురువారం కూడా రాజ్యసభలో మరోసారి విరుచుకుపడ్డారు. దేశ ప్రజలను కాంగ్రెస్ వంచిస్తోందని ధ్వజమెత్తారు. గతంలో చేసిన పాపాలను శిక్ష అనుభవిస్తోందని విమర్శించారు. కొందరు ఎంపీల ప్రవర్తన బాధ కలిగిస్తోందన్నారు. బీజేపీ తన పాలన ద్వారా ప్రజల నమ్మకాన్ని పొందిందని చెప్పుకొచ్చారు. ఆరు దశాబ్దాల కాంగ్రెస్ పాలన అంతా శుద్ధ దండగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పాలనలో జనం డబ్బు మధ్యవర్తలు చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. గరీబీ హఠావో అనేది కాంగ్రెస్ నినాదం మాత్రమేనని ఆచరణకు నోచుకోలేదని మోదీ ఫైర్ అయ్యారు. వారు సమస్యలకు పైపూత మాత్రమే పూశార,ని తాము దీర్ఘకాల సమస్యలను శాశ్వతంగా పరిష్కరించామని పేర్కొన్నారు. విపక్షాలు విసిరే బురదలో కూడా కమలం వికసిస్తుందని వ్యాఖ్యానించారు. తాను రాజకీయ లబ్ధి కోసం ఆలోచించనని, తాము నిజమైన లౌకికవాదాన్ని అనుసరిస్తున్నామని మోదీ అన్నారు. తాము వికాసాన్ని నమ్ముతాం, విపక్షాన్ని కాదని పేర్కొన్నారు. విపక్షాలను చూస్తుంటే జాలేస్తోందన్నారు. ప్రభుత్వాల కూల్చివేతలపై.. ప్రభుత్వాల కూల్చివేతలపై కాంగ్రెస్‌కు మోదీ కౌంటర్ ఇచ్చారు. ఇంధిరా గాంధీ 50 సార్లకుపైగా ఆర్టికల్ 356తో ప్రభుత్వాలను పడగొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పాలకులు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఏంజీఆర్ వంటి దిగ్గజాల ప్రభుత్వాలను కాంగ్రెస్ అక్రమంగా పడగొట్టిందని విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ చికిత్స కోసం అమెరికా వెళ్తే ఆయన ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారని విమర్శలు గుప్పించారు. మరోవైపు మోదీ ప్రసంగానికి ముందు విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అదానీ వ్యవహారంపై మాట్లాడాలని డిమాండ్ చేశాయి. దీంతో విపక్ష సభ్యుల నిరసనల మధ్యే ప్రధాని తన ప్రసంగాన్ని కొనసాగించారు. చదవండి: మోదీ ప్రసంగంపై రాహుల్ విమర్శలు.. అదానీ ఊసే లేదని సెటైర్లు.. -
సెయిల్ లేదా ఎన్ఎండీసీలో వైజాగ్ స్టీల్ విలీన ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: వైజాగ్ స్టీల్‌ను (ఆర్ఐఎన్ఎల్) సెయిల్, ఎన్ఎండీసీలో విలీనం చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పలు ప్రతిపాదనలు వచ్చాయి. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్ సింగ్ కులస్తే ఈ విషయం తెలిపారు. ప్రస్తుతం ఆర్ఐఎన్ఎల్లో 4,875 మంది ఎగ్జిక్యూటివ్‌లు, 10,005 మంది నాన్–ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఉన్నారని రాజ్యసభకు రాతపూర్వక సమాధానంలో ఆయన వివరించారు. కంపెనీ ఆర్థిక పరిస్థితి అంతగా బాగా లేనందున రిక్రూట్‌మెంట్‌ను క్రమబద్ధీకరించినట్లు కులస్తే పేర్కొన్నారు. పబ్లిక్ ఇష్యూ లేదా బాండ్ల జారీ ద్వారా ఆర్ఐఎన్ఎల్ నిధులు సమీకరించే యోచనేదీ లేదని తెలిపారు. -
554 మంది జడ్జీల్లో 430 మంది జనరల్ కేటగిరీయే
న్యూఢిల్లీ: 2018 నుంచి హైకోర్టు జడ్జీలుగా నియమితులైన 554 మందిలో 430 మంది జనరల్ కేటగిరీకి చెందిన వారేనని న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు రాజ్యసభలో తెలిపారు. మిగిలిన వారిలో 58 మంది ఇతర వెనుకబడిన కులాలకు, 19 మంది షెడ్యూల్ కులాలకు చెందిన వారు కాగా, కేవలం ఆరుగురు షెడ్యూల్ తెగలకు, 27 మంది మైనారిటీలని వివరించారు. మొత్తమ్మీద 84 మంది మహిళా జడ్జీలున్నారని చెప్పారు. మొత్తం జడ్జీల్లో జనరల్ కేటగిరీకి చెందిన వారే 77% పైగా ఉన్నారన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీల నియామకాలకు రిజర్వేషన్లు లేవని మంత్రి పేర్కొన్నారు. అత్యున్నత న్యాయ వ్యవస్థలోనూ సామాజిక వైవిధ్యం సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. జడ్జీల నియామకాలకు ప్రతిపాదనలు పంపే సమయంలో అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళా జడ్జీల పేర్లను కూడా పరిశీలించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కోరుతోందని వెల్లడించారు. 2018 నుంచి ఇప్పటి వరకు సుప్రీంకోర్టులో 30 మంది జడ్జీలు నియమితులయ్యారని చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా జడ్జీల్లో 612 మంది ఎస్సీలు, 204 మంది ఎస్టీలు, 1,329 మంది ఓబీసీలు, 1,406 మంది మహిళలు ఉన్నారని ఒక ప్రశ్నకు సమాధానంగా పేర్కొన్నారు. -
త్వరలో రూ.2,000 నోట్లు రద్దు! బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాజ్యసభలో మాట్లాడిన ఆయన.. రూ.2000 నోట్లను దశల వారీగా రద్దు చేయాలని కేంద్రాన్ని కోరారు. ఈ పెద్ద నోట్లు ఉన్న వారు వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు రెండేళ్ల గడువు ఇవ్వాలని సూచించారు. దేశంలోని ఏటీఎంలలో రూ.2వేల నోట్లన్నీ ఖాళీ అయ్యాయని సుశీల్ మోదీ పేర్కొన్నారు. త్వరలోనే ఈ నోట్లను రద్దు చేస్తారనే వదంతులు కూడా మొదలయ్యాయని చెప్పారు. కేంద్రం దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రూ.2వేల నోట్ల ముద్రణను ఆర్బీఐ మూడేళ్ల కిందటే నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. 2016లో ప్రధాని మోదీ నోట్ల రద్దును ప్రకటించారు. రూ.1000, రూ.500 నోట్లను బ్యాన్ చేశారు. వాటి స్థానంలో కొత్తగా రూ.2000, రూ.500 నోట్లను చలామణిలోకి తెచ్చారు. అయితే రూ.1000 నోట్లనే రద్దు చేసినప్పుడు రూ.2000 నోట్లను చలామణిలోకి తేవడంలో అర్థం లేదని సుశీల్ మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో పెద్ద నోట్లు చలామణిలో లేవని వివరించారు. భారత్‌లో రూ.2వేల నోట్లను డ్రగ్స్, మనీ లాండరింగ్ వంటి అక్రమ లావాదేవీలకు ఉపయోగిస్తున్నారని బీజేపీ ఎంపీ చెప్పుకొచ్చారు. ఈ పెద్ద నోటు నల్ల ధనానికి పర్యాయపదంగా మారిందని చెప్పారు. అందుకే కేంద్రం దశల వారీగా రూ.2వేల నోట్లను రద్దు చేసి, వాటిని బ్యాంకుల్లో మార్చుకునేందుకు ప్రజలకు రెండేళ్ల సమయం ఇవ్వాలని పేర్కొన్నారు. చదవండి: రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోదీని లేకుండా చేయాలి: కాంగ్రెస్ నేత -
బీసీలకు రాజ్యసభ సభ్యుల వరకు పదవులు దక్కాయి : మంత్రి బొత్స సత్యనారాయణ
-
కృష్ణా మిగులు జలాల్లో వాటాలు తేలుస్తాం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా మిగులు జలాల్లో ఏపీ, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలనలో ఉందని కేంద్ర జలశక్తి శాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్ తుడు చెప్పారు. రాజ్యసభలో సోమవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్దిష్టమైన విధానం రూపకల్పన బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్మెంట్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించి అవసరమైన సమాచారం ఇవ్వకపోవడంతో సాంకేతిక సంఘం తన బాధ్యతను పూర్తిచేయలేకపోయిందన్నారు. కృష్ణా జలాలను రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా కేటాయించేందుకు వివాద పరిష్కార ట్రిబ్యునల్ కాల పరిమితి పొడిగించామన్నారు. ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న వీధి వ్యాపారుల్లో 25 శాతం మందికి రుణాలు మంజూరు చేయకుండా బ్యాంకు అధికారులు తిరస్కరించారని, పెండింగ్‌లో ఉన్న ఫైళ్ళతో కలిపితే ఈ సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను అంగీకరించిన కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురి ఈ అంశం కేంద్రం పరిధిలోనిది కాదన్నారు. రుణాల మంజూరుపై ఆయా బ్యాంకులు నిర్ణయం తీసుకుంటాయని, సంబంధిత శాఖల మంత్రులు ఈ విషయమై బ్యాంకు అధికారులతో చర్చిస్తున్నారని తెలిపారు. బీచ్‌శాండ్ తవ్వకాలపై నిషేధం తొలగించే ప్రతిపాదన బీచ్శాండ్తో సహా మరికొన్ని అణు ఖనిజాల తవ్వకాలపై నిషేధాన్ని తొలగించే ప్రతిపాదనపై ప్రభుత్వం అందరి సలహాలు, సూచనలు కోరినట్లు కేంద్ర గనులశాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషి తెలిపారు. గనులు, ఖనిజాల నియంత్రణ, అభివృద్ధి చట్టం మొదటి షెడ్యూలులోని పార్ట్–బి కింద చేర్చిన బీచ్‌శాండ్ మినరల్స్‌తోపాటు మరికొన్ని అటామిక్ మినరల్స్‌ను తొలగించే ప్రతిపాదనపై వివిధ శాఖలు, విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, మైనింగ్ పరిశ్రమకు చెందిన భాగస్వాములు, పారిశ్రామిక సంఘాలతోపాటు ప్రజల నుంచి సలహాలు, సూచనలు కోరినట్లు ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు రాజ్యసభలో ఇండియన్ అంటార్కిటిక్ బిల్లుకి వైఎస్సార్సీపీ మద్దతు తెలిపింది. రాజ్యసభలో సోమవారం బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొన్న ఎంపీ నిరంజన్‌రెడ్డి.. దేశాన్ని సంప్రదింపుల భాగస్వామిగా చూపే ఈ బిల్లుకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు.