ప్రధానికే ప్రాణభయమా? మరి దేశం పరిస్థితి!! | heated arguements over demonetisation in rajaysabha | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 24 2016 1:41 PM | Last Updated on Wed, Mar 20 2024 1:57 PM

పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో వాడీవేడిగా చర్చ కొనసాగుతోంది. ప్రధాని మోదీ రాజ్యసభకు రావడంతో ఈ అంశంపై ప్రతిపక్ష సభ్యులు మొదట మాట్లాడుతూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పెద్దనోట్ల రద్దు వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నందుకు తనను కొంతమంది బతుకనివ్వకపోవచ్చునని, తనకు ప్రాణభయం ఉందని ప్రధాని మోదీ పేర్కొనడాన్ని సమాజ్‌వాదీ ఎంపీ నరేశ్‌ అగర్వాల్‌ తప్పుబట్టారు. సాక్షాత్తూ ప్రధానికే ప్రాణభయం ఉంటే.. దేశాన్ని ఎవరూ కాపాడుతారని ఆయన ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దు వల్ల సామాన్య ప్రజలే కష్టాలు పడుతున్నారని, బ్యాంకుల ముందు క్యూలైన్లలో కోటీశ్వరులు ఎవరైనా నిలబడ్డరా కేంద్రాన్ని ప్రశ్నించారు. పెద్దనోట్ల రద్దుతో దేశంలో రెండో ఎమర్జెన్సీ విధించినట్టయిందని విమర్శించారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement