కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకు బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామంటూ ఎన్‌డీఏ ప్రభుత్వం చేసిన ప్రకటనకు చట్టబద్దత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గతేడాది ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లభించే మూడు ముఖ్య ప్రయోజనాలకు చట్టబద్దత కల్పించాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు.
మూడు ముఖ్య ప్రయోజనాలు..
1. 2015 -2020 మధ్యకాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90:10 ఉండాలి. కేంద్రం వాటాగా అందించే 90 శాతం నిధులను ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రతి ఏటా రాష్ట్రానికి అందజేయాలి.
2. 2015-2020ల మధ్యకాలంలో ఏపీలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ఇచ్చే 90 శాతం రుణాన్ని గ్రాంటుగా ఇవ్వడం.
3. ఐదు సంవత్సరాల కాలంలో ఏపీలో ప్రారంభమయ్యే అన్ని రకాల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను, పన్ను మినహాయింపులను ఇవ్వడం.
కాగా, ఎంపీ రామచంద్రరావు పంపిన బిల్లును పరిశీలించిన రాజ్యసభ సెక్రటరియేట్.. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుకు కిందకు వస్తుందని పేర్కొంది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేమని బిల్లును వెనక్కుపంపింది.
Comments
Please login to add a commentAdd a comment