private bill
-
ఏపీ ప్రత్యేక హోదాపై లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు..
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా ఇవ్వాలని లోకసభలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. వెనుకబడిన జిల్లాలకు స్పెషల్ అసిస్టెన్స్ ఇవ్వాలని బిల్లులో డిమాండ్ చేశారు. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని అవిశ్వాస తీర్మానంలో ప్రస్తావిస్తామని చెప్పారు. ఏపీ విభజన చట్ట సవరణ కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని పేర్కొన్నారు. హక్కుల కోసం..గళమెత్తుతాం.. పార్లమెంటులో జరగబోయే అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా.. ఏపీకి జరిగిన అన్యాయంపై గళమెత్తుతామని ఎంపీ భరత్ చెప్పారు. పది మంది ఎంపీలతో ఏపీ రీఆర్గనైజేషన్ అమెండ్మెంట్ బిల్–2023ను ప్రైవేటు మెంబర్ బిల్లుగా ప్రవేశ పెట్టామని తెలిపారు. 'విభజన హామీల అమలుకు సంబంధించిన ప్రైవేటు మెంబర్ బిల్లును గతంలో మా పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అయితే ఆ బిల్లు ఫైనాన్స్ తో ముడిపడిన అంశం కావడం వల్ల లోక్ సభలోనే ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ నేపథ్యంలో మేము ఆ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టాం.' అని ఎంపీ భరత్ చెప్పారు. 'కేంద్రంపై పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లు ఉపయోగపడుతుంది. విభజన హామీలపై.. గత ప్రభుత్వంలో చంద్రబాబు యూ టర్న్ తీసుకుని ఏపీని వెనక్కు తోశారు. ఆ తప్పిదాలను సవరించుకుంటూ ఏపీకి రావాల్సినవన్నిటినీ రాబడుతున్నాం. ఈ ప్రైవేటు మెంబర్ బిల్లులో ప్రత్యేక హోదా డిమాండ్‌ను ప్రధానంగా ముందు పెడుతున్నాం. పోలవరం నిధులకు సంబంధించి.. ప్రాజెక్టు ఆథారిటీ సవరించిన అంచనాలపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఆ అంచనాలను ఆమోదించాలనే డిమాండ్ ఈ బిల్లులో ఉండబోతోంది. విభజన చట్టం ప్రకారం గతంలో రాష్ట్రంలోని 7 వెనుకబడిన జిల్లాలకు.. జిల్లాకు రూ.50 కోట్ల చొప్పున నిధులిచ్చారు. ప్రస్తుతం తలసరి ఆదాయం ప్రకారం ఆయా జిల్లాలకు స్పెషల్ ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేయబోతున్నాం. దీనివల్ల ఒక్కో జిల్లాకు రూ.1000 కోట్లు రావడానికి అవకాశం ఉంది. వాల్తేరు డివిజన్‌ను కలుపుకుని సౌత్ కోస్టల్ రైల్వే జోన్‌ను ఇవ్వాలని కూడా డిమాండ్ చేయనున్నాం. ఈ బిల్లు త్వరలో టేబుల్ అవుతుంది.. వచ్చే సమావేశాల్లో ఈ బిల్లు చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఆ చర్చలో దేశాన్ని ఆకర్షించే విధంగా మేం ఏపీ హక్కుల కోసం గళమెత్తుతాం.' అని తెలిపారు. 'బాధ్యత కేంద్రంపై లేదా..?' ప్రైవేటు బిల్లులు పెట్టాల్సిన దౌర్భాగ్యం ఎందుకు వస్తుందనేది కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ అన్నారు. 2014 ఏపీ విభజన చట్టాన్ని ఎందుకు గౌరవించడం లేదు.. ఆ బాధ్యత కేంద్రంపై లేదా అనేది కూడా ప్రశ్నిస్తామని తెలిపారు. విభజన చట్టంలోని కీలకమైన మరికొన్ని అంశాలను పక్కన పెట్టడం దురదృష్టకరం, బాధాకరమని చెప్పారు. దుగరాజుపట్నం పోర్టును చట్టంలో పొందుపరిచారు.. సాంకేతిక కారణాలతో దాన్ని రామాయపట్నానికి మార్చారని అన్నారు. ఈ పోర్టుకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. 'కృష్ణా, గోదావరి బేసిన్లో ఒక పెట్రో కెమికల్ రిఫైనరీ తీసుకురావాలి. దానికి కూడా ఏపీ వయబిలిటీ ఫండ్ గ్యాప్ పెట్టుకోవాలనడం ఏమిటి..? గుజరాత్, పారాదీప్‌లో ఉన్న రిఫైనరీలకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ అడిగారా..? ఏపీ వరకూ వచ్చే సరికి ఎందుకు సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు అనేది కూడా మేం ప్రశ్నిస్తాం. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ప్రధాని మోడీ చరిత్రలో నిలిచిపోతారు. విభజన చట్టం ప్రకారం... పదేళ్ల గడువులో ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది...కాబట్టి యుద్ధప్రాతిపదికన చట్టంలో ఉన్న హామీలన్నీ నెరవేర్చాలని మేం నిలదీయబోతున్నాం' అని ఆయన చెప్పారు. టీడీపీది గోడమీది పిల్లివాటం.. నేషనల్ క్యాపిటల్ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించిందని తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ ఫ్లోర్ లీడర్ మిథున్ రెడ్డి దానిపై మాట్లాడారు. 'ఈ బిల్లు ప్రత్యేకమైనది. దేశానికి రాజధానిగా ఉన్న న్యూ ఢిల్లీ పూర్తిగా రాష్ట్రం కాదు. అలా అని కేంద్ర పాలిత ప్రాంతం కాదు. ప్రత్యేకమైన ఇలాంటి ప్రాంతంలో లా అండ్ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండాలన్న ఆలోచనతో మద్దతు ఇచ్చాం. కొన్ని వందల దౌత్య కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ బిల్లుకు వైఎస్సార్ కాంగ్రెస్ మద్దతు పలకింది. ఇదే సందర్భంలో ఏపీలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ స్టాండ్ ఏమిటో కూడా చెప్పకుండా గోడమీద పిల్లిలా వ్యవహరిస్తున్నారు.' అని మిథున్ రెడ్డి తెలిపారు. పోలవరంపై మరో బిల్లు.. వైఎస్ఆర్సీపీ లోక్ సభా పక్ష నాయకుడు మిథున్ రెడ్డి పోలవరంపై మరొక ప్రైవేట్ మెంబర్ బిల్ కూడా పెట్టారు. అది ఇవాళ టేబుల్ అవుతోంది. పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548 కోట్లు ఆమోదించాలని ఆయన ప్రత్యేకంగా ప్రైవేట్ మెంబర్ బిల్లును పెట్టారు. పార్లమెంటు వేదికగా ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ మేం వినియోగించుకుంటున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దిశానిర్ధేశంతో మేం పార్లమెంటులో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. 'మాకు రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం. రాష్ట్రానికి రావాల్సిన నిధులన్నీ రాబడుతున్నాం. మొన్ననే రూ.10వేల కోట్లకు పైగా తీసుకొచ్చాం. రాష్ట్ర విభజన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో చంద్రబాబు నిధులు తీసుకురాగలిగాడా..? పోలవరానికి సంబంధించి మరొక రూ.12 వేల కోట్ల నిధులు కూడా త్వరలో విడుదల చేయనున్నారు. ఇవన్నీ సాధించుకుంటూనే కేంద్రానికి ఇష్యూ బేసిస్‌గా మద్దతు ఇస్తున్నాం. బిల్లు దేశానికి మంచి జరిగే విధంగా ఉంటే మేం మద్దతు పలుకుతాం. ఒకవేళ నష్టం జరిగితే మేం మద్దతు పలికేది లేదు' అని మిథున్ రెడ్డి చెప్పారు. ఇదీ చదవండి: Viveka Case: దర్యాప్తు తీరు ఆద్యంతం సందేహాస్పదం.. ‘ద వైర్’ కథనం -2 -
రాజ్యసభలో 2 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు -
ఎంపీ విజయసాయిరెడ్డి బిల్లుపై ముందుకు.. కేంద్రం సానుకూలం!
సాక్షి, ఢిల్లీ: రాజధానుల ఏర్పాటుపై ఆయా రాష్ట్రాలకే అధికారం ఉండాలన్న వైఎస్సార్సీపీ విధానానికి కేంద్రం మద్దతు తెలపనున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఆ దిశగా బీజేపీ అధిష్ఠానం ఆలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర పరిధిలో రాజధానుల ఏర్పాటుపై ఆ రాష్ట్ర అసెంబ్లీకి స్పష్టమైన అధికారం ఉండేలా రాజ్యాంగ సవరణ కోరుతూ మొన్నటి పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును ప్రవేశపెట్టారు. చదవండి: ఏపీ ప్రభుత్వం తరపున సీజేఐ ఎన్వీ రమణకు విందు రాజధానుల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చట్టబద్ధంగా తిరుగులేని అధికారం ఉందన్న పార్టీ విధానాన్ని విజయసాయిరెడ్డి పెద్దల సభలో స్పష్టం చేశారు. ఈ మేరకు ఆర్టికల్ 3కు రాజ్యాంగ సవరణ చేసి 3ఏను చేర్చాలని ఆ బిల్లులో ఆయన డిమాండ్ చేశారు. ఈ బిల్లుపై పార్లమెంటు వచ్చే శీతాకాల సమావేశంలో చర్చకు రానున్నట్టు తెలిసింది. దీనిపై కేంద్రం కూడా పూర్తి సానుకూలంగా ఉందంటూ జాతీయ మీడియా పేర్కొంది. ప్రైవేట్ బిల్లుకు బదులుగా అధికారపార్టీనే ఆర్టికల్ 3 సవరణ బిల్లును ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోందని జాతీయ మీడియా పేర్కొంది. అంతేకాదు.. ప్రైవేటు బిల్లును ఉపసంహరించుకోవాలని విజయసాయిరెడ్డికి బీజేపీ అధిష్ఠానం సూచించనున్నట్టు తెలిపింది. ఈ మధ్యకాలంలో జనతాదళ్ యునైటెడ్ లాంటి పార్టీలు ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో బీజేపీ బలం రాజ్యసభలో 108కి తగ్గింది. పెద్దల సభలో ప్రతిపక్షాలకు 129 మంది సభ్యులున్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాలంటే.. అధికారపార్టీకి మరో 79 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. -
జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: రైతు ప్రయోజనాల పరిరక్షణ, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటుకు రాజ్యాంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే ఈ కమిషన్ రైతాంగ సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కమిషన్‌కు ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడం, న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వొకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, ఆభరణాలు, పర్సులు ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను భారతీయ శిక్షా స్మృతిలో విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ ఈ నేరానికి పాల్పడిన వారికి 5 నుంచి 10 ఏళ్లపాటు కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షా స్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ఆయన ప్రవేశపెట్టారు. -
చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే
సాక్షి, న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతులకు(ఓబీసీ) లోక్‌సభ, శాసనసభల్లో జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం కల్పించడానికి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లు–2018 (కొత్త ప్రకరణలుగా 330ఎ, 332ఎ చేర్చుట)ను ఆమోదించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి కోరారు. గతంలో ఆయన ప్రవేశపెట్టిన ఈ ప్రైవేట్ బిల్లుపై చర్చకు శుక్రవారం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ అనుమతించారు. ఈ బిల్లుపై జరిగిన చర్చలో ముందుగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ‘‘దేశ జనాభాలో సగం కంటే ఎక్కువగా ఓబీసీలు ఉన్నారు. పార్లమెంట్లో ఓబీసీల ప్రాతినిధ్యం వారి జనాభాకు అనుగుణంగా లేదు. 1984లో లోక్‌సభలో ఓబీసీల ప్రాతినిధ్యం 11 శాతం, 2009లో 18 శాతం. ప్రస్తుత 17వ లోక్‌సభలో 20 శాతం లోపే ఉంది. దాదాపు 2,400 ఓబీసీ కులాలు ఉండగా, అందులో 2,200 కులాలకు పార్లమెంట్ ఉభయ సభల్లో, శాసన సభల్లో ఇప్పటివరకు ప్రాతినిధ్యమే లభించలేదు. వారు ఇప్పటికీ చట్టసభల్లో అడుగు పెట్టలేదని చెప్పాల్సి రావడం సిగ్గుపడాల్సిన అంశం. మెజారిటీ రాష్ట్రాల్లో ఓబీసీల జనాభా 50 శాతం కంటే ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 50.4 శాతం ఓబీసీలు ఉన్నారు. ఏపీ సీఎం ఇటీవల తన మంత్రివర్గంలో దాదాపు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 60 శాతం పదవులు కేటాయించారు. ఐదు ఉప ముఖ్యమంత్రి పదవులను ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ వర్గాలకు కట్టబెట్టి ఆదర్శంగా నిలిచారు. ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే.. ఓబీసీ వర్గాలకు జనాభా దామాషా ప్రకారం లోక్‌సభలో, శాసనసభలో సీట్లను రిజర్వ్ చేయాలి. ఆర్టికల్ 330, 332లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల గురించి చెబుతున్నాయి. వీటికి అదనంగా ఓబీసీలకు సైతం వారి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు వర్తింపజేయాలి. అప్పుడే వారికి సామాజిక న్యాయం దక్కుతుంది. 2,400 ఓబీసీ కులాలు ఉండగా, 1,400 కులాలు చాలా పేదరికంలో ఉన్నాయి. ఓబీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసేందుకు తగిన వనరులు లేవు. 1953లో కేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్‌ను నియమించారు. కేల్కర్ కమిషన్ 40 సిఫారసులు చేయగా, కేవలం 2 సిఫారసులను మాత్రమే అమలు చేశారు. 2021లో మరోసారి జనగణన ఉంటుంది. ఓబీసీలకు సంబంధించి సమగ్ర అధ్యయనం ఉండాలి. సమగ్ర ప్రశ్నావళి ఉండాలి. తద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఓబీసీలకు చట్టపరమైన రక్షణ కల్పించాలి. వేధింపులు, అవమానాల నుంచి రక్షించాలి. ఓబీసీల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. వారిలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు నిధులు కేటాయించాలి. అన్ని పార్టీలు ఈ బిల్లుకు మద్దతు పలకాలని, ఓబీసీలకు రిజర్వేషన్లు దక్కాలని కోరుతున్నా. ఈ బిల్లు ఆమోదం పొందాలని ఆశిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. బిల్లుకు రాజకీయ పార్టీల మద్దతు రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లులపై శుక్రవారం దాదాపు 2 గంటల పాటు ఈ చర్చ జరిగింది. దాదాపు 10 రాజకీయ పార్టీలు ఈ చర్చలో పాల్గొన్నాయి. ఓబీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ బిల్లు ప్రవేశపెట్టినందుకు విజయసాయిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ సభ్యుడు బి.కె.హరిప్రసాద్ అభినందించారు. ఓబీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు అమలైతేనే సామాజిక న్యాయం దక్కుతుందని తేల్చిచెప్పారు. బిల్లుపై రాజ్యసభలో బీజేపీ సభ్యుడు డాక్టర్ వికాస్ మహాత్మే, ఆర్జేడీ సభ్యుడు ప్రొఫెసర్ మనోజ్ కుమార్ ఝా, డీఎంకే సభ్యుడు టి.కె.ఎస్.ఇలంగోవన్, బీజేపీ సభ్యుడు రామ్‌కుమార్ వర్మ, కాంగ్రెస్ సభ్యుడు ఎల్.హనుమంతయ్య, సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు విశంభర్ ప్రసాద్, ఏఐఏడీఎంకే సభ్యుడు గోకులకృష్ణన్, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యుడు సంజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు ఛాయా వర్మ తదితరులు మాట్లాడారు. వైఎస్సార్సీపీ చొరవ భేష్ ధన్యవాదాలు తెలిపిన జస్టిస్ ఈశ్వరయ్య జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకు పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ సవరణ చేయాలంటూ రాజ్యసభలో రెండు ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అఖిల భారత్ వెనుకబడిన తరగతుల సమాఖ్య అధ్యక్షుడు జస్టిస్ వి.ఈశ్వరయ్య ధన్యవాదాలు తెలిపారు. ప్రైవేటు బిల్లులో వైఎస్సార్సీపీ చూపిన చొరవ అభినందనీయమని ఆయన కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ తరహాలో జనాభా దామాషా ప్రకారం ఓబీసీలకూ రిజర్వేషన్లు అమలుచేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
పెళ్లయితే మహిళ మగాడి ఆస్తి అవుతుందా?
సాక్షి, న్యూఢిల్లీ: ‘అమ్మాయికి పెళ్లయితే..ఆమె భర్త సొంత ఆస్తి అవుతుందా? ఏకంగా చట్టంలోనే ఈ అర్థం వచ్చేలా ఉండడం ఏంటి?. దాదాపు 160 ఏళ్ల నాటి ఇండియన్ పీనల్ కోడ్‌లో రూపొందించిన సెక్షన్ 497 సెక్షన్ ద్వారా మహిళను భర్తలు తమ సొంత ఆస్తిలా చూడడమే కాకుండా.. మహిళల ప్రవర్తనను పురుషుడు నియంత్రించేందుకు అవకాశం కల్పించేలా ఉండడం సహేతుకమేనా’ అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ వి.విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రశ్నించారు. ఈ సెక్షన్‌ను సవరించాలని ఇటీవల ఆయన ప్రైవేటు బిల్లు ప్రతిపాదించారు. ‘వేరొకరి భార్య అని తెలిసినప్పుడు, లేదా అలా విశ్వసించేందుకు తగిన కారణాలు ఉన్నప్పుడు, అతడి అనుమతి లేకుండా, అతడి ఉపేక్ష మేరకు, ఆమెతో పరాయి పురుషుడు లైంగిక చర్యలో పాల్గొనడం వ్యభిచార నేరమే.. ఇందుకు ఐదేళ్ల వరకు శిక్ష, లేదా జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.. ఇందులో ప్రేరేపించిన వ్యక్తిగా భార్యను శిక్షించజాలం.. ’ అని చెప్పే ఈ సెక్షన్లో ‘అతడి అనుమతి లేకుండా’, ‘అతడి ఉపేక్ష మేరకు’ అన్న పదాలను తొలగించాలని బిల్లులో ప్రతిపాదించారు. అంతేగాకుండా వివాహితను పురుషుడి సొంత ఆస్తిలా చూడడమనే భావన ఈ సెక్షన్లో అంతర్లీనంగా ఉందని, అందువల్లే లింగభేదం లేకుండా సెక్షన్‌ను సవరించాలని ఆయన ప్రతిపాదించారు. పురాతన భావనలు.. ‘వివాహేతర సంబంధాలను ఇండియన్ పీనల్‌కోడ్(ఐపీసీ)లోని సెక్షన్ 497 నేరంగా పరిగణిస్తోంది. అయితే 1860లో రూపొందించిన ఐపీసీ పురాతన భావనలను ప్రాతిపదికగా తీసుకుంది. పురాతన నైతికత ఆధారంగా ఏర్పడ్డ ఈ చట్టాలు మహిళలు, పురుషుల మధ్య సమానత్వాన్ని ఉల్లంఘిస్తున్నందున వీటిని సవరించాలి ’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ‘భర్త అంగీకారం ఉంటే పరా>యి పురుషుడితో జరిపే శృంగారం చట్టబద్ధమైనదని చిత్రించారు. భార్య లైంగికతను, చర్యలను భర్త ఇష్టానుసారం అని ఈ సెక్షన్ చెబుతోంది. భార్య తన భర్తను వివాహేతర సంబంధంపై కోర్టుకు లాగేందుకు అవకాశం ఇవ్వడంలో ఈ సెక్షన్ విఫలమైంది..’ అని వివరించారు. పితృస్వామ్య వ్యవస్థలా.. ‘మహిళల నడవడికను నియంత్రించేలా చట్టంలో ఉన్న ఇలాంటి పితృస్వామ్య భావనలను తొలగించాలి. వివాహ బంధం పవిత్రతను లింగ సమానత్వం ద్వారా కాపాడాలి కానీ.. వివక్ష ద్వారా కాదు. భర్తల చేతుల్లో ఉన్న ఒక వస్తువుగా మహిళను చూసినప్పుడు ఈ సెక్షన్ మహిళల రక్షణకు ఉద్దేశించింది ఎంత మాత్రం కాదు. పెళ్లి అనే సామాజిక వ్యవస్థలో మహిళల స్వతంత్రత, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పురాతనమైన ఇలాంటి చట్టాలను మార్చాల్సిన అవసరం ఉంది..’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. -
విద్యార్థుల అరెస్ట్.. రేపు రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రవేటు యూనివర్శిటీల బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి యత్నంచిన విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. అక్రమ అరెస్టులు చేశారంటూ విద్యార్థి సంఘాలు గురువారం తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. ప్రముఖ విద్యార్థి సంఘాలు ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్, పీడీఎస్‌యూ, టీవీవీ, ఏఐఎస్ఓ, టీఎస్‌ఎఫ్‌ల ఆధ్యర్యంలో విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ప్రైవేటు యూనివర్శిటీల బిల్లును తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టడాన్ని తీవ్రగా వ్యతిరేకిస్తూ అసెంబ్లీ ముట్టడించేందుకు బుధవారం ఉదయం నిజాం కళాశాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో విద్యార్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. విద్యార్థులను అదుపు చేసేందుకు పోలీసు లాఠీ చార్జ్ చేయడానకి యత్నించడంతో తోపులాట జరిగింది. చివరకు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. విద్యార్థినులని కూడా చూడకుండా.. ముట్టడిలో పాల్గొన్న విద్యార్థినులను సైతం మగ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసి వ్యాన్లలోకి ఎక్కించారు. పోలీసుల తీరుపై విద్యార్థులు తీవ్ర నిరసనలను వ్యక్తం చేశారు. అరెస్ట్ అయి పోలీసు స్టేషన్లో ఉన్న నాయకులు అక్కడే మీడియాతో మాట్లాడారు. విద్యార్థి సంఘ నాయకులు కోట రమేష్, శివరామకృష్ణ, జూపాక శ్రీనివాస్, గంగాధర్, సందీప్, శోభన్ నాయక్‌లు మాట్లాడుతూ.. విద్యను అందించడం ప్రభుత్వం ప్రాథమిక విధి అని, ప్రభుత్వం తన భాద్యతను మరిచి ప్రైవేట్‌కు దాసోహమవుంతోందని విమర్శించారు. ప్రైవేటు విశ్వవిద్యాలయాల వల్ల విద్య వ్యాపారంగా మారుతుందని, ప్రభుత్వాలకు వాటిపై నియంత్రణ ఉండదని పేర్కొన్నారు. ఫీజులు, పాఠ్యాంశాలు, ప్రవేశ విధానాలను అవే నిర్ణయించడం వల్ల దళిత, గిరిజన, బలహీన, మైనారిటీ వర్గాల విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగవచ్చని తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ప్రజాతంత్ర హక్కులను ప్రభుత్వం కాలరాస్తుందని ఆరోపించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ప్రభుత్వ సంస్థలను బలోపేతం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. అలాగే, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును వెనక్కి తీసుకోవాలని, విద్యసంస్థల్లో విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని, విద్యారంగానికి అధిక నిధులు కేటాయించాలని, అక్రమంగా అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. -
ప్రత్యేక ప్యాకేజీ చట్టబద్దత బిల్లు తిరస్కరణ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదాకు బదులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అందజేస్తామంటూ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ప్రకటనకు చట్టబద్దత కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు గతేడాది ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా వల్ల ఏపీకి లభించే మూడు ముఖ్య ప్రయోజనాలకు చట్టబద్దత కల్పించాలని ఆయన బిల్లులో పేర్కొన్నారు. మూడు ముఖ్య ప్రయోజనాలు.. 1. 2015 -2020 మధ్యకాలంలో అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలలో కేంద్ర-రాష్ట్రాల మధ్య వాటాల నిష్పత్తి 90:10 ఉండాలి. కేంద్రం వాటాగా అందించే 90 శాతం నిధులను ఆర్ధిక సంవత్సరం చివరిలో ప్రతి ఏటా రాష్ట్రానికి అందజేయాలి. 2. 2015-2020ల మధ్యకాలంలో ఏపీలో విదేశీ సాయంతో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్ర ఇచ్చే 90 శాతం రుణాన్ని గ్రాంటుగా ఇవ్వడం. 3. ఐదు సంవత్సరాల కాలంలో ఏపీలో ప్రారంభమయ్యే అన్ని రకాల పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలను, పన్ను మినహాయింపులను ఇవ్వడం. కాగా, ఎంపీ రామచంద్రరావు పంపిన బిల్లును పరిశీలించిన రాజ్యసభ సెక్రటరియేట్.. ఆర్టికల్ 110 ప్రకారం మనీ బిల్లుకు కిందకు వస్తుందని పేర్కొంది. రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టలేమని బిల్లును వెనక్కుపంపింది. -
హోదాపై విజయసాయి రెడ్డి ప్రైవేట్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశ పెట్టిన ప్రైవేటు బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. త్వరలోనే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. రాష్ట్రానికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధనలో విజయ సాయిరెడ్డి పార్టీ తరఫున అలుపెరగని పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. -
అనర్హత అంశంపై ప్రైవేటు బిల్లు
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్ 102, 191లకు సవరణలు ప్రతిపాదిస్తూ సభలో విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు. ఈ ఆర్టికల్స్ ద్వారా సంక్రమించిన అధికారాలతో రూపుదాల్చిన ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 8(4) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2013 జులై 10న లిలీ థామస్ కేసులో తీర్పు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ భావనల పరిరక్షణకు వీలుగా ఆర్టికల్ 102, 109లలో క్లాజ్ 1 తరువాత క్లాజ్ 1(ఎ)ను చేర్చుతూ రాజ్యంగ సవరణ చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. చట్ట సభల సభ్యుల హక్కుల పరిరక్షణకు, అనర్హత తేదీకి సంబంధించిన అంశాలతో తగిన చట్టం చేయడాన్ని ఈ ఆర్టికల్ నిలువరించలేంటూ క్లాజ్1(ఏ)లో చేర్చాలని ప్రతిపాదించారు. -
అది ద్రవ్య బిల్లు
కేవీపీ ప్రైవేటు బిల్లుపై రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారణ సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడానికి వీలుగా ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ నిర్ధారించారు. ఈ మేరకు చైర్మన్ ఆదేశాలను డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు. కేవీపీ బిల్లులోని అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత, ఈ విషయంపై న్యాయ మంత్రిత్వ శాఖ సలహా మేరకు, ఏపీ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు, 2015ను రాజ్యాంగంలోని ఆర్టికల్ 117, క్లాజు(1)ను బట్టి ద్రవ్య బిల్లుగా నిర్ధారిస్తున్నట్టుగా కురియన్ ప్రకటించారు. స్పీకర్ నిర్ణయాన్ని తోసిపుచ్చారు: కేవీపీ తాను ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ద్రవ్య బిల్లుగా నిర్ధారించి రాజ్యసభలో చర్చ నుంచి తొలగించడాన్ని కేవీపీ తప్పుబట్టారు. రాజ్యసభ నియమావళి 185(3) ప్రకారం కేవీపీ బిల్లును చర్చ నుంచి శుక్రవారం తొలగించారు. దీనిపై కేవీపీ స్పందిస్తూ..లోక్‌సభ స్పీకర్ ఇది ద్రవ్య బిల్లుకాదని తేల్చినా.. లోక్‌సభ సెక్రటరీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని ద్రవ్య బిల్లుగా నిర్ధారించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. దీనిని తాము సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని రాజ్యసభ సభ్యుడు జైరాం రమేష్ చెప్పారు. -
ఫిరాయింపులపై ప్రైవేటు బిల్లు
రాజ్యసభలో ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ ఫిరాయింపుల నిరోధానికి సంబంధించి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో శుక్రవారం ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాజ్యాంగ సవరణ బిల్లుగా పేర్కొంటూ ఆర్టికల్ 361(బి) స్థానంలో కొత్త ఆర్టికల్ చేర్చాలని, రాజ్యాంగంలోని పదో షెడ్యూల్లోని 6వ పేరాను సవరించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఫిరాయింపుల పిటిషన్లపై నిర్దిష్ట కాలపరిమితిలో చైర్మన్ లేదా స్పీకర్ చర్యలు తీసుకొనే విధంగా సవరణ ఉండాలని విజయసాయిరెడ్డి ప్రతిపాదించారు. కేవీపీ బిల్లుకు సాంకేతిక కారణలు చూపడం సరికాదు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో కేవీపీ రామచంద్ర రావు ప్రవేశపెట్టిన బిల్లుకు సాంకేతిక కారణాలు చూపి అడ్డుకోవడం శోచనీయమని విజయసాయిరెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీకి చిత్తశుద్ధిలేదని ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రానికి ఇంత అన్యాయం జరుగుతున్నా సీఎం చంద్రబాబు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే.. రాష్ట్రాన్ని విభజించడంతో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీ, టీడీపీలకు పడుతుందని హెచ్చరించారు. విభజన హామీల అమలులో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరిపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. -
ప్రైవేటు బిల్లుకు మద్దతివ్వాలి
ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య నెల్లూరు (టౌన్): ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని ఏపీ ప్రత్యేక హోదా విద్యార్థి జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక వీఆర్సీ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద వివిధ సంఘాల ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా అంజయ్య, లాయర్స్ అసోసియేషన్ నాయకుడు చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎంపీలందరూ ఒకే తాటిపైకి వచ్చి ప్రైవేటు బిల్లుకు మద్దతు తెలపాలన్నారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రైవేటు బిల్లును పక్కదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రధానమంత్రి మోదీని కలవనున్న చంద్రబాబు ప్రత్యేక హోదాపై డిమాండ్ చేయాలన్నారు. ఆంధ్ర ప్రజలకు అన్యాయం జరిగితే ప్రశ్నిస్తానన్న పవన్‌కల్యాణ్ కనిపించకుండా పోయారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు నాగేంద్రకుమార్, వేణుగోపాల్, కొప్పుల చంద్రశేఖర్, రవి పాల్గొన్నారు. -
ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వాలు
– డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య కర్నూలు (ఓల్డ్‌సిటీ): ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని డీసీసీ అధ్యక్షుడు బి.వై.రామయ్య ఆరోపించారు. ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రై వేట్ బిల్లును బీజేపీ సభ్యులు అడ్డుకుని వాయిదా వేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం స్థానిక కోల్స్ కాలేజీ సమీపంలోని మూడు రస్తాల కూడలిలో కాంగ్రెస్ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీవై రామయ్య మాట్లాడుతూ.. హోదా సంజీవని కాదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో కొంగజపం చేస్తున్నారన్నారు. ఎమ్మెల్సీ ఎం.సుధాకర్ బాబు, మాజీ ఎమ్మెల్యే మదనగోపాల్, జెడ్పీ మాజీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, పీసీసీ కార్యదర్శి సర్దార్ బుచ్చిబాబు, డీసీసీ ఉపాధ్యక్షులు వేణుగోపాల్‌రెడ్డి, అశోకరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఆ మూడు పార్టీలు డ్రామాలాడుతున్నాయి
-
వాళ్ల మైండ్స్ రీడిజైన్ చేయాలి
-
వాళ్ల మైండ్స్ రీడిజైన్ చేయాలి: కేటీఆర్
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగానికి కేంద్రం సాయం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి రావాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆహ్వానించారు. కేటీఆర్‌తో పాటు టీఆర్ఎన్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు త్వరలో రాష్ట్రానికి వస్తానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్...కాంగ్రెస్ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నేతలు అజ్ఞానం, అపరిపక్వతతో వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ, హరియాణకు భౌగోళిక పరిస్థితుల్లో తేడా ఉందన్నారు. ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ రాద్ధాంతం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. 60 ఏళ్లు పాలించి ఏమీ చేయని అసమర్థులు కాంగ్రెస్ నేతలు అంటూ విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ నాయకుల మైండ్లను రీడిజైన్ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పవర్ పాయింట్ ప్రజంటేషన్పై అసెంబ్లీ సమావేశాల్లో తోక ముడిచి, ఇప్పుడు మీడియా కోసం ప్రాజెక్టుల యాత్రలు చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ బిల్లుకు మద్దతిస్తామనలేదు రాజ్యసభ ఎంపీ కేవీపీ రామచంద్రరావు పెట్టిన ప్రైవేటు బిల్లుకు తాను మద్దతిస్తానని అనలేదని కేటీఆర్ తెలిపారు. హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లు పెడితే మద్ధతిస్తానని మాత్రమే చెప్పానని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ తెలంగాణ ఎలా సాధించారో కాంగ్రెస్ నాయకులు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఉద్యమ సమయంలో 36 పార్టీలను ఒప్పించి ఏకాభిప్రాయం ద్వారా తెలంగాణ సాధించామని చెప్పుకొచ్చారు. ప్రైవేటు బిల్లుతో ఏమీ ఒరగదన్నారు. కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి, ఇంగితజ్ఞానం ఉంటే అన్ని పార్టీలతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ఇలాంటి గిమ్మిక్కులతో ప్రజలను మభ్యపెట్టగలం అనుకుంటే అది వారి అవివేకం అని విమర్శించారు. -
స్పీకర్ నిర్ణయానికి గడువు పెట్టాలి
- ఫిరాయింపుల నిరోధక చట్టానికి సవరణలు - రాజ్యసభలో విజయసాయిరెడ్డి ప్రైవేటు బిల్లు సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రస్తుతం అమలులో ఉన్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి కొన్ని కీలకమైన సవరణలు చేస్తూ ఒక ప్రైవేటు బిల్లును ప్రతిపాదించారు. ఈ మేరకు ఆయన ఈ నెల 8వ తేదీన రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు ఒక నోటీసును ఇచ్చారు. తాను ప్రస్తుత చట్టంలోని 316-బిలోని కొన్ని అంశాలకు సవరణలు ప్రతిపాదిస్తున్నానని పేర్కొన్నారు. చట్టసభలో ఓ పార్టీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యుడు (ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీ (రాజ్యసభ లేదా లోక్‌సభ) మరో పార్టీలోకి వెళ్లినపుడు అతనిని అనర్హుడిని చేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేసినా నియమిత వ్యవధిలో ఆయన నిర్ణయం తీసుకోవాలనే నిబంధన ప్రస్తుత చట్టంలో లేదు. విజయసాయిరెడ్డి దానిని సవరించాలని సూచించారు. ఫిరాయించిన సభ్యుడి అనర్హతకు సంబంధించి ఫిర్యాదు అందిన ఆరు నెలలలోపు దానిపై స్పీకర్ నిర్ణయం తీసుకునేలా చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించారు. ఫిరాయించిన చట్టసభ సభ్యుడిపై చట్టం ప్రకారం అనర్హత వేటు పడితే అతని పదవీ కాలం పూర్తయ్యేవరకూ లేదా అతను మళ్లీ ఎన్నికయ్యేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవిని చేపట్టరాదనేది ప్రస్తుత నిబంధనగా ఉంది. కానీ ఫిరాయించిన సభ్యునిపై స్పీకర్ వద్ద ఫిర్యాదు నమోదైన రోజు నుంచీ, ఆ ఫిర్యాదుపై స్పీకర్ చర్య తీసుకునేవరకూ లాభదాయకమైన రాజకీయ పదవి ఏదీ చేపట్టకూడదని సవరించాలని ప్రతిపాదించారు. ఒక వేళ ఫిరాయించిన సభ్యునిపై అనర్హత వేటు పడితే, అతని మిగతా పదవీకాలం ముగిసేవరకూ కూడా ఎలాంటి లాభదాయకమైన పదవీ చేపట్టకూడదని కూడా ఉండాలన్నారు. ఇక 361-బిలోని పేరా 6(2) ప్రకారం స్పీకర్‌కు వచ్చే అనర్హత ఫిర్యాదులపై చర్య తీసుకునేందుకు ఒక కాల పరిమితి అంటూ ఏమీ లేదు. ఇపుడు విజయసాయిరెడ్డి తన బిల్లులో ఆరు నెలలలోపుగా నిర్ణయం తీసుకునే విధంగా మార్పు చేయాలని సవరించారు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోని పక్షంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకునే విధంగా అనుమతిని ఇవ్వాలని కోరారు. -
'హోదాపై ప్రైవేట్ బిల్లు.. టీడీపీ, బీజేపీ పరారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లును చూసి టీడీపీ, బీజేపీ పారిపోయాయని సీపీఐ నారాయణ విమర్శించారు. శనివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ఏమిచ్చారో కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని నారాయణ డిమాండ్ చేశారు. -
ఓటింగ్‌తో వాళ్ల నిజాయితీ తెలుస్తుంది: రఘువీరారెడ్డి
ప్రత్యేక హోదాపై పీసీసీ చీఫ్ రఘువీరా న్యూఢిల్లీ: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరుతూ రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై ఓటింగ్‌తో బీజేపీ, టీడీపీ నిజాయితీ ఏంటో బయటపడుతుందని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. పార్టీ ఎంపీ కేవీపీ రాంచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబరు బిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఇతర పార్టీలను కోరినట్టు వివరించారు. ఓటింగ్ జరిగే 13వ తేదీన కాంగ్రెస్ సభ్యులందరూ హాజరవ్వాలని పార్టీ విప్ జారీచేస్తుందని, దీనిపై ఇప్పటికే సోనియాగాంధీ ఆదేశాలు ఇచ్చారని వెల్లడించారు. ప్రైవేటు బిల్లు ఓటింగ్‌కు రాకుండా అడ్డుకోవాలని బీజేపీ, టీడీపీ కుట్రలు పన్నుతున్నట్టు తెలుస్తోందని ఆరోపించారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చి న్యాయం చేయాలని కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి కేంద్రాన్ని కోరారు. ఆర్థిక బిల్లుపై బుధవారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. ఏపీకి రాజధాని లేదని, నిర్మాణంలో తగిన సాయం చేయాలని ఆయన కోరారు. -
'ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపండి'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు బీజేపీ-టీడీపీ ఎంపీలు మద్దతు తెలపాలని శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య కోరారు. హైదరాబాద్‌లో బుధవారం ఇందిరాభవన్‌లో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో ఈ నెల 13న చర్చకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందని...ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతు తెలపాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులపై స్పష్టత ఇవ్వాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చెప్పే లెక్కలపై స్పష్టత లేదన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ బిల్లుకు మద్దతుగా ఈ నెల 12న తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఏపీసీసీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరువు సాయం, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఖరీఫ్‌కు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13 నుంచి మూడు రోజలు పాటు ఏపీసీసీ రెండు బృందాలుగా రైతు యాత్రలు చేపడుతున్నట్లు రామచంద్రయ్య చెప్పారు. -
అభివృద్ధి అంధకారం.. మౌనంగా అధికారం
♦ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ వైఎస్సార్ సీపీ పోరాటం ♦ పార్లమెంటులో ఎంపీ వైవీ, శాసనసభలో జగన్మోహన్రెడ్డి ♦ జిల్లా పరిషత్తులో విపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు పట్టించుకోని అధికారపక్షం జిల్లాను కరువు కాటేస్తోంది...ఆ కోరల్లోంచి బయట పడలేక జిల్లా ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంట కలిసి రాక రైతులు... కూలి దొరక్క రైతుకూలీలు... ఏ ఉపాధి పనులూ లేక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి అండగా ఉండాల్సిన పాలకపక్షం ప్రేక్షకపాత్ర వహించడంతో వైఎస్సార్ సీపీ క్రియూశీలక పాత్ర పోషించడం ప్రారంభించింది. పార్లమెంటు... అసెంబ్లీ... జిల్లా పరిషత్తు... మండల పరిషత్తు ఇలా ఏ వేదికనూ విడిచిపెట్టకుండా కరువుపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. అసెంబ్లీలో జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుబ స్పందించ లేదు. ఇటీవల జరిగిన రెండు జెడ్పీ సమావేశాల్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీలు దీన్ని అంగీకరించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినా అధికార పార్టీ తుంగలో తొక్కింది. అధికార పక్షం మౌనవ్రతం అసెంబ్లీలో, పార్లమెంట్లో దీనిపై మాట్లాడే తీరికే అధికార పార్టీ సభ్యులకు లేకుండాపోయింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంగానీ, అసెంబ్లీలో దీనిపై మాట్లాడే ప్రయత్నం కూడా అధికార పార్టీ చేయలేదు. ఎవరికివారు జిల్లాలో తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వారేగానీ, ప్రజల వెతలు తీర్చలేకపోయారు. . పార్లమెంట్లో ప్రైవేటు బిల్లు ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జిల్లా ఎదుర్కొంటున్న దుర్భిక్షంపై పార్లమెంట్లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 46లోని సెక్షన్ 94 ప్రకారం వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ ప్రకటన సమయంలో జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చలేదన్న విషయూన్ని గుర్తు చేశారు. విషాదమిలా... గత ఏడాది మొత్తం 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే, అంతకు ముందు ఏడాది 54 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం గతేడాది నమోదైంది. సాగర్ నీరు కూడా రాకపోవడంతో ఖరీఫ్, రబీలలో సగం విస్తీర్ణంలో కూడా పంటలు పండలేదు. ఒక్క ఏడాదే 38 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దొనకొండ పారిశ్రామిక నగరం, మైన్స్ యూనివర్శిటీ, మినరల్ సెన్సైస్, ఒంగోలు ఎరుుర్ పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు.. ఉత్పత్తి జోన్, రామాయపట్నం పోర్టు, ఫుడ్ పార్కు, వెలిగొండ-1 ఏడాదిలో పూర్తి, స్మార్ట్ సిటీ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్.. ఇవన్నీ ఎక్కడున్నారుు అనుకుంటున్నారా? ఎక్కడా లేవు!! నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అరుున వెంటనే జిల్లాపై కురిపించిన హామీల జల్లులివి. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు సరికదా.. అసలు ఈ హామీల ఊసెత్తేవారే కరువయ్యూరు. జిల్లాలో గడిచిన మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తున్నా పాలకులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయూలపై అసెంబ్లీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్లమెంట్లో వైవీ సుబ్బారెడ్డి గళమెత్తారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సర్కార్ కనికరిస్తుందేమో వేచి చూద్దాం. - సాక్షి ప్రతినిధి, ఒంగోలు ఆక ర్ష్పై శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ? ప్రకాశం.. అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లా. ఈ విషయూన్ని ఇటీవల నిర్వహించిన రెండు జెడ్పీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. అయితే ఆ నిర్ణయాన్ని అధికార పార్టీ తుంగలో తొక్కింది. అసెంబ్లీలో గానీ, పార్లమెంట్లోగానీ దీనిపై మాట్లాడే తీరిక అధికార పార్టీ సభ్యులకు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంగానీ, అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం గానీ అధికార పార్టీ సభ్యులు చేయలేదు. ఎవరికి వారు జిల్లాలో తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారే గానీ, శాసనసభలో, మంత్రివర్గ సమావేశంలో ఒక్కసారి కూడా జిల్లాను వెనుకబడిన జాబితాలో చేర్చాలని కోరిన దాఖలాలు లేవు. కనీసం దీనిపై చర్చించేందుకు జెడ్పీ సమావేశానికి కూడా మంత్రి శిద్దా రాలేదు. విపక్షంలో ఉన్న వారిని తమవైపు ఆక్షర్షిండమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీ నేతలు అభివ ృద్ధి పనులను మాత్రం గాలికొదిలేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించలేదు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇదే అంశంపై పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి విధితమే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 46లోని క్లాజ్ 94 ప్రకారం వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే ఆ ప్రకటన సమయంలో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చలేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాల్లో చేర్చి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు ఇవ్వాలని పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టారు. త్వరలో ఇది చర్చకు రానుంది. ప్రకాశం జిల్లా అంటే ఓ వెనుకబడిన జిల్లా.. కేంద్రం ఉత్తరాంద్ర, రాయలసీమకు ప్యాకేజీలు ఇస్తున్నా ప్రకాశం జిల్లా గురించి పట్టించుకోవడం లేదు. ఈ జిల్లా ఏర్పాటే విచిత్రంగా జరిగింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. ఒంగోలు డివిజన్ గుంటూరు నుంచి, కందుకూరు డివిజన్‌ను నెల్లూరు జిల్లా నుంచి, మార్కాపురం డివిజన్‌ను కర్నూలు జిల్లా నుంచి వచ్చి చేరింది. జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేకపోవడంతో ప్రజలు దుర్బిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం తర్వాత తక్కువ వర్షపాతంతోపాటు వెనుకబాటుతనం, వలసలు ఉన్న జిల్లా ప్రకాశం. పేరుకు కోస్తా జిల్లానే అయినా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది. గత ఏడాది మొత్తం 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే, అంతకు ముందు ఏడాది 54 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం గత ఏడాది నమోదైంది. సాగర్ నీరు కూడా రాకపోవడంతో ఖరీఫ్, రబీలో సగం విస్తీర్ణంలో కూడా పంటలు పండలేదు. ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉంది. జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 38 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న చీమకుర్తి గ్రానైట్ రంగం కూడా సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో జిల్లాలో ఆర్థిక ప్రగతి మందగించింది. జిల్లా వ్యాప్తంగా కొత్త పరిశ్రమలకు, జాతీయ విద్యాసంస్థల కోసం లక్షన్నర ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇటీవలే ట్రిపుల్ ఐటీకి అబ్దుల్‌కలాం పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అసలు ఈ సంస్థ ఎప్పుడు మంజూరు అయిందో కూడా తెలియదు. ఒంగోలులో వెటర్నరీ యూనివర్శిటీ, మినరల్ యూనివర్శిటీలు ప్రకటనలకే పరిమితమైంది. కనీసం రాష్ట్ర యూనివర్శిటీ కూడా లేని జిల్లా ప్రకాశం జిల్లానే. ఈ నేపథ్యంలో ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా ప్రకటిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది.