అనర్హత అంశంపై ప్రైవేటు బిల్లు | vijay sai reddy private bill in rajya sabha | Sakshi
Sakshi News home page

అనర్హత అంశంపై ప్రైవేటు బిల్లు

Published Fri, Dec 2 2016 4:42 PM | Last Updated on Mon, Sep 4 2017 9:44 PM

అనర్హత అంశంపై ప్రైవేటు బిల్లు

అనర్హత అంశంపై ప్రైవేటు బిల్లు

న్యూఢిల్లీ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ ఎంపీ విజయసాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రైవేట్‌ మెంబర్‌ బిల్లును ప్రవేశపెట్టారు. శాసనసభ్యుల అనర్హతకు సంబంధించిన ఆర్టికల్‌ 102, 191లకు సవరణలు ప్రతిపాదిస్తూ సభలో విజయసాయిరెడ్డి బిల్లు ప్రవేశపెట్టారు.

ఈ ఆర్టికల్స్ ద్వారా సంక్రమించిన అధికారాలతో రూపుదాల్చిన ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్‌ 8(4) రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు 2013 జులై 10న లిలీ థామస్ కేసులో తీర్పు ఇచ్చిందని, ఈ నేపథ్యంలో ఈ సెక్షన్ భావనల పరిరక్షణకు వీలుగా ఆర్టికల్‌ 102, 109లలో క్లాజ్‌ 1 తరువాత క్లాజ్‌ 1(ఎ)ను చేర్చుతూ రాజ్యంగ సవరణ చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. చట్ట సభల సభ్యుల హక్కుల పరిరక్షణకు, అనర్హత తేదీకి సంబంధించిన అంశాలతో తగిన చట్టం చేయడాన్ని ఈ ఆర్టికల్‌ నిలువరించలేంటూ క్లాజ్‌1(ఏ)లో చేర్చాలని ప్రతిపాదించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement