
పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది.
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్‌సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు.
ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు.
ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు