BC census
-
BC Census: బీసీ జన గణనతోనే న్యాయం
జనాభా కులాలుగా విడగొట్ట బడిన దేశం మనది. ఆధిపత్య కులాలు దేశంలోని భూమి, ఇతర వనరులు; విద్య, ఉద్యోగ అవకాశాలను అధికంగా అను భవిస్తున్నాయి. సంపద వారి చేతుల్లో ఉన్నందు వల్ల చదువు కోగలరు కాబట్టి... ఉద్యోగావకాశాలూ సహజంగా వారికే అధికంగా లభిస్తాయి. అయితే దేశంలో సంఖ్యాపరంగా వీరి సంఖ్య తక్కువ. బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాల జనాభా అధికంగా ఉంది. రాజ్యాంగం అందరికీ సమాన అవ కాశాలు వాగ్దానం చేసింది. అవకాశాల్లో సమాన భాగం కాకపోయినా... కనీస భాగం పొందాలంటే రిజర్వేషన్లు ఒక్కటే మార్గమని రాజ్యాంగ సభ భావించి రాజ్యాం గంలో అందుకు తగిన ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల కాలంలో కొత్త కులాలనూ, వర్గాలనూ రిజర్వేషన్ వర్గాల్లో కలపడంతో రిజర్వేషన్ వర్గాల వారికి అవకాశాలు పలుచబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో కులాల జన గణన జరిగితే ఎవరి దామాషా ప్రకారం వారు అవకాశాలను పొందవచ్చుగదా అనే ఆలోచన బయలుదేరింది. ముఖ్యంగా వందలు, వేలా దిగా ఉన్న బీసీ కులాలు ఈ డిమాండ్‌ను బలంగా విని పిస్తున్నాయి. ఇలా కుల గణన జరిగితే ఒనగూరే ఇతర ప్రయోజనాలనూ వారు పేర్కొంటున్నారు. వెనుక బడిన మెజార్టీ ప్రజల సంక్షేమానికి తగిన పథకాల రూపకల్పనకు ఈ డేటా చాలా అవసరం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఎవరి వాటా వారు పొందడానికి వీలు కలుగుతుంది. ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని ఎన్నో వందల కులాలను వెలుగులోకి తీసుకురావచ్చు. ఫలితంగా అత్యధిక పేదలు ఉన్న బీసీల్లో తమ వాటా తమకు లభిస్తుందన్న సాంత్వన లభిస్తుంది. ఎవరి వాటా వారికి లభిస్తే సామాజిక అశాంతి తగ్గి శాంతి భద్రతలు మెరుగవుతాయి. ప్రభుత్వం తన దృష్టిని అభివృద్ధి కార్యక్రమాలపై నిలపడానికి అవకాశం ఏర్పడుతుంది. కులగణనపై సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం... కులాల వారీగా వెనుకబడిన తరగతుల జనగణన చేపట్టడం పాలనపరంగా కష్టమని తెలిపింది. దీంతో బీసీలు బాగా అసంతృప్తికి లోనయ్యారు. 1931 కులగణన తర్వాత బీసీ జనగణన జరగలేదు. అయితే 1979లో జనతా ప్రభుత్వం బీపీ మండల్ సారథ్యంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన తరగతులవారిని గుర్తించి వారి అభివృద్ధికి సిఫార్సులు చేయమని ఒక కమిటీని నియమించింది. ఈ మండల్ కమిషన్ 1980లో సమర్పించిన నివే దికలో భారత్ మొత్తం జనాభాలో 52 శాతం వెనుక బడిన తరగతులవారేననీ, వారికి 27 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ సిఫార్సు చేసింది. బీసీల సమగ్ర అభివృద్ధి కోసం అనేక సిఫార్సులు చేసినా అవన్నీ అటకెక్కాయి. 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే అత్యంత దారుణ వ్యతిరేక పరిస్థితుల్లో అమలులోకి వచ్చాయి. నిజానికి ఇప్పుడు బీసీల జనాభా మరింతగా పెరిగి ఉండాలి. వారూ వీరూ చెప్పే లెక్కలన్నీ కాకి లెక్కలే. ఒక్కసారి కుల గణన జరిపితే అభివృద్ధి ఫలాల్లో ఎవరి వాటా వారు అడగడానికి వీలు ఉంటుంది. సామాజిక న్యాయం సాకారమవుతుంది. (చదవండి: కులాంతర వివాహాలు శాస్త్రబద్ధమే) - డాక్టర్ పరికిపండ్ల అశోక్ సామాజిక కార్యకర్త -
రాజ్యసభలో 2 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు -
సామాజిక న్యాయానికి బీసీ జనగణన
భారత సమాజం కులాల దొంతర అన్న సంగతి తెలిసిందే. ఈ దొంతరలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదిమ తెగలవారూ, అసలు మనుషులుగా గౌరవం పొందని హిందూ సామాజిక బహిష్కృత ఎస్సీలూ అట్టడుగున ఉంటే... అటు ఓసీలలా గౌరవానికి నోచుకోనివారూ, ఇటు ఎస్సీల్లా మరీ తక్కువ చూపుకు గురికాని బీసీలు మధ్యస్తరంలో ఉన్నారు. దేశ జనాభాలో వీళ్లశాతం సగం కన్నా ఎక్కువే. వీరంతా సంప్రదాయ వృత్తులను అనుసరిస్తూ దేశ సంపద సృష్టిలో ప్రధాన పాత్ర వహిస్తున్నారు. విద్య, ఉద్యోగ తదితర రంగాల్లో అణగారిన, వెనుక బడిన వర్గాలకు ప్రభుత్వాలు రిజర్వేషన్ కల్పించినా... జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అందడం లేదనేది ఒక ప్రగాఢమైన విశ్వాసం రిజర్వేషన్ పొందుతున్న వర్గాల్లో ఉంది. మరీ ముఖ్యంగా బీసీల్లో ఈ అభిప్రాయం ఉంది. తాము దేశ జనాభాలో ఎంతమందిమి ఉన్నామో తెలిస్తే... ఆ నిష్పత్తిలో రిజర్వేషన్లు పొందవచ్చని వారు భావిస్తున్నారు. అందుకే బీసీ జన గణన జరగాలని వారు కోరుకుంటున్నారు. ఇప్పటికే చాలా సార్లు ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినా అది పట్టించుకోవడం లేదు. దీంతో అనేక రాష్ట్రాల్లో బీసీ జనాభాను లెక్కించాలనీ, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ కోరుతూ ఉద్యమాలు రగులుకుంటున్నాయి. బీసీ జనగణన చేయమని అడిగితే పట్టించుకోని కేంద్ర ప్రభుత్వంపై దీర్ఘకాలిక ఉద్యమం చేయక తప్పని స్థితి వచ్చింది. ఈ ఉద్యమం దేశ చరిత్రలోనే మరో శాంతియుత బీసీల హక్కుల సాధన జాతీయ ఉద్యమంగా కొనసాగాలి. అది ఏ విధంగా అంటే 14 ఏళ్లు శాంతియుతంగా కొనసాగిన మలిదశ తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమ నమూనాలో కొనసాగాలి. వ్యవసాయరంగాన్ని రక్షించుకోవడానికి ఇటీ వల జరిగిన శాంతియుత రైతాంగ ఉద్యమ రూపం ధరించాలి. రిజర్వేషన్ శాతాన్ని పెంచాలని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం భావించి ముస్లింలకు 12 శాతం, గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదిస్తూ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఆ తీర్మానం పంపి ఇప్పటికి సరిగ్గా ఆరేళ్లు అవుతోంది. కేంద్రం ఇప్పటికీ పెదవి విప్పటం లేదు. ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం బీసీ జనగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపచేసుకుని కేంద్రానికి పంపింది. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని జార్ఖండ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 60 శాతం నుంచి 77 శాతానికి రిజర్వేషన్లు పెంచాలనే చట్టసవరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రిజర్వేషన్ల పెంపుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో మార్పులు చేయాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమిళనాడు తరహాలో తెలంగా ణకు కూడా రిజర్వేషన్లు ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. ఇలా రిజర్వేషన్ల శాతం పెరిగినప్పుడే జనాభా దామాషా ప్రకారం ఎవరి వాటా వారికి దక్కుతుంది. రాజ్యాంగంలోని 340 ఆర్టికల్‌ను అనుసరించి భారత దేశంలో ప్రప్రథమంగా 1953 జనవరిలో కాకా కాలేల్కర్ నేతృత్వంలో వెనుకబడిన తరగతుల కమిషన్‌ను నియ మించడం జరిగింది. ఇది 1955లో తన నివేదికను సమ ర్పిస్తూ దేశంలో 2399 కులాలను వెనుకబడిన కులాలుగా అందులో 837 కులాలను అత్యంత వెనుకబడిన కులాలుగా గుర్తించి కొన్ని సిఫార్సులు చేసింది. అయితే ప్రభుత్వం ఈ కమిషన్ చేసిన సిఫార్సులను తిరస్కరించింది. కేంద్ర ప్రభుత్వం 1979లో బి.పి. మండల్ నేతృత్వంలో రెండవ బీసీ కమిషన్‌ను ఏర్పాటుచేయడం జరిగింది. ఈ కమిషన్ బీసీల జనాభాను 52 శాతంగా లెక్కకట్టి వీరికి విద్యా ఉద్యోగ రంగాల్లో 27 శాతం రిజర్వేషన్లను కల్పించాలని 1980లో నివేదిక సమర్పించింది. అయితే, ఈ సిఫారసులు 1992 నుండి మాత్రమే అమలులోకి వచ్చాయి. 2017 అక్టోబర్‌లో జస్టిస్ రోహిణి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఒక కమిషన్‌ను నియమించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వ ఓబీసీ జాబితాను వర్గీకరించడం ఈ కమిషన్ ముఖ్య విధి. ఇప్పటికి ఈ కమిషన్ గడువును 13 సార్లు పొడిగించడం జరిగింది. ఇంతవరకు ఈ కమిషన్ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత బి.ఎస్. రాములు నేతృత్వంలో నియమించబడ్డ తొలి తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ ఏప్రిల్ 2017లో ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పిస్తూ, బీసీ–ఇ గ్రూప్‌లో ఉన్న ముస్లింలలోని కొన్ని వెనుకబడిన వర్గాలకు అందించబడుతున్న రిజర్వే షన్లను 4 శాతం నుండి 10 శాతానికి పెంచాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను ప్రభుత్వం అంగీక రిస్తూనే, సుధీర్ కమిషన్, ఇతర నివేదికలను అనుసరించి వీరికి రిజర్వేషన్లను పన్నెండు శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2019లో ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ మరో నివేదిక సమర్పిస్తూ... సంచార, అర్ధ సంచార జాతులకు చెందిన 17 కులాలను తెలంగాణ రాష్ట్ర బీసీ జాబితాలో చేర్చాలని సిఫారసు చేయడం జరిగింది. ఈ సిఫారసులను కేసీఆర్ క్యాబినెట్ యధాతథంగా ఆమోదించి అమలుచేయడం జరిగింది. 2011లో జరిగిన సామాజిక ఆర్థిక కులగణన వివరాలు ఉన్నాయని చెప్పిన కేంద్రం ఆ వివరాలు ఎందుకో బైట పెట్టకుండా దాటవేసింది. దేశంలో సగానికి పైగా జనాభా వున్న బీసీల విషయంలో కేంద్రం లెక్కలేనితనం చూపడం దారుణమైనది. దేశంలో బీసీలు ఎంతమంది ఉన్నారు? వీళ్ల ఆర్థిక స్థితి గతులేమిటి? వీరి చదువులు ఎలా వున్నాయి? వీరి ఉద్యోగ అవకాశాలేమిటి? వీరింకా దారిద్య్ర రేఖకు దిగువన ఉండటానికి కారణాలు ఏమిటి? బీసీలలో ఇంకా సంచారజాతులుగా వున్న వారి దీనస్థితికి విముక్తి ఎప్పుడు? ఈ సమాచారం లేకుండా దేశాభివృద్ధికి వ్యూహాలు రచించడం కష్టం. అందుకే బీసీ జన గణన అత్యంతావశ్యం. జూలూరు గౌరీశంకర్, వ్యాసకర్త చైర్మన్, తెలంగాణ సాహిత్య అకాడమీ -
సంఘటితమైతేనే రాజ్యాధికారం
దేశంలో ప్రతి దానికీ లెక్క ఉంటుంది. పశుపక్ష్యాదు లెన్ని, పులులు, సింహాలెన్ని అనే లెక్కలు కూడా తీస్తారు. అలాంటిది బీసీల లెక్క ఎందుకు తీయడం లేదు? గత నాలుగు దశాబ్దాలుగా ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ బీసీ జనగణన చేయడం లేదు. బీసీ జనాభా ఎంతో తెలియకుండా బీసీల సమగ్రాభివృద్ధికి ఎలా ప్రణాళికలు రూపొందిస్తారు? చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ, క్రీమీలేయర్ విధానాన్ని తొలగించాలనీ, విద్య, ఉద్యోగాల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలనీ దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో జరుగుతున్న ఉద్యమ సంఘాలు దేశ రాజధాని ఢిల్లీ చేరుకొని ధర్నా చేస్తున్నాయి. ముఖ్యమైన నాయకులను కలిసి వినతి పత్రాలు సమర్పిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీలకున్న రాజ్యాంగపరమైన హక్కులు, ఆధిపత్య వర్గాలకున్న రాజ్యాధికారం బీసీలకు లేక పోవడం వల్ల వారు అభివృద్ధికి నోచుకోవడంలేదు. ప్రాచీన కాలం నుంచీ ఉత్పత్తి, సేవా రంగాల్లో తమ దైన నైపుణ్యంతో మానవాళి మనుగడకు కృషి చేస్తూ వచ్చిన బీసీలు ఇవ్వాళ దయనీయమైన స్థితికి చేరుకున్నారు. ఆధునిక పారిశ్రామిక విధానం వల్ల బీసీలకు జీవనాధారమైన సాంప్రదాయిక వృత్తులు విధ్వంసమై బీసీలు వలసల బాట పట్టారు. సాంకేతిక పరిజ్ఞానంతో వచ్చిన మార్పులను గమనించిన ఆధి పత్య కులాల వాళ్లు బీసీ కులాల వృత్తులను లాక్కున్నారు. మెషినరీ (మిల్లు)తో చేనేత రంగాన్ని కొల్లగొట్టారు. ప్లాస్టిక్‌తో కుమ్మరుల వృత్తీ, బ్యాండ్ బాక్స్‌లతో చాకలి వృత్తీ, బ్యూటీ పార్లర్లతో మంగలి ఉపాధీ మాయమవుతోంది. దూదేకుల, నూరుబాషా, పింజారి, లద్ధాఫ్, మెహతర్, ఫకీర్, అత్తరు, కాశోల్లు, గారడోళ్ల లాంటి ఎన్నో చిన్న చిన్న ఒంటరి కులాల వారు... బహుళజాతి కంపెనీల ఉత్పత్తులు, ఆధిపత్య కులాల వారి వ్యాపారాలతో ఉపాధి కోల్పోయి రోడ్డున పడి తమ ఉనికి కోల్పోవాల్సిన దుస్థితిలో ఉన్నారు. దాదాపు అన్ని బీసీ కులాల వారూ ఇదే పరిస్థితుల్లో ఉన్నారు. వీరు సంఘటితమై రాజ్యాధికారాన్ని చేపడితే కానీ వారి దుస్థితి మారదు. మరి అందుకేం చేయాలి? బీసీలు రాజ్యాధికారం కోసం కొత్త ఎత్తుగడలతో ముందుకు సాగాలి. తమ జనాభాలో సగమైన మహిళ లను రాజకీయాలవైపు తీసుకురానంత కాలం విముక్తి సాధ్యం కాదని గుర్తించాలి. వందల కులాలుగా, వర్గాలుగా విడిపోయి జీవిస్తున్న బీసీ ప్రజలు బతుకు దెరువు కోసం వంద ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వారందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి రాజ్యాధికారం చేపట్టడం బీసీ నాయకత్వానికి, సంఘాలకు కత్తిమీద సాము లాంటిదే. బీసీ ప్రజలందరూ ఒకే జాతి ప్రజ లనే అవగాహన పెంపొందించాలి. వారి దైనందిన సమస్యలలో బీసీ నాయకత్వం పాల్పంచుకోవాలి. రాజ్యాధికారంతోనే సమగ్రాభివృద్ధి సాధ్యమని బోధించి వారిని సమీకరించిన నాడు తప్పక విజయం సాధించవచ్చు. బీసీలు నేడు తమ ఆత్మగౌరవం కోసం, బహుజన రాజ్యాధికారం కోసం ఐక్యం కావాల్సిన చారిత్రక సందర్భాన్ని గుర్తించి ముందుకు సాగాలి. బహుజనులకు రాజ్యాధికారం నినాదంతో ఉత్తరప్రదేశ్, బిహార్లలో బహుజనుల రాజ్యం ఏర్పడింది. పెరియార్ ఉద్యమ వారసత్వంగా ఆనాడు కరుణానిధి, నేడు స్టాలిన్ తమిళనాడులో రాజ్యాధికారం చేపట్టి బహుజన ప్రజల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. బీసీ సమాజం నుండి ఎదిగిన బీసీ నాయకులు, మేధావులు, విద్యావంతులు, విద్య, ఉద్యోగాలతోనే అభివృద్ది జరగదని గుర్తించాలి. (క్లిక్: వినదగిన ‘తక్కెళ్ల జగ్గడి’ వాదన) రాష్ట్రాల్లో విడివిడిగా ఉద్యమాలు జరుపుతున్న నాయకులు ఆల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమి టీగా ఏర్పడి దేశవ్యాప్త ఉద్యమ నిర్మాణానికి నడుంబిగించారు. ఈ కృషిలోప్రతి బీసీ భాగస్వామి కావాలి. (GO 111 Hyderabad: పర్యావరణాన్నే పణంగా పెడదామా?) - సాయిని నరేందర్ బీసీ స్టడీ ఫోరం వ్యవస్థాపక చైర్మన్ -
వాటా అడుగుతారనే బీసీ జనగణనపై వెనుకడుగు
పంజగుట్ట: బీసీలు వారికి రావల్సిన న్యాయపరమైన వాటా అడుగుతారనే భయంతోనే కేంద్రం బీసీ జనగణన చేపట్టడంలేదని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ ఆరోపించారు. ప్రధాని నరేంద్రమోదీని కలిసి జనగణన చేపట్టాలని టీఆర్ఎస్ కోరినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ జనగణన–కేంద్ర ప్రభుత్వ విధానం, బీసీల తక్షణ కర్తవ్యం’అంశంపై అఖిలపక్ష పార్టీలు, బీసీ ఉద్యోగ సంఘాలు, బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల స్వాతంత్య్ర చరిత్రలో గొల్ల, కురుమ వర్గానికి చెందిన తనను, ముదిరాజ్ వర్గానికి చెందిన బండ ప్రకాష్‌ను రాజ్యసభకు పంపింది తెలంగాణ ప్రభుత్వమే అన్నారు. బీసీ జనగణనతో పాటు కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో ఈ నెల 13న ఢిల్లీలో తలపెట్టిన బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశానికి తన పూర్తి మద్దతు తెలిపారు. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ... కుక్కలు, పిల్లులు అన్నింటికీ లెక్కలు ఉన్నాయి కాని బీసీలకు మాత్రమే లెక్కలు లేకపోవడం బాధాకరమన్నారు. బీసీల లెక్కలు తేల్చకపోతే రాజకీయంగా దెబ్బతింటామని భావించేలా ఉద్యమం చేయాలని, అప్పుడే అన్ని పార్టీలు దిగివస్తాయన్నారు. బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ... ఎస్సీ, ఎస్టీలతోపాట ఆఖరుకు 9 శాతం ఉన్న ఓసీలు కూడా 10 శాతం రిజర్వేషన్లు పొందుతున్నారని, 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు 27 శాతం రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్ కుందారం గణేష్ చారి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీఎస్పీ నేత రమేష్, బీసీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు దానకర్ణచారి, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు కనకాల శ్యామ్, బీసీ విద్యార్థి నేత విక్రమ్‌గౌడ్, కుల్కచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీల జనగణన కోసం చలో ఢిల్లీ
పంజగుట్ట: బీసీ జనగణనతో పాటు కుల గణన చేయాలనే డిమాండ్‌తో డిసెంబర్ 13 నుంచి 15 వరకు ‘బీసీల చలో ఢిల్లీ’కార్యక్రమం నిర్వహించనున్నట్టు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. 13న బీసీల జంగ్ సైరన్, 14న పార్లమెంట్ ముట్టడి, 15న జాతీయ స్థాయి అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రశ్నించనందున తాడో పేడో తేల్చుకునేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో చలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో పాటు 9 రాష్ట్రాల ప్రభుత్వాలు బీసీల జనగణన జరగాలని అసెంబ్లీలో తీర్మానించి కేంద్రానికి పంపాయని తెలిపారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాపురం పద్మ, మణిమంజరి, నర్సింహా నాయక్, శ్రీనివాస్ గౌడ్, మాదాసి రాజేందర్, స్వర్ణ, నర్సింహా తదితరులు పాల్గొన్నారు. -
సీఎం జగన్‌కు బీసీ నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: బీసీ జనగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ శాసన సభలో తీర్మానం చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని బీసీ నేతలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభలోని సీఎం కార్యాలయంలో సీఎం జగన్‌ను బుధవారం డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాసవేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, బీసీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కలిశారు. బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న విప్లవాత్మక చర్యలు, వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైనాన్ని ఆయా వర్గాలకు మరింతగా తెలియజెప్పేలా నాయకులు పనిచేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సూచించారు. -
సర్వత్రా హర్షం.. సీఎం వైఎస్ జగన్‌కు బీసీ సంఘాల నేతల కృతజ్ఞతలు
సాక్షి, అమరావతి: కులాల ప్రాతిపదికగా జనగణన జరపాలని కేంద్రాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అసెంబ్లీలో తీర్మానం చేయడంపై బీసీ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. జనగణన–2021లో కులం కాలమ్‌ను తొలగిస్తామని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని బీసీ సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. 90 ఏళ్ల క్రితం 1931లో జరిగిన జనగణన ఆధారంగానే బీసీల శాతాన్ని ఇప్పటికీ లెక్కగట్టడంతో తీవ్ర నష్టం జరుగుతోందని, రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా తగినంత తోడ్పాటు లేదని బీసీ వర్గాలు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. ఈసారి జనగణనను కులాల ప్రాతిపదికన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ డిమాండ్‌లో న్యాయం ఉందని గ్రహించిన రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో వెనుకబడిన తరగతులను వెన్నెముక వర్గాలుగా తీర్చిదిద్దుతున్న వైఎస్ జగన్ ప్రభుత్వం తాజాగా కుల జనగణన నిర్వహించాలంటూ కేంద్రాన్ని కోరడంతో బీసీ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి బీసీలకు మేలు చేసే కుల జనగణనకు మద్దతు పలుకుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం గొప్ప విషయం. అందుకు బీసీల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇదే స్ఫూర్తిని కొనసాగించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచాలి. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని గానీ, రాష్ట్ర ప్రభుత్వపరంగా ప్రతినిధి బృందాన్ని పంపడం గానీ చేయాలి. అవసరమైతే జాతీయస్థాయిలో కలిసి వచ్చే సీఎంలు, సంఘాలతో ఐక్య కార్యాచరణ చేపట్టి కేంద్రాన్ని ఒప్పించాలి. – కేశన శంకరరావు, ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇది చారిత్రాత్మకం కుల జనగణన చేపట్టాలని కేంద్రాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడం చారిత్రాత్మకం. ఇది కేంద్రంపై ఒత్తిడి పెంచుతుంది. సీఎం వైఎస్ జగన్ బీసీల గుండెల్లో నిలిచేలా నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీసీల పక్షపాతి అని మరోసారి రుజువైంది. బీసీల్లో ప్రతి కులానికి కార్పొరేషన్ పెట్టి వారి అభివృద్ధికి జగన్ ప్రత్యేక కృషి చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టు వర్కుల్లో బీసీలకు 50 శాతం ఇచ్చేలా జగన్ చట్టబద్ధత కల్పించిన తీరు దేశానికే మార్గదర్శకం. వెనుకబడిన తరగతులకు చెందిన సీఎంలు ఉన్న రాష్ట్రాలు కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సీఎం వైఎస్ జగన్‌కు బీసీ వర్గాల అందరి తరపున కృతజ్ఞతలు తెలిజేస్తున్నాం. – ఆర్.కృష్ణయ్య, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి జనగణనలో కులం కాలమ్ కూడా ఉండాలని ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేయడం అభినందనీయం. కేంద్రం చేపట్టే జన గణనలో కులం కాలమ్ తీసేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడమే. బీసీలకు సామాజికంగా, రాజకీయంగా జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం జరగాలంటే బీసీ కుల జనగణన తప్పనిసరి. – వైకే (వై.కోటేశ్వరరావు), సామాజిక న్యాయ సేవా కేంద్రం రాష్ట్ర కన్వీనర్ -
బీసీ జనగణనతో ఎంతో మేలు: సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ రెండున్నరేళ్లలో బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం విప్లవాత్మక చర్యలు చేపడుతున్నాం. విద్యా పరంగా, ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు మరింత మంచి చేయాలంటే కేంద్ర ప్రభుత్వం బీసీ జనగణన నిర్వహించాలి. బీసీల జనాభా ఎంతన్నది కచ్చితంగా తెలిస్తే వారికి ప్రభుత్వాలు మరింత మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకే బీసీ జనగణన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ శాసనసభ ద్వారా తీర్మానం చేసి పంపుతున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. బీసీ జనగణన చేయాలని కోరుతూ శాసనసభలో మంగళవారం ప్రవేశపెట్టిన తీర్మానంపై ఆయన మాట్లాడారు. దేశంలో బీసీల జనాభా దాదాపు 52 శాతం ఉంటుందని అంచనా అని, అయితే ఏనాడు బీసీల సంఖ్య ఎంతన్నది జనాభా లెక్కల్లో మదింపు చేయలేదన్నారు. 1931లో బ్రిటీష్ పాలనలో మాత్రమే కులపరమైన జన గణన చేశారని చెప్పారు. కుల పరంగా జనాభా లెక్కలు సేకరించి ఇప్పటికి 90 ఏళ్లు అయ్యిందని, అప్పటి నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా ఎంతనేది కేవలం అందాజుగా.. సుమారుగా అన్న బాపతులోనే లెక్క వేస్తున్నారన్నారు. సీఎం జగన్ ఏమన్నారంటే.. లెక్క తెలిస్తేనే మరింత లబ్ధి ►బీసీల గురించి కచ్చితమైన లెక్క తెలిస్తేనే వారి మేలు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నది ప్రభుత్వాలకు స్పష్టత ఉంటుంది. రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనగణనలో అంటే 1951 నుంచి ఇప్పటి వరకు బీసీల జనాభా లెక్కలు సేకరించలేదు. ►జన గణనలో కుల పరంగా బీసీల వివరాలు కూడా చేర్చడం గురించి మరింత విస్తృతంగా ఆలోచించాలి. నిజానికి జనాభా లెక్కలు 2020లో జరగాలి. కరోనా, వివిధ కారణాలతో అవి వాయిదా పడుతూ వచ్చాయి. కాస్త ఆలస్యంగానైనా ఇప్పుడు మొదలు కాబోతున్నాయి. ►సమాజంలో కొద్ది మంది మాత్రమే అధికారాన్ని దక్కించుకుంటున్నారన్న భావన వల్ల కావచ్చు.. దశాబ్దాలుగా, శతాబ్దాలుగా రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో బీసీలను ఎదగనివ్వడం లేదన్న భావన వల్ల కావచ్చు.. పలు విధాలా వివక్షకు గురయ్యాం అన్న భావన వల్ల కావచ్చు.. వీటన్నింటి వల్ల బీసీ జనగణన జరగాలన్న డిమాండ్ ఆ వర్గాల నుంచి వస్తోంది. ‘మేము ఎంత మందిమి ఉన్నామనే సంఖ్య మీకు తెలిస్తేనే కదా.. ఏదైనా చేయడానికి వీలుండేది’ అని ఆ వర్గాల వారు అంటుండటంలో న్యాయం ఉంది. ►బీసీలు అంటే బ్యాక్ వర్డ్ క్లాసులు కాదు.. బ్యాక్ బోన్ క్లాసులుగా మార్చుతామని అధికారంలోకి రాకమునుపే ఏలూరులో పార్టీ తరఫున తీర్మానం చేశాం. ఆ దిశగా ఈ రెండున్నరేళ్ల కాలంలో అడుగులు పడ్డాయని ఈ రోజు గర్వంగా చెబుతున్నాను. అడుగడుగునా సామాజిక న్యాయం ►వైఎస్సార్సీపీ తరఫున మొత్తంగా గెలిచిన, గెలవబోతున్న ఎమ్మెల్సీలు 32 మంది. వారిలో 18 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారే. ►మనం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు పంపిన నలుగురిలో ఇద్దరు బీసీలే. ఐదేళ్ల టీడీపీ పాలనలో ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. ►శాససనభ స్పీకర్ స్థానంలో బీసీని కూర్చోబెట్టే భాగ్యాన్ని దేవుడు కలిగించాడు. తొలిసారి శాసన మండలి చైర్మన్ పదవిని దళితులకు ఇవ్వగలిగామని గర్వంగా తెలియజేస్తున్నా. శాశ్వత బీసీ కమిషన్‌ను నియమించాం. ►నామినేటెడ్ పదవుల్లో, కాంట్రాక్టు పనుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం పదవులు ఇచ్చేట్టు చట్టం చేశాం. ఇందులో మహిళలకు కూడా 50 శాతం చట్టం చేసి ఇవ్వగలిగాం. ►మొత్తం 648 మండలాలకు గాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్నది 635. అందులో బీసీలకు 239 మండల అధ్యక్ష పదవులిచ్చాం. అంటే 38 శాతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి మొత్తం 67 శాతం పదవులు ఇచ్చాం. ►మొత్తం 13 జెడ్పీ చైర్మన్ పదవుల్లో బీసీలకు 6 పదవులు ఇచ్చాం. అంటే 46 శాతం పదవులు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 69 శాతం జెడ్పీ చైర్మన్ పదవులిచ్చాం. ►13 మునిసిపల్ మేయర్ పదవుల్లో బీసీలకు ఏడు పదవులు ఇచ్చాం. అంటే 54 శాతం పదవులు. మొత్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 92 శాతం పదవులు ఇచ్చాం. ►మొత్తం 87 మునిసిపాలిటీలలో వైఎస్సార్సీపీ 84 గెలుచుకుంది. ఒకటి టై అయింది. ఫలితం ఇంకా రాలేదు. టాస్‌లో దేవుడి ఆశీర్వచనం ఎలా ఉంటే అలా జరుగుతుంది. ఇచ్చిన 84 మునిసిపల్ చైర్మన్ పదవుల్లో 37 పదవులు బీసీలకే ఇచ్చాం. అంటే 44% పదవులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మొత్తం 73% పదవులిచ్చాం. దేవుడి దయతో కొండపల్లి కూడా వస్తే బీసీలకు మరో పదవి పెరుగుతుంది. ►196 వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ పదవుల్లో 76 అంటే 39 శాతం బీసీలకే ఇచ్చాం. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 60 శాతం ఇచ్చాం. వివిధ ప్రభుత్వ కార్పొరేషన్లలో 137 చైర్మన్ పదవుల నియామకాల్లో 53 బీసీలకే ఇచ్చాం. ఇది 39 శాతం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను కలుపుకుంటే 58 శాతం ఇచ్చాం. ఇవి కాక బీసీలకు ప్రత్యేకంగా 56 కార్పొరేషన్లు, ఎస్సీలకు మరో 3 కార్పొరేషన్లు, ఎస్టీలకు మరో కార్పొరేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశాం. ►137 కార్పొరేషన్లలో మొత్తం 484 నామినేటెడ్ డైరెక్టర్ల పదవుల్లో 201 బీసీలకే ఇచ్చాం. అంటే డైరెక్టర్లలో బీసీలు 42 శాతం మంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కలిపి మొత్తం 58 శాతం డైరెక్టర్ పదవులు ఇచ్చాం. ►ఇవి కాక 56 ప్రత్యేక బీసీ కార్పొరేషన్లు, 3 ఎస్సీ కార్పొరేషన్లు, 1 ఎస్టీ కార్పొరేషన్లలో 684 డైరెక్టర్ల పోస్టులన్నీ కూడా ఆ వర్గాలకే ఇచ్చాం. శాశ్వత ఉద్యోగాలలోనూ... గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.30 లక్షల మందికి శాశ్వత ఉద్యోగాలు ఇచ్చాం. వాటిలో 83% ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే ఇచ్చాం. ఈ 29 నెలల్లో 2.70 లక్షల వలంటీర్ ఉద్యోగాలు, మిగిలిన ఉద్యోగాలు కలుపుకుని మొత్తం 6.03 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాం. సామాజిక న్యాయానికి అద్దం పడుతూ ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కనీసం 75 శాతానికి పైగా ఉద్యోగాలు ఇచ్చాం. పేద వర్గాలన్నీ ఒక్కటిగా ఉండాలి దేవుడి దయతో ప్రజలందరి చల్లని దీవెనలతో రాబోయే రోజుల్లో కూడా మరింత మంచి చేసే అవకాశం కలగాలని కోరుకుంటున్నాను. అట్టగుడు వర్గాల్లో ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు.. ఈ పేద వర్గాలన్నీ కూడా ఒక్కటిగా ఉండాలి. విభజించు పరిపాలించు అన్న గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి తప్పుడు ఆలోచనలకు చరమగీతం పాడాలి. టీడీపీ పాలనలో బీసీల విభజన టీడీపీ పాలనలో తమకు ఓటు వేసిన వారెవరు.. ఓటు వేయని వారెవరు అని బీసీలను విభజించారు. ఓటు వేసిన వారికి కొద్దో గొప్పో ఇస్తాం, వేయని వారికి లేదు.. అనే పరిస్థితి ఉండేది. జన్మభూమి కమిటీల పేరుతో ఏ రకంగా చేశారన్నది అందరికీ తెలుసు. మన పాలనలో అర్హతే ప్రామాణికత మనందరి పరిపాలనలో బీసీలందరూ మనవాళ్లే.. అని భావించి మనకు ఓటు వేసినా, వేయకపోయినా అర్హులందరికీ పథకాలు అందిస్తున్నాం. వైఎస్సార్ పింఛన్ కానుక, వైఎస్సార్ రైతు భరోసా, వైఎస్సార్ ఉచిత పంటల బీమా, ఇన్పుట్ సబ్సిడీ, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వైఎస్సార్ నేతన్న నేస్తం, జగనన్న తోడు, జగనన్న చేదోడు, వైఎస్సార్ వాహనమిత్ర, వైఎస్సార్ బీమా.. ఇలా అన్ని పథకాలు మంజూరు చేశాం. జగనన్న ఇళ్ల పట్టాలు కూడా 31 లక్షల మందికి ఇచ్చాం. సచివాలయ, వలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి ఒక్కరికీ మంచి చేయగలిగాం. -
బీసీ కులగణన చేయాల్సిందే: జాజుల
అచ్చంపేట రూరల్: పదేళ్లకు ఓసారి నిర్వహించే జనగణనలో బీసీ కులగణన చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని అతిథిగృహం ఆవరణలో గురువారం విలేకరులతో ఆయన మాట్లాడారు. దేశంలో జంతువులు, పక్షులను లెక్కబెడుతున్నారే గానీ..బీసీలను మాత్రం లెక్కించడానికి కేంద్రానికి మనసు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు సీఎం కేసీఆర్ కూడా బీసీ కులగణన చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేశారని పేర్కొన్నారు. బీసీల కులగణనపై నవంబర్‌లో అన్ని రాష్ట్రాలు పర్యటించి ఢిల్లీలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తామన్నారు. కేంద్రం సానుకూల నిర్ణయం తీసుకోకపోతే డిసెంబర్లో భారత్‌బంద్‌కు పిలుపునివ్వడంతో పాటు జనగణనను బహిష్కరిస్తామని హెచ్చరించారు. ఆత్మగౌరవ పోరాటానికి బీసీలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహగౌడ్, బీసీ సంఘం నాయకుడు కాశన్నయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ కులగణనతోనే సామాజికన్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశంలో బీసీల జనాభా ఎంత ఉందో కచ్చితంగా తేలితేనే ఆయా కులాలకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్గిరి ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. దేశంలో సామాజికన్యాయం జరగాలంటే బీసీ కులాల జనగణన చేపట్టాల్సిందేనని స్పష్టం చేశారు. సోమవారం ఇక్కడి గాంధీభవన్‌లో బీసీల జనగణనపై అఖిలపక్ష సమావేశం జరిగింది. టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీమంత్రి పొన్నాల లక్ష్మయ్య, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.మహేశ్‌కుమార్‌గౌడ్, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఎం.వి.రమణ(సీపీఎం), బాలమల్లేశ్(సీపీఐ), సంధ్య(న్యూడెమోక్రసీ)లతోపాటు ప్రొఫెసర్ మురళీమనోహర్, ప్రొఫెసర్ తిరుమలి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ మాట్లాడుతూ బీసీల ఓట్లు లేకుండా ఎవరూ చట్టసభల్లో అడుగుపెట్టలేరని, వారి జనాభా లెక్కలు చెప్పాలని అడగడంలో న్యాయం ఉందని అన్నారు. వన్‌నేషన్–వన్ సెన్సెన్ విధానాన్ని తీసుకురావాలని కోరారు. మన రాష్ట్రంలో కులాలవారీగా లెక్కలు తీసిన సమగ్ర కుటుంబసర్వే వివరాలను ఎందుకు బయటపెట్టడం లేదని రేవంత్ ప్రశ్నించారు. వెంటనే సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టును బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జనగణన కోసం బీసీలు చేపట్టే ఏ ఉద్యమానికైనా కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తుందని రేవంత్ హామీ ఇచ్చారు. ప్రొఫెసర్ మురళీమనోహర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక బీసీలు వెనుకబడిపోతున్నారని వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ ఎం.కోదండరాం మాట్లాడుతూ బీసీ జనగణనపై రాష్ట్రపతికి అన్ని పార్టీల పక్షాన లేఖ రాయాలని సూచించారు. పెద్ద ఎత్తున ఉత్తరాల ఉద్యమం చేపట్టాలన్నారు. కాగా, అఖిలపక్ష భేటీలో భాగంగా వెంటనే బీసీ గణన చేపట్టాలని కోరుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. -
బీసీ కులగణనపై కాంగ్రెస్ వైఖరేంటి?: జాజుల
సాక్షి, హైదరాబాద్: జనగణనలో బీసీ కులాలవారీగా జనాభాను లెక్కించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని అన్నారు. బీసీ కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ కమిటీ వేయడం కాలయాపనకు దారితీస్తుందని, ఈ అంశంపై యుద్ధప్రాతిపదికన స్పష్టతనిచ్చి కేంద్రప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఈమేరకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ప్రత్యేకంగా లేఖ ద్వారా జాజుల కోరారు. -
బీసీ గణన పూర్తి!
ఉప్పల్, కార్వాన్లలో అధికం సిటీబ్యూరో: జీహెచ్ఎంసీలో బీసీ జనగణన పూర్తయింది. ఎన్నికల ప్రక్రియలో భాగంగా అధికారులు హైకోర్టుకు అందజేసిన నివేదిక మేరకు బుధవారం రాత్రికి బీసీ గణన పూర్తి చేశారు. అయితే ఏ డివిజన్లో ఎంత శాతం బీసీలు ఉన్నారనే లెక్కలు రాత్రి పొద్దుపోయేంత వరకు సాగుతూనే ఉన్నాయి. గురువారానికి గానీ ఇవి ప్రధాన కార్యాలయానికి అందే పరిస్థితి లేదు. బుధవారం సాయంత్రం వరకు అందిన సమాచారం మేరకు మొత్తం జనాభాలో బీసీలు దాదాపు 21 శాతం మాత్రమే ఉండటం అధికారులను కలవరపాటుకు గురిచేసింది. 2009లో 26 శాతం ఉన్న బీసీలు ఇప్పుడు తగ్గడానికి కారణాలేమిటనే అంశాలపై దృష్టి సారించారు. మరోమారు సరిచూసుకోవాల్సిందిగా సర్కిళ్లలోని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నిజంగానే తగ్గినట్లయితే ఎక్కువగా ఏయే ప్రాంతాల్లో.. ఎందుకు తగ్గారనే వివరాలు పొందుపరచాల్సిందిగా సూచించారు. అధికారిక సమాచారం మేరకు... మొత్తం జనాభా 70,68,495 కాగా... వీరిలో 50,75,520 (72 శాతం) మందికిసంబంధించిన సర్వే వివరాలు అందాయి. మొత్తం పూర్తయ్యేసరికిబీసీల శాతంలో స్వల్ప మార్పు చోటుచేసుకునే అవకాశం ఉంది. సర్కిళ్ల వారీగా ఇలా... గ్రేటర్ మొత్తంలో బీసీలు ఎక్కువగా ఉన్న సర్కిళ్లలో ఉప్పల్, ఖైరతాబాద్-బి (కార్వాన్ నియోజకవర్గం) ముందున్నాయి. ఈ రెండు సర్కిళ్ల పరిధిలో 31 శాతానికి పైగా బీసీలు ఉన్నారు. అత్యల్పంగా సర్కిల్-5 (బహదూర్‌పురా, చార్మినార్, గోషామహల్ నియోజక వర్గాలు)లో కేవలం 10.60 శాతం మాత్రమే ఉన్నారు. వివిధ సర్కిళ్లలోని బీసీల శాతం ఇలా ఉంది... కాప్రాలో 24.71, ఉప్పల్‌లో 31.29, ఎల్బీనగర్-ఎలో 20.03, ఎల్బీనగర్-బిలో 19.62, సర్కిల్-4ఏలో 22.43, సర్కిల్-4బిలో 22.82, సర్కిల్-5లో 10.60, రాజేంద్రనగర్‌లో 19.58, సర్కిల్-7ఎలో 27.18, సర్కిల్-7బిలో 31.16, సర్కిల్-8లో 16.07, సర్కిల్-9ఏలో 19.94, 9బీలో 19.67, ఖైరతాబాద్-ఎలో 14.51, ఖైరతాబాద్-బిలో 20.31, శేరిలింగంపల్లి-1లో 25.01, శేరిలింగంపల్లి-2లో 18.81, పటాన్చెరు, ఆర్సీపురంలలో 30.21, కూకట్పల్లి-ఎలో 15.04, కూకట్పల్లి-బిలో 21.56, కుత్బుల్లాపూర్‌లో 19.06, అల్వాల్‌లో 15.66, మల్కాజిగిరిలో 15.95, సికింద్రాబాద్‌లో 25.63గా శాతంగా ఉన్నాయి. మొత్తం 20.42 శాతంగా ఉంది. - ఈనెల 24న ఓటర్ల జాబితా వెలువరించేందుకు, 26న బీసీల ముసాయిదా వెల్లడించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల తొలగించిన 6.30 లక్షల ఓటర్లలో దాదాపు 4.5 లక్షల ఓటర్లను తిరిగి చేర్చినట్లు తెలుస్తోంది. కొత్తగా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకున్న వారు మరో 52 వేల మంది ఉన్నారు.